వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది, ఆచార్యులు, విద్యార్థులు చేపట్టిన బైక్ ర్యాలీని పో లీసులు అడ్డుకోవడం హక్కులను హరిం చడమేనని జిల్లా బార్ అసోసియేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్సిటీ వద్ద రిలే దీక్షలు నిర్వహిస్తున్న సమైక్యవాదులకు శుక్రవారం వారు మద్దతు ప్రకటించారు.
ఎస్కేయూ, న్యూస్‌లైన్: వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది, ఆచార్యులు, వి ద్యార్థులు చేపట్టిన బైక్ ర్యాలీని పో లీసులు అడ్డుకోవడం హక్కులను హరిం చడమేనని జిల్లా బార్ అసోసియేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్సిటీ వద్ద రిలే దీక్షలు నిర్వహిస్తున్న సమైక్యవాదులకు శుక్రవారం వారు మద్దతు ప్రకటించారు. శాంతియుతం గా ఆందోళనలు చేస్తున్నవారిపై కక్ష గట్టి ఉద్యమాన్ని అణచివేయాలని చూడడం అప్రజాస్వామ్యం అన్నారు. సమైక్య ఆందోళనకారులకు తాము అండగా ఉంటామన్నారు. తెలుగు భాష రాని ఇతర రాష్ట్రాల వారికి తెలుగుజాతి ఔన్యత్యం ఏమి తెలుసన్నారు.
తక్షణమే విభజన నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి, సీని యర్ న్యాయవాదులు రామ్‌కుమార్, ఎల్‌కే సుదీంధ్రనాథ్, గురుప్రసాద్, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్, బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి బి.నారాయణరెడ్డి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సీఆర్‌ఐటీ విద్యాసంస్థల చైర్మన్ చార్లెస్ చిర ంజీవిరెడ్డి, అకడమిక్ డీన్ నరసింహారెడ్డి రిలే దీక్షలకు మద్దతు తెలిపారు.