Kadapa MLA Amjad basha
-
ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా సినిమా టైటిల్ పోస్టర్ విడుదల
నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ప్రొడక్షన్ నెంబర్ 1గా ‘కలియుగం పట్టణంలో’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. నేడు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా చేతుల మీదుగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'విద్యార్థిని విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ.. ఇప్పుడు మళ్లీ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నందుకు నానికి అభినందనలు తెలుపుతున్నాను. విద్యా రంగంలో అంచెలంచెలుగా ఎలాగైతే ఎదిగారో.. సినిమా రంగంలోనూ అలానే ఎదగాలి. నూతన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ టైటిల్ లాంచ్‌కు విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు. చలనచిత్ర పరిశ్రమ కడప వైపు, రాయలసీమ వైపు చూసేలా చేయాలని' అయన కోరారు. ఈ ఈవెంట్‌కు రాజంపేట్ పార్లమెంట్ ఇంచార్జ్, పొలిట్ బ్యూరో మెంబర్ రెడ్డప్పగిరి శ్రీనివాసుల రెడ్డి, ఏపీ ఇండస్ట్రీస్ అడ్వైజర్ రాజోలి వీర రెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగా రెడ్డి,నాగార్జున స్కూల్ ఛైర్మన్ శివ శంకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. -
ముస్లింలపై చంద్రబాబు కపట ప్రేమ
-
‘ఏపీలో హిట్లర్ పాలన’
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో హిట్లర్ పాలన కొనసాగుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా మండిపడ్డారు. సీఎం సభలో శాంతియుతంగా నిరసన తెలిపిన ముస్లిం యువకులపై కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తే ఏమైనా దేశ ద్రోహమా చంద్రబాబు అంటూ అంజాద్ బాషా ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాలని అడిగితే తప్పా అని నిలదీశారు. అసలు ముస్లింలపై చంద్రబాబుకు ప్రేమ లేదని, ఎన్నికలు వస్తున్నాయనే ముస్లింలపై చంద్రబాబు కపట ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లుగా ముస్లింలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలంటూ ఆయన నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోవడం ఖాయమని అంజాద్ స్పష్టం చేశారు. -
రేపు విద్యాసంస్థల బంద్
సాక్షి, వైఎస్సార్ కడప: శాంతి యుతంగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసుల వ్యవహారశైలికి నిరసనగా రేపు(ఆగస్టు4) విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది.‘కడప ఉక్కు ఆంధ్రుల హక్కు’ అంటూ ఉక్కు పరిశ్రమ సాధన కోసం గత కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళనల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఎస్ఎఫ్ఐ నాయకుడు నాయక్‌తో పాటు పలువురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ మేరకు జేఏసీ బంద్‌కు సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, జనసేన పార్టీలతో పాటు కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహ్మతుల్లా మద్దతు తెలిపారు. -
హజ్ యాత్ర పేరుతో ట్రావెల్స్ నిర్వాకం..
సాక్షి, వైఎస్సార్ : ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో హజ్ యాత్ర పేరుతో ప్రజలను మోసం చేసి కెఎస్ఎస్ ట్రావెల్స్ వారి నుంచి డబ్బులు, పాస్‌పోర్టులు వసూలు చేసి తరువాత నుంచి మొహం చాటేసింది. నిర్వాహకుల నుంచి ఎటువంటి స్పస్టమైన సమధానం రాకపోవటంతో ప్రయాణికులు మోసపోయామని గ్రహించారు. ఈ విషయంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, వారు కట్టిన నగదును, పాస్‌పోర్ట్‌లను వెనక్కు ఇప్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ కడప ఎమ్మెల్యే అంజద్ బాషా డిమాండ్ చేశారు. ఈ ఘటనకు భాద్యులైన ట్రావెల్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీసిఐడి విచారణ జరిపించి, భాదితులకు సత్వర న్యాయం అందించాలని అంజద్ బాషా కోరారు. పోలీసులు ట్రావెల్స్ యజమానులపై కేసు నమోదు చేసి, ధర్యాప్తు ప్రారంభించారు. నకిలీ ట్రావెల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నగదును పూర్తిగా కాకుండా వారి గురించి పూర్తిగా వాకబు చేసిన తరువాతే అడ్వాన్స్ చెల్లించాలని, ఈ విషయంలో అప్రమత్తత తప్పనిసరని జిల్లా ఎస్పీ సూచించారు. -
వైఎస్ఆర్సీపీ నేతల సాయంతో స్వస్థలానికి..
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మలేసియా సభ్యుల సహకారంతో ఓ వ్యక్తి తన స్వస్థలానికి చేరుకోనున్నాడు. వైఎస్ఆర్ సీపీ గల్ఫ్ కన్వినర్ బి.హెచ్.ఇలియాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కడప పట్టణానికి చెందిన జి. సూరిబాబు అనే వ్యక్తి రెండేళ్ల క్రితం జీవనోపాధి కొరకు మలేసియా వెళ్లి ఓ కంపెనీలో వెల్డర్ గా పనిచేశాడు. అయితే 17 నెలలు గడిచిన తర్వాత అక్కడ ఏ పనిలేదని కంపెనీవారు సూరిబాబును ఆకస్మికంగా బయట పంపించేశారు. 'ఇండియాకు తిరిగి వెళతాను.. నా పాస్ పోర్ట్ ఇప్పించాలని కాంపెనీ వారిని ప్రాధేయపడినా పాస్ పోర్ట్ ఇవ్వలేదని' సూరిబాబు చాల అవస్ధలు పడ్డాడని ఇలియాస్ తెలిపారు. ఈ విషయాన్ని కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా ద్వారా సూరిబాబు తల్లి జి.అన్నమ్మ తెలపగా వెంటనే స్పందించి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ. హర్షవర్ధన్ రెడ్డి సహకారంతో మలేసియా వైఎస్ఆర్సీపీ నేత రేవంత్ తిప్పరాజు గారి దృష్టికి తీసుకెళ్లాం. తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్న సూరిబాబును తమ వద్దకు పిలుచుకొని అన్ని వసతులు కల్పించి భారత రాయబార కార్యాలయ అధికారికులతో మాట్లాడి ఈ 19న స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారని తెలిపారు. సూరిబాబు లాంటి ఎందరో అభాగ్యులు మలేసియాలో అవస్ధలు పడుతున్నారని సూరిబాబు ద్వారా తెలిసిందన్నారు. సమస్యలలో ఉన్న ఎన్ఆర్ఐలను ఆదుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడము లేదనే అక్కసుతో ప్రవాసులు ఆయా దేశాలను సర్వనాశనం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటన్నారు. నేడు మన రూపాయి విలువ పడిపోకుండా మన పక్క దేశాలకన్నా ఉన్నత స్ధానంలో ఉందంటే అది కచ్చితంగా ఎన్ఆర్ఐల ద్వారా జరిగే బ్యాంక్ లావాదేవీలే కారణమన్న విషయం సీఎం తెలుసుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. సూరిబాబును సురక్షితముగా ఇండియా పంపేందుకు ఏర్పాట్లు చేసిన రేవంత్ తిప్పరాజు, రాంబాబుకు, వారి మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని ముఖ్యమైన ఫోన్ నెంబర్లు : సూరిబాబు తల్లి జి. అన్నమ్మ సెల్ నెం: +918886368312, సూరిబాబు సెల్ నెం : 00601139497477, రేవంత్ సెల్ నెం : 0060172150232. -
చంద్రబాబు ముస్లింలను మోసం చేశారు: ఎమ్మెల్యే అంజాద్ బాషా
విజయవాడ: ఏపీలోని ముస్లిం మైనారిటీలను సీఎం చంద్రబాబు అన్నిరకాలుగా మోసం చేశారని కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా మండిపడ్డారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన బాషా.. మైనారిటీలకు ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నేతృత్వంలోని మంత్రి వర్గంలో కనీసం ఒక్క మైనారిటీకి కూడా అవకాశం ఇవ్వలేదని విమర్శించారు.