ప్రేమ పెళ్లితో ఒక్కటైన అత్తా,కోడలు | Aunt Leaves Husband To Marry Niece In Bihar | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లితో ఒక్కటైన అత్తా,కోడలు

Published Tue, Aug 13 2024 9:14 AM | Last Updated on Tue, Aug 13 2024 9:18 AM

Aunt Leaves Husband To Marry Niece In Bihar

మేనకోడలిపై మనసు పారేసుకున్న ఓ అత్త భర్తను వదిలేసింది. మేనకోడల్ని మనువాడింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాలో బెల్వా గ్రామంలో వింతఘటన చోటు చేసుకుంది. గ్రామంలో నివాసం ఉండే అత్త తన మేనకోడలిని పెళ్లి చేసుకునేందుకు తన భర్తను విడిచిపెట్టింది. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నఈ జంట పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తాము పెళ్లి చేసుకున్నట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించారు.  

బంధువుల సమక్షంలో స్థానిక దుర్గా భవాని ఆలయంలో అత్త మేనకోడలు వివాహం చేసుకున్నారు. కోడలి మెడలో అత్త మంగళ సూత్రం కట్టింది. అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచారు. ఏడు జన్మలు ఒకరితో ఒకరు కలిసుంటామని వాగ్దానం కూడా చేశారు. ఇంకెవరితోనో పెళ్లి చేస్తారన్న భయంతో మేన కోడలు ఇంటి నుంచి పారిపోయి తన వద్దకు వచ్చిందని, వెంటనే వారిద్దరూ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. అత్త,మేనకోడలి వివాహంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement