‘తగ్గేదే లే’ అన్నది హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా రెండు భాగాల్లోని డైలాగ్. సుకుమార్ దర్శకత్వంలో వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించిన ఈ చిత్రం ఆ డైలాగ్‌కి తగ్గట్టే ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప 2’ దాదాపు రూ.1800 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే హిందీలో ఏ స్ట్రయిట్ చిత్రం వసూలు చేయనంత అంటూ... దాదాపు రూ. 800 కోట్ల గ్రాస్‌ని వసూలు చేయడం విశేషం. ఇక బెంగాల్‌లో ఈ చిత్రం ఓ రికార్డ్ సాధించింది.
మామూలుగా బెంగాలీ సినిమా మార్కెట్ చాలా చిన్నది. తక్కువ బడ్జెట్ చిత్రాలు రూపొందుతుంటాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ బెంగాల్‌లో రూ. 50 కోట్లు వసూలు చేసి, సంచలనం సృష్టించింది. కాగా ‘అమేజాన్ ఓబిజాన్’ (2017) అనే చిత్రం రూ. 48 కోట్ల వసూళ్లతో అప్పట్లో రికార్డ్ నెలకొల్పింది. ఇది స్ట్రయిట్ చిత్రం. ఆ రికార్డును తాజాగా ‘పుష్ప 2’ బ్రేక్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమా ఇలా ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పడం అంటే మామూలు విషయం కాదు... మరి... ‘పుష్ప’ అంటే వైల్డ్ ఫైర్.... లోకల్ కాదు... ఇంటర్నేషనల్.
Comments
Please login to add a commentAdd a comment