
సాక్షి, వైఎస్సార్ కడప: శాంతి యుతంగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసుల వ్యవహారశైలికి నిరసనగా రేపు(ఆగస్టు4) విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది.‘కడప ఉక్కు ఆంధ్రుల హక్కు’ అంటూ ఉక్కు పరిశ్రమ సాధన కోసం గత కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళనల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు నాయక్‌తో పాటు పలువురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ మేరకు జేఏసీ బంద్‌కు సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, జనసేన పార్టీలతో పాటు కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహ్మతుల్లా మద్దతు తెలిపారు.