
లక్నో:ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉద్రిక్తత నెలకొంది.నగరంలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్(జేపీఎన్‌ఐసీ) వద్ద సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) నేతలు ఆందోళన చేపట్టారు. జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్‌కు వెళ్లనివ్వకుండా ప్రభుత్వం తనను అడ్డుకుంటోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్‌యాదవ్ ఆరోపించిన నేపథ్యంలో సమాజ్‌వాదీ కార్యకర్తలు అక్కడ ఆందోళనకు దిగారు.
శుక్రవారం(అక్టోబర్11) జయప్రకాష్‌నారాయణ్ జయంతి సందర్భంగా గురువారం రాత్రి అఖిలేష్ యాదవ్ జేపీఎన్‌ఐసీని సందర్శించారు. అక్కడ మెయిన్‌గేట్ వద్ద పోలీసులు రెండు అడ్డుతెరలు ఏర్పాటు చేయడంపై అఖిలేష్ మండిపడ్డారు.
ప్రభుత్వం ఏదో దాచడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయమై ఎస్పీ శ్రేణులు నిరసనకు దిగాయి. దీంతో లక్నోలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జేపీఎన్‌ఐసీకి వెళ్లేదారిలో శుక్రవారం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.సెంటర్ మెయిన్‌గేట్ వద్ద బారికేడ్లు ఉంచారు.సెంటర్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్‌తో మైత్రి కొనసాగుతుంది: అఖిలేష్
Comments
Please login to add a commentAdd a comment