జయప్రకాష్కు సమైక్యాంధ్ర ఉద్యమ సెగ | united andhra pradesh activists Stops Jayaprakash Narayan | Sakshi
Sakshi News home page

జయప్రకాష్కు సమైక్యాంధ్ర ఉద్యమ సెగ

Published Sat, Sep 14 2013 4:03 PM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM

united andhra pradesh activists Stops Jayaprakash Narayan

లోక్సత్తా పార్టీ నేత జయప్రకాష్ నారాయణ్కు కర్నూలులో సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది.

కర్నూలు: లోక్సత్తా పార్టీ నేత జయప్రకాష్ నారాయణ్కు  కర్నూలులో సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది. తెలుగు తేజం పేరుతో కర్నూలులో జేపి తలపెట్టిన యాత్రలో జై సమైక్యాంధ్ర నినాదాలు చేయాలని ఉద్యమదారులు డిమాండ్ చేశారు. కొండారెడ్డి బురుజు వద్ద జేపిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో లోక్సత్తా కార్యకర్తలకు సమైక్యవాదులకు మధ్య కొద్ది సేపు తోపులాట జరిగింది.

సమైక్యవాదులు అక్కడ ఉన్న స్పీకర్ బాక్స్లను తోసి వేశారు. జేపి గోబ్యాక్ అని నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement