aunt
-
సంక్రాంతి అల్లుడు మిస్సింగ్
సాక్షి, వరంగల్: పాలకుర్తి మండలం బొమ్మర గ్రామంలో సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చిన అల్లుడు అదృశ్యమయ్యారు. అత్తారింట్లో నుంచి బుధవారం రాత్రి స్నేహితులు ఫోన్ చేస్తున్నారని, వారితో మాట్లాడి వస్తానంటూ భార్యకు చెప్పి వెళ్లాడు. రాత్రి 8:30 గంటలకు భార్య ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది.ఇంట్లో నుంచి వెళ్లి 42 గంటలవుతున్నా కానీ యువకుడి ఆచూకీ లభించలేదు. గత ఏడాది డిసెంబర్ 26న వివాహం జరగ్గా, యువకుడి భార్య, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం మధ్యాహ్నం పాలకుర్తి పోలీస్ స్టేషన్లో భార్య ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.కొడుకుపై తండ్రి ఫిర్యాదు వరంగల్: ఆస్తులు పంచుకొని తన బాగోగులు చూసుకోవడం లేదని కొడుకుపై ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట దొడ్లకుంటకు చెందిన గుజ్జల రాజిరెడ్డికి చెందిన 15 ఎకరాల భూమిలో కుమారుడు వినయ్ రెడ్డి ఏడెకరాల భూమి రాయించుకున్నాడు. ఇటీవల తల్లి అనారోగ్యంతో మరణించగా తండ్రి రాజిరెడ్డి జీవనం ప్రశ్నార్ధకంగా మారింది.ఇదీ చదవండి: మంగళూరు బ్యాంకులో దోపిడీ.. ఉద్యోగులను గన్‌తో బెదిరించి..ఆలనా పాలనా చూసుకునే కొడుకే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని.. అలాంటి వాడికి తాను కష్టపడి సంపాదించిన భూమిని తనకు అప్ప చెప్పాలని పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులకు తండ్రి రాజిరెడ్డి ఫిర్యాదు చేశాడు. కుమారుడు వినయ్ రెడ్డి నుండి తనను కాపాడాలని తన వల్ల ప్రాణహాని ఉందని రాజిరెడ్డి పోలీసుల వద్ద వాపోయాడు. వృద్ధాప్యంలో ఉన్న తనకు న్యాయం చేసి ఆదుకోవాలని పోలీసుల వద్ద రాజిరెడ్డి అని 63 ఏళ్ల వృద్ధుడు కన్నీటి పర్యంతమయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
సత్యసాయి జిల్లాలో దారుణం.. అత్తాకోడళ్లపై సామూహిక లైంగిక దాడి
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురం నియోజకవర్గంలో దారుణం జరిగింది. తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. తండ్రి, కొడుకులను కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై లైంగికదాడికి పాల్పడ్డారు. చిలమత్తూరు మండలం బొమ్మనపల్లిలో ఘటన చోటుచేసుకుంది. పేపర్ మిల్లులో వాచ్మెన్ కుటుంబంపై దాడి చేసి ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు.కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం సత్యసాయి జిల్లాకు వలస వచ్చారు. శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వారి నివాసానికి వచ్చి దారుణానికి పాల్పడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమగ్ర విచారణ చేపట్టారు. ఘటనాస్థలిని ఎస్పీ రత్న పరిశీలించారు.ఇదీ చదవండి: వామ్మో ఇన్ని ట్విస్టులా.. పోలీసులే అవాక్కయ్యారు! -
ప్రేమ పెళ్లితో ఒక్కటైన అత్తా,కోడలు
మేనకోడలిపై మనసు పారేసుకున్న ఓ అత్త భర్తను వదిలేసింది. మేనకోడల్ని మనువాడింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాలో బెల్వా గ్రామంలో వింతఘటన చోటు చేసుకుంది. గ్రామంలో నివాసం ఉండే అత్త తన మేనకోడలిని పెళ్లి చేసుకునేందుకు తన భర్తను విడిచిపెట్టింది. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నఈ జంట పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తాము పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. బంధువుల సమక్షంలో స్థానిక దుర్గా భవాని ఆలయంలో అత్త మేనకోడలు వివాహం చేసుకున్నారు. కోడలి మెడలో అత్త మంగళ సూత్రం కట్టింది. అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచారు. ఏడు జన్మలు ఒకరితో ఒకరు కలిసుంటామని వాగ్దానం కూడా చేశారు. ఇంకెవరితోనో పెళ్లి చేస్తారన్న భయంతో మేన కోడలు ఇంటి నుంచి పారిపోయి తన వద్దకు వచ్చిందని, వెంటనే వారిద్దరూ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. అత్త,మేనకోడలి వివాహంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. Shockingly, an aunt and her niece got married in Bihar’s Gopalganj.The two had been having an affair for three years, which has now culminated in marriage. pic.twitter.com/TllfEUf7K0— Habeeb Masood Al-Aidroos (@habeeb_masood) August 12, 2024 -
అత్త ఇంటికి జగన్నాథుడు.. రథయాత్రలో అద్భుత ఘట్టం
ఒడిశాలోని పూరీలో జరిగే రథయాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. నిన్న (సోమవారం) ఉదయం మంగళ హారతితో రథయాత్ర ప్రారంభమైంది. జై జగన్నాథ్ అంటూ భక్తులు నినాదాలు చేస్తుండగా రథయాత్ర మొదలయ్యింది.భక్తులు రెట్టించిన ఉత్సాహంతో రథాల తాళ్లను ముందుకు లాగారు. డప్పుల దరువులుల మధ్య బలభద్రుడి రథంతో జగన్నాథుడు తన అత్త అయిన గుండిచా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కొద్దిసేపటికి జగన్నాథుని సోదరి దేవి సుభద్ర ఆశీనురాలైన రథం కూడా గుండిచా ఆలయానికి చేరుకుంది. నేటి (మంగళవారం) తెల్లవారుజాము వరకు రథాలపైనే ఆశీనులై పూజలు అందుకున్న జగన్నాథుడు, సుభద్రలు గుండిచా ఆలయంలోకి ప్రవేశించనున్నారు.53 ఏళ్ల తర్వాత ఈసారి పూరీలో రథయాత్ర రెండు రోజుల పాటు జరుగుతోంది. కాగా ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో రథయాత్ర సందర్భంగా శ్యామ్ సుందర్ కిషన్ (45) అనే భక్తుడు రథం చక్రాల కింద పడి మృతి చెందాడు. ఆదివారం కుకుజుంఘా గ్రామంలో జగన్నాథ రథాన్ని లాగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు ఆదివారం పూరీలో జరిగిన రథయాత్రలో కొంతమంది పోలీసులతో సహా 130 మంది గాయపడ్డారు, వారిలో సగం మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ కాగా, 40 మందికి చికిత్స కొనసాగుతోంది. -
ఒక చోట అత్తా అల్లుడు.. మరో చోట అన్నాదమ్ములు!
దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల పోరు ఆసక్తికరంగా మారింది. ఒడిశాలోని గంజాం జిల్లాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికల పోరులో సోదరుల మధ్య పోటీ నెలకొంది. చికిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో సోదరులు ఢీ కొడుతున్నారు. వీరు ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్ చింతామణి జ్ఞాన్ సామంత్రాయ్ కుమారులు. వారిలో తమ్ముడు మనోరంజన్ ద్యన్ సామంతరాయ్‌కు బీజేపీ టిక్కెట్టు ఇవ్వగా, అన్న రవీంద్నాథ్ ద్యన్ సామంతరాయ్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించింది. చింతామణి కాంగ్రెస్ సీనియర్ నేత. చికిటి నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి కాంగ్రెస్ టిక్కెట్‌పై విజయం సాధించారు. జూనియర్ సామంతరాయ్ కాంగ్రెస్ తరఫున రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా, ఆయన అన్నయ్య తొలిసారి ఎన్నికల్లో పోటీకి దిగారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) చికిటి అసెంబ్లీ స్థానం నుండి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉషాదేవి కుమారుడు చిన్మయానంద్ శ్రీరూప్ దేబ్‌ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. ఉషాదేవి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఉషాదేవి ఈ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ సీటు బీజేడీకి దక్కింది. మే 13న జరగనున్న ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో అత్త, మేనల్లుడి మధ్య ఎన్నికల పోరు నెలకొంది. నబరంగ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి కౌశల్య ప్రధాన్‌ను బీజేడీ తన అభ్యర్థిగా బరిలోకి దించగా, అదే నియోజకవర్గం నుంచి ఆమె మేనల్లుడు దిలీప్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఈ పోరు అత్త, మేనల్లుడి మధ్య కాదని, రెండు పార్టీల మధ్య మాత్రమేనని, తమ కుటుంబంపై ఈ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపబోవని కౌసల్య మీడియాకు తెలిపారు. -
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో విషాదం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అత్త గంగాదేవి శర్మ(106) కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ఉంటున్న ఆమె తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈరోజు (సోమవారం) ఉదయం 7 గంటలకు గంగాదేవి కన్నుమూశారు. ఈరోజు మధ్యాహ్నం వ్యాస నది ఒడ్డున ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వృద్ధురాలు గంగాదేవి శర్మ మృతితో కులులోని శాస్త్రి నగర్లో విషాదఛాయలు అలముకున్నాయి. జేపీ నడ్డా అత్త ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. ఆమెను సంరక్షించేందుకు ఇద్దరు కేర్టేకర్లు ఉన్నారు. నడ్డా బాల్యం అంతా అతని అత్త ఇంట్లోనే గడిచింది. అందుకే నడ్డా.. కులును తన రెండవ స్వస్థలం అని చెబతుంటారు. తాను హిమాచల్‌ను సందర్శించినప్పుడల్లా తన అత్త ఇంటికి వెళ్తానని నడ్డా తెలిపారు. జేపీ నడ్డా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాసర్‌పూర్ జిల్లా నివాసి. కాగా ఇటీవల జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత వయోవృద్ధ ఓటరుగా గంగాదేవి శర్మ గుర్తింపు పొందారు. నాటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో నడ్డా తన అత్తను కలుసుకున్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో కూలిన సొరంగం: ప్రమాదంలో 40 మంది కూలీలు? -
ఆంటీ ల్యాప్‌టాప్ ఇవ్వకపోతేనేం.. చిట్టితల్లి ఏం చేసిందో చూడండి!
ఆంటీ తనకు ల్యాప్‌టాప్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఒక చిట్టి తల్లి తానే స్వయంగా ల్యాప్‌టాప్‌ను తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఉదంతాన్ని నేహా అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ చిన్నారి కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసిన ‘హ్యాండ్‌మేడ్’ ల్యాప్‌టాప్ ఫొటోను నేహా షేర్ చేశారు. నేహా క్యాప్షన్‌లో ఇలా రాశారు ‘నా మేనకోడలు నన్ను ల్యాప్‌టాప్ కావాలని అడిగింది. నేను నిరాకరించడంతో, మూడు గంటల పాటు శ్రమపడి, ల్యాప్‌టాప్ తయారు చేసుకుంది’ నేహా షేర్ చేసిన ఫోటోలో ల్యాప్‌టాప్ ఆకారంలో కత్తిరించిన కార్డ్బోర్డ్ కటౌట్ కనిపిస్తుంది. దానిపై స్కెచ్ పెన్‌తో గీసిన కీబోర్టు చిహ్నాలు కనిపిస్తాయి. కాగా ఈ హోమ్మేడ్ ల్యాప్‌టాప్‌లో ‘గేమ్స్’, ‘జూమ్’, ‘లైక్’, ‘రైట్’, ‘సెలెక్ట్’ మొదలైన ఆప్షన్ బటన్లు కనిపిస్తాయి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో త్వరగా వైరల్‌గా మారింది. 2,52,000కు పైగా వీక్షణలను దక్కించుకుంది. సోషల్ మీడియా యూజర్స్ ఆ చిన్నారి సృజనాత్మకతను ప్రశంసిస్తున్నారు. ఒక యూజర్ ‘ఈ ల్యాప్‌టాప్ ఉత్తమమైనది. విండోస్ ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి’ అని రాశారు. మరొకరు ‘ఈ ల్యాప్ టాప్ కీబోర్డ్‌లో చాలా ఎక్కువ ఆప్షన్లు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మరింత మెరుగ్గా పని చేస్తుంది’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘బంగ్లా’లో డెంగ్యూ విధ్వంసం.. వెయ్యి దాటిన మృతులు! My niece asked for my laptop and i said no so she spent 3 hours making her own laptop😭 pic.twitter.com/Bb7EK7BN97 — Neha (@LadyPeraltaa) October 1, 2023 -
పక్క పక్క పోర్షన్లు.. అత్తపై అల్లుడి దాడి.. కారణం ఏమిటంటే?
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): భార్యాభర్తల గొడవ నేపథ్యంలో అడ్డువెళ్లిన అత్తను ఊచతో అల్లుడు దాడిచేసి గాయపరిచిన సంఘటన నారాయణపురంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపురానికి చెందిన నరుకుర్తి కాంతం, కుమార్తె దుర్గావేణి, అల్లుడు నారాయణ ఒకే ఇంటిలో పక్క పక్క పోర్షన్లలో నివసిస్తున్నారు. అయితే శనివారం నారాయణ, దుర్గావేణి గొడవ పడుతుండగా పక్కనే ఉన్న కాంతం వారి మధ్యకు వెళ్లింది. దీంతో కోపోద్రిక్తుడైన అల్లుడు నారాయణ.. కాంతంపై ఇనుపఊచతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె పొట్టపై గాయాలు కావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాంతం ఫిర్యాదు మేరకు ప్రకాశం నగర్ ఎస్సై ప్రేమరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వివాహితతో సహజీవనం.. కుమార్తెలపై కన్నేసి.. -
ఘోరం: అత్తను సుత్తితో కొట్టి..పది ముక్కలుగా చేశాడు
సాక్షి, జైపూర్: యావత్తు దేశాన్నే ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్యోదంతం మరువక మునుపే అచ్చం అలాంటి తీరులోనే మరో ఘటన కలకలం రేపింది. ఒక వ్యక్తి ఈవెంట్‌కి వెళ్లొద్దని అడ్డు చెప్పిందన్న కోపంతో అత్తను సుత్తితో కొట్టి చంపి ముక్కలుగా చేశాడు. ఈ దారుణ ఘటన రాజస్తాన్‌లోని జైపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...32 ఏళ్ల అనూజ్ శర్మ అనే యువకుడు జైపూర్‌లోని విద్యానగర్‌లో తండ్రి, చెల్లి, మేనత్తతో కలిసి ఉంటున్నాడు. ఆ యువకుడి తల్లి గతేడాది కరోనా సమయంలో మృతి చెందింది. అతడి చెల్లి, తండ్రి ఇండోర్‌లో వెళ్లడంతో ఈ నెల డిసెంబర్ 11 నుంచి అనుజ్ అతడి మేనత్త సరోజ్ ఇద్దరే జైపూర్‌లో ఉంటున్నారు. వాస్తవానికి అనూజ్ మేనత్త సరోజ్ భర్త చనిపోవడంతో ఆమె అతడి కుటుంబంతోనే కలిసి ఉంటోంది. ఐతే ఒకరోజు అనూజ్ ఢిల్లీలోని ఒక ఈవెంట్‌కి వెళ్లాలనుకున్నాడు. ఆ విషయమై అతడి మేనత్తకు ఆమెకు మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో అనూజ్ కోపంతో ఒక సుత్తి తీసుకుని మేనత్తను కొట్టి చంపేశాడు. ఆతర్వాత ఆమె మృతదేహాన్ని ఒక మార్బుల్ కట్టర్‌తో సుమారు 10 ముక్కలుగా కోసేశాడు. ఆ భాగాలను బకెట్, సూట్‌కేసులలో పెట్టుకుని జైపూర్-సికర్ హైవే సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అత్త కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టాడు. అతడు కేసును తప్పుదోవ పట్టించేందుకు పలు రకాలుగా ప్రయత్నించాడు. ఐతే అతడి చర్యలను అనుమానించిన పోలీసులు నిందితుడి ఇంటికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించగా..అతడు మాత్రమే ఇంటి నుంచి వెళ్తున్నట్లు వీడియోలో కనిపించింది. పైగా అతడి ఫ్లాట్‌లోని కిచెన్‌లో రక్తపు మరకలను గుర్తించారు పోలీసలు. సదరు యువకుడు బీటెక్ వరకు చదువుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే సీసీటీవీలో బకెట్లు, సూట్‌కేసులతో అనూజ్ బయటకు వెళ్లినట్లు సాక్ష్యాధారాలు కూడా ఉండటంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు అరెస్టు చేశారు. (చదవండి: ప్రేమిస్తున్నానంటూ వెంటపడి..పెళ్లి మాట ఎత్తగానే...) -
అత్తతో అసభ్యంగా ప్రవర్తించిన అల్లుడికి ఐదేళ్ల శిక్ష
ఒంగోలు: అత్త పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అల్లుడికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ రెండో అదనపు జిల్లా జడ్జి ఎంఏ సోమశేఖర్ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..చీరాలకు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి చెప్పుల దుకాణం నిర్వహించేది. ఆమె కుమార్తెను చిత్తూరు జిల్లాకు చెందిన కోలా జాన్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు సంతానం. ఈ క్రమంలో అదనపు కట్నం కావాలంటూ భార్యను నిత్యం జాన్ వేధించేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో జాన్..భార్య తల్లికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధించేవాడు. చివరకు ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో చీరాలకు వచ్చి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించబోగా ఆమె కేకలు వేస్తూ బయటకు వచ్చింది. అనంతరం భర్తతో కలిసి చీరాల పోలీసులకు ఫిర్యాదుచేయగా అప్పటి సీఐ వి.సూర్యనారాయణ దర్యాప్తుచేసి కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. నేరం నిరూపణ అయినట్లుగా న్యాయమూర్తి పేర్కొంటూ నిందితుడు జాన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. కేసును అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యత్తపు కొండారెడ్డి వాదించగా, కోర్టు లయన్ ఆఫీసర్‌గా లక్ష్మీనారాయణ వ్యవహరించారు. చదవండి: (తప్పుడు ఆరోపణలు చేస్తే.. మీరే ఫూల్స్ అవుతారు: ఆర్కే రోజా) -
అత్తపై కోడలు భారీ స్కెచ్.. విస్తుపోయే షాకింగ్ నిజాలు బట్టబయలు
పెడన(కృష్ణా జిల్లా): కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తపై కక్ష పెట్టుకున్న కోడలు.. ఆమెను కిరాతకంగా హత్య చేసింది. ఆపై దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే పోస్టు మార్టం రిపోర్టు అసలు విషయాన్ని బహిర్గతం చేయడంతో కోడలు జైలు పాలయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ పెడన పోలీస్ స్టేషన్లో గురువారం విలేకరులకు వెల్లడించారు. చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్.. వారితో చనువు పెంచుకుని.. హోటల్‌కు తీసుకెళ్లి.. మొదటి నుంచీ గొడవలే.. పెడన పరిధిలోని కృష్ణాపురానికి చెందిన పడమట వీరబాబుతో కొండాలమ్మకు వివాహం జరిగి దాదాపు 12 ఏళ్లు అయ్యింది. ఈ క్రమంలో అత్త, కోడళ్లు తరచూ గొడవ పడుతుండేవారు. దీంతో అత్త రజనీకుమారి(50)పై కక్ష పెట్టుకున్న కోడలు కొండాలమ్మ ఆమె అడ్డు తొలగించుకునేందుకు గత నెల 27వ తేదీన విచక్షణ రహితంగా కర్రతో తలపై బలంగా కొట్టింది. ఆపై పీక పిసికి చంపేందుకు ప్రయత్నించింది. అప్పటికీ చనిపోకపోవడంతో చీరను మెడకు బిగించింది. ఆమె నోరు, ముక్కు నుంచి రక్తం రావడంతో స్పృహ కోల్పోయింది. దీంతో అత్త చనిపోయిందని భావించి తన భర్తకు, బంధువులకు సమాచారం అందించింది. ప్రమాదం అంటూ కలరింగ్.. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అత్త కాలుజారి వరండాలో పడిపోయి తీవ్రంగా గాయపడినట్లు భర్త, బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. ఇంటికి వచ్చిన కుమారుడు, కూతురు తీవ్ర గాయాలతో ఉన్న తల్లిని మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం చేర్చారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత నెల 30వ తేదీన రజనీకుమారి మరణించింది. ఈ క్రమంలో మృతురాలి కుమారుడు వీరబాబు తన తల్లి ఇంట్లో ప్రమాదవశాత్తు పడటంతో తీవ్ర గాయాలైనట్లు పేర్కొనడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టించిన పోస్టు మార్టం రిపోర్టు.. విజయవాడ వైద్యులు ఇచ్చిన పోస్ట్‌మార్టం రిపోర్టులో కోడలు చేసిన అసలు విషయం వెలుగు చూసింది. మృతురాలి తలకు బలమైన దెబ్బ తగలడం.. ఆపై ఊపిరి ఆడక చనిపోయినట్లు నివేదిక స్పష్టం చేసింది. దీంతో అనుమానించిన పోలీసులకు గ్రామంలో అందిన సమాచారంతో కోడలు కొండాలమ్మను తమదైన శైలిలో విచారించారు. దీంతో కొండాలమ్మ తానే అత్తను హత్య చేసినట్లు అంగీకరించింది. అత్తను చంపడానికి ఉపయోగించిన చీరను కూడా స్వా«దీనం చేసుకున్నామని సీఐ చెప్పారు. దీంతో కేసును హత్య కేసుగా మార్చి.. నిందితురాలు కొండాలమ్మను కోర్టులో హాజరు పరిచామని పేర్కొన్నారు. -
సోల్ ట్రేడ్..: ఉత్తమ అత్తాకోడళ్లు
చెన్నైలోని ఎస్ఆర్యం యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లో సురభి సొంత వ్యాపారం గురించి కల కనేది. నిజానికి ఆమెది వ్యాపారనేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ, తన ఆలోచనకు కుటుంబసభ్యులు పెద్దగా మద్దతు ప్రకటించలేదు. ‘ఉద్యోగం చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు. కాలం కలిసొస్తే అమెరికా వెళ్లి స్థిరపడిపోవచ్చు. వ్యాపారం చేయడమనేది పెద్ద రిస్క్. అందరికీ అది సాధ్యం కాదు’ అంటుండేవారు. అంతమాత్రాన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు సురభి. నిర్మాణ్ షాతో వివాహం అయిన తరువాత ఆమె ఇండోర్ (మధ్యప్రదేశ్)కు వెళ్లింది. అక్కడ అత్త రూపంలో తనకొక ‘అదృష్టం’ పరిచయం అయింది. అత్త చేత్న షా తనతో ఒక స్నేహితురాలిలా ఉండేది. అత్తగారితో తన ఆలోచన పంచుకుంది సురభి. ‘ఎందుకమ్మా రిస్క్’ అని అత్తగారు అనలేదు. కోడలి ఉత్సాహానికి మరింత ప్రోత్సాహం ఇచ్చింది. అలా ‘కారాగ్రీన్’స్టార్టప్‌కు అంకురార్పణ జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల జరిగే నష్టాల గురించి పుస్తకాల్లో చదవడమే కాదు, ఆ విషాదాన్ని కళ్లతో చూసింది సురభి. ‘ఎవరికి వారు ఇది నా సమస్య కాదు. ఎవరో వస్తారు. ఏదో చేస్తారు అనుకుంటే సమస్య మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు. అందుకే నా వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనలో నుంచి వచ్చిందే కారాగ్రీన్’ అంటుంది సురభి. ‘కారాగ్రీన్’ అనేది బయోడిగ్రేడబుల్ అంకుర సంస్థ. పర్యావరణహితమైన పెన్నులు, పెన్సిల్స్, సీడ్ పేపర్ డైరీలు, క్యాలెండర్లతో పాటు ప్యాకింగ్ సామాగ్రిని తయారు చేస్తారు. ఊహల్లో ఉన్న ప్రాజెక్ట్ కాగితం మీదికి రావడానికి, అక్కడి నుంచి వాస్తవరూపం దాల్చడానికి మధ్యలో సందేహాలు, సమస్యలు, అవాంతరాలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో కోడలికి అండగా నిలిచి ముందుకు నడిపించింది చేత్న షా. ‘వ్యాపారంలో మన కుటుంబసభ్యుల అండ అనేది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది’ అంటుంది సురభి. కట్ చేస్తే... షార్క్ ట్యాంక్ ఇండియా (బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్)లో ‘కారాగ్రీన్’ 50 లక్షల ఫండింగ్ ఆఫర్‌ను గెలుచుకుంది. -
వాకిలి తుడవలేదని అత్త.. చల్లబడ్డాక తుడుస్తానని కోడలు.. చివరికి..
పిఠాపురం(కాకినాడ జిల్లా): పొద్దు కునుకుతోంది ఇంకా వాకిలి తుడలేదని అత్త, ఇంకా చాలా ఎండగా ఉంది కదా చల్లబడ్డాక తుడుస్తానని కోడలు అంతే ఇద్దరు పంతాలకు పోవడంతో వారి మధ్య చిన్న గొడవ. ఇంతలో బయటి నుంచి ఇంటికి వచ్చిన కొడుకు తన తల్లిని భార్యను చిన్న దానికి గొడవెందుకంటూ మందలించాడు. అంతా సర్దుమణిగింది అనుకుంటు ఉదయం లేవగానే కోడలు తనను కొడుకుతో తిట్టించిందని కోపగించి అత్త ఎవరికి చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్లి పోయింది. రెండు రోజుల పాటు ఎంత వెదికినా ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో కొడుకు పోలీసులను ఆశ్రయించగా మహిళ అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చదవండి: నచ్చని పెళ్లి చేస్తున్నారని.. ఆ యువతి ఎంతకు తెగించిందంటే? పట్టణ ఎస్సై శంకర్రావు కథనం ప్రకారం స్థానిక కత్తులగూడేనికి చెందిన వాకాడ సత్యనారాయణ తన తల్లి భార్యతో కలిసి ఉంటున్నాడు. తల్లి, భార్యకు మధ్య వాకిలి తుడిచే విషయంలో చిన్న గొడవ జరగడంతో సత్యనారాయణ తల్లి వీరరాఘవమ్మ అలిగి ఈనెల 14వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బంధువులు, తెలిసిన వాళ్ల ఇళ్ల దగ్గర ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఆదివారం ఆమె కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
అన్నం పెట్టడం లేదని కొడుకుతో చెప్పిన తల్లి.. కోడలు క్షణికావేశంలో..
అనంతపురం క్రైం: అత్త తిట్లు భరించలేక ఓ కోడలు నిప్పంటించుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. నగరంలోని మున్నానగర్‌కు చెందిన ఫైనాన్స్ వ్యాపారి పోతులయ్య, బోయ లక్ష్మి దంపతులు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ముగ్గురు సంతానం. ఈ నెల 6న సాయంత్రం అత్తాకోడలి మధ్య వాగ్వాదం జరిగింది. తనను పట్టించుకోవడం లేదని, అన్నం సక్రమంగా పెట్టడం లేదంటూ కొడుకు పోతులయ్యతో ఈశ్వరమ్మ చెప్పి కోడలిని దూషించింది. కాసేపటికే పోతులయ్య బయటకు వెళ్లగా, ఇంట్లో అత్త, పిల్లలుండగానే లక్ష్మి క్షణికావేశంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈశ్వరమ్మ అరుపులతో చుట్టుపక్కల వారు చేరుకుని మంటలార్పారు. అనంతరం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ గౌస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (చదవండి: Custard Apple: ప్రాణం తీసిన సీతాఫలం) -
ఇల్లరికం అల్లుడు.. అత్తారింట్లో ఏం చేశాడంటే..!
పార్వతీపురం టౌన్(విజయనగరం జిల్లా): కొమరాడ మండలకేంద్రంలో వారంరోజుల కిందట జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. సొంత అత్త ఇంట్లో అల్లుడే దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. దొంగతనం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు పార్వతీపురం డీఎస్పీ సుభాష్ తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. (చదవండి: కాసుల కోసం కక్కుర్తి..! వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్..!) కొమరాడ మండలానికి చెందిన ఓ ఇంటికి ఆవాల గణేష్ ఇల్లరికానికి వచ్చి ఉంటున్నాడని పేర్కొరు. అడిగినపుడు అత్త డబ్బులు ఇవ్వడం లేదని, రెండురోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన అన్నదమ్ముడు కుమారుడైన సింహాచలంతో కలసి దొంగతనం చేశాడని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఇద్దరు నిందితుల వద్ద నుంచి ఎనిమిది తులాల బంగారం, రూ.20వేల నగదును స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని తెలిపారు. కార్యక్రమంలో సీఐ విజయ్‌ఆనంద్, ఎస్సై ప్రయాగమూర్తి పాల్గొన్నారు. చదవండి: అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాకం -
భర్త ఫోన్‌కాల్: భార్యను చంపేశా.. కూతుర్లను కూడా చంపేస్తా..
తాడేపల్లిరూరల్(గుంటూరు జిల్లా): ప్రేమ వివాహం చేసుకున్న భార్యను చంపేశానని అత్తకు ఫోన్ చేసి బెదిరించిన అల్లుడిపై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. సేకరించిన వివరాల మేరకు.. తాడేపల్లి పట్టణ పరిధిలోని యాదవుల బజారులో నివాసముండే పేరం రాములు, పేరం నరసమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. తండ్రి చనిపోయాడు. ఐదుగురు కూతుళ్లు వివాహాలు చేసుకుని ఎవరికి వారు జీవిస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే ఉద్యోగం చేసి, వలంటరీ రిటైర్మెంట్ చేసుకున్న పేరం రాములు భార్య అయిన నరసమ్మకు రూ.30 లక్షల నగదు వచ్చింది. (చదవండి: వివాహేతర సంబంధం: కలిసి ఉండలేమన్న బాధతో..) ఆ నగదును ఎలాగైనా కాజేయాలని ప్రేమ వివాహం చేసుకున్న నాల్గవ కుమార్తె పేరం వరలక్ష్మి భర్త అయిన కామినేని ప్రశాంత్‌కుమార్ పన్నాగం పన్నాడు. ఇల్లు కొనిస్తానంటూ నరసమ్మ వద్ద రూ.30 లక్షల నగదు, మిగిలిన నలుగురు కుమార్తెల వద్ద రూ.5 లక్షలు తీసుకుని భార్యతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ప్రశాంత్‌కుమార్, అతని భార్య ఫోన్‌ను స్విచ్చాఫ్ చేశారు. దీంతో అత్తకు అనుమానం వచ్చి గన్నవరంలోని అల్లుడు కామినేని ప్రశాంత్‌కుమార్ ఇంటికి వెళ్లింది. అక్కడ అతని తల్లిదండ్రులు మాకు తెలియదని చెప్పారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అల్లుడు ఫోన్ చేసి నీ కూతుర్ని చంపి పూడ్చిపెట్టాను. ఈ విషయాన్ని బయటకు చెబితే మిగిలిన నలుగురు కూతుళ్లను, నన్ను చంపుతానని బెదిరించి, ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో తనను, తన కూతుళ్లను రక్షించాలంటూ నరసమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్‌కుమార్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చదవండి: కనికట్టు కొలత.. బంకుల్లో పెట్రోల్ కాజేస్తున్న చిప్‌లు -
అత్తామామల చేతిలో అల్లుడు హతం
తాడేపల్లి రూరల్(గుంటూరు జిల్లా): మండల పరిధిలోని నులకపేటలో బుధవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ భర్త భార్యను చితకబాది, రోడ్డుమీదకు లాక్కొచ్చి వివస్త్రను చేసి కిలోమీటరు దూరంలో ఉన్న అత్తమామ ఇంటివరకు లాక్కెళ్లాడు. అది తట్టుకోలేని అత్త మామలు అల్లుడిపై దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ రామవరప్పాడుకు చెందిన కృష్ణ–రోహిణి దంపతుల పెద్ద కుమారుడైన కడలూరి నరేష్ (31)కు నులకపేటకు చెందిన దుర్గారావు–కమల దంపతుల పెద్దకుమార్తె లావణ్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. నరేష్ పెళ్లయిన రెండేళ్ల తర్వాత లావణ్య తల్లితో అసహ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరేష్‌ను అరెస్ట్ చేశారు. ఆ కేసులో మూడేళ్లు జైలు శిక్ష పడింది. అనంతరం 2017లో మరోసారి అదేవిధంగా ప్రవర్తించడంతో తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో రెండవ కేసు నమోదై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే భార్యను హింసిస్తూ అత్తమామల చేతిలో హతమయ్యాడు. సీఐ శేషగిరిరావు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. నరేష్‌కు విజయవాడలోని బ్లేడ్‌బ్యాచ్‌తో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. నగర బహిష్కరణకు గురైన సందీప్ అలియాస్ పెద్ద బాండ్ అనుచరుడిగా తిరుగుతున్నాడు. పెద్దబాండ్‌ను నగర బహిష్కరణ చేసిన తరువాత నులకపేట ప్రాంతంలోకి తీసుకువచ్చి ఇల్లు ఇప్పించింది కూడా నరేషే అని స్థానికులు చెబుతున్నారు. చదవండి: ఏపీ: కర్ఫ్యూ వేళల సడలింపు మావోయిస్టుల మృతదేహాలను14 కి.మీ. మోసుకుంటూ.. -
బ్రేకింగ్: కరోనాతో ప్రధాని మోదీ చిన్నమ్మ కన్నుమూత
అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ కరోనా ధాటికి సామాన్యులతో పాటు ప్రముఖుల ఇళ్లల్లోనూ విషాదం నిండింది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కుటుంబంలో కూడా విషాదం చోటుచేసుకుంది. కరోనాతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిన్నమ్మ నర్మదా బెన్ (80) కన్నుమూసింది. కరోనాతో చికిత్స పొందుతూ ఆమె అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతిచెందింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోదీ తెలిపారు. అహ్మదాబాద్‌లోని న్యూ రణిప్ ప్రాంతంలో తన పిల్లలతో కలిసి నర్మదాబెన్ నివసిస్తుండేది. ‘మా పిన్నిని పది రోజుల కిందట సివిల్ ఆస్పత్రిలో చేర్పించాం. చికిత్స పొందుతూ ఆమె ఈ రోజు మరణించింది’ అని ప్రహ్లాద్ మోదీ మీడియాకు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తండ్రి దామోదర్ దాస్ తమ్ముడు జగ్జీవన్‌దాస్. ఆయన భార్యే నర్మదాబెన్. చిన్నాన్న కొన్నేళ్ల కిందట కాలం చేయగా తాజాగా చిన్నమ్మ కన్నుమూసినట్లు మోదీ పెద్దన్నయ్య ప్రహ్లాద్ మోదీ తెలిపారు. చదవండి: మే 2 తర్వాతనే కరోనాపై కేంద్రం కఠిన నిర్ణయం? చదవండి: గుడ్‌న్యూస్.. 64 వేల బెడ్లతో రైల్వే శాఖ సిద్ధం -
అత్తపై అల్లుడి దాడి
ఆళ్లగడ్డ రూరల్: తన భార్యను కాపురానికి పంపలేదని అల్లుడు అత్తపై వేటకొడవలితో దాడికి పాల్పడిన ఘటన మండలంలోని చింతకొమ్మదిన్నె గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. రూరల్ సీఐ సుదర్శనప్రసాద్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పెద్దక్క కూతురు తులసీని పదేళ్ల క్రితం వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం సిద్దారెడ్డిపల్లె గ్రామానికి చెందిన హరిఆంజనేయులుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలానికి తాగుడుకు బానిసైన హరిఆంజనేయులు భార్యపై అనుమానంతో వేధింపులకు గురిచేసేవాడు. ఈక్రమంలో మూడు రోజుల క్రితం తులసీ శుభకార్యం నిమిత్తం(సోదరుడి పెళ్లి) పుట్టినింటికి వచ్చింది. గురువారం భార్యను తీసుకెళ్లేందుకు హరిఆంజనేయులు చింతకొమ్మదిన్నెకు వచ్చాడు. మరో వారం తర్వాత పంపుతానని అత్త చెప్పి పొలానికి వెళ్లింది. దీంతో కోపోద్రిక్తుడైన అల్లుడు వెంట వెళ్లాడు ఊరి చివర వేటకొడవలితో అత్త గొంతుపై నరికి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను అంబులెన్స్‌లో ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
పిన్ని ఇంటికే కన్నం
నల్లకుంట: స్వంత పిన్ని ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసిన యువతి, ఆమెకు సహకరించిన స్నేహితుడిని నల్లకుంట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం నల్లకుంట పీఎస్‌లో డీఐ కె.సైదులు, డీఎస్సై కోటేశ్వర్ రావు వివరాలు వెల్లడించారు. అడిక్‌మెట్ రాంనగర్ గుండు సమీపంలో ఉంటున్న నేదునూరి నాగప్రసన్న, భవాని శంకర్ దంప తులు కుటుంబంతో కలిసి ఈ నెల 6న బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వచ్చేసరిగి అల్మారాలో ఉన్న 7.5 తులాల బంగారు నగలు, రూ.75 వేల నగదు కనిపించకపోవడంతో భవాని శంకర్ నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానంతో బాగ్ అంబర్‌పేట వైభవ్ నగర్లో ఉంటున్న నాగప్రసన్న అక్క కుమార్తె సుప్రజా మూర్తి అలియాస్ జాహ్నవి మూర్తి సోమవారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. దారుసలాంలో ఉండే స్నేహితుడు విశాల్ అగర్వాల్‌తో చోరీకి పాల్పడినట్లు తెలిపింది. నిందితులను అరెస్టున పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించారు. -
ఆత్మాభిమానికి పెద్దమ్మ
రెక్కలు ముక్కలు చేసుకుని సాయంత్రానికి నాలుగు రాళ్లు చేతిలో పడితే.. ఆ డబ్బుతో వండివార్చిన పచ్చడి మెతుకులైనా పరమాన్నం తిన్నట్లే ఉంటుంది. ఈ మనసు ఎందరికుంటుంది? అన్ని అవయవాలూ బాగున్నా.. రోడ్ల వెంట చేయి చాస్తున్న మనుషులు నిత్యం తారసపడుతుంటారు. ఇదే సమయంలో ఆత్మాభిమానం కలిగిన వ్యక్తులకూ ఇవే రోడ్లు ఆశ్రయం. ఊరికే డబ్బు వస్తుందంటే ఎవరికి చేదు అనుకుంటాం. కానీ 90 ఏళ్లు పైబడిన ఆ అవ్వకు తనది కాని ఒక్క రూపాయి కూడా పాముతో సమానం. అయినవాళ్లకు ఆమె అక్కరకు రానిదైనా.. జానెడు పొట్ట నింపుకునేందుకు అనాథగా రోడ్డెక్కింది. ఉంటే తింటుంది. లేదంటే పస్తులుంటుంది. ఎవరైనా జాలిపడి పదో పరకో ఇవ్వజూపితే తాను బిచ్చగత్తెను కాదని నవ్వుతూ చెబుతుంది. తాను చేయగలిగిన పని చెబితే చేస్తానని.. ఆ తర్వాత మీరు ఇవ్వదలిచిన డబ్బు ఇవ్వండని ముందుకు కదులుతుంది. ఎండ లేదు.. వాన లేదు.. చలిగాలికీ బెదరదు.. ఫుట్‌పాత్‌పైనే బతుకీడుస్తున్న ఈ చెన్నమ్మ ఆత్మాభిమానానికి పెద్దమ్మే మరి. గార్లదిన్నె మండలం రంగనాథపురానికి చెందిన చెన్నమ్మకు ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. అవసాన దశలో ఉన్న చెన్నమ్మను వారు భారమనుకున్నారేమో.. పదేళ్ల క్రితం నిర్దయగా వదిలేశారు. అప్పటి వరకు ఎంతో పరువుగా బతికిన ఊళ్లో ఆమె ఇమడలేకపోయింది. ఉన్న ఊరు వదిలేసి అనంతపురానికి చేరుకుంది. బతికేందుకు రెక్కల కష్టాన్ని నమ్ముకుంది. ఓ కర్రను ఊతంగా పట్టుకుని నడుస్తూ.. రోడ్డు పక్కన పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుకుంటూ గుత్తిరోడ్డులోని ఓ గుజరీలో విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో ఆకలిదప్పికలు తీర్చుకుంటోంది. ఎవరైనా జాలితో అన్నమో.. డబ్బో ఇచ్చేందుకు ప్రయత్నిస్తే సున్నితంగా తిరస్కరిస్తుంది. తనకు చేతనైనా పనిచేసిపెడతానని, అప్పుడే తనకు ఆ డబ్బు ఇవ్వాలని సూచిస్తోంది. ఇదిగో.. టీ తాగు చచ్చే వరకూ ఒకరిపై ఆధారపడకుండా తన రెక్కల కష్టంపైనే జీవిస్తానంటూ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న చెన్నమ్మను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. చివరకు తనకు వస్తున్న పింఛన్‌ను బిడ్డలు లాక్కెళుతున్నా.. ఆమె నోరు మెదపడం లేదు. ఇదంతా తన ఖర్మ అంటూ కర్మసిద్ధాంతాన్ని గుర్తు చేసుకుంటుంది. కొసమెరుపేమిటంటే.. తనను ఫొటోలు తీస్తుండగా గమనించిన ఆమె ఎందుకు అంటూ ఆరా తీసింది. ‘ఎండలో చాలా కష్టపడుతున్నావు నాయనా.. ఇదిగో ఈ డబ్బు తీసుకుని టీ తాగు’ అంటూ ఓ ఐదు రూపాయలు తీసి ఇవ్వజూపినప్పుడు కెమెరా కళ్లు చెమ్మగిల్లాయి. అనంతపురంలోని గుత్తి రోడ్డులో చెత్తకుండి నుంచి వ్యర్థాలు ఏరుకుంటూ.. సేకరించిన వ్యర్థాలను గుజరీ షాపులో వేస్తున్న చెన్నమ్మ -
అత్తను చంపిన అల్లుడు
కృష్ణా జిల్లా : పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అత్తను అల్లుడు గొడ్డలితో నరికి చంపాడు. వివరాలు..నాగాయలంక మండలం నాచుకుంట ఏసుపురం గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ శివలీల (52) కుమార్తె శశిరేఖకు వణుకూరులో నివసిస్తున్న కన్నా జోజి ప్రసాద్‌కు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేకపోవడంతో రెండు రోజుల క్రితం కుమార్తెను ఆసుపత్రిలో చూపించేందుకు శివలీల వణుకూరు వచ్చింది. శనివారం రాత్రి గేదె అమ్మగా వచ్చిన డబ్బులను మద్యం సేవించేందుకు భార్యను ప్రసాద్ అడగటంతో వివాదం మొదలైంది. గొడవ మధ్యలో అత్త శివలీల వెళ్లి మందలించింది. దీంతో అక్కడినుంచి వెళ్లిపోయిన ప్రసాద్ బాగా మద్యం సేవించి తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చిన అనంతరం భార్య శశిరేఖతో మళ్లీ గొడవపడి గొడ్డలి తీసుకుని వెంబడించాడు. గమనించి అత్త అడ్డుపడటంతో కోపంలో అత్తను గొడ్డలితో నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అత్తను చంపిన అల్లుడు
పెగడపల్లి: భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో అల్లుడే అత్తను చంపిన సంఘటన పెగడపల్లి మండలం లింగాపూర్‌లో ఆదివారం జరిగింది. లింగాపూర్‌కు చెందిన శనగరపు నర్సవ్వ(70) అల్లుడు దుంపటి కొమురయ్య తన భార్య గంగవ్వను కాపురానికి పంపడం లేదని ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మల్యాల సీఐ నాగేందర్‌గౌడ్ తెలిపిన వివరాలు. నర్సవ్వ భర్త మల్లయ్య చనిపోయాడు. తన కూతురు గంగవ్వ వివాహం మండలంలోని సుద్దపల్లికి చెందిన దుంపటి కొమురయ్యతో 25 ఏళ్ల క్రితం జరిపించింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. కొమురయ్య భార్య గంగవ్వ, కూతుళ్లను వేధిస్తుండడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టుకుని పదేళ్ల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలో తిరిగి ఐదేళ్ల క్రితం భార్యభర్తలు కలిసి ఉంటూ వారి కూతుళ్లకు వివాహాలు కూడా చేశారు. కొంతకాలంగా గంగవ్వను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తల్లిగారి ఊరు లింగాపూర్‌కు వచ్చి తల్లి నర్సవ్వతో ఉంటుంది. ఈ నేపథ్యంలో తాగుడుకు బానిసైన కొమురయ్య తరచూ భార్యతో గొడవలు పడుతూ ఉన్నాడు. భార్యను కాపురానికి పంపకుంటే చంపుతానని బెదిరించేవాడు. ప్రాణభయం ఉందనే భయంతో గంగవ్వ బంధువుల ఇంట్లో నిద్రిస్తుంది. ఈక్రమంలోనే ఆదివారం రాత్రి వచ్చిన కొమురయ్య నిద్రిస్తున్న అత్త నర్సవ్వ తలపై రోకలిబండతో బాది హత్య చేశాడు. హత్యా జరిగిన ప్రదేశాన్ని జగిత్యాల డీఎస్పీ భధ్రయ్య సందర్శించి, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు జరిపించారు. మృతురాలి కూతురు గంగవ్వ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగేందర్ తెలిపారు. పెగడపల్లి ఎస్సై జీవన్ ఉన్నారు. -
చోరీలకు పాల్పడుతున్న అత్త, కోడలు అరెస్ట్
వేలూరు: జోలార్‌పేట– కాట్పాడి మధ్య రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న అత్త, కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు. జోలార్‌పేట– కాట్పాడి రైలు మార్గంలో తరచూ ప్రయాణికుల వద్ద బంగారు, నగదు చోరీ కావడంలో ప్రయాణికులు జోలార్‌పేట, కాట్పాడి రైల్వేస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో రైల్యే పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. అదే విధంగా చోరీలు జరిగిన సమయంలో కాట్పాడి రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ సమయంలో ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో పోలీసులు ప్రయాణికుల తరహాల్లో వారి కోసం ప్రత్యేక నిఘా ఉంచారు. దీంతో గురువారం ఉదయం కాట్పాడి రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాలో ఉన్న ఇద్దరు మహిళలు ఉండడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. విచారణలో వేలూరు సాయినాథపురానికి చెందిన బాలన్ భార్య పగలమ్మాల్, ఈమె కోడలు ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా అరగొండ గ్రామానికి చెందిన రాజేంద్రన్ భార్య అలిమేలు అని తెలిసింది. వీరిద్దరూ కలిసి బృందావన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో 22 సవర్ల బంగారు నగలు చోరీ చేసినట్లు నేరం అంగీకరించారు. అలిమేలుకు చిత్తూరులో రెండు సొంత ఇళ్లు ఉన్నట్లు తెలిసింది. ముంబైలో అత్త, కోడలు కలిసి రెండు సొంత ఇళ్లు కొనుగోలు చేసినట్టు, చోరీ చేసిన నగలు తాకట్టు పెట్టి నగదు సంపాదించినట్లు తెలిసింది. వీరిద్దరూ చోరీ చేసిన నగలతో ఇళ్ల కొనుగోలు చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. దీంతో అలిమేలు, పగలమ్మాల్ను అరెస్ట్ చేశారు. -
అల్లుడు హింసిస్తున్నాడంటూ అత్త ఫిర్యాదు
♦ మద్యం మత్తులో అసభ్యంగా ♦ ప్రవర్తిస్తూ వేధింపులు నులకపేట (తాడేపల్లి రూరల్) : తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటలో నివసించే ఓ యువకుడు మద్యం సేవించి ఆ మత్తులో అత్తను, భార్యను హింసించడంతో బుధవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అత్త ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తాడేపల్లి ఎస్సై ప్రతాప్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నులకపేటలో నివాసం ఉండే ఓ మహిళ తన పెద్ద కూతురును ఆరేళ్ల క్రితం రామవరప్పాడుకు చెందిన కరుడు నరేష్‌కి ఇచ్చి వివాహం చేసింది. తాగుడుకు బానిసైన నరేష్ భార్యను పోషించకుండా పుట్టింటికి పంపించివేశాడు. అనంతరం నరేష్ కూడా వచ్చి అత్త గారి ఇంట్లోనే నివాసం ఉంటూ ప్రతిరోజూ మద్యం సేవించి అత్తతో, భార్యతో ఒకే విధంగా ప్రవర్తిస్తూ హింసిస్తున్నాడు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు కూడా చర్చించుకొని నరేష్‌కు సర్దిచెప్పినా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకుండా, అత్తతో, ఆమె కూతురుతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, హింసిస్తుండటంతో విసిగిపోయిన అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రతాప్‌కుమార్ తెలిపారు. -
ఆంధ్రా అత్త.. అన్నానగర్ కోడలు.. అదిరే జ్యూస్‌లు
కేకేనగర్ : ఫ్రూట్ జ్యూస్‌లతో ఆనందంతోపాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నారు ఈ అత్తాకోడళ్లు. గత పదేళ్లుగా ముగప్పేర్ ఈస్ట్‌లో నివసిస్తున్న అత్త ప్రేమ, కోడలు లక్ష్మీలు ఇంట్లోనే రకరకాల పండ్లతో ప్రకృతి సిద్ధంగా జ్యూస్‌లను తయారు చేసి అతి తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ప్రారంభంలో ఇంటికి వచ్చిన అతిథులకు, స్నేహితులకు తాగడానికి జ్యూస్ చేసి ఇచ్చేవారు. వారు వారికి తెలిసిన వారికి చెప్పి ఆర్డర్లు ఇవ్వడంతో వీరి చిన్న పాటి వ్యాపారానికి గిరాకీ పెరిగింది. రోజూ పది లీటర్ల జ్యూస్‌ల నుంచి సీజన్లలో 150 లీటర్ల వరకు అమ్మకాలు సాగుతుంటాయని ప్రేమ తెలిపారు. ప్రేమ తెలుగు వారు కావడం విశేషం. ఆమె పుట్టిల్లు తిరుపతికాగా కోడలు లక్ష్మీ చెన్నై అన్నానగర్‌కు చెందినవారు.ప్రేమ నాన్న వేదాంతచారి. ఆయన తిరుమల కొండపై అహోబిలం మఠంలో ముద్రకర్తగా 65 సంవత్సరాలు సేవలందించారు. ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకుని గత 40 ఏళ్ల కిందట చెన్నై వచ్చేశారు. భర్త రామభద్రన్ టాన్సీ విశ్రాంత ఉద్యోగి. కుమారుడు ఆరవముదన్కు వివాహం జరిగిన అనంతరం కోడలు లక్ష్మితో కలిసి ప్రేమ జ్యూస్ వ్యాపారం ప్రారంభించారు. ఈ విషయమై ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తాము తయారు చేసే పండ్ల జ్యూస్‌లను ఎంతో ఇష్టంగా తాగుతారని తెలిపారు. చిన్న ప్లిలలు సాధారణంగా పాలు తాగాలంటే మొండికేస్తారు. వారి తల్లుల కోరిక మేరకు రోస్మిల్క్లను తయారు చేసి అందిస్తున్నట్టు పేర్కొన్నారు. సీజన్లతో పని లేకుండా అన్ని సీజన్లకు తగినట్లు ఫ్రూట్ జ్యూస్‌లను తయారు చేయడం తమ ప్రత్యేకత అని ప్రేమ చెప్పారు. లెమన్, పైనాపిల్, గ్రేప్, మ్యాంగో, జింజర్ జ్యూస్‌లు, ఇంకనూ లెమన్ ప్లెయిన్, జింజర్ లెమన్, లెమన్– నన్నారి, లెమన్ – మింట్, పిల్లల కోసం ప్రత్యేకంగా రోస్మిల్క్ తయారు చేస్తామని అన్నారు. తమ వ్యాపారానికి ఎలాంటి ప్రకటనలు, పబ్లిసిటీ ఇవ్వలేదన్నారు. ప్రేమ, వినియోగదారుల పోత్రాహం, అభిమానమే తమ వ్యాపార రహస్యం అన్నారు ప్రేమ నవ్వుతూ.. లక్ష్మీ మా ట్లాడుతూ.. సమ్మర్ సీజన్లో జింజర్, మిం ట్‌తో తయారు చేసిన జ్యూస్‌లకు గిరాకీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అల్లం శరీ రంలో చురుకుదనాన్ని కల్గించి అలసటను పోగొడుతుందని వివరించారు. ఒక జ్యూస్‌ను తయారు చేయడానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుందని లక్ష్మి తెలిపారు. జ్యూస్‌లలో కలపడానికి తాజా పండ్లను తీసుకుంటామని, చక్కెర సిరప్‌ను వేడి చేసి ఫ్రెష్‌గా తయారు చేసి చల్లారిన తర్వాత జ్యూస్‌లలో కలుపుతామని, తాము తయారు చేసే ఈ జ్యూస్‌లు ఆరు నెలల పాటు తాజాగా ఉంటాయని ఈ అత్తాకోడళ్లు తెలిపారు. ఖర్చులకు పోగా వచ్చే ఆదాయాన్ని కూడబెట్టి సత్కార్యాలకు వినియోగించాలనేది ఈ ఇద్దరి కోరిక. వీరితో పాటు కుటుంబ సభ్యులందరూ అదే కోరుకుంటున్నారు. మనం కూడా వారి కోరిక నెరవేరాలని ఆశిద్దాం. -
మంత్రాల నెపంతో మామను, అత్తను చంపేశాడు
జష్పూర్: ఛత్తీస్‌గఢ్ లో దారుణం జరిగింది. చేతబడులు చేస్తున్నారనే నెపంతో ఓ వ్యక్తి తన సొంత మేనమామ, అత్తలను కొట్టి చంపాడు. జష్పూర్ జిల్లా కరదరి గ్రామంలో ఈ ఘోరం వెలుగుచూసుంది. గ్రామానికి చెందిన లండ్రూ రాం భార్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీనికి కారణం.. తన మేనమామ బిషున్ రాం(60), అతని భార్య బసంతి రాయ్(48)నే అని లండ్రూ అనుమానం. దీంతో వారిద్దరినీ అంతం చేయాలని పథకం పన్నాడు. ఆదివారం సాయంత్రం ఊరి బయట ఉన్న తన ఇంటికి వారిద్దరినీ ఆహ్వానించాడు. అయితే, ఆ దంపతులకు అనుమానం వచ్చింది. కానీ, లండ్రూరాం మాయమాటలు చెప్పి రప్పించాడు. మార్గమధ్యంలోనే వారితో వాదులాటకు దిగి ఇంటి సమీపంలోకి చేరాక ఇద్దరినీ కర్రతో తీవ్రంగా కొట్టి చంపాడు. సోమవారం సాయంత్రం ఆ మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు లండ్రూను అదుపులోకి తీసుకున్నారు. తన భార్య ఆరోగ్య సమస్యలకు వారి మంత్రాలే కారణమనే అనుమానంతో చంపేసినట్లు అంగీకరించాడు. దీంతో అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
గర్భం ధరించకుండానే ప్రసవించినట్లు నాటకం
సినీ ఫక్కీలో భార్య మోసం భర్త ఫిర్యాదుతో వెలుగులోకి కేకేనగర్: ఓ యువతి గర్భం ధరించకుండా బిడ్డకు జన్మనిచ్చినట్లు నాటకం ఆడడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు యువతి నుంచి బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై, కీళ్పాక్కం రిటైర్డ్ సహాయ పోలీస్ కమిషనర్ సోమన్. ఇతని కుమారుడు యోగేశ్వరన్ భార్య పద్మిని. 2016, ఫిబ్రవరి 14న పెద్దల అనుమతితో వీరి వివాహం జరిగింది. అయితే పద్మినిని ఇష్టపడని యోగేశ్వరన్ తల్లిదండ్రులు తరచూ ఆమెను వరకట్న వేధింపులకు గురిచేసేవారని తెలుస్తోంది. బిడ్డ పుడితే సమస్యలు తీరుతాయని బంధువులు చెప్పారు. దీంతో పద్మిని తాను గర్భవతినని భర్తతో చెప్పింది. అయితే ప్రతిసారి తల్లితోపాటు డాక్టర్ వద్దకు చెకప్‌కు వెళ్లేదని, భర్త పిలిస్తే వెళ్లేది కాదని తెలిసింది. ఆమెకు తొమ్మిదో నెల సీమంతం చేశారు. సీమంతానికి వచ్చిన పలువురు గర్భం లేదని అనుమానం వ్యక్తం చేశారు. దానికి ఆమె తల్లి తమ వంశంలో అందరికీ ఇలాగే కడుపు ఉంటుందని నమ్మించింది. తర్వాత ఆమె ప్రసవం కోసం తల్లి ఇంటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో బుధవారం తనకు ఆడ పిల్ల పుట్టిందని పద్మిని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. బిడ్డను చూడడానికి వెళ్లిన యోగేశ్వరన్, అతని తల్లిదండ్రులకు బిడ్డ పుట్టి నాలుగు నెలలు అయినట్లు తెలిసింది. దీంతో భార్య ప్రవర్తనపై సందేహంతో యోగేశ్వరన్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. ఇంకనూ శిశు సంక్షేమ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు పద్మిని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వారి వద్ద విచారణ జరిపారు. బిడ్డ ఏ ఆసుపత్రిలో పుట్టింది, వాటి ఆధారాలు చూపించమని అధికారులు అడిగారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో శిశువును తీసుకెళ్లారు. చింతాద్రిపేట పోలీసులు జరిపిన విచారణలో కొన్ని నిజాలు వెలుగుచూశాయి. పద్మిని తన 17 సవర్ల తాళి చెయిన్‌ను అమ్మి బిడ్డను ఉత్తరాది దంపతుల వద్ద కొన్నట్లు తెలిసింది. పిల్లల కోసం భర్త, అత్త వేధింపులు, తట్టుకోలేక ఈ పనిచేసినట్లు అంగీకరించింది. -
వివాహిత దీక్ష
మైలవరం: అత్త, భర్త వేధిస్తున్నారంటూ ఓ వివాహిత దీక్షకు కూర్చొన్న సంఘటన దొమ్మరనంద్యాల గ్రామంలో గురువారం చోటుచేసుకొంది. ఇందుకు సంభందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామానికి చెందిన పల్లా గోపాల్, ధనలక్ష్మి కుమార్తె రాజేశ్వరిని మైలవరం మండలం దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన బడిగించాల వెంకటసుబ్బయ్య సంవత్సరం క్రితం వివాహం చేసుకొన్నాడు. మొదటి ఆరు నెలలు సంసారం సజావుగా సాగింది. తర్వాత రాజేశ్వరికి వేధింపులు మెదలయ్యాయి., దీంతో ఆమె తనకు న్యాయం చేయాలంటూ మైలవరం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు న్యాయం చేయలేదని బుధవారం రాత్రి తల్లి, తండ్రి, సోదరుడుతో కలిసి దొమ్మరనంద్యాలలోని వనంలోని చౌడేశ్వరి గుడి దగ్గర దీక్షకు కూర్చున్నారు. పెద్ద మనుషుల చర్చలు విఫలం : గ్రామానికి చెందిన కొందరు పెద్దమనుషులు గురువారం ఉదయం అబ్బాయి తరఫు వారితో మాట్లాడి సయోధ్య కుదురుస్తామని అమ్మాయి బుంధువులతో చెప్పారు. తమ కుమార్తెను వేధించిన వారిపై కేసు నమోదు చేయాలని, అంతవరకు దీక్ష విరమించేది లేదన్నారు. మధ్యాహ్నం వరకు సాగిన పెద్ద మనుషుల చర్చలు విఫలమయ్యాయి. కేసు నమోదు చేసిన రూరల్ సీఐ దీక్ష విషయం పోలీసులకు ఉదయమే తెలిసినా ఫ్యాక్షన్ గ్రామమైన చిన్నకొమెర్లలో పెద్దమ్మ జాతరకు బందోబస్తు కోసం వెళ్లారు. రాత్రి రూరల్ సీఐ మురళీనాయక్, మైలవరం ఎస్ఐ సునీల్ కుమార్‌రెడ్డి రాజేశ్వరితో మాట్లాడారు. అనంతరం వెంకటసుబ్బయ్య అతని తల్లి మరి కొందరిపై కేసు నమోదు చేశారు. దీంతో రాత్రి 9 గంటల సమయంలో ఆమె దీక్ష విరమించింది. ఇంటికి వస్తే కాపురం చేస్తా:– రాజేశ్వరిని వేధింపులకు గురి చేయలేదు. తల్లిని వదిలేసి వేరు కాపురం పెట్టాలని బలవంతం చేస్తోంది. దీనికి నేను అంగీకరించలేదు. దీంతో ఆమె చెప్పుడు మాటలు విని మాపై కేసు పెట్టింది. ఇప్పటికైనా ఆమె నా ఇంటికి వస్తే కాపురం చేస్తాను. – వెంకటసుబ్బయ్య, -
అత్తకు యముడు...
బెంగళూరు (కేఆర్ పురం) : చికెన్ రుచిగా వండలేదనే కారణంతో సొంత అత్తను అల్లుడు హత్య చేసిన సంఘటన ఆవలహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన వీరప్ప కృష్ణరాజపురంలోని కేఆర్ ఇఎస్ హోటల్లో సూపర్వైజర్ పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతను కిత్తగనూరుకు చెందిన మునిరత్నమ్మ (50) కుమార్తె సౌమ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అత్త ఇంటిలోనే నివాసం ఉంటున్నాడు. ఇదిలా ఉంటే మద్యానికి బానిసైన వీరప్ప నిత్యం తాగి వచ్చి అత్తతో గొడవకు దిగేవాడు. ఆదివారం చికెన్ సరిగా వండలేదని అత్తతో గొడవకు దిగాడు. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని సర్ది చెప్పి పంపారు. దీంతో అల్లుడిని బయటే ఉంచి వాకిలి వేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇంటి పొగ గొట్టం నుంచి లోనికి దిగిన వీరప్ప తన భార్య సౌమ్య సహాయంతో అత్త మునిరత్నమ్మ గొంతునులిమి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. -
కోడలిపై దాడి కేసులో అత్త అరెస్ట్
-
కట్టుకున్నోడే కాలయముడై..
కొవ్వూరు : కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భార్యను కిరాతకంగా నరికి చంపాడు. అడ్డువచ్చిన అత్తపైనా దాడిచేశాడు. ఆ తర్వాత అదే కత్తితో పీకకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొవ్వూరులో గురువారం జరిగిన ఈ దారుణ ఘటన సంచలనం సృష్టించింది. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కలవపాడుకుS చెందిన బొదంకి నరసింహమూర్తి కొవ్వూరుకు చెందిన వరలక్ష్మి(30)ని పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ తరుచూ గొడవలు పడుతుండడంతో పలుమార్లు పెద్దలు రాజీ చేశారు. బంటా కూలీగా పనిచేసే నరసింహమూర్తి ఏడాది క్రితమే సెట్రింగ్ పనుల నిమిత్తం ఉపాధి కోసం కుటుంబ సమేతంగా హైదరాబాద్ వెళ్లాడు. రెండు నెలల క్రితం భార్యాభర్తలు గొడవ పడడంతో వరలక్ష్మి కొవ్వూరులోని పుట్టింటికి వచ్చేసింది. నెల రోజుల క్రితం మళ్లీ పెద్దలు సర్ది చెప్పడంతో కాపురానికి వెళ్లింది. అయినా వీరిద్దరి మధ్య సక్యత కుదరలేదు. భర్తతో విసుగెత్తిన వరలక్ష్మి పదిరోజుల క్రితమే ఆమె కుతూరు, చిన్న కుమారుడిని తీసుకుని కొవ్వూరు వచ్చింది. వరలక్ష్మి పెద్ద కుమారుడు కొంతకాలంగా కొవ్వూరులోనే ఉంటున్నాడు. గురువారం కొవ్వూరులోని 19వ వార్డు దగ్గువారి వీధిలోకి వచ్చిన నరసింహమూర్తి వరలక్ష్మిని పిలిచి గొడవపడ్డాడు. మాటామాటా పెరగడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడ్డాడు. వరలక్ష్మి అరుపులు విని ఆమె తల్లి మాచారపు అచ్చాయమ్మ బయటికి వచ్చి అల్లుడిని అడ్డుకునేందుకు యత్నించింది. దీంతో నరసింహమూర్తి ఆమెపైనా విచక్షణరహితంగా దాడి చేశాడు. అదే కత్తితో పీకకోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కత్తితో నరసింహమూర్తి దాడికి పాల్పడుతున్న సమయంలో చుట్టు పక్కల జనం నిచ్చేష్టులై ఉండిపోయారు. భయంతో అతడిని అడ్డుకునే సాహసం చేయలేకపోయారు. దీంతో రక్తపు మడుగులో రోడ్డుపైనే పడిపోయిన వరలక్ష్మి పక్కనే నరసింహమూర్తి కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు వీరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉన్న వరలక్ష్మిని, పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో నరసింహమూర్తిని 108లో రాజమండ్రి తరలించారు. మార్గమధ్యలో వరలక్ష్మి మరణించింది. నరసింహమూర్తి రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అచ్చాయమ్మ చికిత్స పొందుతున్నారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎస్ఐ పవన్‌కుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
హత్యకేసులో ముగ్గురి అరెస్ట్
తాడేపల్లిగూడెం రూరల్ : వివాహితను హత్య చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్‌చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. పట్టణంలోని కొబ్బరితోటకు చెందిన ఉర్రింకల జానకి(30) ఈ నెల 20న హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పట్టణ సీఐ ఎం.ఆర్.ఎల్.ఎస్.ఎస్.మూర్తి మంగళవారం మృతురాలి భర్త గంగాధరరావు, అత్తమామలు బాలయోగి, సరస్వతిని అరెస్ట్ చేశారు. -
అత్తింటి వేధింపులకు బలి
భర్త, అత్తమామలే హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ కొడకండ్ల : అదనపు వరకట్న వేధింపులకు వివాహిత బలైన ఘటన మండలంలోని రేగుల గ్రామంలో గురువారం చోటుచేసుకొంది. తమ కుమార్తెను అత్తింటి వారు హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. నెక్కొండ మండలం రెడ్లవాడకు చెందిన పల్లెకొండ నర్సయ్య–నర్సమ్మల కుమార్తె లావణ్య(19)ను రేగుల గ్రామానికి చెందిన రాయారపు యాకయ్య–సాయమ్మల కుమారుడు అశోక్‌కు ఇచ్చి 8నెలల క్రితం రూ.3లక్షల కట్నకానుకలు ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత నెలరోజులకే భర్త, అత్త, మామలు అదనపు కట్నం కోసం వేధించసాగారు. దీంతో లావణ్య తల్లిదండ్రులు, బంధువులు వచ్చి వారిని నిలదీయగా ఇక నుంచి మంచిగా చూసుకొంటామని అన్నారు. కానీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో నెల రోజుల క్రితం లావణ్య తల్లిదండ్రులు అప్పు చేసి రూ.80 వేలు ఇచ్చారు. అయినా వేధింపులు ఆపలేదని, వారు తీవ్రంగా కొట్టడం వల్లే తమ కూతురు మృతి చెందిందని, ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని నర్సయ్య, నర్సమ్మ విలపించారు. లావణ్య మృతి విషయం తెలిసి తాము వచ్చేసరికే ఆ ముగ్గురూ పరారయ్యారని చెప్పారు. తమ కుమార్తెను గొంతు నులిపి, కొట్టారని, చాతిపై, వీపులో గాయాలు ఉన్నాయని తెలిపారు. లావణ్య భర్త, అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. వారి ఫిర్యాదు మేరకు అశోక్, యాకయ్య, సాయమ్మపై కేసు నమోదు చేసినట్లు పాలకుర్తి సీఐ కరుణాసాగర్‌రెడ్డి, ఎస్సై ఎంబాడి సత్యనారాయణలు తెలిపారు. -
కట్నపు కోరలకు మహిళ బలి
ఆదోని టౌన్ : అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధించడంతో భరించలేని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆస్పరి మండలం ములుగుందంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆస్పరి ఎస్ఐ రమేష్ బాబు, బాధతురాలి తండ్రి తిక్కయ్య తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ముద్ద రంగయ్యతో బైలుప్పలకు చెందిన లక్ష్మికి పదేళ్లక్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. ఇటీవల భర్త, అత్త ఈరమ్మ లక్ష్మిని అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీకంగా వేధించేవారు. లక్ష్మిపై భర్త దాడి చేయడంతో పుట్టింటికి వెళ్లింది. పెద్దలు పంచాయితీ చేసి కాపురానికి పంపారు. మళ్లీ వేధింపులు మొదలవడంతో తీవ్రమనస్థాపానికి గురైంది.S ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన భర్త, కుటుంబ సభ్యులు ఆదోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మతి చెందింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆస్పరి ఎస్ఐ తెలిపారు. -
అత్తగారి పెత్తనం తట్టుకోలేక..
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నం.. పార్వతీపురం: అత్తలు పెట్టే బాధలను భరించలేక గరుగుబిల్లి మండలం బాలగుడబ గ్రామంలో ఓ అల్లుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. పట్టణంలోని బెలగాంలో అత్త బాధ భరించలేక ఓ కోడలు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీటికి సంబంధించి స్థానిక ఏరియా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు, బాధితుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట సమీపంలోని ఇల్లపిల్లికి చెందిన ఈల మురళి గురుగుబిల్లి మండలం బాలగుడబకు చెందిన అరుణను వివాహం చేసుకుని గ్రామంలోనే నివాసముంటున్నాడు. వీరికి సంజన అనే పాప ఉంది. అత్త వల్ల భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండడంతో మనస్తాపం చెందిన మురళి సోమవారం పురుగమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి స్థానిక ఏరియూ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బెలగాంలో.. బెలగాంనకు చెందిన మీసాల రూపకు తగరపువలసకుచెందిన సంతోష్‌తో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల పాప ఉంది. అయితే సంతోష్ సింగరేణిలో పనిచేస్తుండడంతో రూప తన పాపతోపాటు అత్తవద్దే ఉంటోంది. నిత్యం అత్త వేధిస్తుండడంతో మనశ్శాంతి లేక రూప ఇటీవల తన తల్లివద్దకు వచ్చింది. అప్పటికీ ఆమె వేధింపులు ఆగకపోవడంతో ఇంట్లో ఉన్న ఫినారుుల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి స్థానిక ఏరియూ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
నగల కోసం అత్తను హతమార్చిన అల్లుడు
నర్సాపూర్: నగల కోసం అత్తను అల్లుడు హతమార్చినట్లు నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు, ఎస్సై వెంకటరాజుగౌడ్లు తెలిపారు. ఈనెల 18న మండలంలోని నాగులపల్లి పంచాయతీ పరిధిలోని తౌర్య తండాకు చెందిన గిరిజన మహిళ మెగావత్ తార(48)ని పట్టపగలే దారుణంగా హత్యచేసిన నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. హతురాలి కూతురు బుజ్జి భర్త ఇస్లావత్ జగదీష్, అతడి మిత్రుడు ఉమేష్ కలిసి పథకం ప్రకారమే అత్త ఒంటిపై ఉన్న నగలు, నగదు కోసం దారి కాచారు. నాగులపల్లి ఉన్న పాఠశాల సమీపంలోని కర్నాలకుంట వద్ద కల్లు సీసాతో గొంతు, ఇతర చోట్ల పొడిచి హత్య చేసినట్లు తెలిపారు. మృతురాలు తార, విఠల్ దంపతులకు ఒక్కగానొక్క కూతురు బుజ్జి ఉండడంతో ఆమెను అదే తండాకు చెందిన ఇస్లావత్ జగదీష్‌కు ఇచ్చి మూడేళ్ళ క్రితం పెళ్లి జరిపించినట్లు తెలిపారు. పెళ్లైన కొన్ని రోజుల నుంచి జగదీష్ పనులేమీ చేయకుండా జులాయిగా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డాడన్నారు. మూడేళ్లలో మామ విఠల్, అత్త తారలు రెండు సార్లు అతడికి కొత్త బైక్ కొని ఇచ్చారు. అయితే వాటిని జల్సాల కోసం తక్కువ ధరకు విక్రయించడంతోపాటు తరుచూ డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేసేవాడు. జల్సాలు మానుకొని ఏదైనా పని చేసుకోవాలని అత్త తార పలుమార్లు గట్టిగా చెప్పింది. అది జీర్ణించుకోలేక అత్తను హతమారిస్తే ఇక తనకు తిరుగు ఉండదన్న ఉద్దేశంతో పథకం ప్రకారం హత్య చేశాడు. హత్య చేసిన సమయంలో ఆమె ఒంటిపై కాళ్ళ కడియాలు, పట్టాలు, కలిపి( 40 తులాల వెండి), అర్ధ తులం బంగారు కమ్మలు, రూ 16 వేల నగదు ఉండగా వాటిని తీసుకొని అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. దీంతోపాటు అత్తను హత మారిస్తే తనుకు తిరుగుండకపోవడంతోపాటు అత్తామామల ఆస్తిని చేజిక్కించుకోవచ్చన్న అత్యాశతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలిందన్నారు. ఇద్దరు నిందితుల నుంచి నగలు, నగదును రికవరీ చేసి కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో హెడ్‌కానిస్టేబుల్ రాజు, మధు, తదితరులు ఉన్నారు. -
తల నరికి.. గాల్లోకి విసిరేసి..
కొబ్రా: చేతబడి చేస్తోందన్న అనుమానంతో సొంత అత్తను మేనల్లుడు చంపిన ఘటన చత్తీస్ ఘడ్ కొబ్రా జిల్లాలోని బెల్బహర్పురా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అమ్మ, తమ్ముడు తరచూ జబ్బు పడటానికి తన అత్త భూదాన్ బాయ్ చేసిన చేతబడే కారణమని ఉదయ్ గోండ్(28) నమ్మాడు. దీంతో కోపావేశంతో రగిలిపోయిన గోండ్ గొడ్డలి తీసుకుని భూదాన్ బాయ్ ఇంటికి వెళ్లాడు. ఆమెను చితక్కొట్టిన గోండ్ అడ్డొచ్చిన ఆమె ఇద్దరి కూతుళ్లను కొట్టి పక్కకు తోసేశాడు. దీంతో తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన బాధితురాలు ఇంటి వెనుక ఉన్న కూరగాయల చేనులోకి వెళ్లింది. ఆమె వెనుకే వెంటాడిన గోండ్ గొడ్డలి ఆమె తలను నరికేశాడు. తర్వాత ఆ తలను చేతితో పట్టుకుని శవం నుంచి దూరంగా గాల్లోకి విసిరేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
ఆ కేసు అత్తమామలపై కూడా వేయచ్చు!
గృహహింస :: కేస్ స్టడీ శ్రీలత వివాహమై నాలుగేళ్లయింది. భర్త ఐటీ ఉద్యోగి. రెండేళ్ల బాబు. దురదృష్టవశాత్తూ అనారోగ్యంతో భర్త మరణించాడు. అప్పటిదాకా భర్త, అత్తమామలతో కలిసి ఉన్న శ్రీలత పుట్టింటికి చేరింది. పుట్టెడు దుఃఖంతో ఉండి ఏ వ్యవహారాలూ పట్టించుకోలేదు. అత్తగారింట్లో దాదాపు యాభై తులాల బంగారం ఉండిపోయింది. బీరువాలో ఉంచి అత్తగారే తాళం వేశారు. భర్తచనిపోయిన నెలవరకూ అత్తింటివాళ్లు సానుభూతి చూపారు. ఏమైందో ఏమో హఠాత్తుగా వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. శ్రీలత వల్లే తమ కుమారునికి ఆరోగ్యం దెబ్బతిందనీ, ఆమె కారణంగానే అతను మరణించాడనీ, ఆమె జాతకం బాగోలేదనీ నిందించసాగారు. లేనిపోని అభాండాలు వేస్తూ, కొడుకే తమకు కాకుండా పోయాక కోడలితో తమకిక ఏ సంబంధమూ లేదని తెగేసి చెప్పారు. శ్రీలత వారి కడుపుకోతని అర్థం చేసుకుని మిన్నకుండింది. అత్తగారింటినుండి ఏ సహాయమూ ఆశించలేదు, అందలేదు. కానీ బీరువాలో ఉన్న నగలు ఆమె పుట్టింటివారు పెట్టినవి. అవి ఆమె స్త్రీ ధనం. వాటికోసం అత్తగారిని అడిగితే ఆమె ససేమిరా అన్నారు. తమకేం తెలీదని, శ్రీలతే వాటిని తీసుకొని వెళ్లిందని గొడవ పెట్టుకున్నారు. అత్తగారు ఆ నగలను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి శ్రీలత విస్తుపోయింది. తెలిసినవారు గృహహింస కేసు వేయమన్నారు. సాధారణంగా ఆ కేసులు భర్తలపై వేస్తారు కదా! మరి అత్తగారిపై వేయవచ్చా అనే సందేహంతో న్యాయవాదిని ఆశ్రయించింది. అత్తమామలపై ఖచ్చితంగా కే సు వేయవచ్చునని, శ్రీలతకు వారు వివాహం ద్వారా బంధువులవుతారని, అందువల్ల గృహహింస చట్టం ప్రకారం వారిపై కేసు వేయవచ్చునని న్యాయవాది తెలిపారు. నగలకు సంబంధించిన బిల్లులు, బీరువాలో అత్తగారు భద్రపరిచిన విషయం తెలిసిన సాక్షులు, కట్టుబట్టలతో పుట్టింటికి వెళ్లిన వైనం తెలిసిన శ్రేయోభిలాషులు ఉండడంతో ఊపిరి పీల్చుకొని కే సు వేసి, తన స్త్రీధనం దక్కించుకోవాలని నిర్ణయించుకుంది శ్రీలత. -
అత్తగారి కండిషన్స్
గుణవధు కాబోయే అత్తగారొకరు తమ కుటుంబంలోకి కోడలుగా రావలసిన అమ్మాయికి ఉండాల్సిన గుణగణాలను ఏకరువు పెడుతూ, వ్యంగ్యంగా సాగే వీడియో ఇంటర్నెట్లో ఇప్పుడు ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. 12 అంతర్జాతీయ అవార్డులతో 2012లో సంచలనం సృష్టించిన కార్లే రే జెప్సన్ ఆల్బమ్ ‘కిస్’లోని ‘కాల్ మీ మేబీ’ పాటకు పేరడీగా మద్రాసు ఐ.ఐ.టి. విద్యార్థులు.. ‘బీ అవర్ పొండాట్టి’ పేరుతో ఈ వీడియోను రూపొందించారు. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో కుర్చీపై కూర్చున్న ఓ మహిళ తన కుమారుడికి కావలసిన వధువు లోని లక్షణాల కోసం పెద్ద చిట్టానే విప్పింది. -
కోడలు దిద్దిన కాపురం
♦ కన్నీటిని దిగమింగి.. కష్టాలకు ఎదురొడ్డి.. ♦ ఆ కుటుంబానికి అత్తాకోడళ్లే పెద్ద దిక్కు ♦ ‘సాగు’తోన్న సంసారం ఎందరికో ఆదర్శం ♦ అత్తాకోడళ్ల జీవన యానం వర్గల్: అత్తాకోడళ్లు కలిసికట్టుగా సాగారు... కాపురం నిలబెట్టారు. ఇంటి పెద్దల్లో ఒకరు మరణించగా.. మరొకరు మంచాన పడ్డారు. ఆడవాళ్లం మేమేం చేయగలం అని వారు చేతులెత్తేయలేదు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఇద్దరు కలిసి కష్టపడి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఆదర్శంగా నిలిచారు. వర్గల్ మండలం సింగాయపల్లికి చెందిన రైతు టేకులపల్లి మల్లారెడ్డి-నర్సమ్మ దంపతులు. కొడుకు గోపాల్‌రెడ్డి, కోడలు సంతోష, మనవరాలు నవ్య, మనవడు అరవింద్ ఉ న్నారు. ఈ కుటుంబానికి వ్యవసాయమే ఆధా రం. సాఫీగా సాగుతున్న వీరి కుటుంబంలో సంతోష భర్త గోపాల్‌రెడ్డి అకాల మరణంతో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఏ మా త్రం నెరవని సంతోష అత్తామామలతో కలిసి పొలంబాట పట్టింది. మరో మూడేళ్లు గడిచిందో లేదో ఇంటి పెద్దగా ఉన్న మామ మల్లారెడ్డి తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో అత్తాకోడళ్లు మరోసారి కష్టాలు ఎదురయ్యాయి. అయినా వాటికి ఎదురొడ్డి నిలిచారు. అత్తాకోడళ్లు కలిసి రెండెకరాల్లో కూరగాయ పంటలు సాగు చేయడం దినచర్యగా మార్చుకున్నారు. పురుషులకు దీటుగా ‘బంగారు’ పంటలు పండిస్తూ ఆ అత్తాకోడళ్లు గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరోవైపు తీరిక దొరికితే చాలు కోడలు సంతోష బీడీలు చుడుతూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. పుట్టెడు కష్టాలు ఎదురైనా.. నా పిల్లలు ఐదేళ్లలోపు వయసు ఉన్నప్పుడే ఆ దేవుడు నా భర్త గోపాల్‌రెడ్డిని దూరం చేశాడు. మా కుటుంబం ఒక్కసారిగా కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తరువాత మూడేండ్లకు మామ మల్లారెడ్డి ఆరోగ్యం దెబ్బతిన్నది. నేనూ, మా అత్త కష్టం చేస్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితి. చిన్నపిల్లలు బెంగటిల్లొద్దని ఎవుసం బరువు బాధ్యతలు అత్తాకోడళ్లం నెత్తినెత్తుకున్నం. రెండెకరాల పొలానికి నీటి సవులత్ ఉన్నది. కాలం బట్టి మిర్చి, ఆలుగడ్డ, గుమ్మడి, కీర పంటలు వేసుకుంటున్నం. డ్రిప్ పెట్టుకున్నం. మిగతా రెండెకరాలల్ల పునాస పంటలు వేస్తం. నాకు వీలైనపుడు బీడీలు కూడా చేస్తుంట. మా కష్టం ఎన్నడు వృథా కాలేదు. మంచి దిగుబడి సాధించినం. పిల్లలకు తండ్రి లేని లోటు లేకుండ చూసుకుంటున్న. - సంతోష కీర, మిరప వేసినం... మాకున్న నాలుగెకరాలల్ల రెండెకరాలకు నీళ్ల సవులత్ ఉన్నది. కాలం ఎన్కకుపోయింది. దీంతోని బోరు బాయిల నీళ్లు ఎకరానికే సరిపోతున్నయ్. పంట పండితెనే పిల్లలకు చదువులు, కుటుంబం గడుస్తది. ఎకరం భూమిల అద్దెకరం కీర, అద్దెకరంల మిర్చి వేసుకున్నం. ఇపుడు పూత దశకొచ్చింది. అత్తాకోడళ్లం శేనుకాడనె పంట పనుల్లో మునిగి తేలుతం. కరువుల సైతం మంచి పంట దిగుబడి తెచ్చినం. సర్కారు గింత సాయం చేస్తె ఎకరంల పందిరి వేసుకుంటం. భూమిని నమ్ముకున్నోళ్లు ఎన్నడు చెడిపోరు. - నర్సమ్మ (అత్త) -
చిన్నారి మృతికేసులో పినతల్లి ఆత్మహత్యాయత్నం
బద్వేలు: వైఎస్సార్ జిల్లాలో బుధవారం ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఏడేళ్ల చిన్నారిని తండ్రే హత్యచేసినట్లు మొదటి భార్య ఆరోపిస్తుండడంతో....రెండో భార్య ఆత్మహత్యాయత్నం చేయడం కొత్త సందేహాలకు దారితీసింది. బద్వేలు పట్టణంలోని రాజుగారివీధికి చెందిన ఫయాజుద్దీన్ మొదటి భార్య ఇమామ్‌బీ విడిపోవడంతో... కమలాపురంకు చెందిన జహీరాను పెళ్లాడాడు. మొదటి భార్య పిల్లలు సనా అమ్రీన్(7), నయీముద్దీన్(9) ఫయాజుద్దీన్ వద్దే ఉంటున్నారు. ఈ నెల 13న అమ్రీన్ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందింది. తండ్రి ఫయాజుద్దీనే గొంతు నులిమి హతమార్చినట్టు ఆరోపిస్తూ మొదటి భార్య ఇమామ్‌బీ మంగళవారం బద్వేలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం ఫోరెన్సిక్ నిపుణులతో అమ్రీన్ మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిపించారు. ఈ సమయంలో ఫయాజుద్దీన్ రెండో భార్య జహీరా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తనపై కేసులు పెడుతున్నారన్న భయంతోనే జహీరా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. -
అత్తింటి ముందు మహిళ ధర్నా
హైదరాబాద్: జీవితాంతం కలిసుంటానని ప్రమాణం చేసి వివాహం చేసుకున్న భర్త.. అర్థాంతరంగా విడాకులు కోరడంతో దిక్కుతోచని స్థితిలో శిల్ప అనే మహిళ అత్తింటి ముందు రెండు రోజులుగా ధర్నాకు దిగింది. తిరుమలగిరి లోతుకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్ఆర్ఐ రజనీకాంత్‌తో శిల్పకు 2013లో వివాహం జరిగింది. ఇంతకాలం శిల్పతో సజావుగానే కలిసున్న రజినీకాంత్ అకస్మాత్తుగా అమెరికా కోర్టులో విడాకులను కోరాడు. దీంతో తనకు న్యాయం చేయాలని శిల్ప అత్తింటి ముందు ధర్నాకు దిగింది. -
గ్యాంగ్ రేప్ చేసి వీడియో షేర్ చేశారు
-
గ్యాంగ్ రేప్ చేసి వీడియో షేర్ చేశారు
ముంబై: మైనర్ బాలికను నలుగురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్ చేసి వీడియోను షేర్ చేసిన వైనం ముంబైలో కలకలం రేపింది. తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆ దృశ్యాలను వీడియో తీసి, బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చదువులో సహాయం కావాలని పిలిచి మైనర్ బాలిక(15)పై నలుగురు బాలురు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో బాధిత బాలిక అత్త వాట్పాప్ కు షేర్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నవంబరు 8వ తేదీన ముంబైలో జరిగిన ఈ అమానుషం దాదాపు 15 రోజుల తర్వాత పోలీసుల దృష్టికి వచ్చింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 15,16 ఏళ్ల వయసున్న నలుగురు అబ్బాయిలు పథకం ప్రకారం బాధిత బాలికను పిలిచారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని కంబైన్డ్ స్టడీ పేరుతో ఇంటికి పిలిచారు. ఆ తరువాత అఘాయిత్యానికి పాల్పడి, సెల్‌ఫోన్ లో చిత్రించారు. ఎవరికైనా చెబితే వీడియోను బహిర్గతం చేస్తామని బెదిరించారు. దీంతో అమ్మాయి మౌనంగా వుండిపోయింది. కానీ వాళ్లలో ఒకడు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అదికాస్తా బాలిక బంధువుకు చేరింది. దీంతో షాకైన ఆమె.. బాలికను నిలదీయడంతో, జరిగిన అన్యాయాన్ని వివరించింది. ఆమె మలాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం వీరిని జువైనల్ కోర్టుకు తరలించామని సీనియర్ పోలీసు్ అధికారి తెలిపారు. కాగా బాలిక తండ్రి చనిపోవడంతో అక్కతో కలిసి అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటోంది. ఈ ఘటన తమ కుటుంబం విషాదంలో మునిగిపోయిందని బాలిక అమ్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే గత అయిదు నెలల్లో మలాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది రెండవ గ్యాంగ్ రేప్ కేసు కావడం ఆందోళన రేపింది. -
వివాహిత దారుణ హత్య
- హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భర్త, అత్త - చిత్రహింసలకు గురిచేసి హత్యచేశారని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ, ఫిర్యాదు - హత్య కేసు నమోదు చేసిన పోలీసులు కందుకూరు అర్బన్ : ఓ వివాహితను ఆమె భర్త, అత్త కలిసి చిత్రహింసలకు గురిచేసి హత్యచేశారు. ఆపై ఆమే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించారు. మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాలు, ఇచ్చిన ఫిర్యాదుతో పాటు సంఘటన స్థలంలో ఆధారాల ప్రకారం పోలీసులు వరకట్న వేధింపుల హత్యకేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం కందుకూరు పట్టణంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆ వివరాల ప్రకారం... చినగంజాం మండలం కడవకుదురు గ్రామానికి చెందిన తోట యానాది, లక్ష్మిల కుమార్తె గౌతమి (22)ని కందుకూరు పట్టణం తూర్పుకమ్మపాలేనికి చెందిన గంటా సత్యవతి కుమారుడు చలపతికి ఇచ్చి 2011లో వివాహం చేశారు. ప్రస్తుతం వీరికి నాలుగేళ్ల కుమార్తె హనీ, 11 నెలల కుమారుడు అయ్యప్ప సంతానం. కొంతకాలంగా అత్త సత్యవతి చెప్పిన విధంగా వినడం లేదని భర్త చలపతి, అత్త కలిసి గౌతమిని వేధిస్తున్నారు. అనేకసార్లు కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. గౌతమి తన తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడగా, వారు నచ్చజెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా గౌతమిపై భర్త, అత్త దాడిచేశారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో తండ్రి యానాదికి ఫోన్‌చేసి బుధవారం ఉదయం తన దగ్గరికి రావాలని గౌతమి కోరింది. అయితే, బుధవారం వేకువజామున నాలుగున్నర గంటల సమయంలో తన కోడలు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుందని సత్యవతి కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ ఆ ఇంటి వద్దకు వచ్చాడు. మెయిన్ గేటుకు తాళం వేసి ఉండటం, తాళం తీయమని అడిగినా సత్యవతి తీయకపోవడంతో గోడదూకి లోపలికి వెళ్లి పక్కనున్న ఇసుకను గౌతమిపై పోసి మంటలు ఆర్పివేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న చలపతి చూస్తూ ఉండిపోయాడు. హత్యచేసి ఆపై దహనం చేశారు : తల్లిదండ్రులు తమ కుమార్తెను చాలాకాలంగా భర్త, అత్త కలిసి వేధిస్తున్నారని, దానిలో భాగంగానే కొట్టి హత్యచేసి, ఆపై కిరోసిన్ పోసి దహనం చేశారని గౌతమి తండ్రి యానాది, తల్లి లక్ష్మి కన్నీటిపర్యంతమయ్యారు. సంఘటనకు 8 గంటల ముందు తమ కుమార్తె తమకు ఫోన్‌చేసి వేధింపులపై ఆవేదనతో మాట్లాడిందని, బుధవారం ఉదయం రావాలని కోరిందని చెప్పారు. కచ్చితంగా తమ కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ జి.శ్రీనివాసరావు వరకట్న వేధింపుల హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీఐ లక్ష్మణ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారించారు. ఇవీ అనుమానాలు... గౌతమి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె భర్త, అత్త చెబుతుండగా, సంఘటన స్థలంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గౌతమి మృతదేహం పడి ఉన్న చుట్టుపక్కల ఎక్కడా ఆమె కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆ బాధ భరించలేక అటూఇటూ పరిగెత్తినట్లు గుర్తులు లేవు. ఉద్దేశపూర్వకంగా హత్యచేసి ఆపై కిరోసిన్‌పోసి తగులబెట్టినట్లు తెలుస్తోంది. కలచివేసిన చిన్నారుల రోదన... తల్లి చనిపోవడంతో ఆమె ఇద్దరు చిన్నారులు రోదించడం చూపరులను కలచివేసింది. పాలకోసం 11 నెలల కుమారుడు ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. -
'నాన్నను, పిన్నిని కఠినంగా శిక్షించాలి'
హైదరాబాద్: కన్నతండ్రి, పిన్ని చేతిలో ఘోరంగా చిత్రహింసలు అనుభవించిన ప్రత్యూష తొలిసారి వారికి శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఎల్బీ నగర్‌లోని అవేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష శుక్రవారం సాక్షితో మాట్లాడింది. తాను వాళ్లకు పుట్టలేదనే కారణంతో ఏడాది కాలంగా తనను టార్చర్ పెడుతూ వచ్చారని వాపోయింది. తనను ప్రతిక్షణం మానసికంగా, శారీరకంగా చాలా రోజుల నుంచి వేధిస్తున్నారని ప్రత్యూష వెల్లడించింది. తన పేరు మీద ఏ ఆస్తులు ఉన్నాయో కూడా తెలియదని, తనలాంటి దుస్థితి మరెవరికి రాకూడదని కన్నీరు మున్నీరైంది. ఇంత ఘోరంగా వేధించిన తన నాన్నకు, పిన్నికి కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఏడాది కాలంగా గదిలో నిర్బంధించి తండ్రి చిత్ర హింసలు పెట్టడంతో తీవ్రగాయాలయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెను రీనల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. -
అమ్మ ఇవ్వనంది.. అత్త ఆదుకుంది!
కోడలికి కిడ్నీ దానం చేసిన అత్త న్యూఢిల్లీ: అత్తలందరూ కఠిన హృదయులు కాదని ఆమె నిరూపించింది. ఆపదలో ఉన్న కోడలిని అమ్మకంటే మిన్నగా ఆదుకుని ప్రాణం పోసింది! తొలుత కిడ్నీ ఇస్తానన్న ఆ కోడలి అమ్మ ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గగా, అత్త నేనున్నానంటూ ముందుకొచ్చి కిడ్నీ దానం చేసింది. మనసు కదిలించే ఈ ఉదంతం ఢిల్లీలో చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన కవిత (36) కిడ్నీ పాడవడంతో బీఎల్కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరింది. కిడ్నీ మార్చాలని వైద్యులు నిర్ణయించారు. కవిత పుట్టింటి, మెట్టినింటి వారికి అదొక సవాలైంది. చివరికి ఆమె తల్లి కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకుంది. సర్జరీకి ఏర్పాట్లు చేశారు. అయితే ఆఖరు నిమిషంలో కవిత తల్లి కిడ్నీ ఇవ్వడానికి నిరాకరించింది. ఏం చేయాలో డాక్టర్లకు పాలుపోలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా కవిత అత్త విమల(65) ‘నేను కిడ్నీ ఇస్తాను’ అంటూ ముందుకొచ్చింది. ఆశ్చర్యం నుంచి తేరుకున్న డాక్టర్లు విమలకు పరీక్షలు జరిపారు. ఆమె కిడ్నీ కవితకు సరిపోతుందని నిర్ధారించారు. గత నెల 23న విమల కిడ్నీని కవితకు అమర్చారు. సర్జరీ విజయవంతం అయిందని, అత్తాకోడళ్లు కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. -
వృద్ధులకు ఆరోగ్య ధీమా
వైద్య చికిత్సలకయ్యే ఖర్చు భారీగా పెరుగుతున్న తరుణంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరికి ఆరోగ్య బీమా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. వయసుతో పాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రులు, అత్తమామల విషయంలో మరింత ఆరోగ్య ధీమా కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఆర్డీఏ పెద్దవాళ్ల ఆరోగ్య బీమా విషయంలో కొన్ని కీలక సంస్కరణలు చేసింది. సాధారణంగా వయస్సు పెరిగిన తర్వాత ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం అధికంగా ఉంటుంది. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రీమియం భారాన్ని సాధ్యమైనంత తగ్గించుకోవచ్చు. ఈ విషయాలపై అవగాహన కల్పించేదే ప్రాఫిట్ ముఖ్య కథనం. ఇప్పుడు అందరికీ ముఖ్యంగా వయోవృద్ధులకు కూడా ఆరోగ్య బీమా రక్షణను ఐఆర్డీఏ అందుబాటులోకి తీసుకొచ్చింది. గత కొంత కాలంగా వయసు పెరిగిన వారు ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవడంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఐఆర్డీఏ పరిష్కరించింది. గతంలో 50 ఏళ్లు దాటిన వారికి పాలసీ లభించేదే కాదు. ఒకవేళ ఒకటి రెండు కంపెనీలు ఇచ్చినా ప్రీమియం అందుబాటు ధరలో ఉండేది కాదు. ఇప్పుడు ఇక ఈ సమస్య లేదు. సరైన కారణం చూపించకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం జారీ చేయకపోవడం, ప్రీమియం పెంచడం వంటివి చేయడానికి వీలులేదు. అలాగే చాలా బీమా కంపెనీలు 45 ఏళ్లు దాటిన తర్వాత తీసుకునే పాలసీదారులకు ముందుగానే అన్ని ఆరోగ్య పరీక్షలు జరిపించేవారు. ఈ పరీక్షల వ్యయంలో కొంత మొత్తాన్ని కొన్ని కంపెనీలు భరిస్తే మరికొన్ని కంపెనీలు ఒక్క పైసా కూడా చెల్లించేవి కావు. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఐఆర్డీఏ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. 45 ఏళ్లు దాటిన వారికి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత పాలసీ మంజూరు చేస్తే ఆ వ్యయంలో 50% బీమా కంపెనీ భరించాల్సి ఉంటుంది. అంతేకాదు వైద్య పరీక్షల తర్వాత పాలసీ మంజూరు చేశారు కాబట్టి క్లెయిమ్‌లను తిరస్కరించడానికి అవకాశం ఉండదు. అలాగే ఇప్పుడు 65 ఏళ్ళ వారి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు. ఈ నిబంధనలు మారిన తర్వాత చాలా కంపెనీలు వృద్ధులకు ప్రత్యేక పాలసీలను ప్రవేశపెట్టాయి. కొన్ని కంపెనీలు అయితే 70-80 ఏళ్ల వారికి కూడా పాలసీలు అందిస్తున్నాయి. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం రేట్లు పెరుగుతుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు చిన్న వయసులోనే పాలసీ తీసుకోవడం మంచిది. ఒకవేళ వయసు పెరిగిన తర్వాత తీసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు. ఇంటిలోని పెద్ద వయసు వారి పేరు మీద పాలసీ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.. వ్యక్తిగతానికి దూరం.. తల్లిదండ్రులు, అత్తమామల పేరు మీద పాలసీ తీసుకోవాలనుకుంటే వ్యక్తిగత పాలసీల కంటే గ్రూపు పాలసీలకేసే మొగ్గు చూపండి. ఈ వయ సులో వ్యక్తిగత పాలసీలు తీసుకుంటే ప్రీమియం అధికంగా చెల్లించాల్సి వస్తుంది. అదే మీరు పనిచేస్తున్న కంపెనీ ఏదైనా ఆరోగ్య బీమా పాలసీ అందిస్తుంటే అందులో వీరికి కూడా బీమా రక్షణ కల్పించే అవకాశం ఉందా లేదా అని అడిగి తెలుసుకోండి. ఒకవేళ లేకపోతే వివిధ కంపెనీలు అందిస్తున్న ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలను తీసుకోండి. ఇప్పుడు చాలా బీమా కంపెనీలు ఒకే పాలసీ కింద ఆరు నుంచి ఎనిమిది మంది రక్త సంబంధీకులకు బీమా రక్షణ కల్పిస్తున్నాయి. అదే మ్యాక్స్‌బూపా వంటి మరికొన్ని కంపెనీలు అయితే ఏకంగా 13 మంది రక్త సంబంధీకుల వరకు కూడా బీమా కల్పిస్తున్నాయి. ఇలా కుటుంబ సభ్యులందరికీ కలిపి ఒకే పాలసీ తీసుకోవడం వల్ల అందరికీ ఆరోగ్య బీమా రక్షణతో పాటు, చెల్లించే ప్రీమియంలో 50-60% తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది. కో-పేమెంట్... ఒకవేళ కుటుంబమంతా కలసి ఒకే పాలసీ తీసుకునే అవకాశం లేని వారికి ప్రీమియం తగ్గించుకోవడానికి కో-పేమెంట్ అనేది ఒక చక్కటి మార్గం. ఈ ఆప్షన్లో క్లెయిమ్ భారాన్ని ఇద్దరూ భరించాల్సి ఉంటుంది. కో-పేమెంట్ అంటే క్లెయిమ్ మొత్తం బీమా కంపెనీ చెల్లించకుండా కొంత మొత్తం మీరు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా కంపెనీలు 10 నుంచి 20% కో-పేమెంట్‌గా నిర్ణయిస్తాయి. ఉదాహరణకి మీరు తీసుకున్న పాలసీలో కో-పేమెంట్ 20 శాతంగా ఉందనుకుందాం. ఇప్పుడు మీ క్లెయిమ్ మొత్తం రెండు లక్షలు అయితే అందులో బీమా కంపెనీ కేవలం రూ.1.60 లక్షలే చెల్లిస్తుంది. మిగిలిన రూ.40 వేలు మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా కో-పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవడం వలన ఆ మేరకు ప్రీమియం భారం కొంత మేర తగ్గుతుంది. అంతేకాదు కో-పేమెంట్ ఆప్షన్లో మీకు భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి అనవసర చికిత్సా వ్యయాలు ఉండవన్న భావనతో బీమా కంపెనీలు ఈ ఆప్షన్‌కు పెద్ద పీట వేస్తున్నాయి. అప్పటికే వ్యాధులు ఉంటే... ఇప్పుడు చిన్న వయసులోనే బీపీ, షుగర్లు వంటి ఆర్యోగ సమస్యలు సహజం. అందులో వయసు పెరిగిన వారికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండటం అంతే అత్యంత సహజం. పాలసీ తీసుకునే సమయానికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి గురించి తప్పకుండా ముందే తెలియచేయండి. దీనివల్ల క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఉండవు. అంతే కాదు ఇప్పుడు చాలా బీమా కంపెనీలు అప్పటికే ఉన్న వ్యాధులకు వివిధ నిబంధనలతో కూడిన బీమా రక్షణను అందిస్తున్నాయి. కొన్ని బీమా కంపెనీలు అప్పటికే ఉన్న వ్యాధుల చికిత్సా వ్యయంలో సగం భారాన్ని భరిస్తుంటే, మరికొన్ని కంపెనీలు రెండు మూడేళ్ల లాకిన్ పీరియడ్ తర్వాత బీమా రక్షణ కల్పిస్తున్నాయి. ఉదాహరణకు స్టార్ హెల్త్ అందిస్తున్న రెడ్‌కార్పెట్ పాలసీ మొదటి ఏడాది నుంచే అప్పటికే ఉన్న వ్యాధులకూ బీమా రక్షణ అందిస్తోంది. అందుకే బీమా పాలసీ తీసుకునే ముందే అప్పటికే ఉన్న వ్యాధుల క్లెయిమ్ విషయంలో నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించడం మర్చిపోవద్దు. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ మరవద్దు కొన్ని తీవ్రమైన వ్యాధుల్లో చికిత్సా వ్యయంతో సంబంధం లేకుండా తీసుకున్న బీమా రక్షణ మొత్తాన్ని పొందవచ్చు. ఇందుకోసం మీరు కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ రైడర్లో ఎనిమిది నుంచి 10 తీవ్రమైన వ్యాధులకు బీమా రక్షణ లభిస్తుంది. -
కట్నం కోసం వ్యభిచారం చేయమంటున్నారు...
హెచ్ఆర్సీని ఆశ్రయించిన నవవధువు అఫ్జల్‌గంజ్: వ్యభిచారం చేసి అదనపు కట్నం తేవాలని వేధిస్తున్న భర్త, అత్తమామల నుంచి రక్షణ కల్పించాలని ఓ నవవధువు హెచ్ఆర్సీని ఆశ్రయించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి 2015 జనవరి 28 లోగా నివేదిక అందించాలని మల్కాజిగిరి ఏసీపీకి హెచ్ఆర్సీ సభ్యులు మిర్యాల రామారావు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బాధితురాలు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం ఫీర్జాదిగూడకు చెందిన యువతి (27), అవినాష్సింగ్లకు ఈ ఏడాది మే 24న పెళ్లైంది. రూ.4 లక్షల నగదు, 11 తులాల బంగారు నగలు, కిలో వెండి, బైక్ కానుకలుగా ఇచ్చారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే అవినాష్సింగ్తో పాటు అతని తల్లిదండ్రులు రూపాఠాకూర్,అమృత్‌సింగ్ అదనపు కట్నంగా రూ.10 లక్షలు తేవాలని బాధితురాలిని వేధించడం మొదలుపెట్టారు. పెళ్లైనప్పటి నుంచీ ఒక్క రోజు కూడా భర్త తనను భార్యగా చూడలేదని, సంసారం కూడా చేయలేదని ఆమె వాపోయింది. మీ తల్లిదండ్రులు అదనపు కట్నం ఇవ్వకపోతే.. వ్యభిచారం చేసైనా నువ్వు డబ్బు తీసుకురావాలని వేధించారని, నాకు మద్దతుగా మాట్లాడిన వారితో వివాహేతర సంబంధం అంటగట్టడంతో పాటు తనకు బలవంతంగా కన్యత్వ పరీక్ష చేయించారని ఆమె వాపోయింది. పగటిపూట తన తండ్రి వద్ద, రాత్రి తన వద్ద పడుకోవాలని భర్త కొద్ది రోజులుగా బలవంతం చేస్తున్నాడని బాధితురాలు కన్నీరుపెట్టుకుంది. వారి వేధింపులు తాళలేక నవంబర్ 3న మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, ఇప్పుడు హెచ్ఆర్సీని ఆశ్రయించానని బాధితురాలు తెలిపింది. -
కూతురునిచ్చి పెళ్లి చేయలేదని మేనత్తపై దాడి
నెల్లూరు: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చాపరాలపల్లిలో గురువారం దారుణం చోటు చేసుకుంది. తన కూమార్తెను ఇచ్చి పెళ్లి చేయలేదని మేనత్తపై మేనల్లుడు కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో కుప్పకూలింది. దీంతో మేనల్లుడు అక్కడి నుంచి పరారైయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని మేనత్తను గత కొంత కాలంగా ఆమె మేనల్లుడు కొరుతున్నాడు. అందుకు ఆమె ససేమిరా అంది. అంతేకాకుండా కుమార్తెకు ....ఆమె వేరే సంబంధాలు చూడటం మొదలు పెట్టింది. ఆ విషయం తెలుకున్న మేనల్లుడు గురువారం ఉదయం మేనత్త ఇంటికి వెళ్లి కత్తిలో దాడి చేశాడు. -
వేధింపులు తాళలేకే జ్యోతి ఆత్మహత్య
ఏలూరు (వన్‌టౌన్) : అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. పవర్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం పట్టాల వద్ద పడి ఉన్న యువతి మృతదేహం వివరాలను పోలీసులు గుర్తించారు. పత్రికలలో ప్రచురితమైన కుమార్తె ఫొటోను చూసి గుర్తుపట్టిన తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు సమాచారం అందించారు. వివరాలిలా ఉన్నాయి. ఏలూరు పన్నెండు పంపుల సెంటర్‌కు చెందిన కుమరపు అప్పారావు, లక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె జ్యోతి. అప్పారావు స్థానిక టింబర్ డిపోలో పనిచేస్తుండగా, లక్ష్మీ ఇళ్లలో పనిచేస్తుంటుంది. కొడుకు హరిక్రిష్ణ ఎనిమిదేళ్ల వయసులో నాలుగేళ్ల క్రితమే చనిపోయాడు. కోర్టులో ఎన్‌ఎంఆర్‌గా పనిచేస్తున్న టేకి వెంకటేశ్వరరావుతో ఈ ఏడాది మే 15న జ్యోతికి (18) వివాహమైంది. పెళ్ళి సమయంలో రూ. రెండు లక్షల నగదు, రూ.లక్ష విలువైన బంగారం, పెళ్లికొడుకుకు రూ.యాభైవేల బంగారం, యాభై వేలు ఆడపడుచు కట్నం, మరో యాభైవేల విలువచేసే సారె ఇచ్చారు. అత్తింటికి వెళ్లిన నాటి నుంచి అత్త, మామ, ఆడపడుచు తరచూ వేధించేవారు. వారికున్న కిరాణా షాపులో జ్యోతి చేదోడు వాదోడుగా ఉంటున్నా దుకాణానికి వచ్చే వారితో సంబంధం అట్టి హింసించేవారు. పక్కనే ఉన్న ఒక బేకరీలో పనిచేసే మరో యువతితో జ్యోతి తన వేదనను వెళ్లబోసుకునేది. ఈ విషయం తెలిసి జ్యోతిని అత్త,మామలు, ఆడపడుచు, భర్త తిట్టిపోసి బయటికి నెట్టివేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె శనివారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రైల్వే ఎస్సై ఎం.అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మా అత్తమ్మ
సినిమాల్లో గయ్యాళిగా కనిపించే అత్త పాత్రలను చూసి సమాజంలో అత్తలు అందరూ గయ్యాళులుగా ఉంటారని అనుకోవడం అవివేకమే. సినిమా వేరు, నిజ జీవితం వేరు. కోడళ్లను కన్న కూతుళ్లలా చూసుకుంటూ అత్తా ఒకింటి కోడలే అన్న నానుడిని నిజం చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. వయసు పైబడినా కోడళ్లకు చిన్న పని కూడా చెప్పకుండా వారిని కంటికి రెప్పలా చూసుకుంటూ అమ్మను మరిపించే అత్తలు ఎందరో. ‘అత్త’ల దినోత్సవం సందర్భంగా కొందరు కోడళ్ల అనుభవాలు ఇవీ! -సాక్షి నెట్వర్క్ పెళ్లికి ముందు ఫ్రెండ్.. తరువాత ఫ్యాన్ మా అత్త షన్భగం పెళ్లికి ముందు ఫ్రెండ్‌గా ఉండేవారు. సినిమా షూటింగ్ సమయాల్లో మా అమ్మతోపాటు అత్తయ్య కూడా పాల్గొనేవారు. ఫ్రెండ్‌లా వ్యవహరిస్తూ సలహాలిచ్చేవారు. సెల్వమణితో ప్రేమ వివాహం తరువాత అత్తయ్య నాకు పెద్ద ఫ్యాన్‌గా మారిపోయారు. నేను నటించిన సినిమాలు, ఇతర ప్రోగ్రామ్స్‌ను తప్పకుండా చూస్తుంటారు. నా నటన అంటే అత్తకు అభిమానం. ఆమెకు కొడుకు అంటే ప్రాణం. అయితే ప్రేమ వివాహం తరువాత నన్ను ఎలాంటి ఇబ్బందులకూ గురిచేయలేదు. నా పిల్లలిద్దర్నీ అత్తతో పాటు వదిన సరస్వతీ ఎంతో చక్కగా చూసుకుంటారు. నేను సినిమారంగం, రాజకీయ రంగం పట్ల బిజీగా ఉంటున్న విషయాల్ని అత్త బాగా అర్థం చేసుకున్నారు. 2004 ఎన్నికల్లో మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసినపుడు అత్తయ్య ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సంఘటన మరువలేను. ప్రస్తుతం ఆమెకు ఆరోగ్యపరమైన సమస్య ఉండడంతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారరానికి రాలేకపోయారు. అయితే ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ నేను గెలవాలని ప్రత్యేక పూజలు చేయించేవారు. గెలుపు అనంతరం ఆమె ఎంతో ఆనందంతో మొక్కు తీర్చుకున్నారు. అత్తగారితో ఉండే అన్యోన్యత, అనుబంధం, ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది. - ఆర్కే.రోజా, నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే కూతురుకన్నా మిన్నగా చూస్తోంది నా భర్త పేరు చంద్రప్రకాష్. మా అత్త పేరు పద్మావతి. ఆమెకు 76 ఏళ్లు. నాకు 1990లో పెళ్లయింది. మా మామ నాకు పెళ్లికాకముందే చనిపోయారు. నాకు పెళ్లయినప్పటి నుంచీ అత్తతో ఎలాంటి సమస్యా లేదు. ఇప్పటి వరకు అత్తతో చిన్నపాటి గొడవా రాలేదు. మామూలుగా అందరూ భర్త తల్లిని అత్త అనే పిలుస్తుంటారు. కానీ నేను మాత్రం అమ్మ అనే పిలుస్తున్నాను. ఆమె కూడా నన్ను అమ్మా అనే సంబోధిస్తుందే తప్ప పేరుపెట్టి పిలవడం కానీ, ఏకవచనంతో పిలవడం కానీ ఇప్పటి వరకు జరగలేదు. నాకు నాన్నలేడు. అమ్మ ఉన్నా పుత్తూరు మండలం వేపగుంట గ్రామంలో ఉంటోంది. ఎక్కడో దూరంగా పల్లెలో ఉన్నా పెళ్లయిన తర్వాత అమ్మను మరిచిపోయే విధంగా మా అత్త నన్ను చూసుకుంటోంది. ప్రస్తుతం ఆమె బెంగళూరులో ఉంది. మేము కూడా వీలుదొరికినప్పుడల్లా బెంగళూరుకు వెళ్లి వస్తుంటాం. భవిష్యత్తులో కూడా ఎలాంటి మనస్పర్థలూ ఏర్పడకుండా ప్రస్తుతమున్న తల్లీకూతుళ్ల బంధం కడదాకా ఉండేటట్లు ఆశీర్వదించమని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. - గీర్వాణి, జెడ్పీ చైర్పర్సన్ నా ఉన్నతికి కారణం పలమనేరు రూరల్: ‘మా అత్త నాకు అమ్మలాంటిది. నేను అత్తారింట్లో ఉన్నా పుట్టింట్లో ఉన్నట్టే ఉంటుంది. నేనీవాళ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నానంటే మా అత్తయ్య ప్రోత్సాహమే కారణం’ అంటోంది పలమనేరు మండలం రామాపురానికి చెందిన వాసవి. రామచంద్రనాయుడు కుమార్తె వాసవితో పెనుమూరు మండలం కంబాలమిట్టకు చెందిన సరస్వతి, సుబ్రమణ్యం కుమారుడు నాదేళ్ల కుమార్‌తో గతేడాది పెళ్లైంది. భర్త కుమార్ ఫైనాన్షియల్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్నారు. వాసవి అత్తమామలది ఉమ్మడి కుటుంబం. పెళ్లయిన తర్వాత అప్పగింతల సమయంలో వాసవి కన్నీళ్లు తుడిచి అత్త అక్కున చేర్చుకోవడంతో ఆమెకు ధైర్యం వచ్చింది. కోడలికి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం రాగానే ప్రోత్సాహమిచ్చి ఉద్యోగం చేసేలా చూసింది. తన కొడుకును సైతం కోడలితో పాటు పంపి అక్కడే కాపురం పెట్టించింది. ప్రతిరోజూ అత్తాకోడళ్లిద్దరూ ఫోన్లో బాగోగులు తెలుసుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. అత్తారింటికి కోడలు వచ్చినపుడు అన్నీ పనులు అత్తే చేస్తూ కోడలిని బాధపెట్టనివ్వకుండా చూసుకుంటోంది. కోడలు సైతం అత్త మనసును నొప్పించకుండా ఆమెకు సాయంగా ఉంటూ ఇరువురు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. తనకు అత్త తల్లిలాగే అనిపిస్తుందని వాసవి చెబుతోంది. - వాసవి ఆమె ఓపికకు హ్యాట్సాఫ్ మా అత్త సరోజమ్మ నన్ను కన్న కూతురిలా చూసుకుంటోంది. అత్త, అమ్మ రెండూ ఆవిడే. వాస్తవానికి నన్ను కోడలిని చేసుకోవడం మా అత్తకు ఇష్టం లేదు. తన తమ్ముడి కూతురిని ఇంటి కోడలు చేసుకోవాలనేది ఆమె ఆలోచన. ఈ నేపథ్యంలో నా పెళ్లి జరిగినందున మొదట్లో అత్త ఎలాంటి ఇబ్బందులు పెడుతుందోన ని భయపడేదాన్ని. నేను ఊహించినట్లే కొన్నాళ్లు ఆమె మాటలు నా మనసును బాధించాయి. నేను కర్నూలులో పీజీ చేస్తున్నపుడు నా ఏడాది వయసు తొలి బిడ్డను తిరుపతిలో తనవద్ద ఉంచుకొని అక్కరగా చూసుకుంది. నా ఉన్నత చదువులకు, ఉద్యోగానికి ఏనాడూ అభ్యంతర పెట్టలేదు. ఇప్పటికీ మా పిల్లలకు కావాల్సినవి అన్నీ ఆమే చూస్తుంది. వయసు పైబడినా నోములు, వ్రతాలు పండుగలు నిష్టగా చేస్తుంది. సంప్రదాయాలను బాగా గౌరవిస్తుంది. పండుగల పద్ధతులు, వంటలు ఎలా చేయాలో ఆమె దగ్గరే నేర్చుకున్నాను. మాది ఉమ్మడి కుటుంబం. కుటుంబంలో అందరినీ సమానంగా ఆదరిస్తుంది. మానసిక స్ధితి సరిగా లేని తన కూతురికి ఓపికగా ఆమె చేస్తున్న సేవలు నిరుపమానమైనవి. ఆమె ఓపికకు హ్యాట్సాఫ్. - డాక్టర్ కృష్ణప్రశాంతి, జనరల్ ఫిజీషియన్ -
అత్తను చంపి.. భార్యను బెదిరించి...
* నాటు తుపాకీతో పరారైన హంతకుడు * పోగుళ్లను జల్లెడ పట్టిన పోలీసులు బేస్తవారిపేట : అత్తను నాటు తుపాకీతో చంపి.. దానితోనే భార్యను బెదిరించి పరారైన వ్యక్తి ఉదంతం ఇది. మండలంలోని పోగుళ్లలో అత్త తిరుమలమ్మ(55)ను అల్లుడు అల్లూరయ్య ఆదివారం రాత్రి తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. సంఘటన స్థలాన్ని గిద్దలూరు సీఐ నిమ్మగడ్డ రామారావు తన సిబ్బందితో కలిసి సోమవారం పరిశీలించారు. గ్రామస్తులు, మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎస్సై వి.నాగశ్రీను ఆధ్వర్యంలో తిరుమలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమె మృతదేహాన్ని సీఐ పరిశీలించారు. పోగుళ్లలో నాటు తుపాకీతో హత్య జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మార్కాపురం ఓఎస్డీ సమైజాన్‌రావు ఆదేశాల మేరకు స్పెషల్‌పార్టీ పోలీసులు గ్రామాన్ని జల్లెడ పట్టారు. కుమారునికి కొత్త దుస్తులు తేలేదనే.. గ్రామంలో ఆదివారం పోలేరమ్మ జాతరతో పాటు హంతకుడు అల్లూరయ్య కొడుకు పురిటి స్నానం చేయించారు. ఈ సందర్భంగా అల్లూరయ్య పూటుగా మద్యం తాగాడు. తన కొడుకుకు నూతన దుస్తులు తీసుకురాలేదని అత్తింటి వారితో గొడవకు దిగాడు. గొడవ పెద్దదవుతుండటంతో అత్త ఇంటికి ఎదురుగా ఉన్న తన ఇంట్లో అల్లూరయ్యను పెట్టి తాళం వేశారు. అక్కడ దాచి ఉంచిన నాటు తుపాకీతో ఎదురు దబ్బల తలుపు సందులోంచి కాల్చాడు. అత్త తిరుమలమ్మ కడుపులో తుపాకీ గుండు దిగబడి బయటకు వచ్చింది. ఆమె పక్కనే ఉన్న మనుమడు కళ్యాణ్ చేతులకు గాయాలయ్యా యి. తీవ్రంగా గాయపడిన తిరుమలమ్మను మంచంపై పడుకోబెట్టి రోడ్డుపైకి తీసుకొచ్చేలోపే ఆమె మృతి చెందింది. సంఘటన జరిగిన వెంటనే అల్లూరయ్య తన ఇంటి తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. భార్యాబిడ్డపై గురిపెట్టి అరిస్తే చంపేస్తానని బెదిరించి తుపాకీతో సహా పరారయ్యాడు. -
తుపాకీతో అత్తను కాల్చి చంపిన అల్లుడు
ఒకరికి తీవ్ర, మరొకరికి స్వల్పగాయాలు బేస్తవారిపేట : ఓ అల్లుడు నాటు తుపాకీతో అత్తను కాల్చి చంపాడు. ఇదే ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని పోగుళ్లలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన దొర తిరుమలమ్మ(55)కు పెద్దమల్లు అల్లూరయ్య అల్లుడు. ఈ నేపథ్యంలో గ్రామంలో పోలేరమ్మ కొలుపులు నిర్వహిస్తున్నారు. అల్లూరయ్య పూటుగా మద్యం తాగాడు. మేకలు మేపుకునే విషయంలో తిరుమలమ్మ కొడుకులు, అల్లునికి గొడవ జరిగింది. గొడవ పెద్దదవుతుండటంతో అల్లూరయ్యను భార్య తిరుపతమ్మ ఇంట్లో పెట్టి తలుపేసింది. ఇంట్లో ఉన్న నాటు తుపాకీతో తడికె తలుపు నుంచి అల్లూరయ్య బయటకు కాల్చాడు. ఇంటి బయట ఉన్న తిరుమలమ్మ పొట్టలో బుల్లెట్ దిగిబడి బయటకు వచ్చింది. ఆమె పక్కనున్న మనుమడు కళ్యాణ్‌కు తీవ్ర గాయాలుకాగా గ్రామస్తుడు నాగూర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రక్తమోడుతున్న తిరుమలమ్మను వైద్యశాలకు తరలించేందుకు రోడ్డుపైకి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె మృతి చెందింది. మిగిలిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. -
సీఎం అయినా పిన్ని నుంచే పాకెట్ మనీ
లక్నో: అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా ఇప్పటికీ పిన్ని నుంచి పాకెట్ మనీ తీసుకుంటారట. చిన్నతనం నుంచి నేటి వరకు అఖిలేష్ ఖర్చుల కోసం పిన్ని డబ్బులు ఇస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములయాం సింగ్ యాదవ్ కొడుకైన అఖిలేష్ ఇటీవల 42 వ ఏట అడుగుపెట్టారు. అఖిలేష్ చిన్నతనంలో తల్లి మరణించడంతో బాబాయ్ శివపాల్ యాదవ్ దగ్గర పెరిగారు. అఖిలేష్ పిన్ని అయిన శివపాల్ భార్య అతణ్ని సొంత కొడుకులా పెంచారు. వివిధ ప్రాంతాల్లో అఖిలేష్ విద్యాభ్యాసం కొనసాగింది. పెళ్లి చేసుకుని తండ్రి అయ్యారు. ములయాం వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అఖిలేష్ పిన్ని మాత్రం ఇప్పటికి ఆయనకు పాకెట్ మనీ ఇస్తూ తల్లిలా ఆదరిస్తారట. -
అత్త కాదు యమదూత
కొడుకుల కోరిక తీర్చలేదని కోడల్ని కడతేర్చింది పోస్టుమార్టం నివేదికతో వీడిన నవవధువు మేఘన మృతి మిస్టరీ అత్త సహా భర్త, బావ అరెస్టు పెందుర్తి : అమ్మలా చూసుకోవలసిన అత్త కోడలిని అంతమొందించింది. కన్న కొడుకుల వాంఛ తీర్చలేదని, అదనపు కట్నం తేలేదని పెళ్ళైన నెల రోజులకే అంతమొందించింది. వేపగుంట సింహపురి లేఅవుట్‌కు చెందిన కాండ్రేగుల మేఘావతి (మేఘన) (28) మృతిపై నెలకొన్న మిస్టరీ వీడింది. అత్త రత్నమే మేఘనను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. రత్నంతో పాటు మేఘన భర్త సురేష్‌కుమార్, గణేష్‌లను పెందుర్తి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను నార్త్ ఏసీపీ సీఎమ్ నాయుడు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఇలా అంతమొందించింది : ఖరగ్‌పూర్‌కు (ప్రస్తుతం అల్లిపురంలో నివాసం) చెందిన శరగడం శంకర్రావుకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె మేఘనను సింహపురి లేఅవుట్‌కు చెందిన డాక్‌యార్డు ఉద్యోగి (కాంట్రాక్ట్) కాండ్రేగుల సురేష్‌కుమార్‌కు ఇచ్చి గత మే 11న వివాహం జరిపించారు. కట్నం రూ.2 లక్షలు, రూ.50 వేల లాంఛనాలు, 20 తులాల బంగారం ఇచ్చారు. సురేష్‌కుమార్ సంసారానికి పనికిరాడు. దీన్ని అదనుగా చూసుకున్న బావ గణేష్ కోరిక తీర్చమని మేఘనను వేధించడం మొదలుపెట్టాడు. గణేష్ తల్లి రత్నం కూడా పెద్దకుమారుడికి వత్తాసు పలికింది. దీంతోపాటు పెళ్ళి సమయంలో ఇచ్చిన కట్నం చాల్లేదని అదనపు కట్నం తీసుకురావాలని కోడలిని వేధించసాగింది. ఈ రెండు ప్రతిపాదనలు మేఘన ఒప్పుకోకపోవడంతో రత్నం కోడలిపై పగబట్టింది. తరచూ ఆమెతో అత్త, భర్త, బావ ఘర్షణపడేవారు. 15న ఉదయం పడకగదిలో విశ్రాంతి తీసుకుంటున్న మేఘన వద్దకు వచ్చిన అత్త రత్నం వివాదానికి దిగింది. ఆ సమయంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఇంట్లో పరిస్థితుల కారణంగా తిండి మానేసిన మేఘన నీరసంతో మంచంపై పడిపోయింది. వెంటనే రత్నం సమీపంలో ఉన్న కర్రచెక్కతో మేఘన తలపై బలంగా మోదింది. దీంతో స్పృహ తప్పిన మేఘన మెడకు నైలాన్ తాడు బిగించింది. అపస్మారక స్థితిలో ఉన్న మేఘనను ఏమీ తెలియనట్లు స్థానికుల సహాయంతో నగరంలోని ఆస్పత్రికి తరలించింది. అక్కడ మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మేఘన ఈ నెల 18న ప్రాణాలు వదిలింది. తన కుమార్తె మృతికి అత్తింటివారే కారణమని తండ్రి శంకర్రావు అదే రోజు ఫిర్యాదు చేశారు. పట్టించిన పోస్టుమార్టం నివేదిక మేఘన మృతి మిస్టరీని పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఛేదించినట్లు ఏసీపీ తెలి పారు. మేఘన తల నుదురు, వెనుక భాగా ల్లో తీవ్రమైన గాయాలున్నాయి. మెడకు తాడు బిగించిన ఆధారాలున్నాయి. దీంతోపాటు ఘటన జరిగిన సమయంలో పెనుగులాటలో మేఘన చేతి గోళ్ళు రత్నం చేతికి గుచ్చుకున్నాయి. మేఘన మంగళసూత్రాలు తెగిపోయాయి. వాటిని గోపాలపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్‌లో రత్నం తాక ట్టు పెట్టింది. ఈ ఆధారాల ప్రకారం దర్యా ప్తు చేసిన పోలీసులు వారంతో రోజుల్లో కేసును ఛేదించారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో మేఘన అత్తతో పాటు భర్త సురేష్‌కుమార్, బావ గణేష్‌లను అరె స్టు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. హత్యకు వినియోగించిన చెక్క, నైలాన్ తాడు, మేఘన మంగళ సూత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సీఐ కొండపల్లి లక్ష్మణమూర్తి, ఎస్ఐ బి.సురేష్, పీసీలు ఎల్.శివప్రసాద్, ఎమ్.నారాయణరావు, శ్రీను, లీలావతి, రామలక్ష్మి పాల్గొన్నారు. -
అత్తా కోడలు.. దొంగనోట్ల చెలామణిలో దిట్టలు
ఎర్రగుంట్ల(వైఎస్ఆర్ జిల్లా), న్యూస్‌లైన్:జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన లక్ష్మీదేవి, సుమలత ఇద్దరూ అత్తాకోడలు. పనీపాట లేకుండా ఇంటి పట్టున ఉండే వీరిని బడా దొంగలు పావులుగా వాడుకున్నారు. చిల్లర డబ్బులకు కక్కుర్తి పడిన మహిళలిద్దరూ దొంగనోట్లు మార్పిడి చేస్తూ చివరకు పోలీసులకు చిక్కిపోయారు. ఇందుకు సంబంధించిన వివ రాలను ఎస్ఐ భానుమూర్తి విలేకరులకు ఆదివారం తెలిపారు. దొంగనోట్లను ఎలా మార్పిడి చేసేవారంటే... అసలు నోటును పోలి ఉండే రూ.500 దొంగనోటను తీసుకుని వివిధ ప్రాంతాల్లోని చిల్లర దుకాణాలకు వెళ్తారు. రూ.వందలోపు విలువ చేసే సరుకులను తీసుకుని తమ వద్దనున్న రూ.500 నోటు ఇస్తారు. మిగిలిన రూ.400 ఇవ్వగానే క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోతారు. కొన్నాళ్లపాటు అటువైపు తిరిగి చూడరు. ఇంకో ప్రాంతానికి వెళ్తారు. అక్కడా ఇదే తంతు. దొరికింది ఇలా... యథాప్రకారం ఆదివారం కూడా పైన పేర్కొన్న అత్తాకోడలు ఎర్రగుంట్లకు వచ్చారు. పలు దుకాణాల్లో వస్తువులు కొని దొంగనోట్లను మార్చేశారు. యాపారం బాగుందనుకుని వేంపల్లెకు వెళ్లే మార్గంలోని వెంకటసుబ్బయ్య చిల్లర దుకాణానికీ వెళ్లారు. అక్కడ రూ.వంద విలువ చేసే వస్తువులు కొని రూ.500 నోటు అంటగట్టారు. మిగిలిన రూ.400 తీసుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా కనుమరుగయ్యారు. అదే సదరు వ్యాపారి అదే నోటును మరో వినియోగదారుడికి ఇస్తూ నిశితంగా పరిశీలించగా ఆ నోటు నకిలీదిగా గుర్తించారు. వచ్చిన వినియోగదారులు కూడా నకిలీ నోటేనంటూ తేల్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దుకాణాదారుడు వెంకటసుబ్బయ్య కొందరిని వెంటబెట్టుకుని తనకు నకిలీ నోటు అంటగట్టిన మహిళల కోసం వెతికారు. నడివూరులో వారిద్దరూ ఉండగా పట్టుకుని నిలదీశారు. వారి బ్యాగును పరిశీలించగా మరికొన్ని నకి లీ నోట్లు ఉండడాన్ని కనుగొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి పోలీసులు ఎస్ఐ భానుమూర్తి, ఏఎస్ఐ చంద్రశేఖర్ తమ సిబ్బందిని వెంటబెట్టుకుని అక్కడికి చేరుకున్నారు. మహిళలిద్దరినీ తమ వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ విచారణ చేశారు. పెద్దమొడియం మండలం పాలురు గ్రామానికి చెందిన షామీర్ అనే వ్యక్తి తమకు ఈ నోట్లు ఇచ్చినట్లు వారు విలువైన సమాచారం ఇచ్చారు. కమిషన్ పద్ధతిన దొంగనోట్లను తాము మార్చుతున్నట్లు మహిళలిద్దరూ అంగీకరించారు. అయితే వారు చెప్పిన షామీర్ అనే వ్యక్తికి సంబంధించిన సమాచారం నిజమా, కాదా అనే విషయాలపై దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు.