నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ప్రొడక్షన్ నెంబర్ 1గా ‘కలియుగం పట్టణంలో’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. నేడు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్‌ను లాంచ్ చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా చేతుల మీదుగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'విద్యార్థిని విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ.. ఇప్పుడు మళ్లీ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నందుకు నానికి అభినందనలు తెలుపుతున్నాను. విద్యా రంగంలో అంచెలంచెలుగా ఎలాగైతే ఎదిగారో.. సినిమా రంగంలోనూ అలానే ఎదగాలి. నూతన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ టైటిల్ లాంచ్‌కు విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు. చలనచిత్ర పరిశ్రమ కడప వైపు, రాయలసీమ వైపు చూసేలా చేయాలని' అయన కోరారు.
ఈ ఈవెంట్‌కు రాజంపేట్ పార్లమెంట్ ఇంచార్జ్, పొలిట్ బ్యూరో మెంబర్ రెడ్డప్పగిరి శ్రీనివాసుల రెడ్డి, ఏపీ ఇండస్ట్రీస్ అడ్వైజర్ రాజోలి వీర రెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగా రెడ్డి,నాగార్జున స్కూల్ ఛైర్మన్ శివ శంకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment