United Andhra Activists
-
జైరాం రమేష్ కు చేదు అనుభవం!
విశాఖపట్నం: రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి జైరాం రమేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. గత కొద్దిరోజులుగా రాష్ట్ర పర్యటనలో జైరాం రమేష్ ను సమైక్యవాదులు అడ్డకుంటున్న సంగతి తెలిసిందే. విశాఖలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో పాల్గొనేందుకు వచ్చిన జైరామ్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేతలు అడ్డకున్నారు. జైరాంరమేష్‌ను ఘెరావ్ చేసిన నేతల్లో విద్యార్థి విభాగం నేతలు కాంతారావు, ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులున్నారు. ఇటీవల తిరుపతి వచ్చిన కేంద్రమంత్రి జైరాం రమేష్‌కు గత బుధవారం సమైక్య సెగ తగిలిన సంగతి తెలిసిందే. విభజన ద్రోహి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో జైరాం రమేష్ తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లిపోయారు. -
టీ-నోట్ ఆమోదంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కేంద్ర మంత్రివర్గం తెలంగాణ నోట్‌ను ఆమోదించడంతో గురువారం జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టెక్కలిలో కేంద్ర మంత్రి కృపారాణి ఇంటిని ముట్టడించారు. ఆమె లేకపోవడంతో అక్కడే వంటావార్పు.. భోజనాలు చేసి.. ధర్నా నిర్వహించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రం నుంచి ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు హాజరయ్యారు. మంత్రి పదవిపై మోజు తప్ప కృపారాణికి ప్రజా ప్రయోజనాలు పట్టడం లేదని వారు విమర్శించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే కళ్లున్న కబోదుల్లా వ్యవహరించటమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు మంత్రిని కలిసి విన్నవించినా ఎలాంటి ప్రయోజనం దక్కలేదని వాపోయారు. రాజాంలో సమైక్యవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని పీకివేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. అక్కడినుంచి నేరుగా మంత్రి కోండ్రు మురళీమోహన్ క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లి బైఠాయించారు. మంత్రి పదవికి రాజీనామా చేసి వెంటనే సమైక్య ఉద్యమంలోకి రాకుంటే రాజకీయ జీవితమే లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాతపట్నంలో అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు క్యాంపు కార్యాలయాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. ఆయన తీరుపై మండిపడ్డారు. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీ నోట్‌పై కేంద్ర మంత్రివర్గం చర్చిస్తోందని తెలిసినా చీమకుట్టినట్లు కూడా లేకుండా పోయిందని నిరసించారు. పాతపట్నంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. మెళియాపుట్టిలో బంద్ పాటించారు. ఆమదాలవలసలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు కలిసి బంద్‌కు పిలుపునివ్వటంతో వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. శ్రీకాకుళంలోని వైఎస్ఆర్ కూడలిలోని వైఎస్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు బంద్‌కు పిలుపునివ్వడంతో వ్యాపారులు షాపులు మూసివేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని విమర్శించారు. పాలకొండలో వైఎస్ఆర్సీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం వద్ద సమైక్యవాదులు జాతీయ రహదారిని రెండు గంటలపాటు దిగ్బంధించారు. శ్రీకాకుళంలో గురువారం రాత్రి వైఎస్ఆర్సీపీ నాయకత్వాన పలువురు నాయకులు వైఎస్ఆర్ కూడలిలో యూపీఏ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మూడు రోజుల పాటు ప్రజలు బంద్ పాటించాలని కోరారు. ఇచ్చాపురంలో వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో బస్టాండ్ సెంటర్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన తెలిపారు. పలాసలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో దీక్ష శిబిరం వద్ద టీ నోట్‌ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ హనుమంతు సాయిరామ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో టీవీలు బద్దలు కొట్టి, టైర్లు కాల్చి నిరసన తెలిపారు. రెండురోజుల బంద్ పాటించాల్సిందిగా జేఏసీ నేతలు పిలుపు నిచ్చారు. నరసన్నపేటలో జాతీయ రహదారిపై జేఏసీ నేతలు బైఠాయించారు. -
అట్టుడికిన జిల్లా
టీనోట్ నేపథ్యంలో ఉద్యమం తారా స్థాయికి చేరుకుంది. గురువారం జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు కదంతొక్కారు. పంచాయతీ రాజ్ ఉద్యోగులు వందలాది మంది జిల్లా పరిషత్ నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ కృష్ణదేవరాయల సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజ్‌విహార్ సెంటర్లో మానవహారం నిర్మించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఎన్టీఆర్ సర్కిల్లో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు, మునిసిపల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్లో ప్రైవేట్ విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించి పట్టణ బంద్ పాటించారు. ఆదోనిలో సమైక్య రాష్ట్ర పరిక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పట్టణంలో భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. పాతబస్టాండ్ కూడలి వద్ద పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో చేనేత మహిళలు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద విద్యార్థులు ఉపవాస దీక్ష చేపట్టారు. నంద్యాల మండలం శివపురంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రైతులు దీక్ష చేశారు. 300 తప్పెట్లతో మాదిగపేట వాసులు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్‌శాఖ, నీటి పారుదల శాఖ ఆద్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హొళగుందలో ఉపాధ్యాయులు శ్రమదానం చేశారు. ప్యాపిలి, వెల్దుర్తిలో జేఏసీ దీక్షలు కొనసాగుతున్నాయి. ఆత్మకూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటి వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించి నిరసన వ్యక్తం చేశారు. సత్వరమే మంత్రి తమ పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలు పంచుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొత్తబస్టాండ్ వద్ద కూర్చొని నిరసన తెలిపారు. వెలుగోడులో పొట్టి శ్రీరాములు సెంటర్లో సింహగర్జన సదస్సు నిర్వహించారు. బనగానపల్లెలో సమైక్యాంధ్రకు మద్దతుగా యూటీఎఫ్, ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం బస్తాలు మెస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో రోడ్డుపై వ్యాయామం నిర్వహించారు. కొలిమిగుండ్ల మండలంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై భజన చేశారు. పత్తికొండలో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులు రాస్తారోకో చేపట్టారు. - న్యూస్‌లైన్, కర్నూలు(కలెక్టరేట్) -
జయప్రకాష్‌కు సమైక్యాంధ్ర ఉద్యమ సెగ
-
జయప్రకాష్‌కు సమైక్యాంధ్ర ఉద్యమ సెగ
కర్నూలు: లోక్‌సత్తా పార్టీ నేత జయప్రకాష్ నారాయణ్‌కు కర్నూలులో సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది. తెలుగు తేజం పేరుతో కర్నూలులో జేపి తలపెట్టిన యాత్రలో జై సమైక్యాంధ్ర నినాదాలు చేయాలని ఉద్యమదారులు డిమాండ్ చేశారు. కొండారెడ్డి బురుజు వద్ద జేపిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో లోక్‌సత్తా కార్యకర్తలకు సమైక్యవాదులకు మధ్య కొద్ది సేపు తోపులాట జరిగింది. సమైక్యవాదులు అక్కడ ఉన్న స్పీకర్ బాక్స్‌లను తోసి వేశారు. జేపి గోబ్యాక్ అని నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. -
జెపి కి తగిలిన సమైక్య సెగ
-
స్పీకర్ నాదెండ్ల ఇంటిని ముట్టడించిన సమైక్యవాదులు
గుంటూరు: తెనానిలో శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇంటిని సమైక్యాంధ్రవాదులు ముట్టడించారు. స్పీకర్ పదవికి నాదెండ్ల మనోహర్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. జై సమైక్యాంధ్ర అంటూ వారు నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విభజించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రోజు నుంచి జిల్లాలో ముఖ్యంగా తెనాలిలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. రాష్ట్రం విభజించాలన్న ప్రతిపాదనకు నిరసనగా ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే స్పీకర్ ఇంటిని ముట్టడించారు. ఆయన రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. -
ఆందోళనలను అడ్డుకోవడం హక్కులను హరించడమే.. న్యాయవాదుల సంఘం
ఎస్కేయూ, న్యూస్‌లైన్: వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది, ఆచార్యులు, వి ద్యార్థులు చేపట్టిన బైక్ ర్యాలీని పో లీసులు అడ్డుకోవడం హక్కులను హరిం చడమేనని జిల్లా బార్ అసోసియేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్సిటీ వద్ద రిలే దీక్షలు నిర్వహిస్తున్న సమైక్యవాదులకు శుక్రవారం వారు మద్దతు ప్రకటించారు. శాంతియుతం గా ఆందోళనలు చేస్తున్నవారిపై కక్ష గట్టి ఉద్యమాన్ని అణచివేయాలని చూడడం అప్రజాస్వామ్యం అన్నారు. సమైక్య ఆందోళనకారులకు తాము అండగా ఉంటామన్నారు. తెలుగు భాష రాని ఇతర రాష్ట్రాల వారికి తెలుగుజాతి ఔన్యత్యం ఏమి తెలుసన్నారు. తక్షణమే విభజన నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి, సీని యర్ న్యాయవాదులు రామ్‌కుమార్, ఎల్కే సుదీంధ్రనాథ్, గురుప్రసాద్, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్, బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి బి.నారాయణరెడ్డి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సీఆర్ఐటీ విద్యాసంస్థల చైర్మన్ చార్లెస్ చిర ంజీవిరెడ్డి, అకడమిక్ డీన్ నరసింహారెడ్డి రిలే దీక్షలకు మద్దతు తెలిపారు. -
కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటి ముట్టడి
కాకినాడ: సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు కేంద్రమంత్రి పళ్లంరాజు ఇంటిని ముట్టడించారు. వైఎస్ఆర్ సిపి నేత ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఏపీఎన్జీఓ సంఘం నేతలు ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పదవికి పళ్లంరాజు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు, ఎంపిలు రాజీనామా చేసి అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర అంతటా గత 8 రోజుల నుంచి వారు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపిల ఇళ్లను ముట్టడిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పళ్లంరాజు ఇంటిని ముట్టడించారు. -
బొత్స ఇంటిని ముట్టడించిన విద్యార్ది జేఏసీ