లక్నో: సమాజ్‌వాదీపార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ సీటు నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేత రాంగోపాల్‌యాదవ్ బుధవారం(ఏప్రిల్24) ప్రకటించారు. అఖిలేశ్ కన్నౌజ్ నుంచి గురువారం నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఎంపీగా పోటీ విషయాన్ని అఖిలేశ్‌ను మీడియా అడగ్గా నామినేషన్ వేసినపుడు తెలుస్తుందన్నారు.
కన్నౌజ్ నియోజకవర్గం నుంచి ఎస్పీ తరపున తొలుత తేజ్‌ప్రతాప్ యాదవ్ బరిలో ఉంటారని ప్రకటించారు. అయితే తేజ్‌ప్రతాప్ అభ్యర్థిత్వాన్ని పార్టీ శ్రేణులు ఒప్పుకోకపోవడంతో అఖిలేశ్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.
గతంలో ఎస్పీకి కంచుకోటగా ఉన్న కన్నౌజ్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లడంతో ఎంపీ పదవికి దూరమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ సీటును బీజేపీ కైవసం చేసుకుంది.
ఇదీ చదవండి.. కేరళలో ముగియనున్న ఎన్నికల ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment