ఐపీఎల్‌కు ముందే క్రికెట్ సమరం.. సిద్ధమంటోన్న అఖిల్ అక్కినేని | Tollywood Hero Akhil Akkineni Reveals CCL 2025 League Starting Date, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

CCL 2025 Starting Date: మినీ ఐపీఎల్ క్రికెట్ సమరం.. తెలుగు వారియర్స్ మ్యాచ్ ఎప్పుడంటే?

Published Sun, Feb 2 2025 4:36 PM | Last Updated on Sun, Feb 2 2025 5:03 PM

Tollywood Hero Akhil Akkineni Reveals CCL 2025 league From this Date

క్రికెట్‌ సంబరానికి అంతా సిద్ధమైంది. ఇన్ని రోజుల తెరపై అభిమానులను అలరించిన సినీ తారలు గ్రౌండ్‌లో అడుగుపెట్టనున్నారు. ఇప్పుడు నటనతో కాదు.. బ్యాట్, బాల్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకోనున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) సమరానికి సమయం ఆసన్నమైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఫిబ్రవరి 8 నుంచి ఈ క్రికెట్ సమరం మొదలు కానుంది. ఈనేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌లో టాలీవుడ్‌ సినీ తారలకు చెందిన తెలుగు వారియర్స్‌ టీమ్‌ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈవెంట్‌లో జట్టు కెప్టెన్‌ అఖిల్‌ (Akhil Akkineni)తో పాటు తమన్‌, ఆది, అశ్విన్‌, రఘు, సామ్రాట్‌ పాల్గొన్నారు. జట్టు యజమాని సచిన్‌ జోషి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ మాట్లాడుతూ.. మేము నాలుగుసార్లు కప్ గెలిచామని వెల్లడించారు. ఈసారి మేమే ఛాంపియన్స్‌గా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కాగా.. ఈ సీసీఎల్ లీగ్‌లో మొత్తం 7 సినీ సెలబ్రిటీ జట్లు తలపడనున్నాయి. చెన్నై రైనోస్, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్‌ టైగర్స్, పంజాబ్‌ ది షేర్, బోజ్‌పురి దబాంగ్స్‌  పోటీ పడుతున్నాయి. ఈ నెల 8న బెంగళూరు వేదికగా ఈ టోర్నీ మొదలు కానుంది. ప్రస్తుతం జరుగుతున్న 11 వ సీజన్‌ జనవరి 31న హైదరాబాద్‌లోనే ప్రారంభం కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో షెడ్యూల్‌లో మార్పులు చేశారు.

ccl

కాగా.. ఈ ఏడాది సీసీఎల్ టోర్నమెంట్ ఫిబ్రవరి 8న బెంగళూరులో ప్రారంభమై మార్చి 2 వరకు కొనసాగుతుంది. తొలి రోజు మ్యాచ్‌లో చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్‌, సాయంత్రం కర్ణాటక బుల్డోజర్స్‌ టీమ్.. తెలుగు వారియర్స్‌ను ఢీకొంటుంది. హైదరాబాద్‌లో ఈనెల 14,15 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సీజన్‌లో కూడా అఖిల్ అక్కినేని తెలుగు వారియర్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్‌లన్నీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతాయి. సెమీ-ఫైనల్, ఫైనల్ మార్చి 1, 2 తేదీల్లో జరగనున్నాయి. 
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement