బెంగళూరుకు తెలుగు వారియర్స్ కెప్టెన్‌.. తొలి మ్యాచ్‌కు రెడీ | Akhil Akkineni Reached Bangalore For Telugu Warriors CCL Match | Sakshi
Sakshi News home page

Akhil Akkineni: బెంగళూరుకు తెలుగు వారియర్స్ కెప్టెన్‌ అఖిల్‌.. తొలి మ్యాచ్‌ ఎప్పుడంటే?

Published Fri, Feb 7 2025 5:12 PM | Last Updated on Fri, Feb 7 2025 6:21 PM

Akhil Akkineni Reached Bangalore For Telugu Warriors CCL Match

సినీ, క్రీడా అభిమానులను అలరించే సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌కు అంతా సిద్ధమైంది. బెంగళూరు చిన్నస్వామి స్డేడియం వేదికగా ఈ ఏడాది సీసీఎల్(CCL) ప్రారంభం కానుంది. దాదాపు 7 జట్లు ఈ సారి కప్‌ కోసం పోటీపడుతున్నాయి. తెలుగు వారియర్స్‌(Telugu Warriors) తన తొలి మ్యాచ్‌లో కన్నడ బుల్డోజర్స్‌ను ఢీకొట్టనుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని మాట్లాడారు. ఇప్పటికే నాలుగుసార్లు కప్‌ గెలిచామమని.. ఈ సారి కూడా ఛాంపియన్స్ అవుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సీసీఎల్‌ తొలి మ్యాచ్ కోసం అక్కినేని అఖిల్‌ ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో అఖిల్ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లీగ్ తొలి మ్యాచ్‌లో చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్ తలపడనుండగా.. ఆ తర్వాత జరిగే రెండో మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ తన కప్‌ వేటను ప్రారంభించనుంది. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్‌తో తలపడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement