రష్మిక మందన్న- విక్కీ కౌశల్ కాంబినేషన్‌లో రానున్న హిస్టారికల్ మూవీ ‘ఛావా’. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా దర్శకుడు లక్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ నటించగా, శంభాజీ మహారాజ్ భార్య మహారాణి ఏసుబాయి పాత్రలో రష్మికా మందన్నా నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. సుమారు 35 మిలియన్ల వ్యూస్‌తో నెట్టింట వైరల్ అవుతుంది. సాంగ్‌లో విజువల్స్ అద్భుతంగా ఉండటంతో ఈ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ కూడా భారీగా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపడుతుంది. మొగల్ షెహన్షా ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు.
తాజాగా ఛావా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అయితే, నడవలేని స్థితిలో ఉన్న రష్మిక ఈవెంట్‌లో పాల్గొనడంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న జరిగిన ఈవెంట్‌లో కూడా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ వీల్‌చైర్‌లో స్టేజీపైకి తీసుకొచ్చాడు. అనంతరం రష్మిక.. అతడికి మంగళహారతిచ్చింది. అంతేకాదు.. విక్కీ కౌశల్ (Vicky Kaushal)కు కొంత తెలుగు కూడా నేర్పించింది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment