టాలీవుడ్‌లో ఒక సెంటిమెంట్ ఉంది. నవంబర్ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు సక్సెస్ కావని భావిస్తారు. అందుకే ఈ నెలలో పెద్ద సినిమాలు చాలా తక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఈ సెంటిమెంట్ ఈ సారి కూడా వర్కౌట్ అయింది. గతేడాది మాదిరే ఈ ఏడాది నవంబర్ కూడా టాలీవుడ్‌కి కలిసి రాలేదు. ఈ నెలలో రిలీజైన సినిమాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
నవంబర్ మెదటి వారంలోనే దాదాపు 10 సినిమాలు విడుదలయ్యాయి. వాటిల్లో నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ కూడా ఉంది. కానీ ఏ ఒక్క సినిమా కూడా హిట్ కొట్టలేదు. ఇక నిఖిల్ సినిమా అయితే భారీ ఫ్లాప్‌ని మూటకట్టుకుంది. జితెందర్ రెడ్డి సినిమాకు ఓ మోస్తారు టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. ఇక మంచు లక్ష్మి ఆదిపర్వం, హెబ్బా పటేల్ ‘ధూంధాం’ లాంటి సినిమాలు ఫ్లాప్ టాక్‌నే మూటగట్టుకున్నాయి.
ఇక రెండోవారంలో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి మట్కా. మెగా ప్రిన్స్ వరుణ్ సందేశ్ నటించిన ఈ చిత్రం.. నవంబర్ 14న విడుదలై ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట ఫ్లాప్‌గా నిలిచింది. ఇక భారీ అంచనాలతో వచ్చి సూర్య ‘కంగువా’..ఘోర పరాజయాన్ని చవిచూసింది.
(చదవండి: హైదరాబాద్‌లో ‘పుష్ప 2’ ఈవెంట్.. చివరి నిమిషంలో ప్లాన్ ఛేంజ్!)
ఇక నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ పోరులో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సత్యదేవ్‌తో పాటు మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కూడా పోటీ పడ్డారు. విశ్వక్ నటించిన మెకానిక్ రాకీ, సత్యదేవ్ నటించిన జీబ్రా రెండూ.. నవంబర్ 22న విడుదలయ్యాయి. వీటిలో మెకానిక్ రాకీ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. సెకండాఫ్ బాగున్నా.. ఫస్టాఫ్‌ని భరించడం కష్టమేనని రివ్యూస్ చెప్పాయి. అయితే కొంతవరకు అయినా కలెక్షన్స్ వస్తాయని భావించినా.. మూడో రోజు నుంచే సినిమా గురించి మాట్లాడుకోవడం మానేశారు.
(చదవండి: చైనాలో 'మహారాజా' రెండు రోజుల కలెక్షన్స్.. భారీ రికార్డ్)
ఇక సత్యదేవ్ జీబ్రా మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. రెండో రోజు నుంచి స్క్రీన్స్ కూడా పెరిగాయి. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. వీకెండ్ తర్వాత ఆ జోష్‌ని కంటిన్యూ చేయలేకపోయారు. ఇక అశోక్ గల్లా నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రమైతే ఘోరమైన అపజయాన్ని మూటగట్టుకుంది.
ఇక నవంబర్ చివరి వారంలో మరో నాలుగైదు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో రోటి కపడా రొమాన్స్ మూవీకి మంచి టాక్ లభించింది. సినిమా బాగున్నప్పటికీ.. అప్పటికే ప్రేక్షకులంతా పుష్ప 2 ఫీవర్‌లోకి వెళ్లారు. మొత్తంగా నవంబర్ నెల అయితే ఎప్పటి మాదిరే టాలీవుడ్‌ని నిండా ముంచేసింది. ఈ నెలలో వచ్చిన 22 సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక డిసెంబర్‌లో మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ పుంజుకునే అవకాశం ఉంది. పుష్ప 2తో పాటు మరిన్ని పెద్ద సినిమాలు ఈ నెలలో రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ ఇయర్ ‘క్లైమాక్స్’ ఎలా ఉంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment