రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే, అదంతా ఫేక్ కలెక్షన్స్ అంటూ నిర్మాత దిల్ రాజుపై నెటిజన్లు కామెంట్ చేశారు. ఇదే సమయంలో గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే నాడు కేవలం రూ. 80 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టిందని పలు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ గురించి ఆయన రెస్పాండ్ అయ్యారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయం అందుకోవడంతో డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ పేరుతో మేకర్స్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ నిర్మాత దిల్ రాజుకు ఒక ప్రశ్న ఎదురైంది. సంక్రాంతి పండుగ సమయంలో మీరు రెండు సినిమాలు విడుదల చేస్తే.. ఒక సినిమాకు మొదటిరోజు కలెక్షన్ల వివరాలు మాత్రమే చెప్పి.. రెండో సినిమాకు చాలా పోస్టర్లతో ఆ వివరాలు చెప్పడం వెనుకున్న కారణం ఏంటి అని విలేఖరి ప్రశ్నించారు.
అందుకు దిల్ రాజు కాస్త అసహనంగానే ఇలా చెప్పారు. 'ఈ విషయంలో మాకు కొన్ని బలహీనతలు ఉంటాయి. మీకు కూడా (మీడియా) తెలుసు కదా..! మళ్లీ నన్నెందుకు అడుగుతున్నారు. ప్రతి సినిమా కలెక్షన్ల వివరాలు మీ వద్దే ఉంటాయని అందరూ అంటున్నారు. ఇక నుంచి కలెక్షన్ల వివరాలు కూడా మీరే ప్రకటించండి.' అని అసహనంగా దిల్ రాజు అన్నారు. అయితే ఇదే సమయంలో ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా కలెక్షన్స్ పోస్టర్స్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. మేకర్స్ విడుదల చేస్తున్న కలెక్షన్ల పోస్టర్స్‌ను చూసి ప్రేక్షకులు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
— Out of Commentary (@OutofContestTel) February 1, 2025
Comments
Please login to add a commentAdd a comment