breaking news
SIIMA
-
దక్షిణాది సినీ అవార్డుల పండుగ.. నామినేషన్స్‌లో పుష్పరాజ్‌దే హవా!
దక్షిణాది సినీ అవార్డుల పండుగ సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనుంది. ఇప్పటికే వేదికతో పాటు తేదీలను నిర్వాహకులు ప్రకటించారు. తాజాగా ఈ అవార్డులకు ఎంపికైన నామినేషన్స్ జాబితాను వెల్లడించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచిన దక్షిణాది సినిమాలు ఈ అవార్డుల కోసం పోటీపడుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఎంపికైన చిత్రాల జాబితాను తాజాగా సైమా అవార్డుల కమిటీ ప్రకటించింది.తెలుగు సినిమాల విషయానికొస్తే అత్యధికంగా పుష్ప-2 చిత్రం నామినేషన్స్ దక్కించుకుంది. ఏకంగా 11 విభాగాల్లో ఎంపికైంది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ పది నామినేషన్స్‌తో రెండో ప్లేస్‌లో నిలిచింది. అంతేకాకుండా తేజ సజ్జా-ప్రశాంత్ వర్మ చిత్రం హను మాన్ కూడా 10 విభాగాల్లో నామినేషన్స్ సొంతం చేసుకుంది. కాగా... గతేడాదిలో రిలీజైన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.ఇక కోలీవుడ్ విషయానికొస్తే శివ కార్తికేయన్- సాయిపల్లవి జంటగా వచ్చిన అమరన్ 13 నామినేషన్స్ దక్కించుకుంది. లబ్బర్ పందు 8, వాజై 7 విభాగాల్లో నిలిచాయి. ఇక శాండల్‌వుడ్‌లో భీమా, కృష్ణ ప్రణయ సఖి చిత్రాలు తొమ్మిది విభాగాల్లో నామినేషన్స్ సాధించాయి. ఇబ్బని తబ్బిడ ఇలియాలి - 7 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. అలాగే మలయాళం పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వచ్చిన ది గోట్ లైఫ్(ఆడుజీవితం) అత్యధికంగా 10 విభాగాలకు ఎంపికైంది. ఆ తర్వాత ఏఆర్ఎమ్ 9, ఆవేశం 8 నామినేషన్స్ దక్కించుకున్నాయి. ఈ 13వ సైమా అవార్డుల వేడుక దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 5,6 తేదీల్లో జరగనుంది.The Stage Is Set. The Stars Are Ready.Presenting the Top Nominated Films at SIIMA 2025 🌍🏆From powerful performances to cinematic brilliance, these films captured hearts and headlines across languages. And now… they lead the race for the most coveted awards in South Indian… pic.twitter.com/Vx2dLOOGLO— SIIMA (@siima) July 23, 2025 -
దక్షిణాది సినీ అవార్డుల సంబురం.. తేదీ, వేదిక ఫిక్స్!
దక్షిణాదిలో ప్రతిష్టాత్మక సినీ పండుగ తేదీలు ఖరారు చేశారు. సౌత్ ఇండస్ట్రీలో అందించే ప్రముఖ సైమా అవార్డుల వేడుక జరిగే వేదికను కూడా నిర్ణయించారు. ఈ ఏడాది జరగనున్న 13వ ఎడిషన్ అవార్డుల వేడుకను దుబాయ్‌లోనే నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5,6 తేదీల్లో ఈ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు నిర్వాహకలు వెల్లడించారు.దక్షిణాది సినిమాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులు అందజేయనున్నారు. ఇప్పటివరకు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ పేరిట 12 ఎడిషన్లు పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన నామినేషన్స్ జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నారు. గత రెండేళ్లుగా ఈ వేడుకను దుబాయ్‌లోనే నిర్వహిస్తున్నారు. ఈసారి అక్కడే సినీ అవార్డుల వేడుక సైమా జరగనుంది.The biggest celebration of South Indian Cinema is back!Dubai 5th & 6th SeptemberGet ready for SIIMA's 13th edition, where stars shine the brightest!@BrindaPrasad1 @vishinduri#SIIMA2025 #NEXASIIMA #SouthIndianCinema #dubai pic.twitter.com/AC2iihRNib— SIIMA (@siima) July 18, 2025 -
సూపర్‌స్టార్ కాళ్లకు మొక్కిన ఐశ్వర్యరాయ్ కూతురు.. వీడియో వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ఇటీవల దుబాయ్‌లో జరిగిన సైమా వేడుకల్లో మెరిసింది. గతేడాది పొన్నియిన్ సెల్వన్‌తో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో నటనకు గానూ ఐశ్వర్య లీడ్ రోల్ ఉత్తమనటిగా(క్రిటిక్స్) సైమా అవార్డ్‌ను సొంతం చేసుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌తో కలిసి వేదికపై అవార్డును అందుకుంది.ఈ వేడుకకు హాజరైన ఐశ్వర్య కూతురు ఆరాధ్య తన తల్లిని చూసి పరుగెత్తుకుంటూ స్టేజీ వద్దకు వచ్చింది. తన తల్లిని గట్టిగా కౌగిలించుకుని అభినందించింది. అదే సమయంలో అక్కడే ఉన్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కాళ్లకు ఆరాధ్య నమస్కరించింది. ఆయన పాదాలకు మొక్కిన ఆరాధ్య ఆశీస్సులు తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్‌లో ఐశ్వర్యరాయ్ నటించింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రంలో తన నటనకు గానూ ఫీమేల్ లీడ్ రోల్ (క్రిటిక్స్) విభాగంలో ఉత్తమ నటిగా ఎంపికైంది. కాగా.. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాలను మణిరత్నం తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
హైదరాబాదీగా అలా అనడం కరెక్ట్ కాదు: హీరో సుదీప్
సౌత్ ఇండియా సినిమా అవార్డుల వేడుక(సైమా) దుబాయ్‌లో జరుగుతోంది. సౌత్‌కు చెందిన వివిధ భాషలకు చెందిన సినీతారలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బాలీవుడ్ తారలు ఐశ్వర్యరాయ్ సైతం సైమా ఈవెంట్లో మెరిశారు. అయితే ఈ వేడుకల్లో కన్నడ హీరో కిచ్చా సుదీప్ తనదైన స్టైల్లో కనిపించారు. ఈ సందర్భంగా సీసీఎల్ కొత్త సీజన్‌ను వేదికపై కిచ్చా సుదీప్ ప్రకటించారు.అయితే వేదికపై హైదరాబాద్‌కు చెందిన యాంకర్ పొరపాటున కన్నడను కన్నడ్ అంటూ సంభోధించారు. దీనిపై హీరో కిచ్చా సుదీప్ స్పందించారు. ముంబయి వాళ్లు అలా పిలిస్తే ఓకే.. కానీ నువ్వు హైదరాబాదీ అయి ఉండి అలా పిలవడం కరెక్ట్ కాదు' అని సుదీప్ అన్నారు. దీంతో యాంకర్ వెంటనే సారీ చెప్పాడు. ఇకపై కన్నడ అని సంబోధించాలంటూ అతనికి కిచ్చా సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. గతంలో 2022లో బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్‌కి హాజరైన సుదీప్ 'హిందీ జాతీయ భాష కాదు' అని అన్నారు. దీంతో అజయ్ దేవగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుదీప్‌కి హిందీలో సమాధానమిచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ట్విటర్లో వార్ జరిగింది. అయితే ఆ తర్వాత అనువాదంలో పొరపాటు జరిగిందంటూ అజయ్ దేవగణ్ ఈ వివాదానికి చెక్ పెట్టాడు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సుదీప్ మ్యాక్స్ చిత్రంలో కనిపించనున్నారు. Hello @ajaydevgn sir.. the context to why i said tat line is entirely different to the way I guess it has reached you. Probably wil emphasis on why the statement was made when I see you in person. It wasn't to hurt,Provoke or to start any debate. Why would I sir 😁 https://t.co/w1jIugFid6— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022(ఇది చదవండి: గౌరవ డాక్టరేట్‌కు నో చెప్పిన కిచ్చా సుదీప్.. అభినందిస్తున్న ఫ్యాన్స్)కాగా.. ఈ ఏడాది సైమా అవార్డుల్లో టాలీవుడ్లో నాని హీరోగా నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమనటుడుగా నాని, ఉత్తమనటిగా కీర్తి సురేశ్ నిలిచారు. ఈ రెండు చిత్రాలకు కలిపి వివిధ విభాగాల్లో దాదాపు ఎనిమిది అవార్డులు వచ్చాయి. PRIDE OF KANNADA CINEMA ♥️It’s not kannad ,, it’s KANNADA 💥💥Boss on Fire mode @#SIIMA2024 ♥️#KicchaBOSS #MaxTheMovie#BRBFirstBlood pic.twitter.com/gWTUMik4s9— K R R I I S S H H ™ 𝕏 (@krriisshhtveezz) September 15, 2024 -
సైమా అవార్డ్స్‌లో నాని చిత్రాల హవా.. ఉత్తమ చిత్రం ఏదంటే..?
సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డ్స్‌లో నేచురల్ స్టార్ నాని సినిమాల హవా కొనసాగింది. దసరా, హాయ్ నాన్న చిత్రాలు అవార్డులు కొల్లగొట్టాయి. దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకల్లో టాలీవుడ్ విజేతలను ప్రకటించారు. తెలుగులో ఉత్తమ నటుడిగా నాని నిలవగా.. ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. నాని నటించిన దసరా, హాయ్ నాన్న చిత్రాలకు నాలుగు విభాగాల్లో అవార్డ్స్ దక్కాయి. ఈ వేడుకల్లో హీరోయిన్స్ వేదికపై సందడి చేశారు.టాలీవుడ్లో ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి నిలిచింది. సైమా-2024 విన్నర్స్ వీళ్లే.. ఉత్తమ నటుడు: నాని (దసరా) ఉత్తమ నటి: కీర్తి సురేశ్ (దసరా) ఉత్తమ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా) ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి ఉత్తమ సహాయ నటుడు: దీక్షిత్ శెట్టి (దసరా) ఉత్తమ సహాయ నటి: బేబీ ఖియారా ఖాన్ (హాయ్ నాన్న) ఉత్తమ హాస్య నటుడు: విష్ణు (మ్యాడ్) ఉత్తమ పరిచయ నటి: వైష్ణవి చైతన్య (బేబీ) ఉత్తమ సంగీత దర్శకుడు: అబ్దుల్ వాహబ్ (హాయ్‌నాన్న) ఉత్తమ సినిమాటోగ్రఫీ: భువన గౌడ (సలార్) ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు-బలగం) ఉత్తమ డెబ్యూ యాక్టర్: సంగీత్ శోభన్ (మ్యాడ్) ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: శౌర్యువ్ (హాయ్ నాన్న) ఉత్తమ డెబ్యూ ప్రొడ్యూసర్: వైరా ఎంటర్టైన్మెంట్స్ (హాయ్ నాన్న) ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆనంద్ దేవరకొండ (బేబీ) ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాళ్ ఠాకూర్ ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): సాయి రాజేశ్ 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సైమా అవార్డ్స్- 2023.. రాజమౌళి చిత్రానికి 11 నామినేషన్స్!
సినీ ఇండస్ట్రీలో దక్షిణాదిలో అవార్డుల పండుగకు సర్వం సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ - 2023లో పోటీపడే చిత్రాల జాబితా రిలీజ్ అయింది. అయితే అవార్డుల నామినేషన్స్‌లో టాలీవుడ్ బ్లాక్ బస్టర్, ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా 11 విభాగాల్లో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో 10 విభాగాల్లో నామినేషన్స్‌తో సీతారామం చిత్రం నిలిచింది. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన జగపతిబాబు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) తెలుగులో ఉత్తమ చిత్రం కేటగిరిలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి కాంబోలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు, నిఖిల్ మిస్టరీ అడ్వెంచర్ ఫిల్మ్ కార్తికేయ-2, అడవి శేష్ మేజర్‌తో పాటు.. మరో బ్లాక్‌బస్టర్ మూవీ సీతారామం పోటీలో నిలిచాయి. తమిళంలో అత్యధికంగా 10 నామినేషన్స్ పొన్నియిన్ సెల్వన్-1 చిత్రానికి దక్కించుకుంది. ఆ తర్వాత కమల్‌హాసన్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన విక్రమ్ 9 విభాగాల్లో నామినేషన్స్‌కు ఎంపికైంది . కన్నడలో రిషబ్ శెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కాంతార, యశ్ యాక్షన్ మూవీ కేజీయఫ్-2 చిత్రాలకు 11 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కాయి. మలయాళంలో ఈసారి ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీపడుతున్నాయి. అమల్ నీరద్ దర్శకత్వంలో మమ్ముటి నటించిన భీష్మ పర్వం చిత్రానికి 8 నామినేషన్స్ రాగా, టోవినో థామస్ థల్లుమాల మూవీకి ఏడు నామినేషన్స్ వచ్చాయి. కాగా.. సౌత్ సినిమా ఇండస్ట్రీలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక సైమా అవార్డ్స్- 2023) ఈవెంట్ ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'మేడ్ ఇన్ హెవెన్' లో ట్రాన్స్ వుమెన్.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?) #SIIMA2023 nominations are out. In Telugu RRR Directed by S.S Rajamouli Starring Jr.NTR & Ram Charan has 11 Nominations is leading while Sita Ramam Directed by Hanu Raghavapudi Starring Dulquer Salmaan & Mrunal Thakur with 10 Nominations is close Second. #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/M3DsQ7btLQ — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Tamil Mani Ratnam’s Ponniyin Selvan:1 Starring Vikram, Trisha & Aishwarya Rai leads with 10 nominations while Lokesh Kanagaraj’s Vikram Starring Kamal Haasan, Vijay Sethupathi & Fahadh Faasil with 9 Nominations is close Second. #NEXASIIMA… pic.twitter.com/sXAxDz7cuk — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Kannada Kantara Directed by and Starring Rishab Shetty with 11 Nominations, while KGF Chapter 2 Directed by Prashanth Neel, Starring Yash with 11 Nominations are in top position. #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/hWh4ZDrw0z — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Malayalam Bheeshma Parvam Directed by Amal Neerad Starring Mammootty is leading with 8 Nominations while Thallumaala Directed by Khalid Rahman & Starring Tovino Thomas and Kalyani Priyadarshan with 7 Nominations is close Second #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/Va8wuh2PRW — SIIMA (@siima) August 1, 2023 -
సైమా అవార్డు పోటీల్లో ‘పుష్ప’రాజ్ హవా.. బరిలో ఉన్న చిత్రాలివే
దక్షిణాది భాషల్లో రూపొందుతున్న సినిమాలకు ఒకే వేదికపై అవార్డులను అందిస్తున్న సంస్థ సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్). ఈ ఏడాది ఈ వేడుకను సెప్టెంబర్ 10,11 తేదీలలో బెంగళూరులో జరపనున్నారు. ఈ నేపథ్యంలో సైమా వేదికగా తలపడనున్న సినిమాల జాబితాను విడుదల చేశారు. తెలుగు నుంచి పుష్ప, అఖండ, జాతిరత్నాలు, ఉప్పెన చిత్రాలు ఎక్కువ విభాగాలలో నామినేట్ అయ్యాయి. తెలుగు నుంచి పుష్ప అత్యధికంగా 12 విభాగాల్లో నామినేట్ అవ్వడం గమనార్హం. తమిళ్ నుంచి ‘కర్ణన్(10)’, కన్నడ నుంచి ‘రాబర్డ్’, మలయాళం నుంచి ‘మిన్నల్ మురళీ’ చిత్రాలు అత్యధిక నామినేషన్స్ పొందాయి. ఈ మొత్తం నామినేషన్స్ నుంచి విన్నర్‌ను ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేసి అవార్డులు అందిస్తారు. ప్రేక్షకులు తమ అభిమాన నటీనటులు, సాంకేతిక నిపుణులకు సైమా వెబ్‌సైట్‌కు వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. సైమా అవార్డులకు నామినేట్ అయిన చిత్రాలివే.. టాలీవుడ్ పుష్ప(అల్లు అర్జున్) : 12 అఖండ(బాలకృష్ణ): 10 జాతిరత్నాలు(నవీన్ పొలిశెట్టి): 8 ఉప్పెన(వైష్ణవ్ తేజ్):8 కోలీవుడ్ కర్ణన్(ధనుష్): 10 డాక్టర్(శివ కార్తికేయన్): 9 మాస్టర్(విజయ్): 7 తలైవి(కంగనా రనౌత్): 7 మాలీవుడ్ మిన్నల్ మురళీ(టోవినో థామస్): 10 కురుప్(దుల్కర్ సల్మాన్):8 మాలిక్(ఫహద్ పాజిల్):6 జోజీ(ఫహద్ ఫాజిల్):6 శాండల్‌వుడ్ రాబర్ట్(దర్శన్):10 గరుడ గమన వృషభ వాహన(రాజ్ బి.శెట్టి): 8 యువరత్న(పునీత్ రాజ్‌కుమార్): 7 -
సైమా 2019 : టాలీవుడ్ విజేతలు వీరే!
దక్షిణాది సినీ రంగాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) కార్యక్రమాన్ని ఈ ఏడాది ఖతర్‌లోని దోహాలో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఆగస్టు 15న ప్రారంభమైంది. తొలి రోజు తెలుగు, కన్నడ పరిశ్రమలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టాలీవుడ్ అవార్డ్స్‌లో అత్యథిక అవార్డులతో రంగస్థలం సత్తా చాటింది. సైమా అవార్డ్స్ 2019 విజేతలు ఉత్తమ చిత్రం : మహానటి ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (రంగస్థలం) ఉత్తమ నటుడు : రామ్‌చరణ్ (రంగస్థలం) ఉత్తమ నటి : కీర్తి సురేష్ (మహానటి) విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు : విజయ్ దేవరకొండ( గీత గోవిందం) విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి : సమంత (రంగస్థలం) ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్ ( మహానటి) ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం) ఉత్తమ హాస్య నటుడు : సత్య (ఛలో) ఉత్తమ విలన్ : శరత్ కుమార్ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా) ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం) ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్ (ఎంత సక్కగున్నవవే - రంగస్థలం) ఉత్తమ గాయకుడు : అనురాగ్ కులకర్ణి( పిల్ల రా - ఆర్ఎక్స్ 100) ఉత్తమ గాయని : ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ - రంగస్థలం) ఉత్తమ తొలిచిత్ర నటుడు : కల్యాణ్ దేవ్ (విజేత) ఉత్తమ తొలిచిత్ర నటి : పాయల్ రాజ్‌పుత్ (ఆర్ఎక్స్ 100) ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అజయ్ భూపతి (ఆర్ఎక్స్ 100) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు (రంగస్థలం) ఉత్తమ కళా దర్శకడు : రామకృష్ణ (రంగస్థలం) సామాజిక మాధ్యమాల్లో పాపులర్ స్టార్ : విజయ్ దేవరకొండ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సైమాకు అతిథులుగా..!
దక్షిణాది భాషల్లో రూపొందుతున్న సినిమాలకు ఒకే వేదికపై అవార్డులను అందిస్తున్న సంస్థ సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్). ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ వేడుకలను ఈ ఏడాది ఖతర్‌లో నిర్వహించనున్నారు. ఆగస్టు 15న తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డులను, ఆగస్టు 16న తమిళ, మలయాళ చిత్రాలకు సంబంధించిన అవార్డులను అందించనున్నారు. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మాలీవుడ్ నుంచి కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్‌లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. 15న చిరు, 16న మోహన్‌లాల్‌లు సైమా వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని సైమా ప్రతినిథులు అధికారికంగా ప్రకటించారు. ఖతర్‌లోని దోహలో జరగనున్న ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల నుంచి తారలు తరలివెళ్లనున్నారు. -
సైమా...షురూ...
సాక్షి, హైదరాబాద్: దక్షిణభారత సినీ పరిశ్రమకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) నిర్వహణకు తెర లేచింది. ఈ అవార్డుల ప్రధానోత్సవం వచ్చే ఆగస్టు నెల 15,16 తేదీలలో జరుగనున్నాయి. దీన్ని పురస్కరించుకుని నగరంలోని వెస్టిన్ హోటల్లో శనివారం సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైమా చైర్ పర్సన్బృందా ప్రసాద్ మాట్లాడుతూ అవార్డుల కార్యక్రమాన్ని ఈ ఏడాది మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సినీ తారలు శ్రియా శరన్, నిధిఅగర్వాల్, శాన్వీ, అషిమా, రోహిణి శర్మ... తదితరులు పాల్గొని సైమాతో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. -
ప్రతినాయక పాత్రలకు సిద్ధం : బాలకృష్ణ
టాలీవుడ్లో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. వంద సినిమాల మైలు రాయిని దాటిన ఈ నందమూరి నటసింహా ఇప్పుడు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ పనుల్లో బిజీగా ఉన్న బాలయ్య ఇటీవల జరిగిన సైమా వేడుకల్లో సందడి చేశారు. వేడుకల్లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. యంగ్ హీరో రానాతో కలిసి రెడ్ కార్పెట్ ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తాను కూడా ప్రతినాయక పాత్రల్లో నటించేందుకు సిద్ధమన్నారు. అయితే తాను నెగెటివ్ రోల్స్ చేస్తే తన మీద అభిమానులు కేసుల పెడతారేమో అంటూ నవ్వులు పూయించారు. దుబాయ్‌లో జరిగిన సైమా వేడుకల్లో బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు గాను ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ కేటగిరిలో అవార్డ్‌ను అందుకున్నారు. -
ప్రతినాయక పాత్రలకు సిద్ధం
-
సైమాలో ‘బాహుబలి 2’ హవా!
దక్షిణాది చలన చిత్ర అవార్డుల కార్యక్రమం దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలకు చెందిన తారలందరూ ఈ సైమా వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో టాలీవుడ్‌కు సంబంధించి బాహుబలి2కి అవార్డుల పంట పండింది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫర్ ఇలా బాహుబలి అవార్డుల వేటను కొనసాగించింది. అవార్డులు స్వీకరించిన అనంతరం బాహుబలి బృందం దిగిన ఫోటోను షేర్ చేశాడు సినిమాటోగ్రఫర్ కె.కె.సెంథిల్‌కుమార్. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. సైమా అవార్డుల వివరాలు.. ఉత్తమ చిత్రం : బాహుబలి ది కంక్లూజన్ ఉత్తమ దర్శకుడు : SS రాజమౌళి (బాహుబలిది కంక్లూజన్) ఉత్తమ నటుడు : ప్రభాస్ (బాహుబలిది కంక్లూజన్) ఉత్తమ నటి : కాజల్ అగర్వాల్ (నేనే రాజు నేనే మంత్రి) ఉత్తమ సహాయనటుడు : ఆది పినిశెట్టి (నిన్ను కోరి) ఉత్తమ సహాయనటి : భూమిక చావ్లా(MCA) ఉత్తమ సంగీత దర్శకుడు : MM కీరవాణి (బాహుబలిది కంక్లూజన్) ఉత్తమ పాటల సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ(ఫిదా) ఉత్తమ నేపథ్య గాయకుడు : కాల భైరవ (బాహుబలిది కంక్లూజన్) ఉత్తమ నేపథ్య గాయని : మధుప్రియ (ఫిదా) ఉత్తమ ప్రతి నాయకుడు : రానా దగ్గుబాటి (బాహుబలిది కంక్లూజన్) ఉత్తమ నటుడు( తొలి పరిచయం) : ఇషాన్ (రోగ్) ఉత్తమ నటి( తొలి పరిచయం) : కళ్యాణి ప్రియదర్శన్ (హలో) ఉత్తమ దర్శకుడు( తొలి పరిచయం) : సందీప్ రెడ్డి వంగా(అర్జున్ రెడ్డి) ఉత్తమ ఛాయాగ్రహకుడు : సెంథిల్ కుమార్ (బాహుబలిది కంక్లూజన్) ఉత్తమ హాస్య నటుడు : రాహుల్ రామకృష్ణ(అర్జున్ రెడ్డి) ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ : రానా దగ్గుబాటి(బాహుబలిది కంక్లూజన్.. ది ఘాజి ఎటాక్.. నేనే రాజు నేనే మంత్రి) ఉత్తమ చిత్రం(విమర్శకులు) : గౌతమిపుత్ర శాతకర్ణి ఉత్తమ నటుడు(విమర్శకులు) : నందమూరి బాలకృష్ణ (గౌతమిపుత్ర శాతకర్ణి) ఉత్తమ నటి(విమర్శకులు) : రితిక సింగ్ (గురు) -
బాహుబలి అంటే ఆ మాత్రం ఉండాల్సిందే!
బాహుబలి తెలుగు సినిమా సత్తాను చాటింది. ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేసింది. రాజమౌళి సృష్టించిన ఈ కళాఖండం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ సైమా 2018 అవార్డ్స్‌లో తన స్టామినా ఏంటో చూపింది. పన్నెండు కేటగిరిలో ఈ మూవీ నామినేట్ అయి వార్తల్లో నిలిచింది. ఉత్తమ చిత్రం, నటుడు, నటి, సహాయ నటుడు, సహాయ నటి, సంగీత దర్శకుడు, ప్లే బ్యాక్ సింగర్ మేల్ అండ్ ఫీమేల్, సినిమాటోగ్రఫర్, దర్శకుడు, పాటల రచయిత ఇలా నామినేట్ అయి అందరినీ ఆశ్చర్యపరిచింది. కలెక్షన్లతో దుమ్ముదులిపిన బాహుబలి అవార్డుల్లో కూడా తన సత్తా చాటుతుంది. The Biggest Blockbuster of all time on Indian cinema @BaahubaliMovie receives 12 nominations in various categories for the 2018 @siima awards @ssrajamouli #Prabhas @RanaDaggubati #AnushkaShetty @tamannaahspeaks @meramyakrishnan @Shobu_ @arkamediaworks @actorsubbaraju #SIIMA2018 pic.twitter.com/HV8TonlL2R — BARaju (@baraju_SuperHit) August 5, 2018 -
చెప్పీ.. చెప్పక!
‘అండ్ ది బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గోస్ టు నయనతార..’ అనగానే ఉత్సాహంగా ఈ బ్యూటీ వేదిక మీదకు వెళ్లారు. కానీ, అవార్డు స్వీకరించడానికి నిరాకరించారు. వేదిక మీద ఆల్రెడీ ఉన్న సీనియర్ల చేతుల మీదగా ఆమె అవార్డు అందుకోవడానికి ఇష్టపడలేదు. మరి.. ఎవరి చేతుల మీదగా ఇస్తే తీసుకోవాలనుకున్నారు?.. ఇప్పుడిప్పుడే పైకొస్తున్న దర్శకుడు విఘ్నేష్ శివన్ చేతుల మీదగా ఇప్పించమని నిర్వాహకులను కోరారు. దాంతో విఘ్నేష్ శివన్‌ని వేదిక మీదకు పిలవడం, ఆయన చేతుల మీదగా నయన అవార్డు అందుకోవడం జరిగిపోయింది. సింగపూర్‌లో జరిగిన ‘సైమా’ వేడుకల్లో జరిగిన సంఘటన ఇది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించిన ‘నానుమ్ రౌడీదాన్’ చిత్రానికే నయనతార ఉత్తమ కథానాయికగా అవార్డు అందుకున్నారు. ఇదే చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా విఘ్నేష్ కూడా అవార్డు దక్కించుకున్నారు. కాగా, ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనే వార్త గత కొన్నాళ్లుగా షికారు చేస్తోంది. ఆ వార్తలకు ఊతం ఇచ్చే విధంగా విఘ్నేష్, నయనల సింగపూర్ ట్రిప్ సాగింది. ‘మేం లవ్‌లో ఉన్నాం’ అనే సంకేతాలు అందేట్లుగా ఈ ఇద్దరి ప్రవర్తన ఉందని అవార్డు వేడుకను వీక్షించినవాళ్లు అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే... చెన్నై నుంచి విఘ్నేష్, నయన జాయింట్‌గా సింగపూర్ వెళ్లారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఇద్దరూ ఎయిర్పోర్ట్ నుంచి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్న ఫొటోలు బయటికొచ్చాయి. జాయింట్‌గా వెళితే లవ్‌లో ఉన్నట్లేనా? అన్నది కొందరి వాదన. ఏమీ లేనప్పుడు ఇద్దరూ ఎందుకు కలిసి వెళతారు? చెన్నై నుంచి చాలామంది వెళ్లారుగా.. వాళ్లతో కూడా జాయిన్ అవ్వొచ్చుగా అన్నది ఇంకొందరి వాదన. అవార్డు వేడుక ప్రాంగణానికి కూడా ఇద్దరూ కలిసే వెళ్లారట. పక్క పక్కనే కూర్చున్నారు. ఇద్దరూ జోక్స్ వేసుకోవడం, చెవుల్లో రహస్యంగా ఏదో చెప్పుకోవడం నలుగురి దృష్టిలోనూ పడింది. వీరి వాటం చూస్తుంటే ఏదో స్నేహితుల్లా మాట్లాడుకున్నట్లు లేదని, ప్రేమికులే అనే ఫీలింగ్ కలిగిందనీ ఆ నలుగురూ అంటున్నారు. వేదికపై ఒకరి గురించి మరొకరు కురిపించిన ప్రశంసల వర్షం అయితే హాట్ టాపిక్ అయింది. ఇప్పటివరకూ తాను కలిసినవాళ్లల్లోనే నయనతార ‘బెస్ట్ హ్యూమన్ బీయింగ్’ అని విఘ్నేష్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ‘స్క్రిప్ట్ చదవడానికి రావడం నుంచి లవ్‌లో పడటం వరకూ అన్నింటికీ థ్యాంక్స్’ అని కూడా విఘ్నేష్ అన్నారు. దాంతో నయన స్క్రిప్ట్‌తో లవ్‌లో పడ్డారని అర్థమా? విఘ్నేష్‌తో పడ్డారని అర్థమా? అనే చర్చ మొదలైంది. ఎంతైనా విఘ్నేష్ చాలా తెలివిగలవాడని.. చెప్పీ చెప్పక అసలు విషయాన్ని చెప్పారని కూడా చెప్పుకుంటున్నారు. విఘ్నేష్ మాట్లాడుతున్నంతసేపూ నయనతార ముసిముసి నవ్వులు నవ్వుకున్నారట. ఇక వేదిక మీదకు వచ్చాక.. విఘ్నేష్‌ని ప్రశంసించి ఆనందపడ్డారట. ‘‘ఈ కథ విన్నప్పుడు ఇందులోని పాత్రను నేను చేయగలనా? అని సందేహపడ్డాను. కానీ, విక్కీ (విఘ్నేష్ శివన్)కి నా మీద పూర్తి నమ్మకం ఉంది. తనే నన్ను ఎంకరేజ్ చేశాడు. డిఫరెంట్ రోల్స్ ట్రై చేయడానికి ఇదే సరైన టైమ్ అన్నాడు. నేను తప్ప ఈ పాత్రను ఎవరూ చేయలేరని అన్నాడు’’ అని వేదిక మీద నయనతార అన్నారు. చివర్లో ‘థ్యాంక్యూ విక్కీ..’ అని కూడా చెప్పారు. ఆ తర్వాత ఇద్దరి ఆత్మీయ ఆలింగనం వీక్షకులకు కనువిందు అయింది. అంతా బాగానే ఉంది. ఆల్రెడీ తనకు వేరేవాళ్ల చేతుల మీదగా అవార్డు ఇప్పించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తే.. వారిని కాదని విఘ్నేష్ శివన్ నుంచి అందుకున్నారు నయనతార. మరి.. నిర్వాహకుల కోరిక మీదట నయనకు అవార్డు ఇవ్వాలనుకున్నవాళ్లు చిన్నబుచ్చుకోరూ. అందుకే నయనతార వారికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మొత్తం మీద విఘ్నేష్, నయనల మధ్య ‘సమ్‌థింగ్.. సమ్‌థింగ్..’ ఉందని చాలామంది బలంగా ఫిక్సయ్యారు. మరి.. అందరూ అనుకుంటున్నట్లు వీళ్లది ‘బలమైన బాండింగ్’ అయితే.. అది ఎంత బలమైనదో భవిష్యత్తులో తెలిసిపోతుంది. మూడు ముళ్ల వరకూ వెళ్లేంత ఉందా? లేదా? అన్నది అప్పుడు స్పష్టం అవుతుంది. -
అప్పుడు పవన్, ఇప్పుడు మహేష్
కౌలాలంపూర్: ప్రిన్స్ మహేష్ బాబు మరో అవార్డు దక్కించుకున్నాడు. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాగానూ ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న ఆయన ఇప్పడు 'సైమా'ను సొంతం చేసుకున్నారు. మలేసియాలోని కౌలాలంపూర్ లో వైభవంగా జరిగిన 3వ దక్షిణ భారత అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులు(సైమా)లో కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారం ప్రకటించారు. మహేష్‌బాబు తరపున ఆయన బావ సుధీర్‌బాబు ఈ అవార్డు అందుకున్నారు. గతేడాది 'గబ్బర్ సింగ్'లో నటనకు పవన్ కళ్యాణ్ ఈ అవార్డు దక్కించుకున్నారు. ఈసారి పవన్ సినిమా 'అత్తారింటికి దారేది' ఉత్తమ చిత్రంగా ఎంపికవడమే కాకుండా ఉత్తమ నటి(సమంత), ఉత్తమ దర్శకుడు (త్రివిక్రమ్ శ్రీనివాస్), ఉత్తమ సంగీత దర్శకుడు (దేవిశ్రీ ప్రసాద్), ఉత్తమ ఛాయగ్రాహకుడు(ప్రసాద్ మూరెళ్ల) పురస్కారాలు దక్కించుకుంది. సోషల్ మీడియాలో పాపులర్ నటిగా త్రిష ఎంపికైంది.