దక్షిణాది చలన చిత్ర అవార్డుల కార్యక్రమం దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలకు చెందిన తారలందరూ ఈ సైమా వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో టాలీవుడ్‌కు సంబంధించి బాహుబలి2కి అవార్డుల పంట పండింది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫర్ ఇలా బాహుబలి అవార్డుల వేటను కొనసాగించింది. అవార్డులు స్వీకరించిన అనంతరం బాహుబలి బృందం దిగిన ఫోటోను షేర్ చేశాడు సినిమాటోగ్రఫర్ కె.కె.సెంథిల్‌కుమార్. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది.
సైమా అవార్డుల వివరాలు..
ఉత్తమ చిత్రం : బాహుబలి ది కంక్లూజన్
ఉత్తమ దర్శకుడు : SS రాజమౌళి (బాహుబలిది కంక్లూజన్)
ఉత్తమ నటుడు : ప్రభాస్ (బాహుబలిది కంక్లూజన్)
ఉత్తమ నటి : కాజల్ అగర్వాల్ (నేనే రాజు నేనే మంత్రి)
ఉత్తమ సహాయనటుడు : ఆది పినిశెట్టి (నిన్ను కోరి)
ఉత్తమ సహాయనటి : భూమిక చావ్లా(MCA)
ఉత్తమ సంగీత దర్శకుడు : MM కీరవాణి (బాహుబలిది కంక్లూజన్)
ఉత్తమ పాటల సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ(ఫిదా)
ఉత్తమ నేపథ్య గాయకుడు : కాల భైరవ (బాహుబలిది కంక్లూజన్)
ఉత్తమ నేపథ్య గాయని : మధుప్రియ (ఫిదా)
ఉత్తమ ప్రతి నాయకుడు : రానా దగ్గుబాటి (బాహుబలిది కంక్లూజన్)
ఉత్తమ నటుడు( తొలి పరిచయం) : ఇషాన్ (రోగ్)
ఉత్తమ నటి( తొలి పరిచయం) : కళ్యాణి ప్రియదర్శన్ (హలో)
ఉత్తమ దర్శకుడు( తొలి పరిచయం) : సందీప్ రెడ్డి వంగా(అర్జున్ రెడ్డి)
ఉత్తమ ఛాయాగ్రహకుడు : సెంథిల్ కుమార్ (బాహుబలిది కంక్లూజన్)
ఉత్తమ హాస్య నటుడు : రాహుల్ రామకృష్ణ(అర్జున్ రెడ్డి)
ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ : రానా దగ్గుబాటి(బాహుబలిది కంక్లూజన్.. ది ఘాజి ఎటాక్.. నేనే రాజు నేనే మంత్రి)
ఉత్తమ చిత్రం(విమర్శకులు) : గౌతమిపుత్ర శాతకర్ణి
ఉత్తమ నటుడు(విమర్శకులు) : నందమూరి బాలకృష్ణ (గౌతమిపుత్ర శాతకర్ణి)
ఉత్తమ నటి(విమర్శకులు) : రితిక సింగ్ (గురు)
Comments
Please login to add a commentAdd a comment