
అనంతపురం క్రైం: అత్త తిట్లు భరించలేక ఓ కోడలు నిప్పంటించుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. నగరంలోని మున్నానగర్‌కు చెందిన ఫైనాన్స్ వ్యాపారి పోతులయ్య, బోయ లక్ష్మి దంపతులు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ముగ్గురు సంతానం. ఈ నెల 6న సాయంత్రం అత్తాకోడలి మధ్య వాగ్వాదం జరిగింది. తనను పట్టించుకోవడం లేదని, అన్నం సక్రమంగా పెట్టడం లేదంటూ కొడుకు పోతులయ్యతో ఈశ్వరమ్మ చెప్పి కోడలిని దూషించింది.
కాసేపటికే పోతులయ్య బయటకు వెళ్లగా, ఇంట్లో అత్త, పిల్లలుండగానే లక్ష్మి క్షణికావేశంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈశ్వరమ్మ అరుపులతో చుట్టుపక్కల వారు చేరుకుని మంటలార్పారు. అనంతరం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ గౌస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(చదవండి: Custard Apple: ప్రాణం తీసిన సీతాఫలం)
Comments
Please login to add a commentAdd a comment