టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. టాలీవుడ్‌లో చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన కనిపించింది. అయితే ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు సామ్.
అయితే మరోవైపు పికిల్ బాల్ టోర్నమెంట్‌తో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. గతంలోనే చెన్నై సూపర్ ఛాంప్స్ టీమ్‌ను కొనుగోలు చేసిన సమంత తన జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ పికిల్ బాల్ టోర్నమెంట్‌లో సమంత సందడి చేసింది. తన టీమ్‌కు సపోర్ట్ చేస్తూ కనిపించింది.
రాజ్ నిడిమోరు చేయి పట్టుకుని..
అయితే ఇందులో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి పికిల్ బాల్ టోర్నమెంట్‌లో మెరిసింది. ఇద్దరు జంటగా కనిపించి సందడి చేశారు. దీంతో మరోసారి వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి. గతంలోనే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓకే వేదికపై జంటగా కనిపించడంతో డేటింగ్‌లో రూమర్స్ నిజమేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు ఆమె షేర్ చేసిన ఫోటోల్లో దర్శకుడి చేతిని పట్టుకున్నట్లు సామ్ కనిపించింది. దీంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మరింత బలపడుతున్నాయి. కాగా.. వీరిద్దరు సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో కలిసి పనిచేశారు. అప్పటి నుంచే ఈ జంటపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా సమంత, రాజ్ కలిసి పికిల్ బాల్ టోర్నీలో సన్నిహితంగా ఉండడం చూసిన ఫ్యాన్స్ సామ్ డేటింగ్‌లో మునిగి తేలుతోందంటూ పోస్టులు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment