అరెస్టయిన పగలమ్మాల్, అలుమేలు
వేలూరు: జోలార్‌పేట– కాట్పాడి మధ్య రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న అత్త, కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు. జోలార్‌పేట– కాట్పాడి రైలు మార్గంలో తరచూ ప్రయాణికుల వద్ద బంగారు, నగదు చోరీ కావడంలో ప్రయాణికులు జోలార్‌పేట, కాట్పాడి రైల్వేస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో రైల్యే పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. అదే విధంగా చోరీలు జరిగిన సమయంలో కాట్పాడి రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ సమయంలో ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో పోలీసులు ప్రయాణికుల తరహాల్లో వారి కోసం ప్రత్యేక నిఘా ఉంచారు. దీంతో గురువారం ఉదయం కాట్పాడి రైల్వేస్టేషన్‌లో సీసీ కెమెరాలో ఉన్న ఇద్దరు మహిళలు ఉండడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు.
విచారణలో వేలూరు సాయినాథపురానికి చెందిన బాలన్ భార్య పగలమ్మాల్, ఈమె కోడలు ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా అరగొండ గ్రామానికి చెందిన రాజేంద్రన్ భార్య అలిమేలు అని తెలిసింది. వీరిద్దరూ కలిసి బృందావన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో 22 సవర్ల బంగారు నగలు చోరీ చేసినట్లు నేరం అంగీకరించారు. అలిమేలుకు చిత్తూరులో రెండు సొంత ఇళ్లు ఉన్నట్లు తెలిసింది. ముంబైలో అత్త, కోడలు కలిసి రెండు సొంత ఇళ్లు కొనుగోలు చేసినట్టు, చోరీ చేసిన నగలు తాకట్టు పెట్టి నగదు సంపాదించినట్లు తెలిసింది. వీరిద్దరూ చోరీ చేసిన నగలతో ఇళ్ల కొనుగోలు చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. దీంతో అలిమేలు, పగలమ్మాల్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment