సీఎం అయినా పిన్ని నుంచే పాకెట్ మనీ | Even today, Akilesh yadav gets pocket money from his aunt | Sakshi
Sakshi News home page

సీఎం అయినా పిన్ని నుంచే పాకెట్ మనీ

Published Wed, Jul 2 2014 6:02 PM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

సీఎం అయినా పిన్ని నుంచే పాకెట్ మనీ

సీఎం అయినా పిన్ని నుంచే పాకెట్ మనీ

లక్నో: అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా ఇప్పటికీ పిన్ని నుంచి పాకెట్ మనీ తీసుకుంటారట. చిన్నతనం నుంచి నేటి వరకు అఖిలేష్ ఖర్చుల కోసం పిన్ని డబ్బులు ఇస్తున్నారు.

సమాజ్ వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములయాం సింగ్ యాదవ్ కొడుకైన అఖిలేష్ ఇటీవల 42 వ ఏట అడుగుపెట్టారు. అఖిలేష్ చిన్నతనంలో తల్లి మరణించడంతో బాబాయ్ శివపాల్ యాదవ్ దగ్గర పెరిగారు. అఖిలేష్ పిన్ని అయిన శివపాల్ భార్య అతణ్ని సొంత కొడుకులా పెంచారు. వివిధ ప్రాంతాల్లో అఖిలేష్ విద్యాభ్యాసం కొనసాగింది. పెళ్లి చేసుకుని తండ్రి అయ్యారు. ములయాం వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అఖిలేష్ పిన్ని మాత్రం ఇప్పటికి ఆయనకు పాకెట్ మనీ ఇస్తూ తల్లిలా ఆదరిస్తారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement