టాలీవుడ్ హీరోయిన్ సమంత చివరిసారిగా సిటాడెల్ హన్నీ బన్నీ వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఇందులో వరుణ్ ధావన్ సరసన మెప్పించింది. అయితే ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో టచ్‌లోనే ఉంటోంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక బాటలో ఫుల్ బిజీగా ఉంది. గతంలో చాలాసార్లు ఇషా ఫౌండేషన్‌కు వెళ్లిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
అయితే తాజాగా సామ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత రెండేళ్లుగా తాను ఓ చిన్న ఆచారాన్ని పాటిస్తున్నట్లు తెలిపింది. ఇది తన కష్టతరమైన క్షణాల నుంచి బయపడేసిందని వెల్లడించింది. అంతేకాదు ఇది చాలా సులభమైన, శక్తివంతమైందని సామ్ అంటోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.
సమంత తన ఇన్‌స్టాలో రాస్తూ..'నేను గత రెండు సంవత్సరాలుగా ఈ చిన్న ఆచారాన్ని పాటిస్తున్నా. ఇది నా కష్టతరమైన క్షణాల నుంచి ఉపశమనం కలిగించింది. ఇది చాలా సులభమైంది.. అంతే కాదు శక్తివంతమైనది కూడా. ప్రస్తుత ఎక్కడ ఉన్నాను.. అలాగే మున్ముందు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ఇది మీరు కాస్తా సాఫ్ట్‌గా అనిపిస్తుందని నాకు తెలుసు. కానీ అది నిజం కాదు.. ఇది మీకు సహాయపడుతుందని నిరూపించడానికి తన వద్ద తగినంత సమాచారం ఉంది' రాసుకొచ్చింది.
సామ్ తన పోస్ట్‌లో.. 'రైటింగ్ అనేది మీకు సహజంగా వచ్చినట్లయితే.. ఈ రోజు మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను రాయండి. అవి పెద్దవిగా ఉండాల్సిన అవసరం లేదు. కేవలం నిజాయితీగా ఉండాలి. కానీ రాయడం కష్టంగా, బలవంతంగా అనిపిస్తే మీరు బాగా విశ్వసించే వారితో షేర్ చేయండి. అంతే కాదు ఏమీ చేయకపోయినా కొన్నిసార్లు సైలెంట్‌గా కూర్చున్నా చాలు. ఈ చిన్న అభ్యాసం మొదట చాలా సింపుల్‌గా అనిపించవచ్చు. కానీ ప్రతిదీ మీరు చూసే విధానాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఒకసారి ప్రయత్నించండి. ఇది నాకు గేమ్ ఛేంజర్‌గా మారింది.' రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment