హైదరాబాదీగా అలా అనడం కరెక్ట్‌ కాదు: హీరో సుదీప్ | Kichcha Sudeep corrects Hyderabadi man Pronounce Kannad at SIIMA 2024 | Sakshi
Sakshi News home page

Sudeep: హైదరాబాదీగా అలా అనడం కరెక్ట్‌ కాదు: హీరో సుదీప్

Published Mon, Sep 16 2024 4:11 PM | Last Updated on Mon, Sep 16 2024 4:38 PM

Kichcha Sudeep corrects Hyderabadi man Pronounce Kannad at SIIMA 2024

సౌత్ ఇండియా సినిమా అవార్డుల వేడుక(సైమా) దుబాయ్‌లో జరుగుతోంది. సౌత్‌కు చెందిన వివిధ భాషలకు చెందిన సినీతారలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బాలీవుడ్ తారలు ఐశ్వర్యరాయ్ సైతం సైమా ఈవెంట్‌లో మెరిశారు. అయితే ఈ వేడుకల్లో కన్నడ హీరో కిచ్చా సుదీప్ తనదైన స్టైల్లో కనిపించారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ కొత్త సీజన్‌ను వేదికపై కిచ్చా సుదీప్ ప్రకటించారు.

అయితే వేదికపై హైదరాబాద్‌కు చెందిన యాంకర్‌ పొరపాటున కన్నడను కన్నడ్‌ అంటూ సంభోధించారు. దీనిపై హీరో కిచ్చా సుదీప్ స్పందించారు. ముంబయి వాళ్లు అలా పిలిస్తే ఓకే.. కానీ నువ్వు హైదరాబాదీ అయి ఉండి ‍‍అలా పిలవడం కరెక్ట్‌ కాదు' అని సుదీప్ అన్నారు. దీంతో యాంకర్ వెంటనే సారీ చెప్పాడు. ఇకపై కన్నడ అని సంబోధించాలంటూ అతనికి కిచ్చా సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా.. గతంలో 2022లో బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్‌కి హాజరైన సుదీప్ 'హిందీ జాతీయ భాష కాదు' అని అన్నారు. దీంతో అజయ్ దేవగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుదీప్‌కి హిందీలో సమాధానమిచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ట్విటర్‌లో వార్ జరిగింది. అయితే ఆ తర్వాత అనువాదంలో పొరపాటు జరిగిందంటూ అజయ్ దేవగణ్ ఈ వివాదానికి చెక్ పెట్టాడు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సుదీప్  మ్యాక్స్‌ చిత్రంలో కనిపించనున్నారు. 

(ఇది చదవండి: గౌరవ డాక్టరేట్‌కు నో చెప్పిన కిచ్చా సుదీప్‌.. అభినందిస్తున్న ఫ్యాన్స్‌)

కాగా.. ఈ ఏడాది సైమా అవార్డుల్లో టాలీవుడ్‌లో నాని హీరోగా నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమనటుడుగా నాని, ఉత్తమనటిగా కీర్తి సురేశ్ నిలిచారు. ఈ రెండు చిత్రాలకు కలిపి వివిధ విభాగాల్లో దాదాపు ఎనిమిది అవార్డులు వచ్చాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement