
కడపకు పయనమవ్వనున్నారట కంగువా. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువా’. దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణను కడపలో ప్లాన్ చేశారని, ఈ నెల రెండో వారంలో ఈ చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం.
సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ కడపలో జరగనుందట. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘కంగువా’ ఫస్ట్ పార్ట్ ఏప్రిల్‌లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment