CCL
-
హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించిన కిచ్చా సుదీప్
కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హైదరాబాద్ మెట్రో రైలులో సందడి చేశారు. సీసీఎల్ మ్యాచ్‌ల కోసం హైదరాబాద్‌కు విచ్చేసిన సుదీప్ మెట్రోలో ప్రయాణించారు. అంతేకాకుండా మెట్రో స్టేషన్లో తన టీమ్‌తో కలిసి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను హైదరాబాద్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ ఏడాది సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్డేడియంతో రెండు రోజుల పాటు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక బుల్డోజర్స్ టీమ్ నగరానికి చేరుకుంది. ఉప్పల్ స్డేడియం వెళ్లేందుకు మెట్రోలో ప్రయాణించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. కిచ్చా సుదీప్ కర్ణాటక బుల్డోజర్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఉప్పల్ స్డేడియంలో జరగనున్న మ్యాచ్‌లో చెన్నై రైనోస్‌తో తలపడతారు. మరో మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్- తెలుగు వారియర్స్‌ను ఢీకొట్టనుంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఫైనల్స్ మార్చి 2న జరగనుంది. ఇక సినిమాల విషయానికొస్తే కిచ్చా సుదీప్ చివరిసారిగా మాక్స్ మూవీలో కనిపించాడు. View this post on Instagram A post shared by Hyderabad Metro Rail (@lthydmetrorail) -
బెంగళూరుకు తెలుగు వారియర్స్ కెప్టెన్.. తొలి మ్యాచ్‌కు రెడీ
సినీ, క్రీడా అభిమానులను అలరించే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌కు అంతా సిద్ధమైంది. బెంగళూరు చిన్నస్వామి స్డేడియం వేదికగా ఈ ఏడాది సీసీఎల్(CCL) ప్రారంభం కానుంది. దాదాపు 7 జట్లు ఈ సారి కప్ కోసం పోటీపడుతున్నాయి. తెలుగు వారియర్స్(Telugu Warriors) తన తొలి మ్యాచ్‌లో కన్నడ బుల్డోజర్స్‌ను ఢీకొట్టనుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని మాట్లాడారు. ఇప్పటికే నాలుగుసార్లు కప్ గెలిచామమని.. ఈ సారి కూడా ఛాంపియన్స్ అవుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.సీసీఎల్ తొలి మ్యాచ్ కోసం అక్కినేని అఖిల్ ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో అఖిల్ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లీగ్ తొలి మ్యాచ్‌లో చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్ తలపడనుండగా.. ఆ తర్వాత జరిగే రెండో మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ తన కప్ వేటను ప్రారంభించనుంది. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్తో తలపడుతోంది.INDIA'S BIGGEST SPORTAINMENT EVENT CCL STARTS *TOMORROW*... The 11th season of #CelebrityCricketLeague [#CCL] starts on 8 Feb 2025... Witness the thrill as #India's leading stars clash on the cricket field.Watch LIVE on #SonyTen3 and #Hotstar.#CCL2025Live | #CCL2025 | #CCL11 pic.twitter.com/7NKrABg4Vc— taran adarsh (@taran_adarsh) February 7, 2025#AkhilAkkineni off to Bengaluru for the Telugu Warriors' first match in #CCL @AkhilAkkineni8 ❤️❤️❤️❤️❤️#Akhil6 pic.twitter.com/0FlVsPj29p— 𝐀𝐤𝐡𝐢𝐥𝐅𝐫𝐞𝐚𝐤𝐬_𝐅𝐂 (@AkhilFreaks_FC) February 7, 2025 -
తెలుగు వారియర్స్ టీమ్ జెర్సీ ఈవెంట్లో అక్కినేని అఖిల్ (ఫొటోలు)
-
ఐపీఎల్‌కు ముందే క్రికెట్ సమరం.. సిద్ధమంటోన్న అఖిల్ అక్కినేని
క్రికెట్ సంబరానికి అంతా సిద్ధమైంది. ఇన్ని రోజుల తెరపై అభిమానులను అలరించిన సినీ తారలు గ్రౌండ్లో అడుగుపెట్టనున్నారు. ఇప్పుడు నటనతో కాదు.. బ్యాట్, బాల్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకోనున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) సమరానికి సమయం ఆసన్నమైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఫిబ్రవరి 8 నుంచి ఈ క్రికెట్ సమరం మొదలు కానుంది. ఈనేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌లో టాలీవుడ్ సినీ తారలకు చెందిన తెలుగు వారియర్స్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈవెంట్లో జట్టు కెప్టెన్ అఖిల్ (Akhil Akkineni)తో పాటు తమన్, ఆది, అశ్విన్, రఘు, సామ్రాట్ పాల్గొన్నారు. జట్టు యజమాని సచిన్ జోషి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ మాట్లాడుతూ.. మేము నాలుగుసార్లు కప్ గెలిచామని వెల్లడించారు. ఈసారి మేమే ఛాంపియన్స్‌గా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.కాగా.. ఈ సీసీఎల్ లీగ్‌లో మొత్తం 7 సినీ సెలబ్రిటీ జట్లు తలపడనున్నాయి. చెన్నై రైనోస్, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, పంజాబ్ ది షేర్, బోజ్‌పురి దబాంగ్స్ పోటీ పడుతున్నాయి. ఈ నెల 8న బెంగళూరు వేదికగా ఈ టోర్నీ మొదలు కానుంది. ప్రస్తుతం జరుగుతున్న 11 వ సీజన్ జనవరి 31న హైదరాబాద్‌లోనే ప్రారంభం కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో షెడ్యూల్లో మార్పులు చేశారు.కాగా.. ఈ ఏడాది సీసీఎల్ టోర్నమెంట్ ఫిబ్రవరి 8న బెంగళూరులో ప్రారంభమై మార్చి 2 వరకు కొనసాగుతుంది. తొలి రోజు మ్యాచ్‌లో చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, సాయంత్రం కర్ణాటక బుల్డోజర్స్ టీమ్.. తెలుగు వారియర్స్‌ను ఢీకొంటుంది. హైదరాబాద్‌లో ఈనెల 14,15 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సీజన్లో కూడా అఖిల్ అక్కినేని తెలుగు వారియర్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్‌లన్నీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతాయి. సెమీ-ఫైనల్, ఫైనల్ మార్చి 1, 2 తేదీల్లో జరగనున్నాయి. #TFNExclusive: Actor @AkhilAkkineni8 and Music sensation @MusicThaman snapped at CCL Telugu Warrior event in Hyderabad!!🏏📸#AkhilAkkineni #Thaman #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/WDxjeEsr1S— Telugu FilmNagar (@telugufilmnagar) February 2, 2025 The excitement is building! ⏳ Just 6 days to go for A23 Rummy CCL 2025! 🏏🔥 Brace yourselves for an electrifying season where cinema meets cricket!🎟 Grab your tickets now: https://t.co/xvVGHVHEcj📺 Catch the action LIVE on Sony Sports Ten 3 & Disney+ Hotstar#A23Rummy… pic.twitter.com/lBRRZaiwyH— CCL (@ccl) February 2, 2025 -
హైదరాబాదీగా అలా అనడం కరెక్ట్ కాదు: హీరో సుదీప్
సౌత్ ఇండియా సినిమా అవార్డుల వేడుక(సైమా) దుబాయ్‌లో జరుగుతోంది. సౌత్‌కు చెందిన వివిధ భాషలకు చెందిన సినీతారలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బాలీవుడ్ తారలు ఐశ్వర్యరాయ్ సైతం సైమా ఈవెంట్లో మెరిశారు. అయితే ఈ వేడుకల్లో కన్నడ హీరో కిచ్చా సుదీప్ తనదైన స్టైల్లో కనిపించారు. ఈ సందర్భంగా సీసీఎల్ కొత్త సీజన్‌ను వేదికపై కిచ్చా సుదీప్ ప్రకటించారు.అయితే వేదికపై హైదరాబాద్‌కు చెందిన యాంకర్ పొరపాటున కన్నడను కన్నడ్ అంటూ సంభోధించారు. దీనిపై హీరో కిచ్చా సుదీప్ స్పందించారు. ముంబయి వాళ్లు అలా పిలిస్తే ఓకే.. కానీ నువ్వు హైదరాబాదీ అయి ఉండి అలా పిలవడం కరెక్ట్ కాదు' అని సుదీప్ అన్నారు. దీంతో యాంకర్ వెంటనే సారీ చెప్పాడు. ఇకపై కన్నడ అని సంబోధించాలంటూ అతనికి కిచ్చా సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. గతంలో 2022లో బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్‌కి హాజరైన సుదీప్ 'హిందీ జాతీయ భాష కాదు' అని అన్నారు. దీంతో అజయ్ దేవగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుదీప్‌కి హిందీలో సమాధానమిచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ట్విటర్లో వార్ జరిగింది. అయితే ఆ తర్వాత అనువాదంలో పొరపాటు జరిగిందంటూ అజయ్ దేవగణ్ ఈ వివాదానికి చెక్ పెట్టాడు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సుదీప్ మ్యాక్స్ చిత్రంలో కనిపించనున్నారు. Hello @ajaydevgn sir.. the context to why i said tat line is entirely different to the way I guess it has reached you. Probably wil emphasis on why the statement was made when I see you in person. It wasn't to hurt,Provoke or to start any debate. Why would I sir 😁 https://t.co/w1jIugFid6— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022(ఇది చదవండి: గౌరవ డాక్టరేట్‌కు నో చెప్పిన కిచ్చా సుదీప్.. అభినందిస్తున్న ఫ్యాన్స్)కాగా.. ఈ ఏడాది సైమా అవార్డుల్లో టాలీవుడ్లో నాని హీరోగా నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమనటుడుగా నాని, ఉత్తమనటిగా కీర్తి సురేశ్ నిలిచారు. ఈ రెండు చిత్రాలకు కలిపి వివిధ విభాగాల్లో దాదాపు ఎనిమిది అవార్డులు వచ్చాయి. PRIDE OF KANNADA CINEMA ♥️It’s not kannad ,, it’s KANNADA 💥💥Boss on Fire mode @#SIIMA2024 ♥️#KicchaBOSS #MaxTheMovie#BRBFirstBlood pic.twitter.com/gWTUMik4s9— K R R I I S S H H ™ 𝕏 (@krriisshhtveezz) September 15, 2024 -
ప్రత్యేకంగా నీ బ్యాటింగ్ కోసమే వచ్చా బ్రో: విశ్వక్ సేన్
ఇటీవల సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) మ్యాచులు హైదరాబాద్‌లో నిర్వహించారు. మార్చి 1,2,3 తేదీల్లో వరుసగా మ్యాచులతో టాలీవుడ్ స్టార్స్.. ఇతర సినీ ఇండస్ట్రీ టీమ్స్ కూడా సందడి చేశాయి. ఉప్పల్ స్డేడియం వేదికగా ఈ మ్యాచులు జరిగాయి. అయితే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మన తెలుగు వారియర్స్ టీమ్‌లో స్టార్ బ్యాటర్‌గా కొనసాగుతున్నారు. తాజాగా మన యంగ్ నిఖిల్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. విశ్వక్సేన్తో ఫన్నీగా సంభాషిస్తూ కనిపించారు. అదేంటో మీరు ఓ లుక్కేయండి. ఇటీవల జరిగిన ఉప్పల్ మ్యాచ్‌లో యంగ్ హీరోలు నిఖిల్, విశ్వక్ సేన్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నిఖిల్ బ్యాటింగ్ చూసేందుకు స్టేడియానికి వచ్చానని విశ్వక్ సేన్ చెప్పడంతో వీరిద్దరి మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. 'నిఖిల్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు.. నేను ప్రత్యేకంగా నిఖిల్ బ్యాటింగ్ కోసమే వచ్చా. బ్యాటింగ్ టిప్స్ బాగా తెలుసు. ఇటీవలే రిజల్ట్ కూడా వచ్చింది' అంటూ విశ్వక్ సేన్ నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను నిఖిల్, విశ్వక్ సేన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. విశ్వక్ సేన్ నటించిన చిత్రం గామి ఈ వారం థియేటర్లలో సందడి చేయనుంది. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. Thanks a lot bro , nice batting bro . 🤗❤️ https://t.co/sXv26lAY7d — VishwakSen (@VishwakSenActor) March 2, 2024 -
CCL: విశాఖలో సందడిగా సినీ తారల క్రికెట్ మ్యాచ్ (ఫొటోలు)
-
అఖిల్ అక్కినేని విధ్వంసం.. తెలుగు వారియర్స్ బంపర్ విక్టరీ
ఐపీఎల్ కంటే ముందే క్రికెట్ పండగ సందడి చేస్తోంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ షురూ అయింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్.. కేరళ స్ట్రైకర్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అక్కినేని అఖిల్ రెచ్చిపోయారు. కేవలం 30 బంతుల్లోనే 91 పరుగులు చేసి ఔరా అనిపించారు. మొదట బ్యాటింగ్ దిగిన టాలీవుడ్ స్టార్స్ 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. యువ హీరో ప్రిన్స్ 23 బంతుల్లో 45 పరుగులు చేశారు. హీరో సుధీర్ బాబు 2 బంతుల్లో 2 పరుగులు, అశ్విన్ బాబు 6 బంతుల్లో 15 పరుగులు చేశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కేరళ స్టార్స్ 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 98 పరుగులు మాత్రమే చేశారు. హీరో ప్రిన్స్ నాలుగు వికెట్లు తీయగా, నందకిషోర్ ఒక వికెట్ తీశాడు. అత్యధిక పరుగులు చేసినందుకు అఖిల్‌కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లభించింది. ప్రస్తుతం అఖిల్ సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. It's a MASSIVE win for Telugu warriors at Kerala strikers in @ccl 🔥🔥#AGENT aka @AkhilAkkineni8 leading from the front & conquers at Raipur Stadium with his WILD innings of 91 runs in just 30 balls 💪💥💥@TeluguWarriors1 @keralastrikers_ #CCL2023 #CelebrityCricketLeague2023 pic.twitter.com/CtovKs85n0 — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 19, 2023 -
CCL 2023: సీసీఎల్ మళ్లీ వచ్చేస్తుంది.. హీరోలు బ్యాట్ పట్టి సిక్స్ కొడితే..
తమిళసినిమా: క్రికెట్ పోటీలు అంటేనే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. ఇక సినీ కళాకారుల క్రికెట్ అంటే ప్రత్యేకంగా చెప్పాలా? సందడే సందడి. హీరోలు స్డేడియంలో బ్యాట్ పట్టి సిక్స్ కొడితే.. ఫ్యాన్స్‌కు పునకాలే వస్తాయి. ఇటీవల కరోనా కారణంగా సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) జరగలేదు. ఈ నెల 18వ తేదీ నుంచి సీసీఎల్ పోటీల సందడి మొదలవుతోంది. ఇందులో 8 రాష్ట్రాలకు చెందిన సినీ సెలబ్రిటీ జట్లు తలపడనున్నాయి. చెన్నై రైనోస్, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, కేరళా స్ట్రైకర్స్, పంజాబ్ ది షేర్, బోజ్‌పురి దబాంగ్స్ పోటీ పడుతున్నాయి. కాగా ముంబాయి హీరోస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్‌ఖాన్, కెప్టెన్‌గా రితేశ్ దేశ్‌ముఖ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చెన్నై రైనోస్ జట్టుకు కెప్టెన్ జీవా ఐకాన్ ప్లేయర్‌గానూ, విష్టు విశాల్ స్టార్ క్రీడాకారుడిగా ఉన్నారు. తెలుగు వారియర్స్ జట్టుకు నటుడు వెంకటేశ్ సహ నిర్వాహకుడిగానూ, అఖిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. బోజ్‌పురి దబాంగ్ జట్టుకు మనోజ్ తివారి కెప్టెన్‌గా, కేరళా స్ట్రైకర్స్ జట్టుకు నటుడు మోహన్‌లాల్ సహ నిర్వాహకుడిగా కుంజాకోబోపన్ కెప్టెన్‌గా ఉన్నారు. బెంగాల్ టైగర్స్ జట్టుకు బోనీకపూర్ సహ నిర్వాహకుడిగా, జిసుసేన్ గప్లా కెప్టెన్‌గా ఉండనున్నారు. కర్ణాటక బుల్డోజర్స్ జట్టుకు సుదీప్, పంజాబ్ ది ఫేర్ జట్టుకు సోనూసూద్ కెపె్టన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 18వ తేదీ నుంచి రాయ్‌పూర్, జైపూర్, బెంగళూర్, త్రివేండ్రం, జోద్పూర్, హైదరాబాద్‌లలో ఈ పోటీలు జరగనున్నాయి. అదే విధంగా మార్చి 19వ తేదీ ఫైనల్ పోరు జరుగుతుంది. ఈ పోటీలు జీటీవీలో లైవ్ ప్రసారం అవుతాయని నిర్వాహకులు బుధవారం ఉదయం చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ పోటీల కోసం గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెన్నై రైనోస్ జట్టు కెప్టెన్ జీవా తెలిపారు. -
త్వరలోనే క్రికెట్ పండగ.. ఎనిమిది జట్లతో మెగా టోర్నీ
సెలబ్రీటీల క్రికెట్ సందడి త్వరలోనే మొదలు కానుంది. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కానున్నట్లు సీసీఎల్ ట్వీట్ చేసింది. ఈ మెగా టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఎనిమిది ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను క్రికెట్ ఫీల్డ్‌లోకి తీసుకువచ్చే బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ ప్రాపర్టీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మళ్లీ తిరిగి వచ్చింది. ఈ మెగా లీగ్ ఫిబ్రవరి 18, 2023 నుండి ప్రారంభమవుతుందని సీసీఎల్ వెల్లడించింది. తెలుగు వారియర్స్ టీమ్‌కు అక్కినేని అఖిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. సీసీఎల్ పాల్గొనే ఎనిమిది జట్లు ఇవే: తెలుగు వారియర్స్ కేరళ స్ట్రైకర్స్ ముంబయి హీరోస్ కర్ణాటక బుల్డోజర్స్ భోజ్‌పురి దబాంగ్స్ చెన్నై రైనోస్ బెంగాల్ టైగర్స్ పంజాబ్ దే షేర్ The Biggest Sportainment Property Celebrity Cricket League (CCL) that brings together actors from 8 Film Industries on to cricket field is back. Parle Biscuits picks the Title Sponsor Rights of the Reloaded #CCL2023 which will start from 18th February 2023. #HappyHappyCCL pic.twitter.com/MzIdBVMy8H — CCL (@ccl) January 28, 2023 -
అనంతపురంలో సినీతారల క్రికెట్ మ్యాచ్..
అనంతపురం నగరంలో సినీ తారలు సందడి చేశారు. నో డ్రగ్స్, నో ప్లాస్టిక్ క్యాంపెయిన్ లో భాగంగా టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ మ్యాచ్‌ను ఆదివారం నిర్వహించారు. అనంతపురం పీటీసీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో సంపూర్ణేష్ బాబు, ఓంకార్, వరుణ్ సందేశ్, సామ్రాట్ సహా మొత్తం 45 మంది సినీ, జబర్దస్త్, బిగ్ బాస్ నటీనటులు పాల్గొన్నారు. కాగా కార్యక్రమం క్రీసెంట్ క్రికెట్ కప్ నిర్వాహకులు షకిల్ షఫీ ఆద్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. కాగా మ్యాచ్ ప్రారంభానికి రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిపై ముందు సినీ నటులు, ప్రజాప్రతి నిధులు సంతాపం తెలిపారు. చదవండి: Road Safety World Series: బిన్నీ ఊచకోత.. సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
దారుణం.. ఉద్యోగం కోసం తండ్రినే చంపాడు
రాంచీ : మానవత్వం మంటగలిసింది. ఉద్యోగం కోసం కన్న తండ్రినే హత్య చేశాడు ఓ కిరాతకపు కొడుకు. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామ్‌గర్ జిల్లాలోని బర్కకనాలో కృష్ణారామ్ (55) అనే వ్యక్తి సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్) లో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గత గరువారం రాత్రి అనుమానాస్పదరీతిలో కృష్ణారామ్ మృతి చెందాడు. గుర్తు తెలియన వ్యక్తి గొంతు కోసి చంపినట్లుగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకిని దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో కృష్ణారామ్ పెద్ద కొడుకు రామ్(35) హత్యచేసినట్లుగా కనుగొన్నారు. చిన్న కత్తితో క్వార్టర్స్‌లోనే తండ్రి గొంతుకోసి చంపినట్లుగా తెలిపారు. (చదవండి : వివాహేతర సంబంధం, మటన్ వ్యాపారి హత్య) హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎల్ లీగల్ విభాగం ప్రకారం ఓ ఉద్యోగి తన సర్వీసు కాలంలో మరణిస్తే.. కారుణ్య కోటా కింద అతని కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇస్తారు.నిరుద్యోగి అయిన కృష్ణారామ్ కారుణ్య కోటాలో ఉద్యోగం పొందేందుకు తండ్రిని హతమార్చినట్లుగా పోలీసులు వెల్లడించారు. -
క్రికెటర్‌ను కొట్టిన ప్రియమణి..ఏమైందంటే?
దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తున్న అందాల భామ ప్రియమణి వివాదాలకు, రూమర్లకు దూరంగా ఉంటారు. అయితే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)లో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతడ్ని ప్రియమణి చెంపబెబ్బ కొట్టింది అంటూ పలు వార్తుల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా సినీ తారలు పాల్గొన్న అలాంటి టోర్నిలో దక్షిణాది తారకు అవమానం జరిగింది అనే విధంగా కథనాలు వెలువడ్డాయి. దీనిపై నటి ప్రియమణి వివరణ ఇస్తూ.. "ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగిలించి నాతో ప్రాంక్ చేస్తున్నాడు. రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత ఫోన్ దొంగిలించిన వ్యక్తి స్వయంగా నా హోటల్ రూంకు వచ్చి కలిశాడు. నాతో బిహేవ్ చేసిన విధానం సరిగా లేదని చెప్పాను. ఆ సంఘటన ఓ చేదు అనుభవం లాంటిదే. అయితే తాను అతడిని కొట్టానని వచ్చిన వార్తల్లో నిజం లేదు" అని ప్రియమణి క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ తనను ఇబ్బంది పెట్టిన ఆ క్రికెటర్ పేరేంటి అన్న ప్రశ్నకు మాత్రం ప్రియమణి సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. -
శ్రీదేవికి ఇష్టమైన ఆహారం ఇదే!
అందానికి నిర్వచనం శ్రీదేవి.టాప్ హీరోకు ఉన్నంత స్టార్డమ్ అతిలోక సుందరి సొంతం.ప్రేక్షక లోకం ఆమె ప్రేమలో పడిపోతే..ఆమె మాత్రం నగరంపై అమితమైన ప్రేమను పెంచుకున్నారు.హీరోయిన్గా సినీ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి చనిపోయే దాకా ఆమె ఇక్కడకువస్తూపోతూ ఉండేవారు. చార్మినార్, ట్యాంక్‌బండ్, బిర్లా మందిర్ వంటి ప్రాంతాలుఎంతో ఇష్టమైనా అభిమానుల తాకిడి తట్టుకోలేక రాత్రి వేళ వెళ్లి చూసొచ్చేవారు. స్వతహాగా మాంసాహారి అయినా.. సిటీలో మాత్రం శాకాహారాన్నే ఇష్టంగా తినేవారు. ఆమెనుకలవాలని, ఒక్కసారైనా ఆ అందమైన కళ్లల్లో పడాలని ఎంతో మంది కలలుగంటే..ఆ అదృష్టం మాత్రం కొందరికే దక్కింది. ఆ జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: శ్రీదేవి హైదరాబాదుకు వస్తే సందడే సందడి..తాజ్‌బంజారా, పార్క్‌హయత్‌లో బస..టైముంటేట్యాంక్బండ్పై షికారు..ఉలవచారు రెస్టారెంట్లోఆకుకూర పప్పు..టమోటాచారు..అవర్‌ప్లేస్ హోటల్లోభోజనం.. ఇలా గడిపేవారు.. సీసీఎల్ మ్యాచ్‌లు ఉన్నపుడు స్టేడియంలో హుషారుగా కనిపించేవారు..ఇలా శ్రీదేవితో తమకు ఉన్నఅనుబంధం గురించి సాక్షితో పలువురు మాట్లాడారు. ఆ నవ్వు ఇక చూడలేం.. శ్రీదేవి నవ్వు నాకు చాలా ఇష్టం.. మహేశ్వరి ద్వారా పరిచయం కలిగింది. ప్రతిసారీ చిరునవ్వుతో నన్ను విష్ చేసేవారు.. చాలా తక్కువగా మాట్లాడేవారు.. ఇక ఆమె చిరునవ్వును చూడలేననే విషయం తలచుకుంటే బాధేస్తుంది. –వి.కవితరెడ్డి, ఆడీకార్ బ్రాండ్ కన్సల్టెంట్ సత్యభామ క్యారెక్టర్ బాగా ఇష్టపడేవారు ముంబైలో ఓ ప్రదర్శనలో శ్రీదేవి నా కూచిపూడి నృత్య ప్రదర్శన చూసి అభినందించారు.అప్పటినుంచి ఆమెతో పరిచయం ఏర్పడింది. శ్రీదేవి చెల్లెలు మహేశ్వరీ నాకు ఫ్యాషన్ డిజైనర్ కావడంతో పరిచయం మరింత పెరిగింది. భామాకలాపంలో నా నృత్యం శ్రీదేవికి చాలా ఇష్టం. – పద్మజారెడ్డి, కూచిపూడి నృత్యకారిణి ‘ఉలవచారు’లో ఆకు కూర పప్పు.. నగరంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా ఫిల్మ్‌నగర్‌లోని ‘ఉలవచారు’ రెస్టారెంట్ ఫుడ్‌ని ప్రిఫర్ చేసేవారు. ఇక్కడ దొరికే ‘ఆకు కూర పప్పు, పప్పుచారు, టమోటా చారు’ అంటే చాలా ఇష్టం. అడిగి మరీ వండించుకుని పార్సిల్ తీసికెళ్లేవారు. సిటీకి వచ్చే ముందుఫోన్ చేసి మరీ చెప్పేవారు. –‘ఉలవచారు’ రెస్టారెంట్ యజమాని వినయ్ స్కూల్లో ఉండగానే పరిచయం నేను శ్రీదేవి చెల్లెలు శ్రీలత స్కూల్ ఫ్రెండ్స్. లంచ్ సమయంలో శ్రీలతకు బాక్స్ ఇచ్చేందుకు శ్రీదేవి మా కాన్వెంట్కు వచ్చేవారు.. అలా పరిచయమయ్యారు. కార్తీకదీపం సినిమా సమయంలో మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. మనమధ్యలో లేకపోవడం బాధగా ఉంది. – శైలజరెడ్డి, సెన్సార్‌బోర్డ్ మెంబర్ హాయ్.. రవీ అనేపిలుపు దూరమైంది నేను సీసీఎల్‌కు ఆరేళ్ల పనిచేశా.. అప్పుడు శ్రీదేవితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఏ చిన్న పని పడినా హేయ్ రవి.. హౌ ఆర్ యూ అనేవారు. ఫ్యామిలీ ఎలా ఉంది?’ అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. హాయ్ రవి అనే పిలుపు దూరమైందంటే చాలా విచారకరంగా ఉంది. –రవి పనాస, ఆర్కే మీడియా ఫౌండర్, సీఈఓ గతంలో ఓసారి.. శ్రీదేవి ఓ రోజు రాత్రివేళలో చార్మినార్‌కు వెళ్లి అక్కడ ఫొటోలు తీసుకుంటున్నారు.ఆ సమయంలో అభిమానులు వచ్చారు. తరువాత భారీ సంఖ్యలోజనం గుమిగూడటంతో కష్టపడి కారులోకిచేరుకున్నారు. ఎక్కువగా అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, సారధి స్టూడియోలలో షూటింగ్‌లకు హాజరయ్యేవారు. అవుట్డోర్ షూటింగ్‌లకు అభిమానుల తాకిడి ఎక్కువని, ఒప్పుకునేవారు కాదని, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా షూటింగ్ సమయంలో ఆమెతో పాటు పని చేసిన ప్రొడక్షన్ అసిస్టెంట్ వాసుదేవరావు పేర్కొన్నారు. చికెన్, మటన్‌తో పాటు దక్షిణాది వంటకాల వైపే ఆమె మక్కువ చూపేవారని అవర్‌ప్లేస్ హోటల్ మేనేజర్ తెలిపారు. బోనీ కపూర్, అనిల్‌కపూర్‌తో కలిసి ఆమె తన ఇద్దరి పిల్లలతో తమ హోటల్‌కు వచ్చి విందారగించిన విషయాన్ని అక్కడి సిబ్బంది గుర్తు చేసుకున్నారు. సుమారుగా ఆమె 60 సినిమాల వరకు ఇక్కడ స్టూడియోల్లోనే షూటింగ్ జరుపుకున్నారు. – బంజారాహిల్స్ టీఎస్ఆర్ కుటుంబంతోఅనుబంధం కాంగ్రెస్ నాయకుడు ఎంపీ తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కుటుంబీకులతో శ్రీదేవికి మంచి స్నేహం ఉంది. ఆయన కుమార్తె పింకిరెడ్డి మంచి స్నేహితురాలు. నగరంలో శ్రీదేవి ఎక్కడికి వెళ్లాలన్నా పింకిరెడ్డి వెంట ఉండాల్సిందే. సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇష్టపడేవారు. రసమయి అక్కినేని లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును, స్వర్ణకంకణాన్ని 2004 సెప్టెంబర్ 20న జూబ్లీహల్లో రసమయి ఆధ్వర్యంలో శ్రీదేవికి అందజేశారు. టీఎస్సార్ షష్టిపూర్తి ముంబాయిలో చేసిన సందర్భంగా షణ్ముకానంద హల్లో శ్రీదేవికి సన్మానం చేశారు. అప్పుడు ముంబై వెళ్లిన పలువురు కళాకారులను ఇంటికి ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. రసమయి సంస్థ నిర్వాహకులు ఎంకే రాము, వంశీ కళా సంస్థ నిర్వాహకులు వంశీ రామరాజులు ఆమె ఆకస్మిక మృతికి సంతాపాన్ని వ్యక్తంచేశారు. -
సీపీఎల్‌కు సర్వం సిద్థం
-
సీపీఎల్ జట్టులో వాటా కొన్న కేకేఆర్
టైటిల్ స్పాన్సర్‌గా హీరో కింగ్స్టన్ : వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)పై భారత కార్పొరేట్ల కన్ను పడింది. ఆరు జట్లు ఆడే ఈ టోర్నీకి ప్రఖ్యాత మోటార్‌బైక్‌ల సంస్థ హీరో 2015 సీజన్‌కు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. అలాగే ఈ లీగ్‌లో ఆడే ట్రినిడాడ్ అండ్ టొబాగో రెడ్‌స్టీల్ జట్టులో ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) యాజమాన్యం వాటా కొనుగోలు చేసింది. ‘మా సంస్థను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే ఆలోచనలో భాగంగా రెడ్‌స్టీల్ జట్టులో వాటా కొన్నాం’ అని కేకేఆర్ జట్టు సహ యజమాని షారూఖ్ ఖాన్ చెప్పారు. -
తెరపైకి 12 రెవె‘న్యూ’మండలాలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రెవెన్యూ మండలాల పునర్విభజనపై జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) అదర్‌సిన్హా నేతృత్వంలో కొత్త రెవెన్యూ డివిజన్లు/ మండలాలపై కలెక్టర్లు సమర్పించిన ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించింది. ఈ క్రమంలోనే మన జిల్లాలో నూతనంగా మరో 12 పట్టణ రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రఘునందన్‌రావు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. నగరీకరణ నేపథ్యంలో శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరించడం, ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం వలసలు కూడా పెరిగిపోవడమేగాకుండా.. భూముల విలువలు కూడా అనూహ్యంగా పెరిగినందున పట్టణ ప్రాంతాల్లో మండలాలను పున ర్వ్యస్థీకరించాల్సిన అవసరముందని తేల్చిచెప్పారు. 2007 నుంచి రెవెన్యూ డివిజన్లు/ అర్బన్ మండలాలను పెంచాలనే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నప్పటికీ, 2013, జూన్‌లో కేవలం రాజేంద్రనగర్, మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్లను మాత్రమే ఏర్పాటుచేసి.. కొత్త మండలాలను ఏర్పాటు చే యలేదనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో నూతనంగా 12 అర్బన్ రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటికే జిల్లాలో 37 రెవెన్యూ మండలాలున్నాయని, ఈ మండలాల్లో పరిధి విస్తారంగా ఉండడంతో సిబ్బందిపై పనిభారం పెరిగిందని, ప్రభుత్వ భూముల పరిరక్షణ కూడా కష్టంగా మారినందున అదనపు సిబ్బంది అవసరమనే విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లింది. అధికారంలోకి వస్తే రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్విభజిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో.. తాజాగా డివిజన్లు/ మండలాల పునర్వ్యస్థీకరణపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. భవిష్యత్తులో ఏర్పడే జిల్లాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా న్యూ మండలాల ఏర్పాటు ఉంటుందని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం మండలం- ప్రతిపాదిత మండలాలు మల్కాజిగిరి- మల్కాజ్గిరి, అల్వాల్ కుత్బుల్లాపూర్- కుత్బుల్లాపూర్, దొమ్మరపోచంపల్లి శామీర్‌పేట- శామీర్‌పేట, జవహర్‌నగర్ ఉప్పల్ - ఉప్పల్, కాప్రా శంషాబాద్ - శంషాబాద్, పెద్దషాపూర్ బాలానగర్ - బాలానగర్, కూకట్పల్లి హయత్‌నగర్- హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ సరూర్‌నగర్ - సరూర్‌నగర్, మీర్పేట్ శేరిలింగంపల్లి- శేరిలింగంపల్లి,మదాపూర్/కొండాపూర్ రాజేంద్రనగర్- రాజేంద్రనగర్, నార్సింగి -
ఫైనల్ కు చేరిన తెలుగు వారియర్స్
హైదరాబాద్: సీసీఎల్ క్రికెట్ లీగ్(సీసీఎల్)లో తెలుగు వారియర్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ముంబై హీరోస్ తో జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు ప్రవేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసింది. దీంతో తరువాత బ్యాటింగ్ చేపట్టిన తెలుగు వారియర్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 17.2 లక్ష్యాన్ని చేరుకుంది. తెలుగు వారియర్స్ ఆటగాళ్లలో ప్రిన్స్ (63), ఎస్ బాబు(53) పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరి వరకూ వీరిద్దరూ క్రీజ్ లో ఉండి చక్కటి విజయాన్నిఅందించారు. -
టాలీవుడ్ వారియర్స్ లక్ష్యం 142
హైదరాబాద్: సెలెబ్రిటీ క్రికెట్ లీగ్( సీసీఎల్)లో భాగంగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో టాలీవుడ్ వారియర్స్ తో జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో ముంబై హీరోస్ 142 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన టాలీవుడ్ వారియర్స్ తొలుత ముంబై హీరోస్ బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ముంబై హీరోస్ నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసింది. ఆదిలో తడబడ్డ ముంబై తరువాత తేరుకుని గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసింది. ముంబై ఆటగాళ్లలో బెహ్రావానీ(42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేయడం గమనార్హం. టాలీవుడ్ బౌలర్లలో జోషికి రెండు వికెట్లు లభించాయి. -
సీసీఎల్: తెలుగు వారియర్స్ జయభేరి
రాంచీ: సెలెబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ అద్భుత విజయం సాధించింది. శనివారం రాత్రి రాంచీలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ 10 వికెట్ల తేడాతో భోజ్‌పురి దబాంగ్స్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దబాంగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. అనంతరం తెలుగు వారియర్స్ వికెట్ కూడా నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. సచిన్ జోషీ , ప్రిన్స్ అజేయ హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు. -
స్టార్ షో..
-
11 నుంచి సెలబ్రిటీ క్రికెట్
తమిళసినిమా:సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) సందడి ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుంది.సినీ తారల క్రికెట్‌కు ఈసారి కూడా రెట్టింపు జోష్‌తో సిద్ధం అవుతున్నట్లు చెన్నై రైనోస్ జట్టు కొత్త కెప్టెన్ నటుడు జీవా పేర్కొన్నారు. ఈ లీగ్ పోటీలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సీసీఎల్ పోటీల వివరాలను గురువారం జీవా టీమ్ విలేకరులకు వెల్లడించారు. నటుడు జీవా వెల్లడిస్తూ ఈ జట్టుకు ఇంతవరకు నటుడు విశాల్ కెప్టెన్ బాధ్యతల్ని నిర్వహించేవారన్నారు. ప్రస్తుతం ఆయన చిత్రాలతో బిజీగా ఉండడంతో తానా బాధ్యతల్ని నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఈ జట్టుకు నటుడు విష్ణు విశాల్, వైస్ కెప్టెన్ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్య, విక్రాంత్, రమణ, భరత్, పృథ్వీ, శాంతను, అశోక్ సెల్వన్, బాలాజీ శ్యామ్, వేస్ వెంకట్, చరణ్‌కుమార్, ఉదయకుమార్, సంజయ్ భారతి జట్టు తరపున ఆడనున్నారని పరిచయం చేశారు. ఈ చెన్నై రైనోస్ నిర్వాహకుడు జి.వి.ఆర్.గ్రూప్ గంగాప్రసాద్ మాట్లాడుతూ ఈ లీగ్‌లో చెన్నై రైనోస్‌తో పాటు తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్, కేరళ స్ట్రైకర్స్, ముంబై ఇండియన్స్, వీర మరాఠి, బెంగాల్ టైగర్స్, భోజ్‌పురి ద బాగ్స్ జట్లు పోటీలో పాల్గొంటున్నాయని వెల్లడించారు. చెన్నై రైనోస్ ఈ నెల 11న హైదరాబాదులో జరగనున్న లీగ్‌లో కేరళ స్ట్రైకర్స్తోను, 18న బెంగళూరులో జరిగే లీగ్‌లో వీరమరాఠి జట్టుతోను, 25న అహ్మదాబాద్‌లో జరగనున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టీమ్‌తోను తలపడనుందని తెలిపారు. ఆ తరువాత ఫైనల్ మ్యాచ్ ఉంటుందని చెప్పారు. ఈసారి సీసీఎల్ క్రికెట్ పోటీలు చెన్నైలో జరగకపోవడం ఇక్కడి అభిమానులకు నిరాశ కలిగిందన్నారు.అయితే అనుమతి సమస్య కారణంగా చెన్నైలో సీసీఎల్‌ను నిర్వహించలేకపోతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. -
ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సినీస్టార్
కేరళ: సినీ నటులు తరుచు ఏదో వివాదాల్లో ఉండటం కొత్తమే కాదు. తాజాగా ఇటువంటి ఉదంతమే శనివారం చోటు చేసుకుంది. ఓ హెయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో సినీ స్టార్. కేరళకు చెందిన సినీస్టార్ హైదరాబాద్ లో జరిగే సీసీఎల్ లో పాల్గొనేందుకు విమానం ఎక్కాడు. ఈ క్రమంలోనే హెయిర్ హోస్టస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. దీంతో విమాన సిబ్బంది అతన్ని విమానం నుంచి దించేశారు. రేపు హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ లో కేరళ స్ట్రైకర్స్ జట్టుకు అతను ప్రాతినిధ్యం వహించనున్నాడు. అతనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్‌లో సీసీఎల్ ఫైనల్