sfi students
-
దళం కదలాలి.. దగా ఆపాలి
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ కబంధ హస్తాల నుంచి విద్యారంగాన్ని కాపాడటమే తమ లక్ష్యమని, అలాగే బీజేపీ కాషాయీకరణ పంథా నుంచి విద్యారంగాన్ని రక్షించడమే ఎజెండా అని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) స్పష్టం చేసింది. ఇందుకు అవసరమైన అస్త్ర, శస్త్రాలను సమకూర్చుకోవాలని నిర్ణయించింది. విద్యార్థి లోకాన్ని నిద్రలేపి, కలసి వచ్చే సంఘాలతో సమైక్య పోరుకు సిద్ధమని స్పష్టం చేసింది. హైదరాబాద్ వేదికగా నాలుగు రోజుల పాటు సాగిన ఎస్ఎఫ్ఐ 17వ మహాసభలు శుక్రవారంతో ముగిశాయి. 23 రాష్ట్రాలకు చెందిన 697 మంది ఆహ్వానితులు ఈ సభలకు హాజరయ్యారు. సభల ప్రారంభం రోజు విద్యార్థి గళాన్ని లోకానికి వినిపించేలా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ కీలకోపన్యాసం చేశారు. పేదవాడికి విద్యారంగాన్ని దూరం చేస్తున్న పాలకుల విధానాలను ఎండగట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సాగిన తొలి రోజు సభలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు ప్రసంగం అన్ని వర్గాలను కదిలించింది. నాలుగు రోజులపాటు 35 అంశాలపై ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను, ఉపాధ్యక్షురాలు దిప్సిత ధర్, ప్రధాన కార్యదర్శులు మయూక్ బిస్వాస్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజు తదితరులు పలు అంశాలపై ప్రతిపాదనలు చేశారు. ఈ సమావేశాల సందర్భంగా సభ జాతీయ కమిటీని ఎన్నుకుని, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. (చదవండి: ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా సాను ) -
బీజేపీని ఓడిస్తేనే.. దేశం భద్రం
సాక్షి, హైదరాబాద్: బీజేపీని ఓడించకపోతే దేశానికి భద్రత లేదని త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించడా నికి ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో విద్యార్థులు శంఖారావం పూరించాలని పిలుపునిచ్చారు. వినాశకరమైన నూతన విద్యా విధానాన్ని రద్దు చేసేలా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. బలీయమైన జాతీయ ఉద్యమాన్ని నిర్మించి కొత్త విద్యా విధానాన్ని తిప్పి కొట్టాలని సూచించారు. ఎస్ఎఫ్ఐ జాతీయ మహా సభలు మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాణిక్ సర్కార్ మాట్లాడారు. అన్ని రంగాలూ దుర్భర స్థితిలోనే..: ‘దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో, దిగజారుతున్న దశలో ఉంది. విద్య సహా అన్ని రంగాలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ నియంతృత్వ కూటమి ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. కేంద్రం విద్యారంగాన్ని ధ్వంసం చేస్తోంది. ప్రైవేటుపరం చేస్తోంది. పేద, మధ్య తరగతిని దెబ్బతీసేలా జాతీయ విద్యా విధానాన్ని తెచ్చింది. జాతీయ విద్యా విధానం బలహీన వర్గా లు, గిరిజనులు, దళితులు, మైనారిటీల ప్రయోజనాలకు తూట్లు పొడుస్తుంది. సంపన్న వర్గాల చేతుల్లోకి పోతుంది. మంగళవారం నెక్లెస్ రోడ్డులో ఎస్ఎఫ్ఐ కార్యకర్తల ర్యాలీ పేదలకు దూరం అవుతుంది. అలాగే పాఠ్యాంశాలను, సిలబస్‌ను మార్పు చేయాలని బీజేపీపై ఆర్ఎస్ఎస్ ఒత్తిడి తెస్తోంది. విద్య మౌలిక లక్ష్యం కష్టాల్లో ఉన్నవారికి తోడ్పాటునివ్వడం, శాస్త్రీయ థృక్పథాన్ని తీసుకురావడం. అందుకు విరుద్ధంగా విద్యా విధానం తెస్తున్నారు. నూతన విద్యా విధానంలో విభజన తత్వాన్ని నూరిపోస్తున్నారు. మూఢ నమ్మకాలను, సనాతనత్వాన్ని, సంప్రదాయాలను ప్రవేశపెడుతున్నారు. ఏ కోణంలో చూసినా పాఠ్యాంశాలను కలుషితం చేస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటాలను వక్రీకరిస్తున్నారు..’అని మాణిక్ సర్కార్ విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? ‘దేశంలో కోట్లాదిమంది ఉద్యోగాల కోసం పరితపిస్తున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ 2014లో వాగ్దానం చేశారు. అలా ఇప్పటివరకు 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. కొత్తవి సృష్టించకపోగా ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. నియామకాల పద్ధతినే మార్చేశారు. తాత్కాలికంగా నియమిస్తున్నారు. దీనితో నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగింది. సైన్యంలోనూ తాత్కాలిక పద్ధతిలో అగ్నిపథ్‌ను తీసుకొచ్చారు. నాలుగేళ్లు వాడుకొని వదిలేసేలా మార్చారు. దాన్ని వ్యతిరేకించాలి. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలూ అలానే ఉన్నాయి. కార్మికులకు జీతాలు, హక్కులు లేవు. కార్మికుల 42 హక్కులను కాలరాశారు..’అని చెప్పారు. మతాల మధ్య చిచ్చు... ‘బీజేపీ ప్రభుత్వం హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య వైషమ్యాలను పెంచుతోంది. ప్రజాస్వామ్య, పౌర హక్కులను కాలరాస్తోంది. రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తోంది. వ్యవస్థను భగ్నం చేసే కుట్రకు పాల్పడుతోంది. ప్రజల మీద దాడులు చేస్తోంది. రాజ్యాంగాన్ని, న్యాయవ్యస్థను, ఎన్నికల కమిషన్‌ను తన గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కాలరాయాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులే దేశాన్ని కాపాడుకోవాలి..’మాణిక్ సర్కార్ పిలుపునిచ్చారు. రైతులు, కార్మికులు, దళితులు ఇలా అన్ని వర్గాల ప్రజల కోసం విద్యార్థులు పోరాడాలన్నారు. ఎస్ఎఫ్ఐ మహాసభల్లో ఈ అంశాలపై చర్చించాలని సూచించారు. -
రేపు విద్యాసంస్థల బంద్
సాక్షి, వైఎస్సార్ కడప: శాంతి యుతంగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసుల వ్యవహారశైలికి నిరసనగా రేపు(ఆగస్టు4) విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది.‘కడప ఉక్కు ఆంధ్రుల హక్కు’ అంటూ ఉక్కు పరిశ్రమ సాధన కోసం గత కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళనల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఎస్ఎఫ్ఐ నాయకుడు నాయక్‌తో పాటు పలువురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ మేరకు జేఏసీ బంద్‌కు సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, జనసేన పార్టీలతో పాటు కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహ్మతుల్లా మద్దతు తెలిపారు. -
విద్యార్థుల అరెస్ట్.. రేపు రాష్ట్ర బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రవేటు యూనివర్శిటీల బిల్లును వ్యతిరేకిస్తూ బుధవారం అసెంబ్లీ ముట్టడికి యత్నంచిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులు చేశారంటూ విద్యార్థి సంఘాలు గురువారం తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రముఖ విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, టీవీవీ, ఏఐఎస్ఓ, టీఎస్‌ఎఫ్‌ల ఆధ్యర్యంలో విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని తీవ్రగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడించేందుకు బుధవారం ఉదయం నిజాం కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థులను అదుపు చేసేందుకు పోలీసు లాఠీ చార్జ్ చేయడానకి యత్నించడంతో తోపులాట జరిగింది. చివరకు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. విద్యార్థినులని కూడా చూడకుండా.. ముట్టడిలో పాల్గొన్న విద్యార్థినులను సైతం మగ పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్లలోకి ఎక్కించారు. పోలీసుల తీరుపై విద్యార్థులు తీవ్ర నిరసనలను వ్యక్తం చేశారు. అరెస్ట్ అయి పోలీసు స్టేషన్లో ఉన్న నాయకులు అక్కడే మీడియాతో మాట్లాడారు. విద్యార్థి సంఘ నాయకులు కోట రమేష్, శివరామకృష్ణ, జూపాక శ్రీనివాస్, గంగాధర్, సందీప్, శోభన్ నాయక్‌లు మాట్లాడుతూ.. విద్యను అందించడం ప్రభుత్వం ప్రాథమిక విధి అని, ప్రభుత్వం తన భాద్యతను మరిచి ప్రైవేట్‌కు దాసోహమవుంతోందని విమర్శించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల వల్ల విద్య వ్యాపారంగా మారుతుందని, ప్రభుత్వాలకు వాటిపై నియంత్రణ ఉండదని పేర్కొన్నారు. ఫీజులు, పాఠ్యాంశాలు, ప్రవేశ విధానాలను అవే నిర్ణయించడం వల్ల దళిత, గిరిజన, బలహీన, మైనారిటీ వర్గాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగవచ్చని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ప్రజాతంత్ర హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అలాగే, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును వెనక్కి తీసుకోవాలని, విద్యసంస్థల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని, అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. -
SFI ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికి యత్నం
-
విద్యార్థులపై కేసులు సరికాదు
ఎస్ఎఫ్ఐ నగర సమితి ఉపాధ్యక్షుడు సుమంత్ గాంధీనగర్ : వసతి గృహాల మూసివేతను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేసులు పెట్టడం సరికాదని ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షుడు సీహెచ్. సుమంత్ అన్నారు. ఈనెల 25న అలంకార్ సెంటర్లో ధర్నా చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేసి అరెస్టులు చేయడాన్ని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన బుధవారం జరిగింది. సుమంత్ మాట్లాడుతూ హాస్టల్స్ మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. నిరసన ప్రదర్శనలో నగర నాయకులు దుర్గాప్రసాద్, ఏ మణికంఠ, బాబి, రాజు పాల్గొన్నారు. -
జగన్‌తో ఏపి విద్యార్ధి సంఘం SFI భేటీ