Jayaprakash Narayan
-
అఖిలేశ్ యాదవ్‌ను యూపీ సర్కారు ఎందుకు అడ్డుకుంది?
UP Politics: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జయప్రకాశ్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్(జేపీఎన్ఐసీ)కు వెళ్లకుండా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను అడ్డుకోవడంతో యూపీ రాజధాని లక్నోలో తాజాగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు, సోషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా శుక్రవారం జేపీఎన్ఐసీకి వెళ్లాలని అఖిలేశ్ యాదవ్ భావించారు. జయప్రకాశ్ నారాయణ్‌కు నివాళి అర్పించాలని ఆయన అనుకున్నారు. అయితే అఖిలేశ్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు.అఖిలేశ్‌ను అడ్డుకునేందుకు జేపీఎన్‌ఐసీని మూసివేశారు. ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అడ్డంగా బారికేడ్లు పెట్టి, భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. రేకులతో మెయిన్ గేటును క్లోజ్ చేశారు. విక్రమాదిత్య మార్గ్‌లోని అఖిలేశ్ యాదవ్ నివాసం సమీపంలోనూ పోలీసు బలగాలను భారీగా మొహరించారు. గతేడాది కూడా జేపీఎన్‌ఐసీని సందర్శించేందుకు అఖిలేశ్‌కు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన జేపీఎన్ఐసీ గేట్లను తోసుకుని లోపలికి వెళ్లి జయప్రకాశ్ నారాయణ్‌కు నివాళి అర్పించారు. ఈ నేపథ్యంలో అధికారులు తాజాగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.ఎందుకు అనుమతి ఇవ్వలేదంటే?అఖిలేశ్‌కు అనుమతి నిరాకరించడానికి అధికారులు చెప్పిన కారణాలు వింటే ఆశ్చర్యం కలగకమానదు. జేపీఎన్‌ఐసీని సందర్శించేందుకు అనుమతి లేదంటూ లక్నో డెవలప్మెంట్ అథారిటీ(ఎల్డీఏ) గురువారం అఖిలేశ్‌కు రాసిన లేఖలో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. జేపీఎన్ఐసీ ప్రమాదకర ప్రదేశంగా ఎల్డీఏ పేర్కొంది. నిర్మాణపనులు జరుగుతున్నందున ఆ ప్రాంతమంతా నిర్మాణ సామాగ్రితో గందరగోళంగా ఉందని వెల్లడించింది. వర్షాల కారణంగా పురుగూపుట్రా నుంచి ప్రమాదం పొంచివుందని హెచ్చరించింది. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యురిటీ కలిగిన అఖిలేశ్ యాదవ్.. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సమయంలో జేపీఎన్ఐసీకి వెళ్లడం సురక్షితం కాదని సూచించింది.సమాజ్‌వాదీ పార్టీ శ్రేణుల ఆందోళనఎల్డీఏ లేఖపై సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. అఖిలేశ్‌ను అడ్డుకునే కుట్రలో భాగంగా యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇదంతా చేయింస్తోందని ఆరోపిస్తున్నాయి. శుక్రవారం జేపీఎన్ఐసీ వద్ద సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కాగా, జేపీఎన్‌ఐసీని సందర్శించేందుకు తనకు అనుమతి ఇవ్వకపోవడంతో యోగీ ప్రభుత్వంపై అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం వలసవాద వ్యూహాలు అనుసరిస్తోందని విమర్శించారు.చదవండి: సమాజ్‌వాదీ పార్టీ శ్రేణుల ఆందోళన.. లక్నోలో ఉద్రిక్తతఅఖిలేశ్పై బీజేపీ ఎదురుదాడిజేపీఎన్ఐసీ అంశాన్ని కావాలనే అఖిలేశ్ యాదవ్ రాజకీయం చేస్తున్నారని బీజేపీ ఎదురుదాడి చేసింది. జయప్రకాశ్ నారాయణ్ ఆదర్శాలను సమాజ్‌వాదీ పార్టీ ఎప్పుడో వదలేసిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి భండారీ ఆరోపించారు. జేపీఎన్ఐసీలో నిర్మాణ పనులు జరుగుతున్నందున అక్కడికి ఎవరినీ అధికారులు అనుమతించడం లేదన్నారు. నిజంగా జయప్రకాశ్ నారాయణ్‌పై అంత గౌరవం ఉంటే తన కార్యాలయంలోనే అఖిలేశ్ నివాళి అర్పించాలని సూచించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇండియా బ్లాక్‌లోని పార్టీలు పొలిటికల్ స్టంట్‌కు దిగుతున్నాయని భండారీ ఎద్దేవా చేశారు. -
‘ఎస్పీ’ శ్రేణుల ఆందోళన..లక్నోలో ఉద్రిక్తత
లక్నో:ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉద్రిక్తత నెలకొంది.నగరంలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్(జేపీఎన్ఐసీ) వద్ద సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) నేతలు ఆందోళన చేపట్టారు. జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్‌కు వెళ్లనివ్వకుండా ప్రభుత్వం తనను అడ్డుకుంటోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్‌యాదవ్ ఆరోపించిన నేపథ్యంలో సమాజ్‌వాదీ కార్యకర్తలు అక్కడ ఆందోళనకు దిగారు.శుక్రవారం(అక్టోబర్11) జయప్రకాష్‌నారాయణ్ జయంతి సందర్భంగా గురువారం రాత్రి అఖిలేష్ యాదవ్ జేపీఎన్‌ఐసీని సందర్శించారు. అక్కడ మెయిన్‌గేట్ వద్ద పోలీసులు రెండు అడ్డుతెరలు ఏర్పాటు చేయడంపై అఖిలేష్ మండిపడ్డారు.ప్రభుత్వం ఏదో దాచడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయమై ఎస్పీ శ్రేణులు నిరసనకు దిగాయి. దీంతో లక్నోలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జేపీఎన్ఐసీకి వెళ్లేదారిలో శుక్రవారం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.సెంటర్ మెయిన్‌గేట్ వద్ద బారికేడ్లు ఉంచారు.సెంటర్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌తో మైత్రి కొనసాగుతుంది: అఖిలేష్ -
జయప్రకాశ్ నారాయణ్ కు జర్నలిస్ట్ స్వప్న దిమ్మదిరిగే కౌంటర్
-
ఎడ్యుకేట్ చేయాలి
‘‘సినిమా అనేది ఎంటర్టైన్ చేయడంతో పాటు ఎడ్యుకేట్ చేయాలి. అలా ఎడ్యుకేట్ చేసే సినిమాలను ప్రొత్సహించాలి. యువత రాజకీయాల్లో తిరుగుతూ సరైన నాయకుడిని ఎంచుకోకుండా, జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అలాటి అంశానికి వినోదం జోడించి తీసిన ‘రామన్న యూత్’ని ఆదరించాలి’’ అని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు డా. జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. అభయ్ నవీన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. సెప్టెంబర్ 15న ఈ చిత్రం విడుదల కానుంది. రిలీజ్ డేట్ ΄ోస్టర్‌ని జయప్రకాశ్ నారాయణ్ ఆవిష్కరించారు. ‘‘గ్రామీణ ్రపాంతాల్లో రాజకీయ నాయకుల కోసం యువత ఎలాంటి త్యాగాలు చేస్తున్నారు? రాజు అనే ఒక యువకుడు ΄÷లిటికల్ లీడర్‌గా ఎదగాలని చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అనేది ఈ చిత్రకథ’’ అన్నారు అభయ్ నవీన్. -
రాడికల్ అహింసావాది: జయప్రకాశ్ నారాయణ్(1902–1979)
నేను చూసిన వక్తలలోకెల్లా గొప్ప వక్త జయప్రకాశ్ నారాయణ్. ఆయన ఎక్కడికి వెళ్లినా, ఆయన ప్రసంగాలు వినడానికి వేల మంది ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ, అదంతా ఆయన జీవితంలో ఒక పార్శ్వం మాత్రమే. మరొక వైపు చూస్తే ఆయన చాలా ప్రశాంతమైన వ్యక్తి. మార్క్సిజం మీద పుస్తకాలను అధ్యయనం చేయడమంటే ఆయనకు ఎంతో ప్రీతి. అనుభవాలు ఆయనను మలిచాయి. బిహార్‌లోని ఒక చిన్న గ్రామం లాలోటిలో జన్మించిన జేపీ పైచదువుల కోసం అమెరికా వెళ్లడంతో కొత్త ప్రపంచం ఆయన కళ్ల ముందు నిలిచింది. కళాశాలలో చదివేటప్పుడు, తన చదువుకయ్యే ఖర్చుల కోసం ఆయన ఒక ప్యాకేజింగ్ కంపెనీలో పని చేసేవారు. ఎం.ఎన్.రాయ్ రాసిన పుస్తకాల ద్వారా మార్క్సిజం ఆయనకు అక్కడే పరిచయం అయింది. భారతదేశానికి తిరిగి వచ్చి, మహాత్మాగాంధీని కలుసుకున్న మీదట, ఆయనను గురువుగా చేసుకున్నారు. అయితే చాలా కాలం కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ తన ఆదర్శాలకు, కాంగ్రెస్ ఆదర్శాలకూ పొత్తు కుదరడం లేదని భావించారు. ఎట్టకేలకు తన మిత్రులు యూసఫ్ దేశాయ్, రామ్ మనోహర్ లోహియాలతో కలిసి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని కాంగ్రెస్‌లోనే అంతర్భాగంగా ఏర్పాటు చేశారు. రాడికల్ మార్క్సిజానికి సమర్థించిన జేపీని గాంధీ అహింసావాదం ప్రభావితం చేయడం ఆశ్చర్యమే. 1975లో ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజల అసంతృప్తి అంతటినీ ప్రజా ఉద్యమంగా రూపుదిద్దింది. ఆ సమయంలో బిహార్ అంతటా విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ప్రజ్వరిల్లడం కన్నా జేపీ పలుకుబడికి వేరే నిదర్శనం అక్కర్లేదు. దేశంలో పెరిగిపోయిన అవినీతి, నిరుద్యోగం, అమానుషాలే ప్రజల ఆగ్రహావేశాలకు కారణమని జేపీ అనేవారు. అప్పుడు నేను కళాశాలలో చదువుతున్నాను. వాతావరణం అంతా ఉద్రిక్తంగా ఉంది. ఒక ధర్నాలో ఆయనకు నన్నొకరు పరిచయం చేశారు. ‘నీ గురించి చాలా విన్నానయ్యా’ అని ఆయన నాతో అన్నారు. అవి బహుశా నా జీవితంలో చాలా గొప్ప క్షణాలు. కెరటాలకు ఎదురీదిన జయప్రకాశ్ నారాయణ్ చాలామందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన తన నమ్మకాల కోసం జీవించారు. వాటి కోసం మరణించడానికి కూడా ఆయన వెనుకాడలేదు. (దివంగత సోషలిస్టు రాజకీయవేత్త రఘువంశ్ ప్రసాద్ సింగ్ మాటల్లో..) -
న్యాయం చేస్తా
సినీ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సినీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ నియామకం జరిగింది. ఈ కమిటీ చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జయప్రకాశ్ నారాయణ్ వల్లూరు నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన 20మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తెలుగు సినిమా రంగం నుంచి నిర్మాత సి. కల్యాణ్ ఓ కమిటీ మెంబర్‌గా స్థానం సంపాదించారు. ఆర్టికల్ 33,1984 ప్రకారం కేంద్ర ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కమిటీ పని చేస్తుందని, జూలై 31న ఈ కమిటీ నియామకం పూర్తయిందని సి. కల్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ– ‘‘దేశవ్యాప్తంగా ఎంతో పోటీ ఉన్నా ఒక తెలుగు వ్యక్తికి అవకాశం ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి కార్మికునికి న్యాయం జరిగేలా చూస్తాను. ముఖ్యంగా ఆరోగ్య బీమా, జీవిత బీమా చాలా ముఖ్యం. ఈ నెల 17న ‘ఝాన్సీ’ సినిమా, 24వ తేదిన ‘లక్ష్మీ’ చిత్రాలు మా సంస్థ నుండి విడుదలవుతున్నాయి. ఆ సినిమాలు విజయవంతమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. -
వ్యవస్థలో మార్పు అవసరం: జేపీ
సాక్షి, హైదరాబాద్: వ్యవస్థలో మార్పు రావాలని లోక్‌సత్తా అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎన్.జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వ మాజీ ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లం రాసిన ‘మేలుకొలుపు’ పుస్తకాన్ని బుధవారం హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. కులం, మతం, ప్రాంతం సమాజాన్ని నిట్ట నిలువునా చీలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ చాలాచోట్ల చట్టబద్ధ పాలన సాగడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేకుండా ఏ పనీ జరిగే అవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటే అన్నింటికీ పరిష్కారమార్గమని చెప్పారు. చిత్తశుద్ధి, నిజాయితీకి మారుపేరైన అజయ్ కల్లం ప్రజలను మేలుకొలుపే విధంగా పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ అవినీతిపై సమరానికి మేలుకొలుపు ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో అవినీతి పెరిగిపోయిందన్నా రు. సమస్యలపట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అజయ్ కల్లం మాట్లాడుతూ పాలనావ్యవస్థ నిలువెల్లా కుళ్లిపోయిం దని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ, రాజకీయ విలువలు హరించుకుపోతుం డటంతో చట్టసభలు, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ వంటి కీలక పాలనాయంత్రాంగాలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ సచివాలయాలు అవసరమన్నారు. సమాజంపట్ల బాధ్యతను గుర్తు చేసేందుకు జిల్లాలవారీగా ‘మన కోసం మనం’అనే అంశంపై చర్చావేదికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. అనంతపురం నుంచి చర్చావేదికలకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. మాజీ సంపాదకుడు ఎంవీఆర్ శాస్త్రి మాట్లాడుతూ సమాజ హితం కోసం పుస్తకాలు రావాలని ఆకాంక్షించారు. సమాజంలో మార్పు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. -
తెలుగునాట విచిత్ర పరిస్థితి..
సాక్షి, విజయవాడ: ప్రస్తుతం తెలుగునాట విచిత్ర పరిస్థితి నెలకుందని జయప్రకాష్ నారాయణ్ అన్నారు. రాష్ట్ర విభజన అనివార్యం అని తెలియగానే ఏపీకి జరిగే నష్టాన్ని పూరించవలసిన అవసరం ఉందని నేనే మొదట అడిగానని ఆయన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘దాంతోనే విభజన బిల్లులో కొన్ని అంశాలు పేర్కొన్నారు. ప్రస్తుతం అందరం కలిసి కట్టుగా పోరాడాలి. అన్ని పార్టీలు రాజకీయ లబ్ది పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు లబ్ది పొందాలని ప్రయత్నించడం దారుణం. దేశం.. రాష్ట్రం కంటే ఏ వ్యక్తీ గొప్ప కాదు. తెలుగునాట కులాలు.. వర్గాలు.. అధికార దాహం ఎక్కువైపోయాయి. స్థానిక ఎన్నికల్లో గెలుపొందినా సరే..విపక్షాలను నిర్వీర్యం చెయడానికి జన్మభూమి కమిటీలు పెట్టారు. ముఖ్యమంత్రి తప్ప మన రాష్ట్రంలో ఇంకెవరికీ హక్కు లేదా అని ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా ప్రత్యేక హోదాపై పోర్ కోసం సీఎం అందర్నీ కలుపుకోవాలని డిమాండ్ చేశారు. విభజన బిల్లులో అత్యంత వివాదాస్పద అంశం పన్ను రాయితీ. దీనిపై అప్పుడే క్లారిటీ కోసం ప్రయత్నించినా ఎవరూ కలిసి రాలేదని పేర్కొన్నారు. వివాదం లేని అంశాలపై చర్చిండానికి రెండుసార్లు నిపుణులతో చర్చించామన్నారు. తెలుగు నేతలతో సంబధం లేని నిపుణులో మరో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. నష్టపోయేది ప్రజలు అనే విషయాన్ని అందరూ గుర్తించాలి’ అని అన్నారు. -
ప్రధాని వైఖరి దేశానికే వినాశనం
సాక్షి, కర్నూలు: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మాటను తప్పుతున్నారని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదని హెచ్చరించారు. మంగళవారం కర్నూలులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో రాజకీయ ‘ఘనులు’ పెరిగిపోయారని కేంద్రాన్ని ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో సాక్షాత్తు పార్లమెంట్లో ఇచ్చిన హామీల అమలు జరగడం లేదని వాపోయారు. కేంద్రం వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన అనంతరం వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఓట్లు, సీట్ల కోసమే ఎన్నికల వేళ రాష్ట్రంలో హామీల వర్షం కురిపించిందని విమర్శించారు. వ్యయ‘సాయం’లేదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని జేపీ మండిపడ్డారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం శోచనీయమన్నారు. కరువు ప్రాంతం రాయలసీమ దీనికి ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన తెలిపారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సుకై చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు కేంద్రం కార్యచరణ రూపొందించాలని కోరారు. -
న్యాయ వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలి
తాడితోట (రాజమహేంద్రవరం): న్యాయ వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. జనం కోసం జేపీ సురాజ్య యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ హాల్లో ‘న్యాయవాదులతో జేపీ’ కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేపీ మాట్లాడుతూ ప్రపంచ న్యాయ వ్యవస్థలో మన దేశం వెనుకబడి ఉందన్నారు. ఈ విషయంలో యువ న్యాయవాదులు సీనియర్ న్యాయవాదుల సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. ఎగువ కోర్టుల తీర్పులలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని, తమకు న్యాయం జరిగిందని ఫిర్యాదీ సంతృప్తి చెందే విధంగా ఉండాలన్నారు. రాజకీయ నాయకుల వత్తిళ్ళతో న్యాయం జరగదనే అసంతృప్తి ప్రజల్లో ఉండకూడదని అన్నారు. ప్రతీపనికీ కాలపరిమితి హక్కు ఉండాలన్నారు. పట్టణీకరణ నేపథ్యంలో మహిళల పై శారీరకంగాను, మానసికంగాను దాడులు జరుగుతున్నాయని, వీటికి తక్షణ శిక్షలు అమలు జరిగేలా వ్యవస్థలో మార్పులు రావాలన్నారు. రిజర్వేషన్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌ల పిల్లలకు అవసరం లేదన్నారు. నిజమైన నిరుపేదలకు రిజర్వేషన్లు అమలు జరిగినప్పుడే రిజర్వేషన్లకు సార్థకత ఉంటుందన్నారు. కొన్ని రాష్ట్రాలలో అభివృద్ధి చెందిన కులాలు కూడా రిజర్వేషన్లు కోరుతున్నాయన్నారు. విద్య, ఆరోగ్యం, నిరుద్యోగం, కుల వివక్ష, రిజర్వేషన్ల ఘర్షణ, స్థానికసంస్థలకు అధికారాలు లేకపోవడం, లంచాలు, మహిళలపై వేధింపులు, అప్పుల వ్యవసాయం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వలనే జరుగుతున్నాయన్నారు. ముమ్మారు తలాక్ అనే ఇస్లామ్ మతాచారం చెల్లదని షరియా చట్టాలను పరిగణనలోకి తీసుకుంటూ దీని పై పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మానవ హక్కులు, మహిళా స్వేచ్ఛ, హేతుబద్ధ భావాలకు లభించిన పెద్ద విజయమని పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది మద్దూరి శివ సుబ్బారావు, తవ్వల వీరేంద్రనాథ్ తదితరులు ప్రసంగించారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి దివాన్‌చెరువు (రాజానగరం):గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. దివాన్‌చెరువులోని శ్రీప్రకాష్ విద్యానికేతన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని సీబీఎ‹స్ఈ పాఠశాలలకు మూడు రోజులపాటు జరిగే క్లస్టర్ మీట్ – 7 ఖోఖో పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. పై రెండు రాష్ట్రాలకు చెందిన 38 సీబీఎస్ఈ పాఠశాలల నుంచి 754 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సీహెచ్ విజయప్రకాష్, ప్రిన్సిపాల్ మూర్తి, లోక్‌సత్తా ఉద్యమ జిల్లా అధ్యక్షుడు యు.మాచిరాజు, సురాజ్యయాత్ర రాష్ట్ర సమన్వయకర్త బండారు రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసమస్యలపై ‘పీపుల్స్ పార్లమెంట్’
సెప్టెంబర్ 1, 2 తేదీల్లో కడపలో సదస్సు - ప్రజాసమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లటానికే... - పీపుల్స్ పార్లమెంట్ వెబ్సైట్ ప్రారంభం - పాల్గొననున్న జాతీయ నేతలు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో చట్టసభలు కేవలం తిట్టుకోవటానికి, అవాకులు చవాకులు పేల్చుకోవటానికి తప్ప, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎక్కడా కూడా తావు ఇవ్వటం లేదని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ వాపోయారు. ఈ నేపథ్యంలో పీపుల్స్ పార్లమెంట్ పేరిట జాతీయ సదస్సు నిర్వహించటం గొప్ప విషయమన్నారు. బుధవారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పీపుల్ అగనెస్ట్ కరప్షన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా డారు. కడపలో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరిగే ఈ పీపుల్స్ పార్లమెంటులో వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు, పౌర సేవా హక్కు చట్టం వంటి అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. అందరూ ఇందులో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సాక్షి ఈడీ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ పార్లమెంట్, శాసనసభల్లో రచ్చ తప్ప, ప్రజా సమస్యలపై, విధాన పరమైన అంశాలపై చర్చేలే లేవన్నారు. ఎత్తులు వేసి సభలు జరగకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. 1998 నుంచి రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని, అప్పటి నుంచి వ్యవసాయదారుని స్థితిగతులపై ప్రత్యేక సమావేశాలు జరగాలని తాము కోరుతూ వస్తున్నామని చెప్పారు. చట్టసభల్లో జరగాల్సిన చర్చలు జరగకపోవటం సిగ్గు చేటని పేర్కొన్నారు. కొంతమంది చదువుకున్న యువకులు ముందుకు వచ్చి మోడల్ పార్లమెంట్ అంటూ చర్చలు, సదస్సులు ఏర్పాటు చేయటం సంతోషకరమని అన్నారు. రైతుల ఆత్మహత్యలపై ఎన్నో పరిష్కార మార్గాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నామన్నారు. ఏ ప్రభుత్వమూ, పాలకులు సరైన రీతిలో స్పందించటం లేదని తెలిపారు. ఈ తరుణంలో రైతుల గురించి, వ్యవసాయ రంగ సమస్యల గురించి చర్చకు తీసుకురావటం ఆశాజనకంగా ఉందని చెప్పారు. ప్రజల హక్కుల అణచివేత ఏపీ సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ పి. విజయబాబు మాట్లాడుతూ ప్రజల హక్కులను కాపాడాల్సిన పాలకులు వాటిని తుంగలో తొక్కి భవిష్యత్తు తరాలతో ఆడుకుంటున్నారన్నారు. క్లిష్ట సమయంలో జనరంజక అంశాలపై జరిగే ఈ సదస్సుకు అన్ని రకాల మీడియా సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల్లో యువత చురుగ్గా పాల్గొనటం చూస్తుంటే మార్పు మరెంతో దూరంలో లేదని అర్థం అవుతోందని చెప్పారు. ఉన్నత విద్యావంతులైన యువజన బృందం సమాజంలో మార్పు కోసం నిర్వహించే ఈ సదస్సులో భాగస్వాములు అయ్యేందుకు యువతీ, యువకులు వెబ్సైట్లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. సంస్థ వ్యవస్థాపకులు మారంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ సదస్సుకు జాతీయ స్థాయిలో ప్రముఖులు, మేధావులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు– ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు– మాజీ ఎమ్మెల్సీలు హాజరవుతాయని చెప్పారు. సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు – యువజనులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను సాక్షి ఈడీ రామచంద్రమూర్తి ఆవిష్కరించారు. కార్యక్రమ పోస్టర్‌ను పి.విజయబాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీపుల్స్ పార్లమెంట్ ముఖ్య నేతలు మనోజ్ చిట్టిమల్ల, గురు మల్లి, సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిరాయిస్తే పదవులు పోతాయని..
హైదరాబాద్: పార్టీ మారిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం దారుణమని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాన్ని విస్తరించిన తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. అధికారంలో ఉన్నవాళ్లు రాజ్యాంగాన్ని అమలు చేయడం పోయి, ఉల్లంఘించే స్థాయికి ఈరోజు పరిస్థితి వచ్చిందని వాపోయారు. పార్టీ ఫిరాయిస్తే పదవులు పోతాయని రాజ్యాంగం చెబుతోందని, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది చాలా దారుణమైన రాజ్యాంగ ఉల్లంఘన అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు చంద్రబాబు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. పార్టీని కుటుంబ ఆస్తిగా, ప్రభుత్వాన్ని వ్యాపారంగా మార్చేశారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణలో నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా మంత్రులుగా ఎలా నియమిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. -
నైతికత లేకుండా మంత్రి వర్గ విస్తరణ జరిగింది
-
సమాజంలో మార్పు తెచ్చే నాయకత్వం అవసరం
లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ సీతంపేట (విశాఖ ఉత్తర): మూడేళ్ల పాలన ముగిసినా ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పు రాలేదని, దీనిపై ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్ద నోట్లు రద్దు చేసినా దేశంలో ఎక్కడా అవినీతి తగ్గలేదని, మరింత పెరిగిందన్నారు. కనీసం వెయ్యిమంది అవినీతి అధికారులనైనా ఇంటికి పంపించాలని, ఆ అధికారం ప్రధానికి ఉందన్నారు. రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఆ పని చేయాలన్నారు. అపుడే లంచం తీసుకోవడానికి భయపడే వ్యవస్థ వస్తుందన్నారు. సమాజం మార్పు కోసం పనిచేసే నాయకత్వం రావాలన్నారు. సంప్రదాయ రాజకీయాల నుంచి ప్రజల వైపు గొంతువిప్పే నాయకులు పార్టీలోకి రావాలన్నారు. ఒక్క ఎమ్మెల్సీ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంత కష్టపడటం అవసరమా అని ప్రశ్నించారు. విలాసాలు, దుబారా వల్లే ఆర్థిక సంక్షోభం రాష్ట్రంలో విలాసాలు, దుబారా వ్యయం వల్ల ఆర్థిక సంక్షోభం మరింత పెరిగిందన్నారు. ఉపాధి అవకాశాలు పొందేలా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేలా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా మార్కెటింగ్ యార్డులు చొరవ చూపాలన్నారు. దేశంలో ఆరోగ్యం కోసం కేటాయిస్తున్న నిధులను రెట్టింపు చేయాల్సి ఉందన్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పాత్రికేయుడు వి.వి.రమణమూర్తికి మద్దతు తెలిపారు. మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి, నాయకులు నాయుడు వేణుగోపాల్, రావెల ఝాన్సీ, ఎం.ఎస్.ఎం మూర్తి, రాజవర్మ, రామానాయుడు,వడ్డి హరిగణేష్, ఎమ్మెల్సీ అభ్యర్థి వి.వి.రమణమూర్తి పాల్గొన్నారు. -
రాష్ట్రంలో సంస్కార హీనమైన రాజకీయం
జేపీ తూర్పారపట్టిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంస్కార హీనమైన రాజకీయం, పరిపాలన మనం చూస్తున్నామంటూ లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ చేసిన వ్యాఖ్యల వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పేస్బుక్ వీడియో పోస్ట్‌కు వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. ఫిబ్రవరి నెలలో రాష్ట్రంలో జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌లో వదిలివేసిన సంఘటనపై జేపీ చేసిన కొన్ని వ్యాఖ్యల వీడియో అది. ‘రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన మాత్రమే కాదు.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న గూండాగిరి పరిపాలన మాత్రమే కాదు... ఒక సంస్కార హీనమైన పరిపాలనకు నిదర్శనం ఇది. గతంలో తమిళనాడులో ఇలాంటివి వింటుండేవాడ్ని. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని తప్పులున్నా ఇలాంటి దుర్మార్గం లేదు. మన భావప్రకటన స్వేచ్ఛకు అడ్డుపడే పరిస్థితి లేదు’ అని జేపీ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. సమాజంలో అత్యధికులు అమాయకులు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పినా ఖామోస్ అనుకుంటారు కాబట్టి తమ మాట చెల్లుతుంది... తమకు పెద్ద బాకాలున్నాయని పాలకులు గడుసుగా మాట్లాడుతున్నారన్నారు. -
ప్రత్యేక హోదాతోనే పన్ను రాయితీలు : జేపీ
గుంటూరు: రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు చేకూర్చే ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర రాష్ట్రాలను కలుపుకుని కేంద్రంతో చర్చలు జరపాలని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్‌నారాయణ సూచించారు. గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి శనివారం విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రత్యేక హోదాలోనే ప్రత్యేక ప్యాకేజీ ఉందనే విషయాన్ని గమనించాలన్నారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో రెవెన్యూ లోటును పూరించాలని, విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పన్ను రాయితీలు ఇవ్వాలనే విషయాలను తాను ప్రస్తావించినట్లు చెప్పారు. 14వ ఆర్ధిక సంఘం ద్వారా రెవెన్యూ లోటు, మౌలిక వసతులు కొంతమేరకు సమకూరుతున్నాయంటూ పన్ను రాయితీలు మాత్రం ప్రత్యేక హోదాతోనే వస్తాయని జేపీ స్పష్టం చేశారు. పలు రాష్ట్రాలు ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నందున ఏపీకి ‘హోదా’ ఇచ్చేందుకు కేంద్రం సంశయిస్తున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలను కలుపుకుని కేంద్రాన్ని కోరాలన్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, నిరసనలు తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తుంటే వారిని నిలువరించకూడదని తెలిపారు. ప్రత్యేక హోదా గురించి పార్లమెంటు సాక్షిగా నాటి పాలకపక్షమైన కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీలు తాము ఇచ్చిన హామీలపై వెనక్కు తగ్గడం తగదన్నారు. ప్రత్యేక హోదా గురించి చట్టంలో పెట్టినా, పెట్టకపోయినా పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ప్రజలు ముఖ్యంగా యువత గొంతు విప్పాలని, శాంతియుతంగా ఉద్యమాలు చేస్తే మరలా సమస్య తెరమీదకు వచ్చి దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారని జేపీ చెప్పారు. కాగా, లోక్‌సత్తా పార్టీ మూడు రాజ్యాంగ సవరణలు, ఆరు చట్టాలు తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు దోహదపడిందన్నారు. -
'అవినీతి పరులెవరో అందరికీ తెలుసు'
హైదరాబాద్: వ్యవస్థను మార్చాలంటే మ్యాజిక్ అవసరం లేదు.. నీతి, నిజాయితీ ఉంటే చాలని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. అవినీతిపరులు ఎవరో నాయకులందరికీ తెలిసినా తెలియనట్టు డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన పలు అంశాలపై విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి వంద మంది చొప్పున భయంకర అవినీతి పరులను గుర్తించండి అని ప్రభుత్వానికి సూచించారు. కనీసం దేశంలో 1000 మంది అక్రమార్కులను గుర్తించినా అవినీతిని నియంత్రించినట్లేనని అన్నారు. అధికారం అంటే పెద్ద గోడలు, రాజ భవనాలు కట్టడం, చార్టెడ్ విమానాల్లో తిరగడం కాదు.. ప్రజలకు సేవ చేయటమేననిన్నారు. నోట్ల రద్దుపై... కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8న తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో మొదటి ప్రభావం సామాన్యులపైనే పడిందని, ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిందని జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. నిజాయితీగా డబ్బు సంపాదించినా.. డబ్బు రూపంలోకి మార్చటం తప్పనిసరి అని అన్నారు. సామాన్యులకు డబ్బు, క్యాష్ లెస్ అవకాశాలు పెరగకపోతే నోట్ల రద్దు నిర్ణయం వృథా అయినట్లేనని తెలిపారు. రాష్ట్రం, కేంద్రం కలిసి కూర్చుని చర్చిస్తే ఇలాంటి సమస్యల పరిష్కారం ఈజీ అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంలో చొరవ తీసుకుని రియల్ ఎస్టేట్ రంగంలో క్యాష్ వాడకం లేకుండా చేయాలని సూచించారు. ఇప్పుడూ అవే రాజకీయాలు.. తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రామీణ పోలీస్ అధికారులను నియమించడం మంచిదేనన్నారు. అలాగే, ఆరోగ్య రక్ష పథకం మంచి ఆలోచన అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పెంచాలని సూచించారు. జిల్లాల విభజన వల్ల నిధుల అందుబాటు పెరిగిందన్నారు. కొత్త జిల్లాలకు అధికారం వెళ్ళిందని చెప్పారు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రాజకీయమే ఇప్పుడూ కొనసాగుతోందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తీరులో పెద్ద మార్పు లేదన్నారు. శాసనసభ్యుడిని రాజకీయ పార్టీకి బానిస చేశారన్నారు. రెండు రాష్ట్రాలు చెడు విషయాల్లో కాకుండా మంచి విషయాల్లో పోటీ పడాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల అవసరాలు తీరటం ముఖ్యం.. ప్రజలకు సేవలు అందేలా చూడటం ముఖ్యం. లోక్‌సత్తా కార్యక్రమాల ఫలితంగా రాజకీయాల పట్ల ప్రజల్లో విముఖత తగ్గింది. జల్లికట్టు అంశంపై... జల్లికట్టు విషయంలో జాతీయ స్థాయి నిర్ణయాలు ఎందుకన్నారు జయప్రకాశ్ నారాయణ్. ఈ విషయాన్ని ఆ రాష్ట్రం చూసుకుంటుందని అన్నారు. అధికార కేంద్రీకరణ చాలా అపాయకరమని చెప్పారు. నలబై ఏళ్ల క్రితం కందిమల్లయ్యపల్లెలో జంతు బలి సందర్భంగా పోలీసు కాల్పుల్లో ప్రజలు చనిపోయారని గుర్తు చేశారు. -
ప్రజల నెత్తిపై మోది వేశారు
► పెద్దలను వదలి పేదలపై పడ్డారు ► ప్రధానిది అనాలోచిత చర్య : జయప్రకాష్ నారాయణ్ ► పెద్దల అభిప్రాయాలతో ప్రధానికి నివేదిక ► ‘నోట్ల రద్దు–భావి మార్గం’ అంశంపై ఇండియా నెక్ట్స్ చర్చా గోష్టి సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వివిధ రంగాలకు చెందిన పెద్దలంతా ముక్తకంఠంతో నిరసించారు. ఇది అనాలోచిత, తొందరపాటు చర్య అని అభివర్ణించారు. ఖాతాదారులు బ్యాంకుల్లోని తమ సొమ్మునే డ్రా చేసుకునే వీలులేకుండా చేయడం రాజ్యాగం ఉల్లంఘన కిందకే వస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘నోట్ల రద్దు–భావి మార్గం’ అంశంపై ఇండియా నెక్ట్స్ అనే స్వచ్ఛంద సంస్థ శనివారం చెన్నైలో చర్చా గోష్టి కార్యక్రమాన్ని నిర్వహించింది. మూడున్నర గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన మేధావులు, విద్యావేత్తలు, ప్రముఖులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన జయప్రకాష్ నారాయణ్ కీలకోపన్యాసం చేస్తూ, ప్రధాని ఆశయం మంచిదైనా పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోకుండా ఆచరణలో సాధకబాధకాలు బేరీజు వేసుకోకుండా ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనుచితమని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త నోట్ల ముద్రణలో ఆర్బీఐ సామర్థ్యాన్ని తెలుసుకోకుండా పాత నోట్ల రద్దు దేశ ప్రజలను గందరగోళానికి గురిచేసిందని అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోదీ ప్రకటించినపుడు మద్దతు ప్రకటించిన వాళ్లలో తాను ప్ర«థముడని అన్నారు. అయితే కాలక్రమేణా దాని పర్యవసానాలు గమనిస్తే ఇది ఎంత అనాలోచిత చర్యనో అర్థమైందని అన్నారు. నోట్ల రద్దు వల్ల సామాన్య ఉద్యోగులు, చిన్నపాటి వ్యాపారస్తులు, ప్రజలు ఇలా అన్ని వర్గాలవారు తమ డబ్బును తాముతీసుకోలేక పడుతున్న కష్టాలను, దీని వల్ల స్తంభించిపోయిన ఆర్థిక కార్యకలాపాలను వివరించారు. నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద వాళ్లను వదిలేసి కాయకష్టం మీద చిన్నచిన్న సంపాదనలపై ఆధారపడి జీవిస్తున్న చిరుద్యోగులు, కార్మికులు, రైతుల జీవనం అస్తవ్యస్తమైందని ఆయన అన్నారు. మాజీ ప్రధాన మంత్రి సమాచార సలహాదారు, కేంద్ర ప్రభుత్వ మాజీ అధికార ప్రతినిధి ఎస్ నరేంద్ర మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు పాలనపారమైన సమస్యలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రధాని తొందరపాటుæ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల స్థాయిలోని అవినీతి సమస్యను చర్చించి ముందుజాగ్రత్త చర్యలతో పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. వ్యాధి నివారణకు కొన్నిసార్లు చేదు మందులు, మరికొన్నిసార్లు సర్జరీలు కూడా అవసరమని డాక్టర్ సీఎంకే రెడ్డి అన్నారు. ఈ నోట్ల రద్దును కూడా ఆదే దృష్టితో చూడాలని అన్నారు. గతాన్ని వదిలేసి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఇండియా నెక్ట్స్ సలహామండలి వైస్ చైర్మన్ అనిల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కొందరు నల్లకుబేరులను పట్టుకునేందుకు ప్రజలందరినీ క్రిమినల్స్‌గా చూడటం సరికాదని హితవు పలికారు. పైగా నోట్ల రద్దు తరువాత దేశవ్యాప్తంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కబెట్టడంలో ప్రభుత్వం సమర్దవంతంగా వ్యవహరించలేదని అన్నారు. దక్షిణ భారత తెలుగు చలన చిత్ర మండలి గౌరవ కార్యదర్శి, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయం సినిమా రంగాన్ని తీవ్రంగా కుంగదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్లకు ప్రేక్షకులు తగ్గిపోయారు, షూటింగులు నిలిచిపోయాయని అన్నారు. నగదు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం సినిమారంగానికి కొంత మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇండియా నెక్ట్స్ ప్రధాన కార్యదర్శి మాలినేని అమరేంద్ర స్వాగతోపన్యాసం చేస్తూ, నల్ల ధనం నిర్మూలనకు నోట్ల రద్దు నిర్ణయం మంచిదైనా ప్రభుత్వం చేసిన ప్రకటనలు, ఆంక్షలు ప్రజల్లో అనేక భయ సందేహాలను సృష్టించాయని అన్నారు. దీనిని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేఅన్నారు. సదస్సులో మాట్లాడిన ప్రముఖలంతా ఏటీఎంల పరిస్థితిని సరిచేసి సామాన్య, పేద ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరారు. ఏకపక్షంగా ఎలాంటి ముందుస్తు చర్యలు లేకుండా ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరమని అన్నారు. ఇది ప్రాధమిక హక్కులకు భంగకలిగించేంతటి పరిణామాలకు దారితీసిన ఈ దేశ ప్రజలు సహనంతో భరిస్తున్నారని జేపీ, నరేంద్ర తదితరులు అన్నారు. వక్తల అభిప్రాయాలతో ఒక నివేదికను ప్రధానికి, ఆర్దికశాఖస్థాయి సంఘానికి సమర్పించాలని సదస్సు తీర్మానించింది. ఈ సదస్సులో తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్, హిందూ దినపత్రిక అసోసియేట్ ఎడిటర్ కే టీ జగన్నాథన్, మాజీ ఐఏఎస్ అధికారులు ఎన్ మురుగన్, రాజ్‌కుమార్, చార్టెడ్ అకౌంటెంట్ల సంఘం దక్షిణాది రాష్ట్రాల విభాగం అధ్యక్షులు వీ మురళి, సైబర్ సొసైటీ ఆఫ్ ఇండియా పాలనామండలి చైర్మన్ వీ రాజేంద్రన్, డాక్టర్ సీఎంకే రెడ్డి, ఐక్యరాజ్యసమితి ఉద్యోగి వీ హరిప్రసాద్, ప్రైంపాయింట్ ఫౌండేషన్ చైర్మన్ ఏ శ్రీనివాసన్, అడయార్ ఆనంద భవన్ మేనేజింగ్ డైరెక్టర్ కేటీ శ్రీనివాసరాజా, కేసీపీ సిమెంట్ లిమిటెడ్ ఎగ్జిక్యుటీవ్ ప్రెసిడెండ్ ఏ శివరామప్రసాద్, విజయ్ హాస్పిటల్స్ జనరల్ మేనేజర్ డీ రాంబాబు, ఎస్‌ఏఈ ఎండి ఎగ్జిక్యుటీవ్ డైరెక్టర్ శేషాద్రి, సిమ్సన్ అండ్ కంపెనీ కార్యదర్శి, కలప, బంగారు వ్యాపారవేత్త జోయల్ వక్తలుగా పాల్గొని తమరంగాల్లో నోట్లరద్దు ప్రభావాన్ని, సాధకబాధకాలు వివరించారు. ఇండియన్ నెక్ట్స్ అధ్యక్షులు దువ్విగుంట వెంకటేశ్వర్లు, కోశాధికారి పెమ్మసాని మురళి, సలహా మండలి చైర్మన్ పద్మయ్య, పారిశ్రామికవేత్త అనిల్‌కుమార్ రెడ్డి ఈ సదస్సుకు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. -
హోదాకోసం బాబే కేంద్రంపై ఒత్తిడి తేవాలి
‘హోదా దగా.. కింకర్తవ్యం?’ పుస్తకావిష్కరణలో జేపీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు చంద్రబాబే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, హోదా కల్పిస్తామన్న మాటకు కేంద్రం కట్టుబడి ఉండాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌నారాయణ పేర్కొన్నారు. పారిశ్రామిక పన్ను రాయితీలు హోదాలో భాగమేనని.. ఆ రాయితీలు, వాటితోపాటు ఉద్యోగాలు, అభివృద్ధి వస్తాయన్న ఆశతోనే 2014 ఎన్నికల్లో ప్రజలు టీడీపీ-బీజేపీ కూటమిని గెలిపించారని గుర్తు చేశారు. ‘హోదా దగా.. కింకర్తవ్యం?’ పేరుతో లోక్‌సత్తా పార్టీ రూపొందించిన పుస్తకాన్ని జయప్రకాష్‌నారాయణ శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ పార్టీ అధ్యక్షుడు బీశెటి బాబ్జీ పాల్గొన్నారు. -
అద్భుత రాజధాని ఆర్డరేస్తే రాదు..!
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ రాజధాని విషయంలో అద్భుతాలు చేస్తామనడం దూరదృష్టి లోపమంటున్నారు లోక్‌సత్తా సంస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాష్ నారాయణ్. విద్య, ఆరోగ్యం, ఉపాధి, సంస్కృతి ఇవన్నీ ఒకదానికి ఒకటి సమకూరితేనే ఆధునిక రాజధాని వస్తుంది తప్ప. ఆర్డర్ వేస్తేనో, భూమి రేట్లు 5 కోట్లకు వెళ్లిపోతేనో అకస్మాత్తుగా రాజధాని ఏర్పడదన్నారు. పుష్కరాలు, ఉత్సవాలు వంటి ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లోనే పాలకులు కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ని పాలకులే కులాల కంపుతో మురికి చేయడం అభివృద్ధికి, ఆధునిక సంస్కృతికి చిహ్నం కాదన్నారు. వాగ్దానాలు, మాటల గారడీలు మాని అధికార వికేంద్రీకరణ, సమర్థ పాలన, ప్రజలకు సేవలందించటం, విద్యా ఆరోగ్యం ప్రతి బిడ్డకూ ఆందే ఏర్పాటు చేయ డమే తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మార్గం అంటున్న జేపీ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... చంద్రబాబు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు మీరెలా ఫీలయ్యారు? ఒక నాయకుడికి, మిత్రపక్షాలకు 225 సీట్లను కట్టబెడుతూ జనం తీర్పునిచ్చిన ప్పుడు అర్ధరాత్రిపూట ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని దింపేస్తే అది ఏ రకమైన ప్రజా స్వామ్యం అవుతుంది? ఎలా రాజ్యాంగ బద్దమౌతుంది? సాంకేతికంగా అది చట్టబద్ధం కావచ్చు. కానీ అలాంటి పనిని ఏ పార్టీ చేసినా నైతికంగా తప్పే. తెలంగాణ విషయంలో మీరు సరైన వైఖరి తీసుకున్నారా తీసుకోలేదా? అప్పటికీ ఇప్పటికీ ఒకటే చెబుతున్నాను. ఆనాడు నేను చెప్పింది వాస్తవం అని రుజువవుతోంది. రాజ్యవ్యవస్థ మారకుండా రాజధాని మారితే ప్రయోజనం లేదు. రాష్ట్రం పేరు మారితే పెద్దగా ఏమీ ఒరగదు. తెలంగాణ కావాలంటే తెచ్చుకుందాం కానీ అదొక్కటే సరిపోదు అని ఆనాడే చెప్పాను. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం కరెక్టని తేలిందా లేదా? పార్టీ కోణం నుంచి అయితే రెండు చోట్లా చతికిలపడిపోయారు కదా. ఏపీలో ఒక తరం వరకు కాంగ్రెస్ పార్టీ పుంజుకోకపోవచ్చు. తెలంగాణలోనూ ఆ పార్టీనుంచి చాలామంది జారుకుంటున్నారు. రాజ కీయంగా అద్భుతాలు సాధిస్తామనుకుని, ఓడిపోయారు. అయితే తెలం గాణ ప్రజలు దేశాన్ని కాపాడారు. తెలంగాణ సాధించిన కీర్తిని ప్రజలకు కాకుండా సోనియాకు కట్టబెట్టినట్లయితే బేజీపీ లేదా కాంగ్రెస్.. రాష్ట్ర శాసనసభతో, ప్రజల మనోభావాలతో నిమిత్తం లేకుండా ఓట్ల కోసం, సీట్ల కోసం ఈ దేశంలో అన్ని చోట్లా ఇదే ప్రయోగానికి ఒడిగట్టేవాళ్లు. ఇప్పుడిక ఈ సాహసాన్ని ఎవరూ చేయరు. ప్రజలు తమకు తాముగా కోరుకుని వారి మధ్య సంఘీభావంతో ఒక ఒప్పందానికి వస్తే తప్ప ఢిల్లీలో బలవంతంగా విభజన చేస్తామనే ప్రయత్నం ఇక ఎవరూ చేయరు. కేసీఆర్, చంద్రబాబు పాలన ఎలా ఉంది? కేసీఆర్ పాలనలో రెండు మూడు అంశాలు నాకు నచ్చాయి. సింగపూర్ నుంచి, బ్రిటన్ దాకా గృహ నిర్మాణం ఆధునిక ప్రపంచంలో చాలా కీలకమైనది. అలాగే ఇరి గేషన్, నీటి సంరక్షణ వగైరా. అధికార వికేంద్రీకరణ చేస్తామన్నారు. పంచాయితీలకు ఏడాదికి 5వేల కోట్లు ఇస్తానని కేసీఆర్ అన్నప్పుడు నా గుండె ఉప్పొంగింది. తొలి నుంచీ మేం పోరాడుతున్నది దానిమీదే కదా. కాని ఆయన ఇప్పుడు అలా చేయడం లేదు. ఏపీ విషయంలో బాబుకు గతంలో ఉన్న విస్తృతస్థాయి దృక్పథం కనుమరు గైంది. పెట్టుబడులకోసం ప్రయత్నిస్తు న్నాడు. కానీ అధికార వికేంద్రీకరణపై దిశా నిర్దేశం లేకుండా కులాల జంజాటంతోటే కాలం గడిపేస్తున్నాడు. తాత్కాలికమైన కానుకలు, పుష్కరాలు, అమరావతికి శంకు స్థాపనలు.. ఇలా ఈవెంట్ మేనేజ్మెంట్ హడావుడి తప్ప మరేమీ జరగటం లేదు. అమరావతి ప్రపంచంలోనే నంబర్ వన్ రాజధాని అంటున్నారు. నిజమేనా? ప్రజల హృదయాలు కాస్త గాయపడ్డాయి కాబట్టి, హైదరాబాద్‌కు దీటుగా ఏర్పాటు చేసుకుంటామనటంలో తప్పులేదు. కానీ రాజధాని సహజంగా నిర్మాణం కావాలి. దీన్నే ఆర్గానిక్ గ్రోత్ అంటాం. విద్య, ఆరోగ్యం, ఉపాధి, సంస్కృతి ఇవన్నీ ఒకదానికి ఒకటి సమకూరాలి. దాంతోనే ఆధునిక రాజధాని వస్తుంది తప్ప.. మీరు ఆర్డర్ వేస్తేనో, భూమి రేట్లు 5కోట్లకు వెళ్లిపోతే అకస్మాత్తుగా జరగదు. ఒక యాభై ఏళ్లు, వందేళ్లు పడుతుందని భావించి దానికనుగుణంగా పునాదులు వేస్తే మీరనుకున్నది జరుగుతుంది కాని పాలకుడు ఆదేశిస్తే జరిగేది కాదు. అమరావతిలో రాజధాని విష యంలో ఏం జరుగుతోందో నాకు అర్థం కావటం లేదు. అద్భుతాలు చేస్తాం అన్నారు. ల్యాండ్ పూలింగ్ చేశారు. ఇచ్చినవారు సంతోషంగా ఇచ్చారు. భూమి ఇస్తే పెరిగే విలు వలో రైతుకు వాటా ఉంటుందంటే సంతోషమే కదా. రేపు పొద్దున భూమి రేటు పెరిగితే నాకు కూడా వాటా ఉంటుందనే భావన కలగాలి కానీ నేను తీసేసుకున్నాను. మీ చావు మీరు చావండి, నేను అమ్మేసుకున్నాను అంటే పద్ధతి కాదు. ఓటుకు కోట్లు కేసుపై మీ అభిప్రాయం? కౌన్సిల్‌కు ఉన్న ఒకే ఒక అధికారం ఏమంటే అసెంబ్లీ చేసిన నిర్ణ యాలను 90 రోజుల పాటు ఆపగలగడమే. ఇది తప్పితే దానికి ఏ అధికారమూ లేదు. దాంట్లో ఒక కౌన్సిల్ సభ్యుడి విషయంలో మీకు అధికారమే లేని రాష్ట్రంలో ఇంత రాద్దాంతం ఏమిటి? ఓటుకు డబ్బులిస్తే, పార్టీ ఫిరాయింపులు చేస్తే తప్పకుండా రాజ్యాంగ విరుద్ధమే. ఆ టేపులో గొంతు మీదా కాదా అని బాబును నేను ఎన్నడో ప్రశ్నించాను. కానీ ఇలాంటి వ్యవహారాల్లో పవిత్రులెవరు? అపవిత్రులెవరు? ఎన్నికలలో పోటీ చేసిన ప్పుడు బీజేపీ ఇతర పార్టీలు ఎంపీ సీటుకు 20, 30 కోట్లు ఖర్చు పెట్టలేదని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు మీ సందేశం? రెండున్నరేళ్ల క్రితం మనందరి మనసుల్లో కాస్త భయం ఉండింది. రెండు రాష్ట్రాలు వచ్చేశాయి. ఈ ఆంధ్ర, తెలంగాణ భావం జనం మనస్సుల్లో ఉండి కలుషిత వాతావ రణం సృష్టిస్తే గందరగోళం నెలకొంటుందని అనుకున్నాం. అలా జరగనందుకు ప్రధా నంగా కేసీఆర్‌ని, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించాలి. రాజకీయం కోసం గతంలో ఏం జరిగినప్పటికీ ఒక సామరస్య వాతావరణం మాత్రం తీసుకొచ్చారు. దానికి మనం సంతోషపడాలి. రెండోది. ఆంధ్ర ప్రజలేమో మాకు అన్యాయం జరిగిపోయిందని అను కున్నారు. కాని మన సమస్యలకు ఇంకొకళ్లు కారణం కాదు అని గ్రహించాలి. తెలంగాణ ప్రజలు గతంలో ఆ వాదన చేసారు. ఆ వాదన తప్పని అప్పుడూ చెప్పాను. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ఆ వాదన చేస్తున్నారు. అది తప్పని ఇప్పుడు చెబుతున్నాను. మన సమస్యలకు పరిష్కారాలు మన చేతుల్లోనే ఉన్నాయి. మన పరిపాలనలో, మన రాజ కీయంలో మన సమాజం నడిచే తీరులో, మనందరి ఆలోచనలలో ఉన్నాయి తప్పితే ఇంకెక్కడినుంచో సమస్యలు రావు. పై నుంచి ఏమిచ్చినా పుచ్చుకుందాం. అది మన హక్కు. వాళ్లేం దానంగా ఇవ్వటం లేదు. ప్రత్యేక రాష్టం వచ్చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి, పదో తరగది చదివితే చాలు ప్రతి ఇంటికీ ఉద్యోగం వచ్చేస్తుంది. అందరికీ మూడు ఎకరాలు వచ్చేస్తాయి అంటూ తెలం గాణ ప్రజలు రకరకాల కలలు కన్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు అధికార వికేంద్రీకరణ, సమర్థ పాలన, ప్రజలకు సేవలందటం, మంచి ప్రమాణాలతో విద్యా ఆరోగ్యం ప్రతి బిడ్డకూ ఆందే ఏర్పాటు చేయడం దానిమీద దృష్టి పెట్టండి. (జయప్రకాశ్ నారాయణ్‌తో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకులో చూడండి) -
జయప్రకాశ్ నారాయణ్‌తో మనసులో మాట
-
తెలుగు రాష్ట్రాల్లో విద్యావ్యవస్థ నాశనం: జేపీ
► ఎంసెట్ పేరుతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు ► ఏపీకి ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది ► వ్యవసాయంతో పరిశ్రమలను అనుసంధానం చేయాలి ► మార్కెటింగ్ వ్యవస్థ దళారులు చేతుల్లో మగ్గుతోంది గుంటూరు ఎడ్యుకేషన్: తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ నాశనమైపోయిందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్ధాపకుడు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎన్. జయప్రకాష్ నారాయణ అన్నారు. గుంటూరులో శనివారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంసెట్ పేరుతో తెలుగు విద్యార్థులు రెండేళ్లపాటు పడుతున్న శ్రమ బహుశా ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. విద్యార్థుల చదువుల కోసం పేద తల్లిదండ్రులు అప్పులు చేస మరీ లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఇది సమాజానికి చేటు చేస్తుందన్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో అందిస్తున్న విద్య విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉపయోగపడటం లేదన్నారు. విద్యార్థులకు ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. దేశంలో నెలకు 10 లక్షల మంది డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని బయటకు వస్తున్నారని, ప్రపంచంలోనే ఇది అత్యధికమన్నారు. నిరుద్యోగులకు ఉపాధి చూపడమనేది ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం అత్యాశే.. ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూడటం అత్యాశే అవుతుందని జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రభుత్వం రంగంలో కేవలం రెండు శాతం ఉద్యోగాలు ఉండగా, మిగిలిన 98 శాతం ప్రైవేటు రంగంలోనే ఉంటాయన్నారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న విద్యా విధానంతో సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకురాలేమని చెప్పారు. రాష్ట్ర విభజనతో ఏపీకి జరిగే నష్టాన్ని గురించి మొట్టమొదటిగా లెక్కలతో సహా బయటకు తెచ్చినది తానే అని, ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమల స్థాపన జరిగి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం సులభతరమవుతుందని వివరించారు. రాష్ట్రం మొత్తానికి కాకపోయినా కనీసం రాయలసీమ ఉత్తరాంధ్రలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు అయినా ప్రత్యేక హోదా ద్వారా నిధులు, రాయితీలు కల్పిస్తే ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. హైదరాబాద్‌ను కోల్పోవడం ద్వారా నష్టపోయిన జాతీయ స్థాయి విద్య, వైద్య సంస్థలను ఏపీకి తరలించాలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి బదులు రైతులకు తాయిలాలు ప్రకటించే విధానం ప్రస్తుతం నడుస్తోందన్నారు. వ్యవసాయంతో పరిశ్రమలను అనుసంధానం చేయడం ద్వారా ఇటు వ్యవసాయాన్ని, అటు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. ఏపీలో మార్కెటింగ్ వ్యవస్థ దళారుల చేతుల్లో మగ్గుతోందని, ఫలితంగా రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర లేక అప్పులపాలువుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. -
లోక్‌సత్తా రద్దు కాలేదు
► ఎన్నికల్లో పోటీ చేస్తాం: పార్టీ తీర్మానం ► తాత్కాలిక విరమణే.. నిష్ర్కమణ కాదని వెల్లడి సాక్షి, హైదరాబాద్: లోక్‌సత్తా పార్టీ రద్దు కాలేదని, ఎన్నికల్లో పోటీ చేస్తుందని పార్టీ స్పష్టం చేసింది. ప్రజాభిప్రాయాన్ని జాగృతం చేశాక మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, ఇది తాత్కాలిక విరమణే తప్ప నిష్ర్కమణ కాదని రాజకీయ తీర్మానంలో వెల్లడించింది. గతంలో తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్ కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేయలేదని, పార్టీగా పుంజుకున్నాక ఎన్నికల్లో పోటీచేసిన విషయాన్ని తీర్మానంలో ప్రస్తావించింది. శనివారం జరిగిన లోక్‌సత్తా పార్టీ 10వ వార్షికోత్సవ వేడుకల్లో ఎన్నికల్లో పోటీపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పాండురంగారావు మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో ఓడినంత మాత్రాన మునిగిపోయిందేమీ లేదన్నారు. మూడు ఎన్నికల్లో పాల్గొన్నామని.. ఓటేయలేదంటూ జయప్రకాశ్ నారాయణ్ ఆగ్రహంతోనో, ఆవేదనతోనో ఇక పోటీ చేయమని ప్రకటించారని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు జేపీ మాట్లాడుతూ.. ‘పోటీ చేద్దామనుకుంటే మీ ఇష్టం. అయితే ఏ లక్ష్యం కోసం చేయదలుచుకున్నారనేది ముఖ్యం’ అన్నారు. ఆగ్రహంతోనో, ఆవేశంతోనో ఎన్నికల్లో పోటీ చేయొద్దనే నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దేశంలో ధన రాజకీయాలకు (ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం) తెలుగు గడ్డ పునాది వేసిందని.. అక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు విస్తరించి జమ్మూకశ్మీర్‌కు కూడా ఈ జాఢ్యం చేరుకుందని జేపీ ధ్వజమెత్తారు. బంగారు తెలంగాణకు జిమ్మిక్కులు పనికిరావు బంగారు తెలంగాణ దిశలో సాగాలంటే జిమ్మిక్కులు పనికిరావని, నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని లోక్‌సత్తా పేర్కొంది. వివిధ వర్గాల సంక్షేమానికి చేసిన వాగ్దానాలు ప్రభుత్వం అమలుచేయాలని తీర్మానించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తోం దని విమర్శించింది. కార్యక్రమంలో లోక్‌సత్తా జాతీయ అధ్యక్షు డు సురేంద్ర శ్రీవాస్తవ, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ కన్వీనర్ బండా రు రామ్మోహనరావు, పార్టీ రాష్ట్ర కోశాధికారి పి.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవ్యవస్థ ప్రమాణాలు పడిపోతున్నాయి
లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ హైదరాబాద్: అత్యున్నత సుప్రీంకోర్టు నుంచి కిందిస్థాయి కోర్టుల వరకు న్యాయవ్యవస్థ ప్రమాణాలు పడిపోతున్నాయని లోక్‌సత్తా, ఫౌండేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థల నిర్వాహకుడు జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కంచే చేను మేసిన విధంగా న్యాయవ్యవస్థలో పారదర్శకత, బాధ్యత, జవాబుదారీతనం మచ్చుకైనా కానరావడం లేదన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా న్యాయమూర్తులు ఒక గుంపులా తయారై తమను తామే పదవుల్లో నియమిం చుకునే ‘కొలీజియం’ పద్ధతి ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా లేదని తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ఆస్కీలో ‘జ్యుడీషియల్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ’ పేరుతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో పేరెన్నికగన్న న్యాయకోవిదుల ఆధ్వర్వంలో రూపొం దించిన జ్యుడీషియల్ అపారుుంట్మెంట్స్ కమిషన్‌ను పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించినా.. ఆ బిల్లును న్యాయస్థానం కొట్టివేయడం విచారకరమన్నారు. ఆస్కీ చైర్మన్ పద్మనాభయ్య మాట్లాడుతూ ఒకే స్వభావం ఉన్న కేసుల్లో పరస్పర విరుద్ధమైన తీర్పులు ఇస్తూ న్యాయవ్యవస్థ తమ నమ్మకాన్ని పొగొట్టుకుంటోందని, దశాబ్దాల పాటు కేసులు పరిష్కారం కాకపోవడంతో కక్షిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. పారదర్శకత లోపించిన ‘కొలీజియం’ ‘సాక్షి’ ఈడీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ కొలీజియం పద్ధతిలో పారదర్శకత, ప్రమాణా లు, బాధ్యత, జవాబుదారీతనం లోపించాయన్నారు. న్యాయస్థానాల్లో కోట్లాది కేసులు పెం డింగ్‌లో ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రతిపాదించిన జ్యుడీషియల్ అపారుుంట్‌మెంట్ కమిషన్ మంచి ఆలోచన అని అన్నారు. జస్టిస్ చలమేశ్వర్ లేవనెత్తిన అంశాలకు మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మ ణరావు, రైతు నేత వెంగళరెడ్డి,విశ్రాంత ముఖ్య కార్యదర్శి కాకి మాధవరావు, సోలిపేట రామచంద్రారెడ్డి, ఆవుల మంజులత, విశ్రాంత ఐఏఎస్ కమల్‌కుమార్, హనుమాన్‌చౌదరి, తెలకపల్లి రవి తదితరులు మాట్లాడుతూ న్యాయ సంస్కరణలు తక్షణమే చేపట్టాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. న్యాయసంస్కరణలు, కొలీజియం, జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటులపై ప్రజాభిప్రాయం సేకరించాలని నిర్ణయించారు. దేశంలో వివిధ రంగాల్లోని మేధావులు, నిపుణులు అభిప్రాయాలు సేకరించి రాష్ర్టపతి, ప్రధాని, సుప్రీంకోర్టు సీజే తదితరులకు నివేదించాలని తీర్మానించారు. -
‘హెచ్ఆర్డీకి ప్రతిపాదనలు పంపాం’
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రతిపాదించిన నూతన జాతీయ విద్యావిధానం ముసాయిదాలో సవరణలు, సూచనలను ప్రతిపాదిస్తూ కేంద్ర మానవవనరుల శాఖకు ప్రతి పాదనలు పంపినట్లు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ తెలిపారు. సమాజంలో వివక్షల తొలగింపునకు, ఉద్యోగాల కల్పనకు, ఆర్థికాభివృద్ధికి నాణ్యమైన విద్యే కీలకమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్న నాణ్యమైన విద్యను అందించడం, భారత్‌ను గొప్ప విద్యాశక్తిగా తీర్చదిద్దడం వంటి అంశాల ప్రాతిపదికగా సూచనలు రూపొందించినట్లు ఆయన తెలియజేశారు. -
సీఎంను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి
- లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ గుంటూరు వెస్ట్ ముఖ్యమంత్రిని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే విధానం అమలుచేయాల్సిన అవసరం ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. తద్వారా ఎన్నికల్లో కొంతమేర ధనప్రవాహం తగ్గుతుందని చెప్పారు. ఆదివారం గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో ‘ఎన్నికల్లో ధనప్రభావం.. పర్యవసానాలు.. ప్రజాస్వామ్య భవిష్యత్’ అంశంపై సదస్సు జరిగింది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయాలని, మంచి నాయకత్వం రావాలని చెప్పారు. పశ్చిమబెంగాల్, కేరళ, గుజరాత్ రాష్ట్రాలలో మినహా అన్ని రాష్ట్రాలలో ఎన్నికల్లో ధనప్రవాహం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవిని వ్యాపార ధోరణిలో చూస్తున్నారని, ఈక్రమంలోనే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పోటీకి దిగుతున్నారని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఒక్కొక్క నియోజకవర్గంలో రూ.60 కోట్ల వరకు ఖర్చుపెట్టి పోటీకి దిగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. దామాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా చాలావరకు ఎన్నికల్లో ధనప్రవాహాన్ని నిరోధించవచ్చని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ధనస్వామ్యంగా మారిన ప్రజాస్వామ్యం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోయిందని చెప్పారు. జెండాలు మోసిన పార్టీ కార్యకర్తలను పక్కనపెట్టి డబ్బున్న వాళ్లకే పార్టీలు టికెట్లు ఇస్తున్నాయని విమర్శించారు. చదువుకున్నవారు సైతం సిగ్గు లేకుండా పోస్టల్ బ్యాలెట్లను అమ్ముకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కారుమూరి శ్రీనివాసరెడ్డి, ప్రోగ్రెసివ్ ఫోరం రాష్ట్ర సమితి నాయకుడు ఎస్.హనుమంతరెడ్డి, ప్రొఫెసర్ విశ్వనాథ్, ఆప్ నాయకుడు టి.సేవాకుమార్, రాఘవాచారి, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఫిరాయింపులు అప్రజాస్వామికం: జేపీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ మారేలా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం అప్రజాస్వామికం, అనైతికమని లోక్‌సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి, అధికారంలో ఉన్న పార్టీలోకి ఫిరాయించడాన్ని ఒక వ్యాపారంగా భావిస్తున్నారని ఆరోపించారు. ‘‘రాజకీయాలు, డబ్బును సమానంగా చూసేవారిని, ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చుపెట్టేవారిని, ఎన్నికయ్యాక రూ.కోట్లు సంపాదించుకునే వారినే పార్టీలు ఎంచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పార్టీలు ఎలాంటి వారికి టిక్కెట్లిచ్చాయి? వారు సమయం రాగానే అధికార పక్షంవైపు వెళ్లిపోయారు. రేపు మరోపార్టీ అధికారంలోకి వస్తే అందులో చేరిపోతారు. సామర్థ్యం, నైతిక విలువలు, సమాజంలో గౌరవం ఉన్నవారు ఏ పార్టీలో ఉన్నా అభివృద్ధి పనులు చేయగలరు’’ అని జేపీ చెప్పారు. ‘‘స్పీకర్ అధికార పార్టీకి చెందిన మనిషి కాబట్టి ఫిరాయింపుదారులకు అడ్డుచెప్పే వారే కనిపించడం లేదు. స్పీకర్ చేతిలో అధికారం ఉన్నంత కాలం ఇలాగే ఉంటుంది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకొనే అధికారాన్ని ఎన్నికల సంఘానికి, గవర్నర్‌కు కల్పించాలి. ఎన్నికల సంఘాన్ని సంప్రదించి గవర్నర్ నిర్ణయం తీసుకునే విధానాన్ని అమలు చేయాలి’’ అని స్పష్టం చేశారు. -
జేపీ నిర్ణయం అభినందనీయం: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీః ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ నిర్ణయించడాన్ని వ్యక్తిగతంగా అభినందిస్తున్నట్టు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ ప్రారంభ సందర్భంలో ఇష్టాగోష్టిగా చర్చించినప్పుడు కొత్త పార్టీ స్థాపించి దానిని విజయపథంలోకి తీసుకెళ్లడం అంత సులభం కాదనీ, ఎన్నికల రాజకీయాలకు అతీతంగా ముందుకెళితే మరింత ప్రభావం ఉంటుందని తాను సూచించినట్టు వివరించారు. రాజకీయం ద్వారానే మార్పు వస్తుందని ఆనాడు భావించారని, ఇప్పుడు ఆ అభిప్రాయం వేరుగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా చైతన్యం కలిగించి సంబంధిత వ్యవస్థలపై మార్పు కోసం ఒత్తిడి తేవడం ఆహ్వానించదగిన పరిణామమని, జేపీ నిర్ణయం ప్రజాస్వామ్య పటిష్టతకు ఉపయోగపడగలదని భావిస్తున్నానని చెప్పారు. -
‘సత్తా’ ఎందుకు చాటలేదు?
సందర్భం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లోక్‌సత్తా అధ్యాయం ముగి సింది. ’కొత్త తరానికి కొత్త రాజ కీయం’ అనే నినాదంతో లోక్ సత్తా పార్టీని ప్రారంభించిన జయప్రకాష్ నారాయణ్ పదేళ్ళ ప్రస్థానం తర్వాత, ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రక టించారు. ఐఏఎస్ అధికారిగా అత్యంత విజయవంతమైన జేపీ, ఒక రాజకీయ నాయ కుడిగా మాత్రం విఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీని స్థాపించి వచ్చే లోక్ సభ, అసెంబ్లీ ఎన్ని కలకు సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్ వంటివారు లోక్ సత్తా వైఫల్యం నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? 1996 నుండి ఇప్పటిదాకా అంటే 20 ఏళ్ళు జేపీతో కలసి పనిచేసిన వ్యక్తిగా, ఆయన్ని అతి దగ్గర నుండి చూసిన వ్యక్తిగా నా అభిప్రాయాల్ని పాఠకుల ముందు ఉంచుతున్నాను. ఒక రాజకీయ పార్టీగా లోక్‌సత్తా విఫలం కావ డంలో, 50% పరిస్థితుల ప్రభావం ఉంటే, 50% జేపీ స్వయంకృతం. దేశం మీద ప్రేమ, నిజాయితీ ఈ రెండింటి విషయంలో జేపీని వేలెత్తి చూపడం సూర్యు డిపైకి ఉమ్మి వేయడం లాంటిదే. కాని, ఒక లీడర్‌గా జేపీలో చాలా లోపాలు ఉన్నాయి. ఆయన చాలా పొర పాట్లు చే శారు. లోక్‌సత్తాకి బలమైన కేడర్ లేకపోవడం పెద్ద మైనస్. లోక్‌సత్తా ఉద్యమసంస్థగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, ఓ 10% గ్రామాల్లో లోక్‌సత్తా శాఖలు ఉండేవి. వీటిని ఉపయోగించుకుని పార్టీకి కేడర్ నిర్మాణం చేసుకోకుండా, జేపీ హడావుడిగా రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఇప్పుడు పవన్ వంటివాళ్లు తమ అభిమానుల్ని కేడర్‌గా మార్చుకుని, వచ్చే ఎన్నికలనాటికి వారిని సిద్ధం చేసుకోవాలని భావిస్తు న్నట్లయితే, వారికి ఇప్పటి నుంచే రాజకీయ శిక్షణ, ఆర్గనైజేషన్ అనుభవం కోసం చిన్న చిన్న కార్యక్రమాలు అప్పగించడం అవసరం. లోక్‌సత్తా పార్టీ ప్రారంభించినప్పుడు మంచి నాయకులు పార్టీలో చేరారు. కాని వారిని ఉపయోగించు కోవడంలో జేపీ విఫలం అయ్యారు. ఎవరు ఏ పనికి ఉపయోగపడతారు అనే అంచనా వేయడంలో జేపీది అత్యంత పేలవమైన రికార్డ్. ఉదాహరణకి ఓ ప్రముఖ సామాజిక కార్యకర్త, డాక్టర్ లోక్‌సత్తాలో చేరారు. ఆయన హైదరాబాద్ స్థాయిలో నెట్ వర్కింగ్ చేయగలరు, మంచి అధికార ప్రతినిధిగా వ్యవహరించగలరు. ప్రజలతో, కేడర్‌తో డీల్ చేయడం ఆయనకు రాదు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి సంస్థాగత వ్యవహారాలు చూడమని చెప్పారు. ఆయన ఏ జిల్లాకి వెళ్ళినా జేపీకి ఆయనపై ఆరోపణలు వచ్చేవి, దీనితో జేపీ ఆయన మీద కోప్పడ్డారు, దానితో ఆయన అలిగి ప్రజారాజ్యంలోకి వెళ్ళారు. జేపీ కనుక, ఆ వ్యక్తి చేయగల్గిన పనులు మాత్రమే అప్పగించి ప్రోత్సహిస్తే ఆయన ఒక పెద్ద అసెట్ అయ్యే వారు. జేపీ చేసిన ఇంకో పెద్ద తప్పు ఏంటంటే.. ఆయన దగ్గరికి రకరకాల భావజాలాలు, ఆలోచనలు ఉన్న వ్యక్తులు వచ్చారు. అందరూ వారివారి రంగాలలో కాస్త పేరున్న వారే. వీరు పార్టీని ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా నడపమని జేపీకి సలహాలు ఇచ్చేవారు. వీరందర్నీ కలిపి కూర్చోపెట్టి, ఒక తాటి మీదకు తీసుకొచ్చి, పార్టీకి ఒక డెరైక్షన్ చూపించే పని జేపీ ఎప్పుడూ చేయలేదు. అలాగే కార్యక్రమాలను సమీక్షించి పనిచేసింది ఎవరు? షో చేసింది ఎవరు? అనేది కూడా అంచనా వేసేవారు కాదు. ఒక దీర్ఘకాలిక లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేసేటప్పుడు, నిలకడైన నిర్ణయాలు ఉండాలి. లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటుందో, మార్గం కూడా అంతే స్పష్టంగా ఉండాలి. జేపీకి తన మార్గం మీద ఎప్పుడూ నిలకడలేదు. లోక్‌సత్తా ఉద్యమసంస్థ ద్వారా ఆయన కొన్ని సంస్కరణలు సాధించారు. మార్పుని వేగవంతం చేయడం కోసం ఆయన పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచి ఢిల్లీని ప్రభావితం చేయాలనుకున్నారు. అయితే, ఒకసారి రాజకీయాల్లోకి వచ్చాక, అధికారం ద్వారానే దేశాన్ని మార్చగలం అని నమ్మాక ఇక పూర్తి స్థాయిలో బరిలోకి దిగాలి. కాని, జేపీ కాసేపు పార్టీ ద్వారా, కాసేపు లోక్‌సత్తా ఉద్యమం ద్వారా, కాసేపు సురాజ్య ఉద్యమం ద్వారా, కొన్నాళ్ళు అధికా రంలో ఉన్న వాళ్లు తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయటం ద్వారా మార్పులు తేవాలని ప్రయత్నం చేశారు. అధికారం లేదా, గణనీయమైన ఓట్ల శాతం సాధించి దేశాన్ని మార్చాలనుకున్న ఆయన, ఆ దిశగా నిలకడ అయిన కృషి చేయలేదు. జేపీకి జనంలో కలవడం అంత ఇష్టం ఉండదు. మనసులో జనం మీద అంతులేని ప్రేమ ఉన్నా, దాన్ని ఆయన వ్యక్తం చేయలేరు. పుస్తకాలు చదవడం, రాయడం, చర్చించడం మీద ఉన్న శ్రద్ధ, ఫీల్డ్ మీద ఉండదు. పదేళ్ళ పార్టీ ప్రస్థానంలో ఆయనంతట ఆయన ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటి కూడా తీసుకోలేదు. 2009 ఎన్నికల ముందు అయితే, ఆయన తాను ముఖ్యమంత్రి అయితే ఏ రంగాన్ని ఎలా బాగు చేయాలి అంటూ ఆలోచించిన దాన్లో పది శాతం సమయం కూడా, తాను అధికారంలోకి ఎలా రావాలో ఆలోచించి ఉండలేదు.. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడవడం దగ్గర నుంచి చూశాక జేపీకిమనుషుల మీద నమ్మకం పోయింది. తల్లి మీద ఒట్టు వేసి, ఎన్టీఆర్‌కు ద్రోహం చేయం అని జేపీకి మాట ఇచ్చిన వ్యక్తి, 24 గంటల్లో మాట మార్చి బాబు వైపు చేరిపోవడంతో ఆయనకు మనుషు లంటే నమ్మకం పోయింది. నమ్మితే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉన్నమాట నిజమే; కాని, రాజకీయాల్లో కనీసం నలుగురైనా నమ్మకస్తులు లేకపోతే మనుగడ సాగించడం కష్టం. కొత్తపార్టీ, అదీ ఒక ఆదర్శంతో పెట్టినప్పుడు, ఎంతో మంది యువత ఎన్నోరకాల ఆలోచనలతో వస్తారు. వీరిని వెన్నుతట్టి ప్రోత్సహించడం, పొరపాట్లను సరి దిద్దడం చాలా అవసరం. జేపీ గుడ్డిగా అందర్నీ ప్రోత్స హించేవారు. పార్టీలో జేపీ తర్వాతి స్థానంలో ఎక్కువ కాలం పనిచేసిన ఒకాయన మాత్రం అందర్నీ నిరాశ పర్చేవారు. యువత చిన్న విషయాలకే అసంతృప్తి చెందుతారు. ఇలా అసంతృప్తికి గురైన చాలా మంది యువత పార్టీకి దూరం అయ్యారు. ఇవన్నీ కలసి ఎన్నికల రంగం నుంచి లోక్‌సత్తా నిష్ర్కమణకు దారితీశాయి. - నరేష్ శిరమని వ్యాసకర్త పాత్రికేయుడు మొబైల్: 9912655225 -
కేసీఆర్ వి అనాలోచిత నిర్ణయాలు
మీట్ ది ప్రెస్‌లో లోక్‌సత్తా నేత జేపీ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఎత్తై భవనాలను నిర్మిస్తామంటారు... ఇందిరా పార్కును ఏదో చేస్తానంటారు... హుస్సేన్‌సాగర్‌ను మరేదో చేస్తా అంటూ... ప్రజలను భ్రమపెడుతున్నారని ఇది మంచిది కాదన్నారు. తమ ఆస్తులమ్మి చేసినట్లుగా నగరాభివృద్ధిని మేమంటే మేమే చేశామని అధికార, ప్రధాన ప్రతిపక్షాలు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు చెల్లించిన పన్నుల్లో కొంత స్వాహా చేసి, మరి కొంత నగర అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. శుక్రవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీడబ్ల్యూజేఎఫ్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో జేపీ మాట్లాడారు. దేశ రాజకీయాలు మార్చడంపై చర్చ జరగాలని, ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టిన పార్టీల చేతుల్లోకి అధికారం వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే దోచుకోవడం, పైరవీలు చేసుకోవడమే పనిగా మారిందన్నారు. ప్రధాన పార్టీలన్నీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రౌడీలు, భూకబ్జాదారులు, నేరచరిత్ర ఉన్నవారికే టికెట్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. లోక్‌సత్తా, వామపక్షాలు జెండాలు పక్కకు పెట్టి నిర్దిష్టమైన ఎజెండాతో వన్ హైదరాబాద్ కూటమిగా ముందుకెళ్తున్నాయన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అంశాల ప్రాతిపదిక ఆధారంగా ఈ కూటమి భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. సేవలకు కాలపరిమితి పెట్టి, ఆలోపు పూర్తి కాని పక్షంలో సంబంధిత ఉద్యోగికి రోజుకు రూ.200 జరిమానా విధించే విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పన్ను కట్టిన పాపానికి ప్రజలను యాచకులుగా చూడకూడదని, పాలనలో వారిని భాగస్వామ్యం చేయడం ద్వారా జవాబుదారి తనం పెంచాలన్నారు. జీహెచ్ఎంసీ బడ్జెట్‌ను నగరాభివృద్ధితోపాటు 90 శాతం ప్రజలు ఎదుర్కొంటున్న కనీస సౌకర్యాల కల్పనకు వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
'వారి సమస్యలు న్యాయబద్ధమైనవే’
-
'ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు సిద్ధం'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌లో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సి ఉందని లోక్‌సత్తా అధినేత జేపీ అభిప్రాయపడ్డారు. గురువారం అనంతపురంలో జేపీ మాట్లాడుతూ... దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధికి పాటుపడతానని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాల వల్లే కాల్-మనీ గ్యాంగ్‌లు పెట్రేగిపోతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని జేపీ స్పష్టం చేశారు. -
’సీఎం కంటే ఈవెంట్ మేనేజర్‌గా పనికొస్తారు’
-
'విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది'
హైదరాబాద్: రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్రం చేసే సాయం గురించి స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఏం చేశారో ప్రధాని చెప్పలేదని జేపీ అన్నారు. రాజధాని అంటే కేవలం అమరావతే కాదని చెప్పారు. -
రాజధాని ప్రజలదా? రియల్‌దా?
-
బాబూ.. మళ్లీ నాటకాలా?
* ప్రత్యేక హోదాపైనా డబుల్ డ్రామాలొద్దు: జేపీ * ఏడాది గడిచినా ఎందుకు తేలేకపోయారు? సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన సమయంలో ద్వంద్వ వైఖరి అవలంబించి నాటకాలాడిన తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా విషయంలోనూ అదే విధంగా వ్యవహరిస్తోందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ విమర్శించారు. విశాఖపట్నంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చేందాలంటే పరిశ్రమలపై పన్నుల బారం తగ్గాలని, ప్రత్యేక హోదాతోనే అది సాధ్యం అవుతుందని అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకురావడంలో తెలుగుదేశంపార్టీ విఫలం అయ్యిందని అన్నారు. అయిన వారికి లబ్ధి చేకూర్చడానికే తెలుగుదేశం ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టిందని విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి ఐదేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ముష్టిలా ఏడాదికి రూ.250 కోట్లు ఇస్తూ ఉంటే ఎందుకు నిలదీయడం లేదన్నారు. ఇంత వరకూ కేటాయించిన నిధులు మట్టి తీయడానికే సరిపోవడం లేదన్నారు. 14 వ ఆర్థిక సంఘం నిధులతో ఏపీ బడ్జెట్ లోటు భర్తీ చేసేశామని కేంద్రం చెబుతోందంటే రాష్ర్టం ఇచ్చిన నివేదికలో ఏముందో, కేంద్రంతో ఏం లాలూచీ పడిందో ప్రజలకు తెలియాలన్నారు. ఓ వైపు అప్పుల్లో ఉన్నామంటూనే ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరుగుతూ, కార్యాలయాలకూ, హంగూ ఆర్భాటాలకూ, చంద్రన్న కానుకలకూ రూ.కోట్లు ఖర్చు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. -
ఆ అంశాలు ఏపీ మంత్రులకెందుకు?: జేపీ
సాక్షి, హైదరాబాద్: సెక్షన్ 8ను హైదరాబాద్‌లో అమలు చేయాలని అడగాల్సింది ఇక్కడి ప్రజలు గానీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్మమో, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలో కాదని, తమ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడుకోకుండా పొరుగు రాష్ట్రంలోని సమస్యలు ఏపీ మంత్రులకు ఎందుకని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ప్రజలు తమది ఆంధ్రానా.. తెలంగాణనా అన్న భేదాభిప్రాయాలు లేకుండా ప్రశాంతంగా ఉన్న సమయంలో పాలకులు సెక్షన్ 8 అంశాన్ని వివాదాస్పదం చేసి ఇక్కడి ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో పార్టీ నేతలతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సెక్షన్ 8 అన్నది కేవలం హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాల ప్రజల శాంతిభద్రతలకు సంబంధించినది మాత్రమేనన్నారు. ప్రజలెనుకున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు గవర్నర్ అన్ని వ్యవహారాలలో తలదూర్చితే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. గవర్నర్ వ్యవస్థ క్రమంగా లేకుండా పోవాలన్నది తన కోరికగా జయప్రకాష్ నారాయణ చెప్పారు. -
'ఏడాది తర్వాత సెక్షన్-8 గుర్తుకు రావడం విడ్డూరం'
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన ఏడాది తర్వాత సెక్షన్ -8 గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. పదమూడు నెలలుగా హైదరాబాద్ నగరంలో ఉంటున్న ఆంధ్రా ప్రజలకు ఎటువంటి హానీ జరగలేదని జేపీ స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొందరు ప్రజల మధ్య ఎంతగా చిచ్చు పెడితే అంతలా రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్ర విభజన జరిగిన ఏడాది తర్వాత సెక్షన్-8 గుర్తుకు రావడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంతో పాటు, ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పగించాలని జేపీ విజ్ఞప్తి చేశారు. -
ఇడియట్స్ రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు
లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జేపీ హైదరాబాద్ : ఇడియట్స్, జోకర్స్, పనిలేని వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థను భ్రష్టుపటి ్టస్తున్నారని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. హైదరాబాద్‌లో శనివారం లైఫ్‌స్కిల్స్ ఇండియా ఆధ్వర్యంలో ‘భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాజకీయ నేతలు కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రావాలన్న ధ్యాస తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఓటుకు కోట్లు వ్యవహారంపై రెండు రాష్ట్రాల సీఎంలు రెచ్చగొట్టే ధోరణులే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. విద్యా విధానం పరమచెత్తగా ఉందని, పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే యువతకు ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడ్డారు. -
18 నెలలు జైల్లో గడిపాను!
ఎమర్జెన్సీ అనుభవాలను గుర్తు చేసుకున్న వెంకయ్యనాయుడు సాక్షి, న్యూఢిల్లీ: చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి రోజని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ప్రజాస్వామ్యానికి అదొక మాయని మచ్చ అని, ఒక వ్యక్తి తన పదవిని కాపాడుకోవడానికి రాజకీయాల్లో ఏస్థాయికి దిగజారుతారనేదానికి ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. అత్యవసర స్థితి రోజులను బుధవారం ఆయన గుర్తు చేసుకుంటూ.. నియంతృత్వాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని చరిత్ర రుజువు చేసిందన్నారు. ‘40 ఏళ్ల కిందట పోలీసులు వచ్చి నన్ను అరెస్టు చేశారు. జయప్రకాశ్ నారాయణ్‌ను విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి ప్రభుత్వానికి, అవినీతికి వ్యతిరేకంగా ఉపన్యాసం ఇప్పించడంతో పాటు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. పదిహేడున్నర నెలల పాటు విశాఖ, హైదరాబాద్, ముషీరాబాద్, నెల్లూరు జైళ్లల్లో ఉన్నాను’ అని గుర్తు చేసుకున్నారు. ‘నాడు దేశంలో ప్రజాస్వామ్య భావనలు గట్టిగా ఉన్నాయి. జేపీ లాంటి అనేక మంది నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని నడిపించారు. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ సంస్థలు చురుకైన పాత్ర పోషించాయి. సోషలిస్టు పార్టీలూ ఉద్యమించాయి. వాజ్‌పేయి, జార్జఫెర్నాండెజ్ లాంటి నేతలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. మొరార్జీదేశాయ్, అద్వానీ లాంటి నేతలను అరెస్టు చేసి హింసించారు’ అని వెంకయ్యనాయుడు వివరించారు. ఎమర్జెన్సీ తర్వాత తనతో సహా అనేక మంది యువనేతలు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ‘మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయారు. నేను లా చదివి, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలనేది మా అమ్మ కోరిక అని అమ్మమ్మ చెబుతుండేది’ అని గుర్తు చేసుకున్నారు. -
'బాబు, కేసీఆర్ కాదు... ప్రజలు నష్టపోతారు'
-
'బాబు, కేసీఆర్ కాదు... ప్రజలే నష్టపోతారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని లోక్‌సత్తా పార్టీ నాయకుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) ఆరోపించారు. ఇలా చేయడం వల్ల నష్టపోయేది చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదని... ప్రజలే నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో జేపీ మాట్లాడుతూ... ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు ప్రాంతాల మధ్య సమస్య కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదాలను కేంద్రప్రభుత్వం పరిష్కరించకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని జేపీ విమర్శించారు. ఎన్ని కుట్రలు పన్నినా అన్ని ప్రాంతాల్లో ప్రజలు పూర్తిసామరస్యంతో ఉన్నారని తెలిపారు. ఓ పౌరయుద్ధం, హింస రావాలని కొంతమంది కోరుకుంటున్నారని ఆరోపించారు. అయితే ప్రజల్లో విజ్ఞత ఉందని... దాన్ని పోగొట్టాలని చూస్తున్నారని జేపీ ఆందోళనవ్యక్తం చేశారు. -
ఆ గొంతు మీదని తేలితే రాజీనామాకు సిద్ధమా?
సీఎం చంద్రబాబుకు లోక్‌సత్తా అధినేత జేపీ సవాలు ♦ తెలుగునాట డబ్బు రాజకీయాలు మీ చలవే ♦ మీ స్వార్థం కోసం ప్రజల్ని రెచ్చగొట్టొద్దు ♦ హజారే వారసుడినన్నారుగా... మరి ఆ ప్రమాణాలు పాటిస్తారా? ♦ లోక్‌పాల్ పర్యవేక్షణలో ఈ కేసును సీబీఐతో విచారించాలి ♦ రేవంత్.. మీకు చెప్పకుండా ఆ పనిచేస్తే ఎందుకు ఉపేక్షించారు? సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే ఓటు కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన వ్యక్తిగత బాధను అందరి బాధగా చిత్రీకరించి ప్రజల్ని రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ దుయ్యబట్టారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వంక చెప్పి చంద్రబాబు ఈ కేసును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగా? రికార్డింగా? స్టింగ్ ఆపరేషనా? మరొకటా..? అనేది కోర్టు తేల్చాలన్నారు. ‘చంద్రబాబూ, ఆ గొంతు మీదే అయితే రాజీనామాకు సిద్ధమా’ అంటూ జేపీ సవాలు విసిరారు. ‘గుంటూరు సభలో నాకేమన్నా అయితే లేవండి.. లేవండి’ అంటూ ప్రజల్ని పదే పదే రెచ్చగొట్టేందుకు యత్నించారు. ఇప్పటికే ప్రాంతీయ విద్వేషాలతో నలిగిపోతున్న ప్రజలకు నచ్చజెప్పాలే తప్ప, రెచ్చగొట్టే యత్నం సరైన నేతల లక్షణం కాదు’ అంటూ తూర్పారపట్టారు. రాష్ట్రం దివాలా స్థితిలో ఉందని పదే పదే చెబుతున్న మీరు నిజంగా అలా ఉంటే ఓ ఎమ్మెల్యే ఓటుకి రూ. 5 కోట్లు ఎలా ఇవ్వగలుగుతున్నారని నిలదీశారు. తెలుగునాట డబ్బు రాజకీయాల్ని తెచ్చింది చంద్రబాబేనని చెప్పారు. పోలీసులు, చట్టం తమ గుప్పెట్లో ఉందనే ధోరణిలో చెబుతూ అధికారం రాజరికంతో సమానమనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 15 ఏళ్లల్లో ఎన్నడూలేనిరీతిలో దివంగత సీఎం ఎన్టీఆర్ ప్రస్తావనను నిన్ననే ఎందుకు తెచ్చారని సూటిగా ప్రశ్నించారు. ఎన్టీఆర్ తీరుకు, ప్రమాణాలకు, చంద్రబాబు తీరుకు, ప్రమాణాలకు చాలా వ్యత్యాసముందన్నారు. అన్నా హజారేకి వారసుడినని చెప్పుకునే చంద్రబాబు ఆ ప్రమాణాల్ని పాటిస్తారా? అని ప్రశ్నించారు. ఈ కేసును లోక్‌పాల్ పర్యవేక్షణలో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పలు ప్రశ్నలను సంధిస్తూ... వాటికి సూటిగా జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ♦ మీ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటు కొనుగోలుకు ప్రయత్నించాడా.. లేదా? మీ అనుమతి, ప్రేరణ లేకుండా పార్టీకి ఒక ఎమ్మెల్సీని ఇవ్వడం కోసం ఒక్క ఓటుకి రూ. 5 కోట్లు ఆ ఎమ్మెల్యే ఇస్తారా? ♦ మీకు తెలియకుండా మీ ఎమ్మెల్యే కొనుగోలు చేసి ఉంటే మరి ఎందుకు ఆయనపై చర్య తీసుకోలేదు? మీ అనుమతి లేకుండా అంత డబ్బుని ఇచ్చినా, పార్టీ భవిష్యత్‌ను దెబ్బతీసినా ఎందుకు చర్య తీసుకోలేదు? ♦ కొన్నాళ్ల కిత్రం బంగారు లక్ష్మణ్ వంటి మంచి మనిషి ఒక జాతీయ పార్టీ కోసం లక్ష రూపాయలు చెక్కు లేకుండా విరాళం తీసుకున్నందుకు ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అలాంటిది రూ. 5 కోట్లు ఇస్తే చర్య తీసుకోకుండా ఎలా ఉంటారు? రాజకీయమంటే ఇలాగే ఉంటుందంటారా? ♦ మీ ఆడియో టేపు.. అది ఫోన్ ట్యాపింగా, రికార్డింగా, స్ట్రింగా కాదా అనేది కోర్టులు తేలుస్తాయి. గొంతు నాది కాదు.. వేర్వేరు చోట్ల మాట్లాడిన మాటల్ని అతికించారు అని చెప్పిస్తున్నారు. ఒక క్రిమినల్ కేసులో శిక్ష వేసేందుకు వాటిని కోర్టులు పరిశీలిస్తాయి. క్రిమినల్‌కు పాటించే ప్రమాణాల స్థాయికి మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటున్నారా? -
ఆ గొంతు మీదని తేలితే రాజీనామాకు సిద్ధమా?
-
ఓ కానిస్టేబుల్ కేంద్రమంత్రిని ఆపడమా?
ఒక్కటి మాత్రం తెలుసు. లార్కా వంటి పది మంది ధైర్యశాలురు- జీవితంలో మనం ఎంత రాజీపడి సరిపెట్టుకుంటున్నామో హెచ్చరిస్తుంటారు. ఈ దేశంలో బోలెడంత అవినీతి ఉంది. అధికార దుర్విని యోగం ఉంది. అంతకుమిం చి తనేంచేసినా చెల్లిపోతుంద నే అహంకారం నాయకత్వంలో ఉంది. ఇదంతా ఈ దేశాని కి పట్టిన చీడ. కాని మరీ ప్రమాదకరమైనది ప్రజల అలసత్వం. ‘‘మనకెందుకులే!’’ అనే మనస్తత్వం. ‘‘వాళ్లేం చేసినా చెల్లిపోతుంది. అధికారం వారి చేతుల్లో ఉంది’’ అనుకునే, అనే నిస్త్రాణ. ఇది లేని కారణానికే ఈ జాతి ఒకరిని మహాత్ముడన్నది. మరొకరిని లోకమాన్యుడన్నది. ఒక విలువకు కట్టుబడే నియతి అది. రెండు ఉదాహరణలు. మొన్న పాట్నా జయప్రకాష్ నారాయణ్ విమానాశ్రయం నిష్ర్కమణ ద్వారం దగ్గర ఇరవయ్యో పడిలో ఉన్న పారిశ్రామిక రక్షణశాఖ కాని స్టేబుల్ నిలబడి ఉంది. ఈ అమ్మాయి జార్ఖండ్‌కి చెందిన హవల్దార్ శశి లార్కా. ఆ రోజు ఢిల్లీ నుంచి వస్తున్న బండారు దత్తాత్రేయ గారికి స్వాగతం చెప్పడానికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాంకృపాల్ యాదవ్ తన వందిమాగధులతో నిష్ర్కమణ ద్వారం గుండా హడావుడిగా వెళ్లబోయాడు. లార్కా ఆయన్ని ఆపింది. ఇది బయటికి వెళ్లే మార్గమని చెప్పింది. కాస్సేపు మాటా మాటా పెరిగింది. ఒక కానిస్టేబుల్ కేంద్రమంత్రిని ఆపడమా? లార్కా తన సీనియర్లతో మాట్లాడింది. ఏమయినా మంత్రిగారిని, పరివారాన్ని విడిచిపెట్టలేదు. తెలివైన మంత్రి వెనక్కు వెళ్లి - ప్రవేశ ద్వారం గుండా లోపలికి వెళ్లాడు. ఇంతే కథ. మరొక కథ. 1959లో నేను ఆంధ్ర విశ్వవిద్యాలయం తరఫున ఢిల్లీ యూత్ ఫెస్టివల్‌కి వెళ్లాను. 39 విశ్వ విద్యాలయాలు పాల్గొన్నాయి. టలక్టొరా గార్డెన్స్‌లో ఉత్సవాలు. ఉత్సవాలను ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. ప్రవేశ ద్వారం దగ్గర ఎన్సీసీ కేడెట్లు నిలబడి, పాస్‌లు ఉన్న వారిని మాత్రమే ఆవరణలోకి వదిలేవారు. ఒక సాయంకాలం అప్పటి విద్యామంత్రి, నెహ్రూ గారికి అత్యంత సన్నిహితుడు డాక్టర్ వి.కె.ఆర్.వి.రావు గారొచ్చారు. కారుని ఆపి యథాప్రకారంగా పాస్ అడిగాడు ఎన్సీసీ కుర్రాడు. రావుగారికి తిక్కరేగింది. ‘‘నేనెవరో తెలీదా?’’ అని కేకలేశారు. కుర్రాడు అటెన్షన్ లోకి వచ్చి సెల్యూట్ చేశాడు. ‘‘తెలుసు సార్. కాని పాస్ లేనిదే వదలకూడదని నాకిచ్చిన ఆర్డర్’’ అన్నాడు. ఇది సున్నితమైన సమస్య. మాలాంటి కుర్రాళ్లంతా చేరిపోయి వినోదాన్ని చూస్తున్నాం. ఎన్సీసీ కమాండర్ - మరేదో యూనివర్సిటీ ప్రొఫెసర్ - పరిగెత్తుకు వచ్చాడు. రావుగారికి పాస్ లేదు. నిజమే. కాని ఆయన్ని వెళ్లని వ్వాలా వద్దా? కమాండర్‌కి చెమటలు పట్టాయి. ‘‘మీరిచ్చిన ఆర్డరే నేను పాటిస్తున్నాను. వారిని లోనికి వదలాలంటే మీ ఆర్డర్‌ని ఉపసంహరించుకోండి సార్! లేకపోతే నేను తప్పుకుంటాను. మీరు తప్పుచేయండి’’ అన్నాడు కుర్రాడు. కమాండర్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఎదురుగా రావుగారి కారు. చుట్టూ స్టూడెంట్లు. ఎటూ పాలుపోలేదు. చివరికి రావుగారే అగ్గిమీద గుగ్గిలమయి - ‘‘నేను పండిట్జీతో మాట్లాడుతాను’’ అని కారు వెనక్కి తిప్పి వెళ్లిపోయారు. ఆ సాయంకాలం కుర్రాళ్లందరూ ఆ కేడెట్ని పెద్ద వీరుడిలాగ గార్డెన్ అంతా ఊరేగించారు. ఒక సిద్ధాంతానికి కట్టుబడి నడవడానికి బోలెడంత చిత్తశుద్ధి కావాలి. రాం కృపాల్ యాదవ్ తన అధికా రాన్ని ఉపయోగించి ఎదురు తిరగాలనుకుంటే అల్లర యేది. తరువాత లార్కా కథ దుర్గాశక్తి నాగ్‌పాల్ కథ అయేదా, భేమ్కా కథ అయేదా అన్నది వేరే విషయం. ఉద్యోగాన్ని మాత్రమే కాపాడుకునేవాడు నీతికి తిలో దకాలిస్తాడు. నీతిని కాపాడేవాడు అవకాశవాదానికి తిలోదకాలిస్తాడు. వి.కె.ఆర్.వి.రావు గారూ అక్కడే నిలవ దలిస్తే గొడవ జరిగేది. కాని రెండు సందర్భాలలోనూ 20 ఏళ్ల లార్కా, ఆనాటి కేడెట్ చేసిన పని సబబైనది. వారు విధికి కట్టుబడి చేసినది. బస్సులో 85 పైసలు టిక్కెట్టిచ్చి 15 పైసలు మిగుల్చుకునే బస్సు కండక్టరుని ఎంతమంది నిలదీస్తున్నారు? గ్యాస్ సిలెండర్ ఇచ్చే కుర్రాడు 630 రూపాయలు పుచ్చు కుంటాడు. 4 రూపాయలు వాపసు ఇవ్వడు. నిజాయితీకి, కర్తవ్య నిర్వహణకి చిన్నా పెద్దా లేదు. ఈనాటి లార్కా సంఘటన చదివినప్పుడు 55 సంవ త్సరాల కిందటి కుర్రాడి నిజాయితీ, దాని విజయం గుర్తుకొచ్చింది. ఇప్పుడా కుర్రాడూ నా వయస్సు వాడే అయివుం టాడు. ఏ విశ్వవిద్యాలయం నుంచి వచ్చాడో? పేరేమిటో? ఇప్పుడేం చేస్తు న్నాడో? 20 ఏళ్ల వయస్సులో నిలదొక్కు కున్న నిజాయితీ, ధైర్యం జీవితంలో అతన్ని ఏ మార్గం లో నడిపించిందో! ఒక్కటి మాత్రం తెలుసు. లార్కా వంటి పది మంది ధైర్యశాలురు- జీవితంలో మనం ఎంత రాజీపడి సరిపెట్టుకుంటున్నామో హెచ్చరిస్తుంటారు. - గొల్లపూడి మారుతీరావు -
ప్రత్యేక హోదా- నేతల మాటల యుద్ధం!
-
చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి: జెపి
-
'ఎన్నికలు అయిపోయాయి కాబట్టి డ్రామాలు ఆడుతున్నారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం చంద్రబాబును లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలో జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ... చంద్రబాబు సొంతింటి వ్యవహారం కాదన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి ఇచ్చిన లెక్కలు సరైనవా ? కాదా ? అన్నది తేలుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చు నెలకు వడ్డీ కింద లెక్కేసినా రూ. 1900 కోట్లు అవుతుంది. అలాంటిది రూ. 100 కోట్లు ఇచ్చారు. ఈ డబ్బు కూడా ఖర్చు చేయలేదని జేపీ పేర్కొన్నారు. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి డ్రామాలు ఆడుతున్నారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జయప్రకాశ్ నారాయణ నిప్పులు చెరిగారు. ఈ నాలుగేళ్లలో సంవత్సారల్లో పోలవరం పూర్తికావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. -
మాటలు వద్దు.. చేతల్లో చూపండి
అనంతపురం కల్చరల్ : రాష్ట్ర విభజనతో పూర్తిగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏం చేస్తారన్నది మాటల్లో కాదని చేతల్లో చూపాలని లోకసత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ్ పేర్కొన్నారు. ‘తెలుగు భవిత’ పేరిట నిరశన దీక్షను మంగళవారం స్థానిక సప్తగిరి సర్కిల్ వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటిలా ఉందని, తెలుగు రాష్ట్రాల పట్ల వారికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఖజానా ఖాళీ అయిందని అభివృద్ధి పనులకు నిధులు లేవని చెప్పడం సత్యదూరంగా ఉందన్నారు. నిజానిజాలను శ్వేత పత్రంద్వారా ప్రజలకు వెళ్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ బూటకమని ఒప్పుకోవాలన్నారు. రాష్ట్రంలో చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు, నానాటికి పెరిగిపోతున్న నిరుద్యోగం దేశంలోనే అత్యధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత ఉండాలంటే పరిశ్రమలు రావాలని, కానీ ఇక్కడ కరెంటు ఎప్పుడిస్తారో...ఎప్పుడు తీస్తారో తెలియదని ఎద్దేవా చేశారు. పాలకులకు సమగ్ర అవగాహన లేకపోవడం వల్లే అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శించారు. రాయలసీమకు రావాల్సిన నీటి పంపకాల గురించి స్పష్టత తీసుకురాకపోతే భవిష్యత్తు తరాలు కష్టాలలో మునిగిపోతాయన్నారు. దీక్షకు ముందు ఉదయం స్థానిక కెఎస్ఆర్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి చర్చ ద్వారా రాష్ట్ర పరిస్థితులు వివరించారు. భవిష్యత్తులో ఆశాకిరణాలు యువత మాత్రమేనని, సమాజంలో ఏం జరుగుతుందో నిత్యం తెలుసుకోవాలని వారికి సూచించారు. వందలాదిగా తరలి వచ్చిన లోకసత్తా అభిమానులతో దీక్ష శిబిరం కిటకిటలాడింది. పలు ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జేపీకి బాసటగా నిలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా యువ కన్వీనర్ సోమనాథరెడ్డి, విద్యార్థి సత్తా జిల్లా అధ్యక్షులు అమర్‌యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సరస్వతీ, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర పాల్గొన్నారు. -
లోక్ సత్తా పార్టీలో వర్గ పోరు?
-
లోక్ సత్తా పార్టీలో వర్గ పోరు?
హైదరాబాద్:లోక్ సత్తా పార్టీలో మరోసారి విభేదాలు చోటు చేసుకున్నాయి. గతంలో చోటు చేసుకున్న వర్గ పోరు ఈసారి తారాస్థాయికి చేరింది. లోక్ సత్తా పార్టీ.. తమదంటే తమదని శ్రీవాత్సవ వర్గం వాదిస్తుండగా.. పార్టీకి విధివిధినాలను రూపొందించింది తామని కఠారి శ్రీనివాస్, వర్మ వర్గం అంటోంది. అసలు శ్రీవాత్సవ వర్గం పార్టీ నియమాలను ఉల్లంఘించదని ఆ పార్టీ అధ్యక్షుడు కఠారి శ్రీనివాస్ తెలిపారు. పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ ను ఆ వర్గం మబ్బుల్లో ఉంచుతున్నారని ఆయన విమర్శించారు. ఈనేపథ్యంలో జేపీ ఎటువైపు ఉన్నారో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని కఠారి తెలిపారు. -
నేడు విశాఖలో లోక్‌సత్తా రౌండ్‌టేబుల్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: పౌర సేవల హక్కు చట్టం కోసం లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ప్రజా ఉద్యమంలో భాగంగా ఆదివారం విశాఖపట్నంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. లోక్‌సత్తా కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. -
ఎమర్జెన్సీ విధింపు దుస్సాహసం: ప్రణబ్
నాటి పరిస్థితులపై పుస్తకంలో రాష్ట్రపతి ఇందిర చర్య నివారించదగ్గది ఆమె భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది న్యూఢిల్లీ: దేశంలో 1975-77 మధ్య నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని అప్పటి ఇందిర కేబినెట్లో సహాయ మంత్రి, ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తప్పుబట్టారు. ఈ చర్యను దుస్సాహసంగా, నివారించదగ్గ సంఘటనగా ప్రణబ్ అభివర్ణించారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజల ప్రాథమిక హక్కులు, ఎన్నికలు రద్దు కావడం, మూకుమ్మడి అరెస్టులు, మీడియాపై నిషేధం వంటి చర్యలు ప్రజలను తీవ్రంగా వేధించాయన్నారు. ఇందుకుగానూ తర్వాతి కాలంలో ఇందిర భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో చీకటి పాలనగా సాగిన ఎమర్జెన్సీపై రాష్ట్రపతి తన మనోభావాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘ద డ్రమాటిక్ డికేడ్: ద ఇందిరా గాంధీ ఇయర్స్’ పేరిట రాసిన ఈ పుస్తకం గురువారం ప్రణబ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. 321 పేజీల ఈ పుస్తకంలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం, నాటి ప్రతిపక్ష నేత జయప్రకాశ్ నారాయణ్ ఎదురుదాడి వైఖరి, 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, కాంగ్రెస్‌లో చీలిక, 1980లో పార్టీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడం వంటి పరిణామాలను ప్రణబ్ ప్రస్తావించారు. సూచన మేరకే విధింపు... నాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యుడైన సిద్ధార్థ శంకర్ రే సూచన మేరకే ఇందిర 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించారని ప్రణబ్ పేర్కొన్నారు. దేశంలో అంతర్గత అల్లర్లను కారణంగా చూపుతూ ఎమర్జెన్సీ ప్రకటించేందుకు వీలు కల్పించే రాజ్యాంగ నిబంధనల గురించి సైతం ఇందిరకు తెలియవ న్నారు. కానీ ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ఆకృత్యాలపై విచారణకు 1977లో ఏర్పాటైన షా కమిషన్ ఎదుట రే సహా ఇతర మంత్రులు, ఉన్నాతాధికారులంతా ఆ నెపాన్ని ఇందిరపై మోపారని ప్రణబ్ గుర్తుచేసుకున్నారు. అలాగే షా కమిషన్ ఎదుట నాటి కేంద్ర హోంమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని ప్రణబ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందిర ఆదేశాల ప్రకారం ఎమర్జెన్సీ విధింపు కోరుతూ బ్రహ్మానందరెడ్డి నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌కు తెల్ల కాగితంపైనే సంతకం చేశారని ప్రణబ్ పేర్కొన్నారు. 79వ ఏట అడుగిడిన రాష్ట్రపతి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం 79వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, త్రివిధ దళాల అధిపతులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధులు, వికలాంగ చిన్నారులతో కలసి ప్రణబ్ వేర్వేరుగా కేక్ కట్ చేశారు. మరోవైపు రాష్ట్రపతి భవన్‌లోని 113 అరుదైన చిత్రాలను ప్రజల కోసం రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్క క్లిక్‌తో రాష్ట్రపతి భవన్‌లోని వింతలు, చారిత్రక విశేషాలను సామాన్య ప్రజలు తెలుసుకునేలా ఈ అవకాశం కల్పించారు. అలాగే రాష్ట్రపతి భవన్లో నివసించే 60 ఏళ్ల వయసు దాటిన వారికి హెల్త్‌కార్డులను పంపిణీ చేశారు. -
పచ్చని బతుకుల్లో చిచ్చు పెడతారా?
ప్రభుత్వ అధీనంలో ఉన్న 1500 ఎకరాలు పోను 28,500 ఎకరాల పచ్చని పంట పొలాల్ని సేకరించాల్సిందే! అయినా, ఇంత భూమి అవసరమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. శాస్త్ర సాంకేతికత పెరిగి, మంత్రివర్గ సమావేశపు ఎజెండాను ఐపాడ్లో చూడ్డం, విశాఖ బాధితులతో హైదరాబాద్‌నుంచి ఇ-పద్దతిన ముఖాముఖి మాట్లాడ్డం చేసే రోజుల్లో రాజధానిని ఎందుకు వికేంద్రీకరించకూడదు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. బహుళ అంతస్తు భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ రాజధానిని ఏ నాలుగైదు వేల ఎకరాలకో పరిమితం చేయొచ్చని జయప్రకాశ్ నారాయణ వంటి నాయకులూ సూచిస్తున్నారు. సమకాలీనం భూమి. అనేక అస్థిత్వాలకు నెలవు. మానవనాగరికత ఆవిర్భావం నుంచి మనిషికి భూమితో విడదీయరాని బంధం. ఉనికికి, ఉపాధికి, ఉత్పత్తికి, ఉన్నతికి.. ఒక్కటేమిటి అన్నిటికి ఆదెరువు భూమే! ఆ భూమిని లాక్కుంటే, తుపానులో తీగనుంచి విడిపడ్డ ఆకులా అల్లాడి పోతాడు సగటు మనిషి. అందుకే, గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం, మందడం గ్రామానికి చెందిన నీరుకొండ చిట్టిబాబు కలవరపాటుతో ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. తొంబై సెంట్ల భూమికి యజమాని. మూడు పంటలు పండిస్తూ ఏడాదికి సగటున లక్ష రూపాయలకు పైగా సంపా దిస్తున్నాడు. దీని ఆధారంగానే ఇద్దరు పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే పిల్లల్నెలా చదివించాలి? కుటుం బాన్ని ఎలా పోషించాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ జరుపుతామంటున్న 17 గ్రామాల్లో చిట్టిబాబు లాంటి కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. భూ సమీకరణ, భూసేకరణ, భూస్వాధీనం... పేరేదైతేనేం, జరిగే దాష్టీకం ఒక్కటే! రైతుల భూముల్ని స్వాధీనపరచుకుంటారు. నష్టపరిహారంగా తృణ మో, పణమో చెల్లించి వారిని నిర్వాసితుల్ని చేస్తారు. రేపెప్పుడో, ఎక్కడో ఎక రాకు వెయ్యిగజాల చొప్పున అభివృద్ధి చేసిన స్థలం ఇస్తామంటారు. వారి కళ్ల ముందే, రాజధాని నిర్మాణం కోసం ప్రకటించిన ప్రాంతానికి చుటు ్టపక్కల భూ ముల విలువ కోట్లరూపాయలు పలుకుతుంది. ఒక పథకం ప్రకారం ఇప్పటికే అక్కడ పెద్దమొత్తం భూములు సేకరించిపెట్టుకున్న బడా బాబులు, పలుకుబడి కలిగిన పెద్దలు, కార్పొరేట్ లాబీయిస్టులు సెంటు భూమి కోల్పోకుండా కోట్లకు పడగలెత్తుతారు. ఆ 17 గ్రామాల్లో భూమి ఉన్నవాళ్ల సంగతి సరే! మరి భూమి లేని నిరుపేదల గతి? ఆ గ్రామాల్లో నివాస ప్రాంతాల జోలికి రాకుండా నివాసే తర ప్రాంతాలతోనే రాజధాని అభివృద్ధి సాధ్యమా? అదే జరిగితే రాజధాని అడ్డ దిడ్డంగా ఉండదా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే! పైగా, భూసమీకరణకు సహకరిస్తారా సరే సరి! లేదంటే భూస్వాధీన చట్టాన్ని వర్తింపజేసి వశపరచుకుం టామని ప్రభుత్వం బెదిరిస్తోంది. నిజంగా అలా చేయగలదా? చట్టప్రకారం వల్లకాదు కనుకే! ఈ ఏడాది మొదట్లో అమల్లోకొచ్చిన భూసేకరణ కొత్త చట్టం ప్రకారమైతే విజ యవాడ పరిసరాల్లో రాజధానికి భూసేకరణ చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. 1894 భూసేకరణ చట్టం గత ఏడాదే మారింది. పలు ప్రతిపాదనలు, సవరణల తర్వాత రూపుదిద్దుకున్న ‘భూసేకరణ, పునరావాస-పరిష్కారంలో న్యాయబద్ధ పరిహారం, పారదర్శకత హక్కు చట్టం-2013’ ప్రకారం ప్రజావస రాలకు ప్రభుత్వం భూసేకరణ జరపాలంటే ఎన్నో నిబంధనల్ని విధిగా పాటిం చాలి. ప్రైవేటు ప్రాజెక్టు అయితే 80 శాతం, పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య) పద్ధతిలో ప్రాజెక్టు అయితే కనీసం 70 శాతం ప్రభావిత కుటుం బాల వారి సమ్మతితోనే భూసేకరణ జరపాలి. ప్రభావిత కుటుంబాల్లో... భూమినో, ఇతర స్థిరాస్తినో కోల్పోయేవాళ్లుంటారు. భూమిలేకున్నా కూలీగానో, కౌలు రైతుగానో, చేతి వృత్తుల వారిగానో సదరు భూమితో ముడివడి జీవనో పాధి కోల్పోయేవాళ్లు, భూసేకరణకు మూడేళ్ల ముందు నుంచి ఏదో విధంగా అక్కడ ఉపాధి పొందుతున్న వాళ్లు... ఇలా పలువురిని ప్రభావిత కుటుంబాల జాబితాలో చేర్చారు. భూసేకరణ వల్ల జరిగే సామాజిక ప్రభావాన్ని, పర్యావ రణ ప్రభావాన్ని నిర్దిష్ట పద్ధతిలో అధ్యయనం జరిపి అందుకనుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. పర్యావరణానికి, మౌలికవసతులకు తక్కువ నష్టం కలిగే ప్రాంతాలే కాకుండా తక్కువమంది నిర్వాసితులయ్యే ప్రాంతాల్నే ఎంపిక చేసు కోవాలి. సాగునీరుండి ఏడాదికి బహుళ పంటలు పండే భూముల్ని మౌలికంగా సేకరించకూడదు. తప్పని పరిస్థితుల్లో సేకరించాల్సి వస్తే నష్టపరిహారం చెల్లిం పునకు మరిన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మార్కెట్ రేటుకు నాలుగింతలు ఎక్కువ ధర చెల్లించాలని చట్ట నిబంధన. భూమి కోల్పోయే వారికే కాకుండా ప్రభావితులయ్యే అందరికీ నష్టపరిహారం వివిధ రూపాల్లో చెల్లించాల్సి ఉంటుం ది. దీనికి తోడు మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రోడ్లు, పోస్టాఫీసులు, డ్రైనేజీ, శ్మశానాలు.. ఇలా అన్నీ నిర్మించి ఇవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ జరిగేవి కావని ప్రభుత్వ పెద్దలకూ తెలుసు. అందుకే భూసేకరణ కాకుం డా, భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) రాగం పట్టింది సర్కారు. ఈ పద్ధతిలో అయితే, భూమికోల్పోయే వారికి నామమాత్రంగా ఏదో ఇచ్చి, ఇతరుల్ని పట్టిం చుకోకుండానే చేతులు దులుపుకోవచ్చన్నది యోచన కావచ్చు. పెద్ద మొత్తంలో భూమి సమీకరించి కొంత మొత్తాన్ని వాణిజ్యపరంగా వాడి డబ్బు గడించ వచ్చన్నది మరో దూరాలోచన. జరుగుతున్నదేంటి? తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలోని 17 గ్రామాల్లో రాజధాని నిర్మాణా నికి 30 వేల ఎకరాలు, అదీ తొలివిడత కింద సేకరించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. దానికి ప్రాతిపదిక ఏంటో, ఏయే అంశాల ఆధారంగా ఆ నిర్ణయానికి వచ్చారో, వీటినే ఎందుకు ఎంచుకొని ఇతర ప్రాంతాల్ని ఎందుకు కాదన్నారో... ఎవరికీ తెలియదు. ఈ విషయంలో పారదర్శకత లేనే లేదు. శాసనసభలో చర్చించలేదు, అఖిలపక్షం నిర్వహించలేదు, ప్రజాభిప్రాయ సేకరణా చేయ లేదు, రాజధాని ఎక్కడో ప్రతిపాదించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ తుదినివేదిక వచ్చే వరకైనా కనీసం నిరీక్షించలేదు. ప్రభుత్వ నిర్ణయానికి రోజు రోజుకూ వ్యతిరేకత, ముఖ్యంగా రైతులు, గ్రామీణ ప్రజల్లో వ్యక్తమౌ తోంది. తమ శవాలపైనే రాజధాని నిర్మాణం జరగాలంటున్నారు. ఏడాదికి మూడు, కొన్ని చోట్ల నాలుగు పంటలు పండే ఈ భూముల్నే ఎందుకు ఎంపిక చేశారు? అన్న ప్రశ్నకు విస్పష్టంగా సమాధానం లేదు. ప్రభుత్వ అధీనంలో ఉన్న 1,500 ఎకరాలు పోను 28,500 ఎకరాల పచ్చని పంట పొలాల్ని సేకరించా ల్సిందే! అయినా, ఇంత భూమి అవసరమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. శాస్త్ర సాంకేతికత పెరిగి, మంత్రివర్గ సమావేశపు ఎజెండాను ఐపాడ్లో చూడ్డం, విశాఖ బాధితులతో హైదరాబాద్ నుంచి ఇ-పద్ధతిన ముఖాముఖి మాట్లాడ్డం చేసే రోజుల్లో రాజధానిని ఎందుకు వికేంద్రీకరించకూడదు అని కొందరు ప్రశ్ని స్తున్నారు. బహుళ అంతస్తు భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటుచేస్తూ రాజధా నిని ఏ నాలుగైదు వేల ఎకరాలకో పరిమితం చేయొచ్చని జయప్రకాశ్ నారా యణ వంటి నాయకులూ సూచిస్తున్నారు. విస్తీర్ణం అడ్డగోలుగా పెంచి, కార్యా లయాలకు కొంత, భూయజమానులకు కొంత, కమర్షియల్‌కు మరి కొంత అని వాటాలు నిర్ణయించడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. జీవకళ లేని ప్రకాశం మెట్ట భూములు, వర్షపాతం లేక ఎడారవుతున్న అనంతపురం భూములు... ఇలా తొండలు గుడ్లు పెట్టని భూముల్ని లక్షల రూపాయలు ప్రైవేటు వారితో కట్టించి పరిశ్రమల కోసం సేకరిస్తే రాజకీయంగా విమర్శలు చేసిన వారు పంట పొలాల్లో మంటలెలా పెడుతున్నారనే ప్రశ్నకు జవాబు లేదు. జరగబోయేదేంటి? ఎంపిక చేసిన 17 గ్రామాల్లో 21 వేల రైతు కుటుంబాలున్నాయి. రెండెకరాల లోపు భూములున్న రైతు కుటుంబాలు 15 వేల పైమాటే! ఇక రైతులంతా భూములు కోల్పోయి వెయ్యి, రెండు వేల గజాల స్థలాలకు మాత్రం ఎప్పుడో హక్కుదారులవుతారు. ఈలోపు ఎకరాకు ఏడాదికి పాతికవేల చొప్పున పదేళ్లు నష్టపరిహారం లభిస్తుంది. నమ్ముకున్న భూమికి ఒక్కసారి దూరమరయ్యాక పరిహారం ఫలహారమౌతుంది, ప్రాజెక్టుల కింద ఊళ్లకు ఊళ్లు భూములు కోల్పోయి నిర్వాసితులైన వారిలో, ఎంత నష్టపరిహారం లభించినా 80 శాతం పైగా కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. తరాల తరబడి అనుబంధం ఉన్న భూమిని కోల్పోవాల్సి వస్తోందని తెలిసిన నుంచే మానసిక పతనం మొదలవుతుంది. నక్సల్బరీ ఉద్యమం నుంచి ఈ దేశంలో భూమి కోసం మహోజ్వల పోరాటాలే సాగాయి. పాలకుల్ని నేలకు దించిన నందిగ్రామ్, సింగూర్ మన కళ్లముందరి భూపోరాటాలు. రాజధాని రగడలో భూమిగల వారి భుక్తికే ఇన్ని కష్టాలొచ్చాయి, ఇక భూముల్లేని చిన్న వ్యాపారులు, నిరుపేద బడుగుజీవులు, చేతి వృత్తులవాళ్లు, దినకూలీల బతుకు అగమ్యగోచరమే! రాజ్యమెప్పుడూ బలమైందే! శీర్షాన ఉండే వారి కీర్తికాంక్షకు వాణిజ్య వైఖరి తోడైనప్పుడు సామాన్యజనం కంటికానరు. వారి జీవితాల్ని పునాదిరాళ్లు చేసి ‘అభివృద్ధి’సౌధాలు కట్టే కార్పొరేట్ శక్తులు ఆవహించినపుడు ఇక అడ్డూ, అదుపూ ఉండదు. కడకది ఎక్కడికి దారితీస్తుందంటే, ప్రజా ఉద్యమాలకు పురిటినొప్పులు పుట్టిస్తుంది. -
జేపీకి ప్రధాని మోదీ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నందుకుగాను లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మోదీ ట్విట్టర్ ద్వారా జేపీకి అభినందనలు తెలిపినట్టు లోక్‌సత్తా పార్టీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
చంద్రులిద్దరూ చుక్కలు చూపిస్తున్నారు
ఇరు సీఎంలపై జేపీ ఫైర్ హైదరాబాద్: ఓటేసిన పాపానికి ఇద్దరు చంద్రులు ఇరు రాష్ట్రాల్లో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన లోక్‌సత్తా తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రథమ మహాసభ, లోక్‌సత్తా ఎనిమిదో వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఇరు రాష్ట్రాలు శ్రీశైలం విద్యుత్‌పై రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని జేపీ మండిపడ్డారు. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు రామ్మోహన్రావు మాట్లాడుతూ తెలంగాణలో లోక్‌సత్తా ప్రజలకు మరింత దగ్గరై గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుతుందన్నారు. ఈ సభలో లోక్‌సత్తా నాయకులు శ్రీనివాసరెడ్డి, రవిమారుతి, గజాన న్, సరోజాదేవి తదితరులు పాల్గొన్నారు. -
లోక్‌సత్తా.. వైఫల్యానికి నాదే బాధ్యత: జేపీ
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణల్లో లోక్‌సత్తా పార్టీ వైఫల్యానికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తనదే పూర్తి బాధ్యతని జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఆది వారం పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఏర్పాటైన తర్వాత అనేక మైలురాళ్లు సాధించామని, వచ్చేనెల 14, 15 తేదీల్లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో మరిన్ని కీలక అంశాలపై చర్చిస్తామని చెప్పారు. మోడీ, చంద్రబాబు, కేసీఆర్‌ల విజయాన్ని అభినందించారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై దృష్టి సారించాలని కోరారు. -
నేటినుంచి సీమాంధ్రలో జేపీ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఇక సీమాంధ్ర జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. గురువారం నుంచి ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారం ప్రారంభిస్తారని పేర్కొంది. గురువారం శ్రీకాకుళం, కాకినాడలో, 2న విజయవాడలో, 3న గుంటూరు, ఒంగోలులో, 4న నెల్లూరు, తిరుపతిలో, 5న నంద్యాల, కర్నూలులో ప్రచారం చేస్తారని తెలిపింది. లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ డీవీవీఎస్ వర్మలు కూడా వివిధ జిల్లాల్లో రోడ్‌షోల ద్వారా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని ఆ ప్రకటనలో తెలియజేశారు. -
జెపి ఆశలకు 'చంద్ర' గ్రహణం
అటు మోడీ, ఇటు పవన్ కళ్యాణ్ లను ఉపయోగించుకుని మల్కాజ్ గిరి ఎంపీ ఎన్నికల్లో గట్టెక్కుదామన్న లోకసత్తా జయప్రకాశ్ నారాయణ్ ప్లాన్ బెడిసి కొట్టింది. అటు మోడీ, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ జేపీకి ముందు ఊరించి, తరువాత మొండి చేయి చూపించారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని జేపీ మంగళవారం విమానాశ్రయం లోనే కలుసుకుని మరీ జేపీ మద్దతు కోరారు. నరేంద్ర మోడీ సానుభూతితో విన్నారు. సానుకూలంగా స్పందించారు. కానీ సాయంత్రం సభలో మాత్రం టీడీపీ అభ్యర్థికే మద్దతు ప్రకటించారు. అయితే పవన్ కల్యాణ్ మద్దతు ఎలాగో తనకే ఉంటుందని జెపి భావించారు. పవన్ కల్యాణ్ తనకు అనుకూలంగా ప్రచారం చేస్తానని కూడా ప్రకటించారు. దీంతో జేపీకి ఆశలు చావలేదు. పవన్ మాట తప్పడని కూడా జేపీ భావించారు. దీంతో కంగారుపడిన చంద్రబాబు బుధవారం హుటాహుటిన పవన్ కళ్యాణ్ ఇంటికి పిలవని పేరంటంగా వెళ్లారు. పవనతో చర్చించి, ఆయన్ని ఒప్పించారు. రాజకీయాలను త్వరగానే ఒంటపట్టించుకుంటున్న పవన్ కల్యాణ్ జేపీ అంటే వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నా తాను పొత్తును గౌరవిస్తానని ప్రకటించారు. చంద్రబాబు పిలవని పేరంటం పాలిటిక్స్ ఫలించాయి. జేపీ ఆశలకు 'చంద్ర' గ్రహణం పట్టింది. -
మోడీకి లోక్‌సత్తా మద్దతిస్తుంది: జేపీ
హైదరాబాద్: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి లోక్‌సత్తా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ చెప్పారు. మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో మోడీని కలసి కాసేపు మంతనాలు జరిపారు. అనంతరం జేపీ మీడియాతో మాట్లాడుతూ... దేశాన్ని నరేంద్రమోడీ మంచి మార్గంలో నడిపిస్తారని భావించి ఆయనకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. లోక్‌సత్తా పార్టీ కోరుకున్న నాలుగు అంశాలు.. ఆర్థికాభివృద్ధి, ఏడాదికి కోటి ఉద్యోగాలు, సుపరిపాలన, ఇండియా నంబర్-1 వంటివి మోడీలో ఉన్నాయన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం విషయుంలో పవన్ కల్యాణ్ తనకు బహిరంగ మద్దతు తెలపడమే కాకుండా తర్వలో ప్రచారం చేయనున్నారని తెలిపారు. ఆందోళనలో టీడీపీ అభ్యర్థి వుల్లారెడ్డి.. వుల్కాజిగిరి నుంచి పోటీచేస్తున్న లోక్‌సత్తా అభ్యర్థి జయుప్రకాష్ నారాయుణ్ బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని కలిసి వుద్దతు కోరడంతో ఇక్కడి టీడీపీ అభ్యర్థి వుల్లారెడ్డి పరిస్థితి అగవ్యుగోచరంగా వూరింది. మిత్రపక్షమైన బీజేపీ తనకు కాకుండా జేపీకి వుద్దతిస్తుందేమోనని ఆయన వుథనపడుతున్నారు. చంద్రబాబు కూడా ఒకవైపు తన సావూజికవర్గానికి చెందిన జేపీ కోసం, వురోవైపు మోడీ, పవన్‌లను ప్రసన్నం చేసుకునేందుకు తనను బలిచేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. -
బాబు చెయ్యి పట్టుకుంటే మసే
చంద్రబాబు ఎవరి చెయ్యి పట్టుకుంటే వాళ్లు మసేనన్న విషయం మరోసారి రుజువవుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లే పెట్టుకుని, వాళ్లకు ఎలాంటి స్థానాలు కేటాయించారో చూస్తే మొత్తం విషయం తెలిసిపోతుంది. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా కేడర్ బలమే లేని రాజమండ్రి, రాజోలు నియోజకవర్గాలను బీజేపీకి చంద్రన్న చాలా ఉదారంగా కేటాయించేశారు. దీంతో అసలు అక్కడెలా పోటీ చేయాలో తెలియక కమలనాథులు తల పట్టుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నట్లు ప్రకటించిన లోక్ సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ ఇప్పుడు ఎందుకొచ్చిందిరా నాయనా అని తల కొట్టుకుంటున్నారు. మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించిన జేపీ.. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా మల్లారెడ్డిని ప్రకటించడంతో కంగుతిన్నారు. ఎలాగోలా చంద్రబాబును ఒప్పించి, మల్లారెడ్డిని బరినుంచి తప్పించాలని బీజేపీ అగ్రనాయకులను జేపీ బతిమాలినట్లు సమాచారం. బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, పొత్తుల విషయం చూసిన సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ ఈ విషయంలో చంద్రబాబుకు ఫోన్ చేసి జేపీ సంగతి కాస్త చూడమన్నారట. అయితే, ఇప్పటికే మల్కాజిగిరి అభ్యర్థి మల్లారెడ్డి నుంచి పార్టీ ఫండ్, ఇతర రూపాల్లో సొమ్ములు నొక్కేసిన పచ్చ నాయకులు మాత్రం ఈ విషయంలో నోరు విప్పట్లేదు. అయితే, బాబు మాత్రం ముందుగానే బీజేపీ తమకు ఈ సీటు ఇచ్చేసింది కాబట్టి మీరే నామినేషన్ ఉపసంహరించుకోవాలని జేపీని కోరారట! -
లోక్‌సత్తాకు అధికారమిస్తే మార్పు చూపిస్తాం:జేపీ
-
అవినీతి వల్లే వెనుకబాటు
యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి మహిళా నాయకత్వం అవసరం లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ {పత్యేక నిధులకు డిమాండ్ విశాఖపట్నం, న్యూస్‌లైన్: అవినీ తి, సరైన నాయకత్వం లేకపోవడం వల్లే ఉత్తరాంధ్ర వెనుకబడి పోయిందని లోక్‌సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్‌నారాయణ్ అన్నారు. మర్రిపాలెం శారదాగార్డెన్స్లో శనివారం సా యంత్రం నిర్వహించిన శంఖారావంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉం దని చె ప్పారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాధ్ర నుంచి బాబ్జీ, వేణుగోపాల్ వంటి నాయకులను అసెంబ్లీకి పంపించాలని కోరారు. దేశంలో మహిళాభ్యున్నతి సాధించాలంటే మహిళా నాయకత్వం అవసరమన్నారు. రాజకీయాల్లో యువతకు సముచిత స్థానం కల్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. మంచి నాయకులను ఎన్నుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖ ఉత్తరనియోజకవర్గ అభ్యర్థి, పార్టీ ఉపాధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ ఉత్తరాంధ్రను ఏళ్ల తరబడి దోచుకుంటున్నారని ఆరోపించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి వేణుగోపాల్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో లోకసత్తా సత్తా చాటుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలరావు, యువ సత్తా, మహిళా సత్తా ప్రతినిధులు పాల్గొన్నారు. -
బతుకు భయాన్ని పోగొడ్తా.. భరోసా ఇస్తా..
ఖమ్మం, న్యూస్‌లైన్:పుట్టిన బిడ్డకు సరైన చదువు లేక.. యువతకు ఉపాధి లేక దేశంలో ప్రజలు అనుక్షణం భయం భయంగా బతుకు బండిని ఈడుస్తున్నారని, తమ పార్టీకి అవకాశం కల్పిస్తే ఆ భయాన్ని పోగొడ్తానని, భరోసా ఇస్తానని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ అన్నారు. శనివారం ఖమ్మంనగరంలో నిర్వహించిన ‘లోక్‌సత్తా శంఖారావం’ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఒక్క స్థానంతో అసెంబ్లీలోకి ప్రవేశించిన తమ పార్టీ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు మూలస్తంభంగా మారిందన్నారు. పంటల ఎగుమతులు, సహకార రంగానికి స్వయం ప్రతిపత్తి కల్పన, మారుమూల ప్రాంతాల్లో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు వంటి చట్టాల తీసుకురావడంతో కీలక భూమిక పోషిం చిందని అన్నారు. రాష్ట్రంలో 70లక్షల మందికి పైగా మద్యానికి బానిసలుగా మారి కుటుం బాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అవకాశం ఇస్తే అద్భుతాలు చేస్తానని, రాష్ట్రంలో మద్యం దుకాణాలు లేకుండా చేస్తామని అన్నారు. బెల్ట్‌షాపులు, కాపుసారాను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకొస్తామని చెప్పారు. అదేవిధంగా మద్యానికి బానిసలుగా మారిన వారికి డీ-ఎడిషన్ చికిత్సను ఉచితంగా చేస్తామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా కుటుంబ రాజకీయాలు పోవడం లేదని అన్నారు. ఐదవ తరం నాయకుడు ప్రధాని పదవికోసం చూస్తున్నాడని రాహుల్‌గాంధీని విమర్శించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఎన్టీ రామారావు టీడీపీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు కుటుంబ రాజకీయాలకోసం తహతహలాడుతున్నాడని విమర్శిం చారు. మాటలు, మంత్రాలు కాకుండా రాష్ట్రం లో పుట్టిన ప్రతీ బిడ్డకు కలెక్టర్ కొడుకుతో సమానంగా చదివే విద్యావకాశాలు, యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని అప్పుడే పేదరికం సమసిపోతుందని అన్నారు. విద్యుత్ కొరతను నివారించేందుకు మోడల్‌గా సబ్‌స్టేషన్‌ను తీసుకొని చూపించామని, దీనిని మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోగా, అమలు చేసిన గుజరాత్ దేశంలో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. పాల ఉత్పత్తుల్లో అద్భుతాలు సృష్టించిన కురియన్ నాయకు స్పూర్తి ప్రధాత అని కొనియాడారు. మహిళలపై దాడులు పెరగడం విచారకరం అన్నారు. అయితే వాటిని నివారించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. ఆకతాయిలకు ఒకటి రెండు రోజుల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, మానసిక పరివర్తన వచ్చే విధంగా శిక్షలు ఉం డాలని అన్నారు. రైతులు పండించిన పంటల కు గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతుంటే ఉత్పత్తుల ఎగుమతులను పెంచాలని ప్రభుత్వానికి సూచించానని, దీంతో రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని అన్నారు. ఖమ్మం నియోజకవర్గం లోక్‌సత్తా పార్టీ అభ్యర్థి రవిమారుత్ మాట్లాడుతూ నోట్లతో ఓట్లను కొనుగోలు చేసి సంస్కృతికి చరమగీతం పాడాలంటే లోక్‌సత్తాకు ఓటు వేయాలని అన్నారు. ఈ బహిరంగసభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కటారు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాయకులు భద్రునాయక్ పాల్గొన్నారు. -
జెపి సమావేశాన్ని అడ్డుకున్న టి అడ్వకేట్ల జెఎసి
-
ఆమ్ ఆద్మీ పార్టీతో మాకు పొసగదు: జేపీ
సాక్షి, హైదరాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేసేందుకు ఢిల్లీ వెళ్లి సీఎం అరవింద్ క్రేజీవాల్‌తో చర్చలు జరిపిన లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఇప్పుడు అదే పార్టీని చిన్న పిల్లల రాజకీయంతో పోల్చారు. జేపీ శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘చిన్న పిల్లల రాజకీయం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీతో మాకు పొసగదు’ అని పేర్కొన్నారు. ఆ పార్టీ తీరు మార్చుకోకపోతే ప్రజలకు మేలు చేయలేదన్నారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన రాష్ట్ర విభజన బిల్లు తెలుగు ప్రజల భవిష్యత్తును ఏ మాత్రం కాపాడలేదని చెప్పారు. ఇంత ఆధ్వానంగా బిల్లును తయారు చేయబట్టే.. కనీసం ఏ అంశాన్ని ఎందుకు చేర్చారో చెబుతూ వివరణ ఇచ్చే సాహసం కూడా కేంద్రం చేయలేకపోయిందన్నారు. బిల్లులో ఐదు కీలక మార్పుల కోసం రాష్ర్ట ఎంపీలతోపాటు బీజేపీ గట్టి బాధ్యత తీసుకొని పనిచేయాలని కోరారు. తాను మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించేందుకు నిరాకరించారు. -
తప్పుడు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారా!
హైదరాబాద్ : కేంద్ర కేబినెట్ ఆమోదించిన తెలంగాణ బిల్లుపై లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పుడు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం దేశానికి మంచిది కాదని ఆయన అన్నారు. జయప్రకాష్ నారాయణ శనివారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బిల్లుపై తాము ఏడు నిర్థిష్ట సవరణలు ఇస్తే... వాటిలో రెండు మాత్రమే చేర్చారన్నారు. పోలవరం ముంపు ప్రాంత గ్రామాలను సీమాంధ్రలోనే ఉంచటాన్ని పెద్ద ఘనకార్యం చేసినట్లు చెప్పుకోవటం సరికాదన్నారు. తాము చూపించిన మౌలిక ప్రాతిపదికలకు రిక్త హస్తం చూపించారని జేపీ అన్నారు. ఇరు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం అన్నింటికీ మాటలతోనే సరిపెడుతోంది తప్ప.... చేతల్లో శూన్యమని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం ప్రాంత ప్రజలు తెలంగాణలోనే ఉండాలని కోరుకుంటున్నారని, అనంతపురం, కర్నూలు పంచాయతీలు కూడా తెలంగాణలో ఉంటాయంటున్నాయని జేపీ గుర్తు చేశారు. -
జేపీ వ్యాఖ్యలు విడ్డూరం
బెంగళూరు, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ(జేపీ) మాటలు విడ్డూరంగా ఉన్నాయని, సీమాంధ్రుల మనోభావాలకు ఆయన తూట్లు పొడుస్తున్నారని కర్ణాటక తెలుగు ప్రజా సమితి(కేటీపీఎస్) అధ్యక్షుడు బొందు రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీబిల్లుపై చర్చ సందర్భంగా జేపీ మాట్లాడిన తీరును ఆయన తప్పుబట్టారు. అసెంబ్లీలో టీ బిల్లుపై చర్చ అనవసరమని, దానిని వెనక్కు పంపాలని ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పడే తెలంగాణ వాసులు ప్రశాంత జీవనం గడుపుతారని అన్నారు. హైదరాబాద్‌లో ఉండేందుకు తెలుగువారికే స్థానం లేకపోతే ఇక పొరుగు రాష్ట్రాల వారి పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో ఊహించలేమని అన్నారు. రాష్ర్ట విభజన అనంతరం ఛత్తీస్గడ్ నేటికీ అభివృద్ధికి నోచుకోలేకపోయిందని గుర్తు చేసారు. ఇదే పరిస్థితి సీమాంధ్రలోనూ తలెత్తకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణను కోరుకుంటున్నది శ్రీమంతులు, దొరలు మాత్రమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అత్యధికులు తెలంగాణ ఏర్పాటుకు అనుమతిస్తే అలాగే విభజన చేయాలని సూచించారు. సమావేశంలో కేటీపీఎస్ నాయకులు బాబు రాజేంద్ర కుమార్, శివకుమార్, అంబరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కులాధిపత్యం కోసమే జేపీ పాకులాట: టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: సొంత సామాజికవర్గ రాజకీయ, ఆర్థిక అధిపత్యం కోసమే లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ పాకులాడుతున్నారని టీఆర్ఎస్ అధికారప్రతినిధి శ్రవణ్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లుపై నెలకొన్న పరిస్థితులను ప్రజలంతా ఉత్కంఠగా చూస్తుంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ తో రాజకీయ పొత్తుకోసం దుర్మార్గపు ఎత్తులు వేస్తున్న జేపీని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. రాజకీయాల్లో కులం, మతం, నేరం, వ్యాపారం వంటి నాలుగు కీడు చేసే వైరస్లు జేపీకి, లోక్‌సత్తాకు ఉన్నాయని ఆరోపించారు. -
ఆప్‌తో పొత్తు కోసం జేపీ చర్చలు
పరస్పర సహకారంపై కేజ్రీవాల్‌తో సమావేశం 16న స్పష్టతనిస్తాం సాక్షి, న్యూఢి ల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో ఈ నెల 16న మరోమారు చర్చలు జరిపిన తర్వాత పొత్తు విషయమై స్పష్టతనిస్తామని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు. దేశంలోని కుళ్లు రాజకీయాలను ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారనడానికి ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ విజయమే ఉదాహరణని చెప్పారు. ఆయన శనివారం మధ్యాహ్నం గంటపాటు ఢిల్లీ సచివాలయంలో కేజ్రీవాల్‌తో లోక్‌సత్తా పార్టీ ప్రతినిధులతో కలిసి భే టీ అయ్యారు. అనంతరం ఏపీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పాత మిత్రులైన కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ప్రశాంత్ భూషణ్, చేతన్భగత్తో స్నేహపూర్వక చర్చలు జరిపామని తెలిపారు. దేశంలో మంచి మార్పు తేవాలని కోరుకుంటున్న పార్టీలుగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఎలా ముందుకు వెళ్లాలన్నది చర్చించుకున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై ఈనెల 16న జరిగే సమావేశాల్లో స్పష్టత వస్తుందన్నారు. ఆప్లా విజయం సాధించడంలో లోక్‌సత్తా ఎందుకు వెనకబడిందని విలేకరులు ప్రశ్నించగా... అనూహ్య విజయం ఎక్కడో ఒకచోటే వస్తుందన్నారు. అందుకు అనేక స్థానిక పరిస్థితులు కూడా కారణమవుతాయని చెప్పారు. లోక్‌సత్తా ఎనిమిది చట్టాలు, మూడు రాజ్యాంగ సవరణలు తేగలిగినా, ఎన్నికల్లో విజయం సాధించలేకపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. తెలంగాణకు పరిష్కారం మా దగ్గర ఉంది తెలంగాణ ఏర్పాటుపైనా లోక్‌సత్తా పార్టీ ముందునుంచి స్పష్టమైన విధానంతో ఉందని జేపీ తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన ఆ ప్రణాళికను అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడిస్తామని చెప్పారు. ప్రజల ఆకాంక్షకు తగ్గట్టు తెలంగాణ ఏర్పాటు జరగాలే కాని ఢిల్లీ ఆదేశాల మేరకు కాదన్నారు. లోక్‌సత్తాతో పొత్తులపై మాట్లాడుకోలేదు: కేజ్రీవాల్ లోక్‌సత్తాతో పొత్తుల విషయమై చర్చ జరగలేదని కేజ్రీవాల్ శనివారం స్పష్టంచేశారు. లోక్‌సత్తా విలీనం అవకాశాలను కొట్టిపారేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ సొంత బలంపై పోటీ చేస్తుందని, ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోదన్నారు. -
జనవరి 11న కేజ్రివాల్ తో జయప్రకాశ్ సమావేశం!
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను లోకసత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ తన పార్టీ నేతలతో కలిసి జనవరి 11 తేదిన సమావేశం కానున్నారు. దేశంలో రాజకీయేతర ఉద్యమాన్ని పటిష్టం చేయడానికి ఇరుపార్టీలు కలిసి పనిచేసే అవకాశంపై చర్చించనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి తమ పార్టీ వాలింటర్లు కృషి చేశారని, నిధులను కూడా సేకరించి పంపామని జేపీ వెల్లడించారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పి, అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మించేందుకు స్వచ్చమైన రాజకీయాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మానిక్ సర్కార్, మమతా బెనర్జీ, మనోహర్ పరిక్కర్, ఎన్ రంగస్వామి, లాంటి వ్యక్తులందర్ని కలుపుకుపోతే కొద్ది నెలల్లోనే ఢిల్లీ రాజకీయాల్లో మార్పును దేశవ్యాప్తంగా సాధించేందుకు అంత కష్టమేమి కాదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఏపీ సహా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీల్లో లోక్‌సత్తా శాఖలున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంపైనే ఎక్కువ దృష్టి పెడతామన్నారు. కాగా, జబ్బార్, దివాకర్ ట్రావెల్స్‌పై లోక్‌సత్తా మెరుపుదాడులకు దిగుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు చెప్పారు. -
ఇది రాజకీయ నాయకత్వమా... రాక్షసత్వమా?
విభజన సమస్య శాసనసభలో మాత్రమే కాదని, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ఉందని లోక్‌సత్తా పార్టీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన పేరుతో కులం, మతం, ప్రాంతాల వారిగా ఓట్లు రాజకీయం చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.... విభజనపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మండిపడ్డారు. ఇది రాజకీయ నాయకత్వమా... లేక రాక్షసత్వమా అని కేంద్రాన్ని జయప్రకాశ్ నారాయణ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఏ ఒక్క అంశంపైన కూడా రాష్ట్ర మంత్రి వర్గం సమిష్టిగా నిర్ణయాలు తీసుకున్న దాఖల లేదన్నారు. మంత్రివర్గంలోని మంత్రులే ఒకరిపై ఒకరు పరుష పదజాలంతో నిందించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఖననం జరగుతుంది. ఢిల్లీలో జరిగిన రాజకీయ మార్పు ఆంధ్రప్రదేశ్ లో కూడా సంభవిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రజలల్లో ఆగ్రహం పెల్లుబికి ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. -
రాజకీయ లబ్ధికోసమే హడావిడిగా విభజన:జేపీ
హైదరాబాద్:రాజకీయ లబ్దికోసమే హడావిడిగా రాష్ట్ర విభజన చేస్తున్నారని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. ఆదివారం రాష్ట్రపతి కలిసిన ఆయన విభజనపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన బిల్లులోని లోపాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష నేరవేర్చడంతో పాటు సీమాంధ్రలోని ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ రాజ్యాంగపరంగా విభజన చేస్తేనే లోక్‌సత్తా మద్దతు ఇస్తుందని రాష్ట్రపతికి తెలిపామన్నారు. డిసెంబర్ 19వ తేదీ, గురువారం హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రణబ్ ను పలువురు నేతలు కలిసి విభజనపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోరాష్ట్రపతిని కలిసిన జేపీ..రాష్ట్ర విభజన బిల్లులు లోపాలను ప్రణబ్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏ ప్రాంత ప్రజలు నష్టపోకుండా చూడాలని రాష్ట్రపతికి తెలిపారు. -
రాష్ట్ర విభజన అంగీకరించం-జేపీ
-
'అధికారం దక్కదన్న భయంతోనే విభజన'
-
టీ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ పెట్టడం ధర్మం: జేపీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ పెట్టడం ధర్మమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. లేదంటే ఎమ్మెల్యేలందరికీ విడివిడిగా అవకాశమిచ్చి వారి అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు సమర్థిస్తారా.. వ్యతిరేకిస్తారా అన్న ప్రశ్నకు ‘బలవంతంగా చేసే నిర్ణయాన్ని లోక్‌సత్తా పూర్తిగా వ్యతిరేకిస్తుంది’ అని బదులిచ్చారు. -
రాజకీయాలకు కొత్త అర్థం చెప్పాలి’
దేవీచౌక్ (రాజమండ్రి), న్యూస్‌లైన్:నేటి తరం రాజకీయాలకు కొత్త అర్థం చెప్పాలి. నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాలని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ పిలుపునిచ్చారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో బుధవారం రాత్రి జరిగిన ప్రజా చైతన్యభేరి సభలో ఆయన ప్రసంగించారు. ఈ వ్యవస్ధ పతనానికి మనమందరమూ కారకులమే అన్నారు. విషబీజాలు నాటి అమృత ఫలాలు రావాలంటే, ఎలా వస్తాయి? అని ఆయన ప్రశ్నించారు. మన సమస్యలకు మనమే కారకులమైనట్టే, మన సమస్యలకు పరిష్కారాలు కూడా మన చేతిలోనే ఉన్నాయన్నారు. ఢిల్లీ సుల్తానులు, మొగలాయి పాదుషాలు, బ్రిటిష్ వైస్రాయ్‌లు చేయలేని పనిని నేటి పాలకులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికయిన శాసన సభ్యుల మాటకు విలువలేదు, ప్రజాభిప్రాయానికి తావు లేదు. కలిసి ఉండాలో, విడిపోవాలో నిర్ణయించునేది తెలుగు ప్రజలు తప్ప మరెవ్వరు కాదని జేపీ అన్నారు. దేశ ప్రధానితో సహా నాయకులు అందరూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం తెలుగుప్రజల సమస్య మాత్రమే కాదు, రేపు ఇటువంటి సమస్యలు పొరుగురాష్ట్రాలకూ ఎదురు కావచ్చునని ఆయన అన్నారు. పభుత్వ సంస్థలు, ప్రతిష్ఠాత్మకమయిన విద్యాలయాలు, పరిశ్రమలు, వాణిజ్యం అన్నీ హైదరాబాద్ నగరంలోనే ఉండటంతో సమస్య పెద్దదయింది అని అన్నారు. ఆ సంస్థలు రాష్ట్రమంతటా విస్తరించి ఉంటే నేడు ఇంతటి తీవ్ర సంక్షోభం తప్పేదన్నారు. లోక్‌సత్తా ముందునుంచీ అధికార వికేంద్రీకరణ జరుగాలనే కోరుతోందన్నారు. యువత కొత్త వ్యవస్థను తీసుకురావడంలో క్రియాశీలక పాత్రను పోషించాలని జేపీ అన్నారు. జిల్లా అధ్యక్షుడు పీవీవీఎస్ కృష్ణారావు, ఉపాధ్యక్షుడు కిరణ్ బాబు, జాతీయ ఉపాధ్యక్షుడు వై.వి.రామారావు, రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షుడు జె.రవి, నగర అధ్యక్షుడు డాక్టర్ వి.వి. రామారావు తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ దుష్టక్రీడలో జెపి ఓ పావు: కొణతాల
హైదరాబాద్: రాజకీయ దుష్టక్రీడలో లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ ఓ పావుగా మారారని అనిపిస్తోందని వైఎస్ఆర్ సిపి రాజకీయ వ్యవహరాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరాధార ఆరోపణల విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో జేపీ పోటీపడుతున్నారన్నారు. జగన్ బయటకు రావడంతో కొన్ని పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారిస్తే జగన్ త్వరగా నిర్దోషిగా బయటకు వస్తారని కొణతాల చెప్పారు. -
రాజకీయ దుష్టక్రీడలో జెపి ఓ పావు: కొణతాల
-
తెలుగుతేజం యాత్ర వాయిదా వేసుకున్న జేపీ