CCL 2023, Kerala Strikers Vs Telugu Warriors Highlights: Telugu Warriors Beat Karnataka Strikers By 64 Runs - Sakshi
Sakshi News home page

CCL 2023 :అఖిల్ అక్కినేని విధ్వంసం.. తెలుగు వారియర్స్ విక్టరీ

Published Sun, Feb 19 2023 9:37 PM | Last Updated on Mon, Feb 20 2023 8:50 AM

Telugu Warriors Won The Match Against Kerala Strikc - Sakshi

ఐపీఎల్ కంటే ముందే క్రికెట్ పండగ సందడి చేస్తోంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ షురూ అయింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్.. కేరళ స్ట్రైకర్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అక్కినేని అఖిల్ రెచ్చిపోయారు. కేవలం 30 బంతుల్లోనే 91 పరుగులు చేసి ఔరా అనిపించారు. మొదట బ్యాటింగ్ దిగిన టాలీవుడ్ స్టార్స్ 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. యువ హీరో ప్రిన్స్ 23 బంతుల్లో 45 పరుగులు చేశారు. హీరో సుధీర్ బాబు 2 బంతుల్లో 2 పరుగులు, అశ్విన్ బాబు 6 బంతుల్లో 15 పరుగులు చేశారు.

అనంతరం లక్ష‍్య ఛేదనకు దిగిన కేరళ స్టార్స్ 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 98 పరుగులు మాత్రమే చేశారు.  హీరో ప్రిన్స్ నాలుగు వికెట్లు తీయగా, నందకిషోర్ ఒక వికెట్ తీశాడు. అత్యధిక పరుగులు చేసినందుకు అఖిల్‌కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లభించింది. ప్రస్తుతం అఖిల్ సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement