Telugu Warriors
-
ప్రత్యేకంగా నీ బ్యాటింగ్ కోసమే వచ్చా బ్రో: విశ్వక్ సేన్
ఇటీవల సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) మ్యాచులు హైదరాబాద్‌లో నిర్వహించారు. మార్చి 1,2,3 తేదీల్లో వరుసగా మ్యాచులతో టాలీవుడ్ స్టార్స్.. ఇతర సినీ ఇండస్ట్రీ టీమ్స్ కూడా సందడి చేశాయి. ఉప్పల్ స్డేడియం వేదికగా ఈ మ్యాచులు జరిగాయి. అయితే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మన తెలుగు వారియర్స్ టీమ్‌లో స్టార్ బ్యాటర్‌గా కొనసాగుతున్నారు. తాజాగా మన యంగ్ నిఖిల్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. విశ్వక్సేన్తో ఫన్నీగా సంభాషిస్తూ కనిపించారు. అదేంటో మీరు ఓ లుక్కేయండి. ఇటీవల జరిగిన ఉప్పల్ మ్యాచ్‌లో యంగ్ హీరోలు నిఖిల్, విశ్వక్ సేన్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నిఖిల్ బ్యాటింగ్ చూసేందుకు స్టేడియానికి వచ్చానని విశ్వక్ సేన్ చెప్పడంతో వీరిద్దరి మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. 'నిఖిల్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు.. నేను ప్రత్యేకంగా నిఖిల్ బ్యాటింగ్ కోసమే వచ్చా. బ్యాటింగ్ టిప్స్ బాగా తెలుసు. ఇటీవలే రిజల్ట్ కూడా వచ్చింది' అంటూ విశ్వక్ సేన్ నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను నిఖిల్, విశ్వక్ సేన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. విశ్వక్ సేన్ నటించిన చిత్రం గామి ఈ వారం థియేటర్లలో సందడి చేయనుంది. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. Thanks a lot bro , nice batting bro . 🤗❤️ https://t.co/sXv26lAY7d — VishwakSen (@VishwakSenActor) March 2, 2024 -
ఒక్కడికి సీరియస్‌నెస్ లేదు; థర్డ్ అంపైర్‌కు మెంటల్ ఎక్కించారు
సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో ఒక వింత సన్నివేశం చోటుచేసుకుంది. ఆడుతుంది ఎంత ఫ్రెండ్లీ మ్యాచ్ అయినా కాస్త అయినా సీరియస్‌నెస్ లేదు. పిచ్చి చేష్టలతో థర్డ్ అంపైర్‌కు మెంటల్ ఎక్కించారు ఇరుజట్ల ఆటగాళ్లు. విషయంలోకి వెళితే.. తెలుగు వారియర్స్, కర్నాటక బుల్డోజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తెలుగు వారియర్స్‌కు అఖిల్ నేతృత్వం వహించగా.. కర్నాటకకు సుదీప్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే కర్నాటక ఇన్నింగ్స్ సమయంలో విచిత్ర సంఘటన జరిగింది. బౌలర్ వేసిన బంతిని కర్నాటక బ్యాటర్ కవర్స్ దిశగా ఆడాడు. సింగిల్ బాగానే పూర్తి చేసిన బ్యాటర్లు రెండో పరుగు కోసం యత్నించారు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్ నుంచి వెళ్లిన బ్యాటర్.. కీపర్ బంతిని స్టంప్స్‌కు వేసే సమయానికి అతనికి అడ్డుగా వెళ్లాడు. దీంతో రనౌట్ చాన్స్ మిస్ అయింది. బంతి కూడా దూరంగా వెళ్లడంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ మూడో పరుగు కోసం స్ట్రైకింగ్ ఎండ్‌కు వచ్చేశాడు. అప్పటికి మరొక బ్యాటర్ అక్కడే ఉన్నాడు. తెలుగు వారియర్స్ ఫీల్డర్ చెత్త త్రో వేయడం.. ఇంతలో ఎవరు ఊహించని హైడ్రామా జరిగింది. మైదానంలోకి మూడో బ్యాటర్ ఎంటరయ్యాడు. అసలు అతను ఎందుకు వచ్చాడో ఎవరికి అర్థం కాలేదు. ఇదంతా ఒక ఎత్తు అంటే.. చివరికి ఇద్దరు బ్యాటర్లు మళ్లీ ఒకే ఎండ్‌లోకి చేరుకోవడం.. అటు ఫీల్డర్ కూడా సరైన త్రో వేయడంతో ఈసారి కీపర్ వికెట్లను గిరాటేశాడు. కానీ స్ట్రైకింగ్ ఎండ్‌లో బ్యాటర్లు ఎవరు లేరన్న విషయాన్ని గుర్తించిలేకపోయారు. ఆ తర్వాత తెలుగు వారియర్స్ ఆటగాళ్లు ఔట్ అంటూ అప్పీల్ చేశారు. మైదానంలో ఉన్న ఫీల్డ్ అంపైర్లకు ఏం అర్థంగాక థర్డ్ అంపైర్‌ను సంప్రదించారు. అప్పటికే ఆటగాళ్ల పిచ్చి చేష్టల కారణంగా థర్డ్ అంపైర్‌కు మెంటల్ ఎక్కే ఉంటుంది. ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థంకాక కాసేపు అలాగే ఉండిపోయాడు. చివరకు ఏం రివ్యూ ఇవ్వాలో తెలియక బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించి.. అటు పరుగులు ఇవ్వలేదు.. ఇటు బంతిని కౌంట్ చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేతగా తెలుగు వారియర్స్ నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దబాంగ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను పది ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఆదిత్య 26, అస్గర్ 11 పరుగులు చేశారు. వారియర్ నందకిషోర్ రెండు వికెట్లు తీశాడు.ప్రతిగా బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓపెనర్ అఖిల్ 67 పరుగులతో రాణించాడు. తరువాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దబాంగ్ ఆరు వికెట్లకు 89 పరుగులు చేసింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన తెలుగు వారియర్స్ 6.1 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోయి విజయలక్ష్యాన్ని సాధించింది. చదవండి: తెలివైన క్రికెటర్.. 'క్యాచ్‌లందు ఈ క్యాచ్ వేరయా' -
అఖిల్ అక్కినేని విధ్వంసం.. తెలుగు వారియర్స్ బంపర్ విక్టరీ
ఐపీఎల్ కంటే ముందే క్రికెట్ పండగ సందడి చేస్తోంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ షురూ అయింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్.. కేరళ స్ట్రైకర్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అక్కినేని అఖిల్ రెచ్చిపోయారు. కేవలం 30 బంతుల్లోనే 91 పరుగులు చేసి ఔరా అనిపించారు. మొదట బ్యాటింగ్ దిగిన టాలీవుడ్ స్టార్స్ 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. యువ హీరో ప్రిన్స్ 23 బంతుల్లో 45 పరుగులు చేశారు. హీరో సుధీర్ బాబు 2 బంతుల్లో 2 పరుగులు, అశ్విన్ బాబు 6 బంతుల్లో 15 పరుగులు చేశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కేరళ స్టార్స్ 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 98 పరుగులు మాత్రమే చేశారు. హీరో ప్రిన్స్ నాలుగు వికెట్లు తీయగా, నందకిషోర్ ఒక వికెట్ తీశాడు. అత్యధిక పరుగులు చేసినందుకు అఖిల్‌కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లభించింది. ప్రస్తుతం అఖిల్ సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. It's a MASSIVE win for Telugu warriors at Kerala strikers in @ccl 🔥🔥#AGENT aka @AkhilAkkineni8 leading from the front & conquers at Raipur Stadium with his WILD innings of 91 runs in just 30 balls 💪💥💥@TeluguWarriors1 @keralastrikers_ #CCL2023 #CelebrityCricketLeague2023 pic.twitter.com/CtovKs85n0 — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 19, 2023 -
త్వరలోనే క్రికెట్ పండగ.. ఎనిమిది జట్లతో మెగా టోర్నీ
సెలబ్రీటీల క్రికెట్ సందడి త్వరలోనే మొదలు కానుంది. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కానున్నట్లు సీసీఎల్ ట్వీట్ చేసింది. ఈ మెగా టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఎనిమిది ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను క్రికెట్ ఫీల్డ్‌లోకి తీసుకువచ్చే బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ ప్రాపర్టీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మళ్లీ తిరిగి వచ్చింది. ఈ మెగా లీగ్ ఫిబ్రవరి 18, 2023 నుండి ప్రారంభమవుతుందని సీసీఎల్ వెల్లడించింది. తెలుగు వారియర్స్ టీమ్‌కు అక్కినేని అఖిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. సీసీఎల్ పాల్గొనే ఎనిమిది జట్లు ఇవే: తెలుగు వారియర్స్ కేరళ స్ట్రైకర్స్ ముంబయి హీరోస్ కర్ణాటక బుల్డోజర్స్ భోజ్‌పురి దబాంగ్స్ చెన్నై రైనోస్ బెంగాల్ టైగర్స్ పంజాబ్ దే షేర్ The Biggest Sportainment Property Celebrity Cricket League (CCL) that brings together actors from 8 Film Industries on to cricket field is back. Parle Biscuits picks the Title Sponsor Rights of the Reloaded #CCL2023 which will start from 18th February 2023. #HappyHappyCCL pic.twitter.com/MzIdBVMy8H — CCL (@ccl) January 28, 2023 -
సీసీఎల్-6 విజేత తెలుగు వారియర్స్
-
ఉప్పల్ స్టేడియంలో సినీతారల క్రికెట్ సందడి
-
తెలుగు వారియర్స్ కు సీసీఎల్-5 టైటిల్
-
తెలుగు వారియర్స్ కు సీసీఎల్-5 టైటిల్
-
ఫైనల్ కు చేరిన తెలుగు వారియర్స్
హైదరాబాద్: సీసీఎల్ క్రికెట్ లీగ్(సీసీఎల్)లో తెలుగు వారియర్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ముంబై హీరోస్ తో జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు ప్రవేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసింది. దీంతో తరువాత బ్యాటింగ్ చేపట్టిన తెలుగు వారియర్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 17.2 లక్ష్యాన్ని చేరుకుంది. తెలుగు వారియర్స్ ఆటగాళ్లలో ప్రిన్స్ (63), ఎస్ బాబు(53) పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరి వరకూ వీరిద్దరూ క్రీజ్ లో ఉండి చక్కటి విజయాన్నిఅందించారు. -
టాలీవుడ్ వారియర్స్ లక్ష్యం 142
హైదరాబాద్: సెలెబ్రిటీ క్రికెట్ లీగ్( సీసీఎల్)లో భాగంగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో టాలీవుడ్ వారియర్స్ తో జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో ముంబై హీరోస్ 142 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన టాలీవుడ్ వారియర్స్ తొలుత ముంబై హీరోస్ బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ముంబై హీరోస్ నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసింది. ఆదిలో తడబడ్డ ముంబై తరువాత తేరుకుని గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసింది. ముంబై ఆటగాళ్లలో బెహ్రావానీ(42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేయడం గమనార్హం. టాలీవుడ్ బౌలర్లలో జోషికి రెండు వికెట్లు లభించాయి. -
తెలుగు వారియర్స్ Vs భోజ్ పూరి దబాంగ్స్ మ్యాచ్
-
సీసీఎల్: తెలుగు వారియర్స్ జయభేరి
రాంచీ: సెలెబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ అద్భుత విజయం సాధించింది. శనివారం రాత్రి రాంచీలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ 10 వికెట్ల తేడాతో భోజ్‌పురి దబాంగ్స్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దబాంగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. అనంతరం తెలుగు వారియర్స్ వికెట్ కూడా నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. సచిన్ జోషీ , ప్రిన్స్ అజేయ హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు. -
వారియర్స్ ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ తరహాలో చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)లో తెలుగు వారియర్స్ చేతులెత్తేసింది. సెమీస్‌కు చేరుకోవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన ఈ మ్యాచ్‌లో బౌలర్లు, ఫీల్డింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. తద్వారా ఈసారి కూడా టైటిల్ గెలవకుండానే నిష్ర్కమించింది. శనివారం లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడింది. దీంతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు పరాజయాలతో సెమీస్‌కు చేరకుండానే నిష్ర్కమించినట్టయ్యింది. కర్ణాటక ఇంతకుముందే సెమీస్‌కు చేరింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన తెలుగు వారియర్స్... అఖిల్ (46 బంతుల్లోనే 90; 7 ఫోర్లు; 4 సిక్స్) అద్భుత ఆటతీరుతో 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 190 పరుగులు చేసింది. ప్రొఫెషనల్ ఆటగాడిని తలపించే స్థాయిలో అఖిల్ మైదానం నలువైపులా బౌండరీల మోత మోగించాడు. అన్ని రకాల షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చూపాడు. అంతకుముందు ఓపెనర్లు ప్రిన్స్ (39 బంతుల్లో 50; 1 ఫోర్; 1 సిక్స్), సుధీర్ బాబు (34 బంతుల్లో 41; 4 ఫోర్లు) జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన అఖిల్ వచ్చీ రావడంతోనే జోరు చూపించాడు. 8వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన తను దుమ్మురేపే ఆటతీరుతో స్టేడియాన్ని హోరెత్తించాడు. సిక్సర్లతో స్కోరును రాకెట్ వేగంతో తీసుకెళ్లాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 194 పరుగులు చేసి నెగ్గింది. తొలి ఓవర్లోనే వికెట్ పడింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ధృవ్ (50 బంతుల్లో 70 నాటౌట్; 10 ఫోర్లు) ఏమాత్రం బెదరకుండా లక్ష్యం వైపు జట్టును నడిపించాడు. కచ్చితమైన షాట్లతో విరుచుకుపడుతూ స్కోరును గాడిన పెట్టాడు. రాజీవ్ (21 బంతుల్లో 53; 1 ఫోర్; 7 సిక్స్) రాకతో ఆట స్వరూపమే మారిపోయింది. 19వ ఓవర్లో తను అవుట్ కావడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. చివరి ఓవర్లో 5 పరుగులు కావాల్సిన దశలో అఖిల్ కట్టుదిట్టంగా బంతులు విసిరినా భాస్కర్ (8) ఓ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. -
ఒకరు సచిన్‌లా... ఒకరు ధోనీలా...
సినిమా... క్రికెట్ ... వీటిలో దేనిపై ఎక్కువ మక్కువ? వెంటనే సమాధానం చెప్పడం కష్టం. క్రికెటర్లు తెరపై కనిపించడం చాలా తక్కువ. కానీ, నటులు క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టి చాన్నాళ్లయింది. సరదా కోసమో, నిధుల సేకరణ నిమిత్తమో సినీ తారలు బ్యాట్ పట్టుకొని మైదానంలోకి వచ్చిన సందర్భాలు 1950ల నాటి నుంచి ఉన్నాయి. ఇక, ఇటీవలి కాలంలో స్టార్ క్రికెటర్లు ఏటా ఏదో ఒక సందర్భంలో క్రికెట్ స్టేడియంలో దాదాపు ప్రొఫెషనల్స్‌లా తమ ప్రతిభను చూపిస్తూ ఉన్నారు. ఒకరు సచిన్‌లా... మరొకరు ధోనీలా మైదానంలో చెలరేగుతున్నారు. అటు సినిమా ఫ్యాన్స్, ఇటు క్రికెట్ ఫ్యాన్స్ కేరింతల మధ్య సిక్స్‌లు, ఫోర్లు కొడుతూ అభిమానాన్ని బౌండరీలు దాటిస్తున్నారు. ఓ వైపు షూటింగ్, మరోవైపు క్రికెట్ ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్న స్టార్ క్రికెటర్లను పలకరిస్తే వారు ఎన్నెన్నో కబుర్లు చెప్పారు. సేవ పేరుతో మొదలైన స్టార్ క్రికెట్ ఆటలు ఇప్పుడు కప్‌లు గెలుచుకునేవరకూ వెళ్లాయి. మూడేళ్లుగా పరభాషా నటులతో కలిసి మన స్టార్లు ఆడుతున్న మ్యాచ్‌లను చూస్తుంటే సినిమా అభిమానులకు, క్రికెట్ అభిమానులకు కన్నుల పండువలా ఉంది. ఇలా క్రికెటర్ల అవతారమెత్తి స్టేడియంలో దర్శనమివ్వడం హీరోలకు కూడా కొత్తగా, గర్వంగా ఉంటోంది. క్రికెటర్ల హోదాలో అందుకుంటున్న ఆతిథ్యం దగ్గర నుంచి కొట్టే సిక్స్, పట్టే క్యాచ్ వరకూ అన్నీ వారికి అపురూపమైన జ్ఞాపకాలే. ఇంత గొప్ప వేడుక వెనుక వారు చేస్తున్న కసరత్తు విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. మూడు వారాల నుంచి హైదరాబాద్ గచ్చిబౌలి దగ్గర ఔటర్రింగ్రోడ్డుకి సమీపంలోని ఓ గ్రౌండ్లో మన ‘తెలుగు వారియర్స్’ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. రోజుకి ఐదు గంటల చొప్పున వారానికి నాలుగురోజులు సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్న మన హీరోల సాధన అనుభవాలు వింటే మనకు కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. సాధనే గెలుపు మంత్రం: వెంకటేష్ ఏ ఆటకైనా సాధన ఉండాలి. అదే గెలుపునకు దారి చూపెడుతుంది. ప్రొఫెషనల్ ట్రైనింగ్ కూడా అవసరం. సిసిఎల్4 (సెల బ్రెటీ క్రికెట్ లీగ్4) స్టార్ క్రికెటర్స్‌కి ఇది చాలా అవసరం. పైగా ఇది మన ఊళ్లో మనవాళ్లతో ఆడుతున్న ఆటకాదు. ఎనిమిది రాష్ట్రాల నుంచి ఎనిమిది టీమ్‌లు బరిలోకి దిగాయి. అన్నీ కూడా నువ్వా...నేనా అన్నట్టు ఉన్నాయి. అలాగని ఇది పూర్తిగా ఒత్తిడిని ఎదుర్కొనే గేమ్ కాదు. చాలా ఆరోగ్యకరమైన పోటీ. మన దేశంలోని సినిమా రంగం ఆటపేరుతో ఏర్పాటు చేసుకున్న అందమైన వేదిక. మా తెలుగు వారియర్స్ జట్టు చాలా సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. నేను కూడా ఇక్కడికి రోజూ వస్తున్నాను. ఇంట్లో రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌తో పాటు ఇక్కడ ఆట నన్ను మరింత ఫిట్‌గా ఉంచుతోంది. ఈ మధ్యనే కాలికి గాయం అవ్వడం వల్ల కొన్నిసార్లు బ్యాటింగ్ నుంచి తప్పుకుంటున్నాను. వైస్ కెప్టెన్ అఖిల్ దగ్గర నుంచి నిఖిల్ వరకూ అందరూ చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈసారి పవర్‌ప్లేలో(మొదటి ఆరు ఓవర్లలో) హీరోలు మాత్రమే ఆడాలి. సిసిఎల్ పేరుతో ఏడాదిలో నెల రోజులు మరో ప్రొఫెషన్లో బిజీగా గడపడాన్ని స్టార్ క్రికెటర్లందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కోరిక తీరింది: అఖిల్ చిన్నప్పటి నుంచి క్రికెటర్‌ను అవ్వాలన్న కోరిక ఇప్పుడు తీరిపోయింది. క్రికెట్ అంటే ఇష్టం ఉండని అబ్బాయి ఎవరుంటారు చెప్పండి. తెలుగు వారియర్స్‌కి వైస్ కెప్టెన్‌గా ఆడుతున్నాను. క్రికెట్‌పై నాకున్న ఆసక్తి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి ఆదివారం క్రికెట్ ఆడాల్సిందే. రెండే రెండు కారణాలు మాత్రం నా ఆదివారం ఆటను ఆపగలవు. ఒకటి వర్షం, రెండోది నేను ఊళ్లో లేకపోవడం. నేను ఆస్ట్రేలియాలో చదువుకున్న రోజుల్లో కూడా క్రికెట్టే నా ప్రపంచం. ప్రతి వీకెండ్‌కి అక్కడ స్పెషల్ మ్యాచ్‌లు ఆడేవాడిని. అందులో భాగంగా కొంత శిక్షణ కూడా తీసుకున్నాను. ఇక ఇక్కడ ప్రాక్టీస్ అంటారా...ఒక్కరోజు ఎగ్గొట్టినా లోపల భయం మొదలవుతుంది. పైగా వైస్ కెప్టెన్ కావడంవల్ల టీం ప్రాక్టీస్‌ని సీరియస్‌గా గమనించే బాధ్యత కూడా నేను చూసుకోవాలి. వెంకీ అంకుల్ అందిస్తున్న ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ముప్పై, నలభై వేలమంది ప్రజల మధ్య బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి దిగడాన్ని గర్వంగానే కాదు పెద్ద బాధ్యతగా కూడా ఫీలవుతున్నాం. అంతా క్రికెట్ పుణ్యమే: నిఖిల్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఆడినపుడు సచిన్ వాడిన డ్రసింగ్ రూమే మాకూ ఇచ్చారు. ఆ సమయంలో నేనెంత గర్వపడ్డానంటే....కేవలం స్టార్ క్రికెటర్స్ మ్యాచ్‌ల పుణ్యమే ఇదంతా అనిపించింది. సల్మాన్‌ఖాన్ లాంటి స్టార్ హీరో మాకు షేక్‌హ్యాండ్ ఇచ్చి ఆల్‌దిబెస్ట్ చెప్పిన సంఘటన వెనకున్న కారణం కూడా క్రికెట్టే. అందుకే దీన్ని మేం చాలా సీరియస్‌గా తీసుకున్నాం. రోజూ ఇక్కడ ఐదు గంటల ప్రాక్టీస్ ఉంటుంది. ఒకపక్క షూటింగ్‌లు... మరో పక్క క్రికెట్ ప్రాక్టీస్. రెండింటికీ న్యాయం చేయడంలో కొంత ఇబ్బంది పడ్డా... ఏడాదిలో ఒకే ఒక్కసారి వచ్చే అవకాశాన్ని మిస్ చేసుకోలేం కదా! మా ఫిజియో వెంకట్ కూడా మాకు బాగా సాయపడుతున్నారు. ప్రతి ప్రాక్టీస్గేమ్కి ముందు ఆయన మా బాడీ ఫిటెనెస్ పరీక్ష చేసి ఎక్కడైనా నొప్పి ఉన్నా...ఒత్తిడిగా ఫీలయినా మసాజ్‌తో సరిచేస్తారు. ఆ తర్వాత వార్మప్ అయ్యాక మా బాడీ ఆటకు రెడీ అవుతుందన్నమాట. కప్ గ్యారెంటీ: తరుణ్ సినిమాల్లోకి రాకపోతే నేను తప్పనిసరిగా క్రికెటర్‌నే అయ్యేవాడిని. అందులో సందేహం లేదు. ఆ లోటును తీర్చడానికే సిసిఎల్ వచ్చిందనిపిస్తోంది. అదే క్రికెట్ గ్రౌండ్...అదే జనం...అవే వసతులు..అవే మర్యాదలు...వీటి మధ్య బ్యాట్ పట్టుకుని ఒకరు సచిన్‌లా ఫీలైతే ఒకరు ధోనీలా ఫీలవుతూ కొట్టే షాట్లు, పట్టే క్యాచ్‌లు...నిజంగా మేం చాలా అదృష్టం చేసుకున్నాం. వీకెండ్ ఉండే మ్యాచ్ రాత్రిపూట ఉంటే ఇక్కడ రాత్రివేళలో ప్రాక్టీస్ చేస్తున్నాం. మధ్యాహ్నం ఉంటే ఇక్కడ కూడా మధ్యాహ్నమే ఆడుతున్నాం. ఆడబోయే సమయానికి అప్పుడున్న వాతావరణానికి అలవాటు పడడానికి రకరకాల పద్ధతుల్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈసారి కప్పు కచ్చితంగా గెలుస్తామని చెబుతున్నాను. ఇక ఆ పొరపాటు జరగదు: సచిన్ మా తెలుగు వారియర్స్ జట్టు తప్పకుండా కప్ గెలుస్తుందని చెప్పడానికి ఇక్కడ జరుగుతున్న ప్రాక్టీస్మ్యాచ్లే నిదర్శనం. ఇలాంటి ప్రత్యేక శిక్షణ పెద్దగా లేకపోవడం వల్లనో ఏమో గత ఏడాది చాలామంది ఆటగాళ్లకు గాయాలయ్యాయి. ఈసారి అలాంటి సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతిరోజూ ప్రాక్టీస్ మ్యాచ్ పెట్టుకున్నాం. చాముండేశ్వరీనాథ్గారు కూడా మాలోని లోపాల్ని గమనించి వాటిని అధిగమించేలా శిక్షణనిస్తున్నారు. కేవలం పండ్లు, ప్రొటీన్ షేక్స్: రఘు ఈ ప్రాక్టీస్ వల్ల అనుభవం రావడమే కాక ప్రతి ఒక్కరు నాలుగేసి కిలోల బరువు కూడా తగ్గిపోయారు. ఎన్ని రకాల జిమ్‌లకు వెళ్లినా రాని ఫిట్నెస్ వస్తోందిక్కడ. ఇక మానసిక ఉల్లాసమంటారా...ఇక్కడ తోటినటులతో సాన్నిహిత్యంతో పాటు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న నటులతో పరిచయాలు... స్నేహాలు అన్నీ మా పాలిట వరాలే. సిసిఎల్ లేకుండా భోజ్‌పురిలో పాపులర్ నటుడి గురించి మాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. బెంగాలీలో ఉన్న నటులతో స్నేహం ఎలా కుదురుతుంది చెప్పండి. అలాగని వారితో కలిసి ఆడే అవకాశంగా భావించి ఊరుకుంటే సరిపోదు. ఈసారి కప్ తేకుంటే తెలుగు వారియర్స్‌ని తెలుగు ప్రేక్షకులు క్షమించరు జుట్టును. (నవ్వుతూ) ఒక పక్క కర్ణాటక, మరో పక్క బాలీవుడ్ ఎడాపెడా వాయించేస్తున్నాయి. మేం కూడా వారికి దీటుగా ఆడడానికే సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ నెలరోజులు ఆరోగ్య విషయంలో, ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్లామర్ తగ్గకుండా జాగ్రత్తలు: సామ్రాట్ చిన్నప్పుడు స్కూల్లో గ్రౌండ్లో ఆడిన జ్ఞాపకాలన్నీ మా కళ్లముందు కదలాడే క్షణాలివి. ఫేవరెట్ స్పోర్ట్ ఏంటని ఎవరిని అడిగినా ప్రశ్న పూర్తవ్వకుండా చెప్పే సమాధానం క్రికెట్. ఒకపక్క తెరపై గ్లామర్‌గా కనిపించాలి. మరోపక్క ఇక్కడ ఇలా ఎండలో ప్రాక్టీస్ చేయాలి. రెండూ ముఖ్యమైనవే కాబట్టి రిస్క్ తీసుకోవడం తప్పడం లేదు. ప్రొఫెషనల్ క్రికెటర్స్కే గ్రౌండ్లోకి వెళ్లగానే ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. ఇక మా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి! అందుకే ఈ తిప్పలన్నీ. మా వెంకీసార్ చెప్పినట్టు సాధనొక్కటే అలాంటి ఆందోళన నుంచి బయటపడేస్తుంది. అందుకే అన్ని పనులూ పక్కన పెట్టి మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఇక్కడ వాలిపోతున్నాం. లోపాల్ని అధిగమించడానికి నేను ఎక్కువగా నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. కొత్త స్నేహితులు దొరికారు: సుధీర్‌బాబు నేను ఆల్‌రౌండర్‌ని. మోహన్‌బాబుగారి అబ్బాయి విష్ణు, నేను చిన్నప్పుడు క్లాస్‌మేట్స్‌మి. మా ఇద్దరికీ స్కూల్ జ్ఞాపకాలకంటే క్రికెట్ గ్రౌండ్ జ్ఞాపకాలే ఎక్కువ. ప్రస్తుతం నా ఆటను చూసి సలహాలిస్తుంటాడు. అతనొక్కడే కాదు..చాలామంది చిన్ననాటి స్నేహితులు నన్ను గ్రౌండ్లో చూసి సంతోషపడుతున్నారు. స్టార్ క్రికెట్ వల్ల పరభాషానటులతో పరిచయాలు, అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకునే అవకాశం కలిగింది మాకు. ఎనిమిది టీమ్‌ల నటుల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పటికే చాలావరకూ మా ఫేస్‌బుక్‌లోకి వచ్చేశారనుకోండి. అలాగే నిజమైన క్రికెటర్ల స్థానంలో ఉండి ఆడుతున్నాం అనే ఫీలింగ్ మమ్మల్ని మరింత సంతోషంగా ఉంచుతోంది. - భువనేశ్వరి టీంవర్క్ని నమ్మారు... గుడ్ టీం. తెలుగు వారియర్స్ ఈసారి చాలా పట్టుదలగా ఉన్నారు. ‘షూటింగ్‌లు...ముఖ్యమైన పనులు అన్నీ ప్రాక్టీస్ తర్వాతే’ అంటున్నారు. వీరి ఉత్సాహం, ప్రాక్టీస్ చేసే విధానం చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వెంకటేష్‌గారి కెప్టెన్సీలో యువహీరోలంతా చాలా ఉత్సాహంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈసారి టీంవర్క్పై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. - చాముండేశ్వరీనాథ్, ‘తెలుగు వారియర్స్’ జట్టు మెంటర్ ప్రాక్టీస్ మ్యాచ్‌లే కోచింగ్ క్యాంపులు! మన తెలుగు హీరోలు చేస్తున్న ప్రాక్టీస్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చెన్నై, కర్ణాటక టీమ్‌లు వీకెండ్‌కి ముందు ప్రత్యేకంగా కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. దానికి భిన్నంగా మన తెలుగు స్టార్స్ ప్రతి రోజు ఐదుగంటలపాటు ఇక్కడ లోకల్ ఆటగాళ్లతో పోటీ మ్యాచ్‌లు ఆడుతున్నారు. అవే వాళ్లకు పెద్ద కోచింగ్ క్యాంపులు. వాళ్ల సీరియస్‌నెస్ చూస్తుంటే వారిలో ప్రొఫెషనల్ క్రికెటర్స్ కనిపిస్తున్నారు. - విష్ణు ఇందూరి, సిసిఎల్ ఫౌండర్ -
దుమ్మురేపిన తెలుగు వారియర్స్
కటక్: సీసీఎల్ టోర్నీ మరోసారి అభిమానులకు టి-20 మజా అందించింది. శనివారం రాత్రి కటక్‌లో జరిగిన పోటీలకు అభిమానులు పోటెత్తారు. టాలీవుడ్ నటుల జట్టు తెలుగు వారియర్స్ దుమ్మురేపింది. భోజ్‌పురి దబాంగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ విజయం సాధించింది. భోజ్‌పురి దబాంగ్స్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ రెండు వికెట్లతో గెలుపొందింది. అంతకుముందు ముంబై హీరోస్, బెంగాల్ టైగర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.