Senthil Kumar
-
నువ్వు దూరమై ఏడాది.. భార్యను తల్చుకుని సెంథిల్ భావోద్వేగం
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ (K. K. Senthil Kumar) గుండెలో భారం మోస్తూనే ఉన్నాడు. భార్య లేని జీవితం ఎంతో బాధాకరంగా ఉందంటున్నాడు. తన సతీమణి రూహి (Roohi Yogi)ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. నువ్వు లేకుండా ఏడాది గడిచిపోయింది.. నీ నవ్వులు, నీ ప్రేమ లేకుండానే 365 రోజులు గడిచిపోయాయి. ఈ సమయమంతా నీ జ్ఞాపకాలు, కన్నీళ్లతోనే నిండిపోయింది. ఎప్పుడూ నాకేం గుర్తొస్తుంటాయో తెలుసా? రెస్ట్ ఇన్ పీస్ మై డార్లింగ్..నువ్వు నావైపు చూసినప్పుడు నీ నవ్వు, కళ్లలో మెరుపు, నా చేతిలో నువ్వు చేయేసే విధానం.. పదేపదే గుర్తొస్తాయి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, ఛాంపియన్.. నా సర్వస్వం కూడా! నువ్వు పంచిన ప్రేమ, మనం కలిసి చేసిన పనులు.. అన్నింటినీ జీవితాంతం గుర్తుంచుకుంటాను. రెస్ట్ ఇన్ పీస్ మై డార్లింగ్. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు. ఎల్లప్పుడూ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని రాసుకొచ్చాడు. రూహితో కలిసి దిగిన పాత ఫోటోను ఈ పోస్ట్‌కు జత చేశాడు.ప్రేమ పెళ్లిమగధీర సినిమా షూటింగ్ సమయంలో సెంథిల్, రూహి ప్రేమలో పడ్డారు. 2009లో పెళ్లి చేసుకున్నారు. రూహి.. యోగా టీచర్. అనుష్క, ప్రభాస్, ఇలియానా వంటి ఎంతోమంది సెలబ్రిటీలకు ఆమె యోగా శిక్షణ ఇచ్చింది. 2024 ఫిబ్రవరి 15న రూహి అనారోగ్యంతో మరణించింది. సెంథిల్ కుమార్ విషయానికి వస్తే.. ఛత్రపతి, ఈగ, మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. View this post on Instagram A post shared by Senthil Kumar (@dopkksenthilkumar) చదవండి: తెలుగు సినిమా సెట్లో పదేపదే ఇబ్బంది పెట్టారు: శ్వేతా బసు ప్రసాద్ -
ఫ్రెండ్ కలలో అడిగాడు... చంపేశా!
అన్నానగర్: కరూర్‌లో చనిపోయిన స్నేహితుడు కలలో వచ్చి ప్రతీకారం తీర్చుకోవాలని కోరడంతో యువకుడిని హత్య చేసి ముక్కలుగా నరికి పూడ్చిపెట్టినట్లు నిందితుడు ఇచ్చిన వాగ్మూలం కలకలం రేపింది. కరూర్ గాంధీ గ్రామానికి చెందిన సెంథిల్ కుమార్‌కు జీవా(19) కుమారుడు ఉన్నాడు. తిరుపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీవా 22వ తేదీ సెలవుల నిమిత్తం కరూర్ వచ్చాడు. ఆపై అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. తంథోనిమలై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాంధీ గ్రామానికి చెందిన శశికుమార్ (27) సహా 10 మంది వ్యక్తులు జీవాను హత్య చేసి మృతదేహాన్ని పారిశ్రామికవాడలోని అటవీ ప్రాంతంలో ముక్కలు చేసి పాతిపెట్టినట్లు విచారణలో తేలింది. ఈ హత్యకు సంబంధించి గాంధీ గ్రామానికి చెందిన శశికుమార్‌తోపాటు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అదే ప్రాంతానికి చెందిన చంద్రు (21), కపిల్ కుమార్ (20) పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి శశికుమార్ పోలీసులకు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. మోహన్, తాను కరూర్ గాంధీ గ్రామా నికి చెందిన స్నేహితులమని, 2021లో ఇండస్ట్రియల్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో ఇద్దరం స్నేహితులతో కలిసి మద్యం సేవించామని చెప్పా డు. అప్పుడు తాను, మోహన్ తాగిన వైన్‌లో విషం కలపి ఇచ్చారని, ఇద్దరం తాగామని, మోహన్ మృతి చెందాడని చెప్పాడు. ఈ ఘటనకు జీవా సహకరించాడని తెలిపాడు. మోహన్ తన కలలో వచ్చి నన్ను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పాడని, అందుకే తాను, నా స్నేహితులు కలిసి జీవాను చంపేశామని శశికుమార్ వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
బ్యాచ్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ విజేత వెలవన్
పారిస్: భారత స్క్వాష్ ప్లేయర్ వెలవన్ సెంథిల్ కుమార్ తన కెరీర్లో ఎనిమిదో ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) టైటిల్‌ను సాధించాడు. పారిస్‌లో జరిగిన బ్యాచ్ ఓపెన్ చాలెంజర్ టోర్నీలో తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల వెలవన్ విజేతగా నిలిచాడు.ఫైనల్లో ప్రపంచ 58వ ర్యాంకర్ వెలవన్ 11–6, 11–9, 11–6తో మెల్విల్ సియానిమానికో (ఫ్రాన్స్)పై గెలుపొంది ఈ ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఈ సంవత్సరం నాలుగు టోర్నీలలో పాల్గొన్న వెలవన్ రెండింటిలో క్వార్టర్ ఫైనల్ చేరి, మరో రెండింటిలో రెండో రౌండ్లో ఓడిపోయాడు. -
సెంథిల్ భార్య గురించి ప్రభాస్ ఎమోషనల్ వీడియో
-
సెంథిల్ భార్య మరణం.. ప్రభాస్ వీడియో వైరల్!
టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య రూహీ అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్త విన్న టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె మృతికి పలువురు సినీతారలు సంతాపం తెలిపారు. తాజాగా ఆమె గురించి ప్రభాస్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. రూహీ యోగా ట్రైనర్ కావడంతో ఆమె సలహాలను పాటించేవాడినని అన్నారు. షూటింగ్ తర్వాత అలసటగా ఉన్న సమయంలో యోగ టిప్స్ పాటిస్తూ రిలాక్స్ అయ్యేవాడినని తెలిపారు. ఆమె తనకు మంచి స్నేహితురాలు అని.. యోగాతో మనం యాక్టివ్‌గా ఉండేందుకు తోడ్పడుతుందని ప్రభాస్ అన్నారు. తన సలహాలతో బాహుబలి పార్ట్-2 లో చాలా హెల్ప్ అయిందని ప్రభాస్ మాట్లాడారు. తాజాాగా ఆమె మరణంతో ప్రభాస్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. బాహుబలి సినిమా సమయంలో అనుష్క, ప్రభాస్‌కు యోగా ట్రైనర్‌గా పనిచేశారు. అంతే కాకుండా ఇలియానాకు కూడా యోగా ట్రైనింగ్ ఇచ్చారు. సెంథిల్ కుమార్ ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రాలకు సినిమాటోగ్రఫర్‌గా సేవలందించారు. ఆర్ఆర్ఆర్, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్, మగధీర, అరుంధతి, యమదొంగ, ఛత్రపతి, ఈగ, సై వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలలో వీరిద్దరూ కలిసి పనిచేశారు. Yoga exponent #Roohi has passed away due to health issues. May her soul rest in peace! Stay strong, anna @DOPSenthilKumar. Throwback video of #Prabhas talking about #SenthilKumar's wife, #Roohi.pic.twitter.com/nJs78SUa5W — Hail Prabhas (@HailPrabhas007) February 15, 2024 -
ఇలా అవుతుందని ఊహించలేదు: చార్మీ, మంచు లక్ష్మి ఎమోషనల్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ భార్య, యోగా ట్రైనర్ రూహీ మరణవార్త అందరినీ కలిచివేస్తోంది. ఎంతోమంది తారలకు యోగా టీచర్‌గా పని చేసిన రూహి అనారోగ్యంతో గురువారం నాడు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు. చార్మీ, మంచు లక్ష్మి.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనలయ్యారు. ఈ వార్త అబద్ధమైతే బాగుండు 'ప్రియమైన రూహి.. నీ కోసం ఇలాంటి పోస్ట్ వేస్తానని ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నాను. మాటలు రావడం లేదు. నువ్వు ఇక లేవన్న వార్త అబద్ధమైతే బాగుండనిపిస్తోంది. మనం చివరిసారి కూడా ఎంతో సరదాగా మాట్లాడుకున్నాం. 18 ఏళ్ల అందమైన స్నేహబంధం మనది. నిన్ను మిస్ అవుతానని చెప్పడం చిన్నమాటే అవుతుంది. నీ కుటుంబానికి ఆ దేవుడు మరింత శక్తినివ్వాలి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది చార్మీ. డ్యాన్స్, నవ్వులు.. అవన్నీ.. మంచు లక్ష్మి.. రూహితో తన చివరి చాట్‌ను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'రూహి నుంచి నాకు అందిన చివరి మెసేజ్ ఇదే! ప్రతివారం తనను జిమ్‌లో కలుస్తూ ఉండేదాన్ని. తన ముఖంలో ఎప్పుడూ ఒక నిష్కల్మషమైన నవ్వు కనిపిస్తూ ఉండేది. ఎంతో ఎనర్జీగా కనిపించేది. మేమిద్దరం ఒళ్లంతా చెమటలు పట్టేవరకు డ్యాన్స్ చేసేవాళ్లం.. దవడలు నొప్పిపుట్టేంతవరకు నవ్వుతూనే ఉండేవాళ్లం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని నువ్వు మరోసారి నిరూపించావు. ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయినందుకు ఎంతో బాధగా ఉంది. మేము అదృష్టవంతులం సెంథిల్, తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తుంటేనే మనసు కలుక్కుమంటోంది. కానీ నువ్వు జీవితానికి సరిపడా ప్రేమను పంచి వెళ్లిపోయావు. నీతో కలిసి ప్రయాణం చేసిన మేమంతా ఎంతో అదృష్టవంతులం. ఎప్పుడూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ సర్ప్రైజ్ చేసేదానివి.. ఇప్పుడు స్వర్గంలో ఉన్న ఏంజెల్స్‌కు యోగాసనాలు నేర్పిస్తున్నావని ఆశిస్తున్నాను. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను. ఇకపై నన్ను చూడటానికి రాలేవు. ఇలాంటి పోస్ట్ వేస్తానని కలలో కూడా ఊహించలేదు. నీ పేరు మీద ఈరోజు ప్రతిక్షణం సెలబ్రేట్ చేసుకుంటా.. ఇట్లు నీ స్నేహితురాలు లక్ష్మి' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రాఫర్ భార్య మృతి -
టాలీవుడ్లో తీవ్ర విషాదం
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ భార్య రుహీ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వృత్తిరీత్యా ఆమె యోగా శిక్షకురాలుగా పని చేస్తున్నారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో శుక్రవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా.. ఆమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పని చేశారు. భరత్ ఠాకూర్ యోగా క్లాసుల హైదరాబాద్ విభాగానికి కూడా ఆమె సారథ్యం వహించారు. కాగా..సెంథిల్ కుమార్ జూన్ 2009లో రూహీని వివాహం చేసుకున్నారు. టాలీవుడ్లో సెంథిల్ కుమార్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలకే ఎక్కువగా పనిచేశారు. టాలీవుడ్లో సై, ఛత్రపతి, యమదొంగ, అరుంధతి, మగధీర, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. View this post on Instagram A post shared by Senthil Kumar (@dopkksenthilkumar) -
దేశాన్ని విడదీసే కుట్రలు సాగనివ్వం
న్యూఢిల్లీ: గోమూత్ర రాష్ట్రాలు అంటూ తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బుధవారం లోక్‌సభలో తీవ్ర అలజడి సృష్టించాయి. అధికార బీజేపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12 గంటలకు సభకు పునఃప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఈ అంశాన్ని లేవనెత్తారు. సెంథిల్ కుమార్ అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు ఆమోదిస్తున్నారా? అని నిలదీశారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ భారతదేశంగా విడదీసే కుట్రలను సాగనివ్వబోమని తేలి్చచెప్పారు. సెంథిల్ కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని మేఘ్వాల్ డిమాండ్ చేశారు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించారని, దేశం పట్ల వారి తీర్పును వెలువరించారని అన్నారు. టీఆర్ బాలు స్పందిస్తూ.. సెంథిల్ కుమార్ అలా మాట్లాడడం సరైంది కాదని చెప్పారు. సెంథిల్‌ను తమ ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారని తెలిపారు. సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు. సభలో సెంథిల్ కుమార్ క్షమాపణ తను వ్యాఖ్యల పట్ల డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. బుధవారం లోక్‌సభలో క్షమాపణ కోరారు. ప్రజల మనోభావాలను గాయపర్చడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. అనుకోకుండానే ఈ మాట ఉపయోగించానని, తనకు ఎలాంటి దురుద్దేశం లేదని సెంథిల్ కుమార్ వివరణ ఇచ్చారు. ఆయన మంగళవారం క్షమాపణ కోరుతూ ‘ఎక్స్’లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ సంస్కృతిని కించపర్చే కుట్ర ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ భారతీయ సంస్కృతిని, గుర్తింపునకు కించపర్చేందుకు కుట్ర పన్నిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలు అన్వేíÙంచకుండా దేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కుయుక్తులు సాగిస్తోందని ధ్వజమెత్తారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోయిన తర్వాతే ఉత్తర–దక్షిణ భారతదేశం అనే విభజనను తెరపైకి తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. -
‘గో మూత్ర’ వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్లమెంట్లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం పార్లమెంట్లో ఒక ప్రకటన చేశారు. ‘నిన్న నేను చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఎవరి మనోభావాలనైనా నేను గాయపరిచి ఉంటే క్షమించండి. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా. పార్లమెంటు రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాలని కోరుతున్నా’అని సెంథిల్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. అంతకముందు ఉదయం సామాజిక మధ్యమం ఎక్స్‌లోనూ పార్లమెంట్లో తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ చేశారు. ‘నేను నిన్న కొన్ని మాటలను అసంబంద్ధంగా వాడాను. ఇందుకు నేనువిచారం వ్యక్తం చేస్తున్నాను. క్షమించాల్సిందిగా కోరుతున్నా’అని తెలిపారు. కాగా, సెంథిల్ కుమార్ వ్యాఖ్యలపై బుధవారం ఉదయం పార్లమెంట్లో కేంద్ర మంత్రులు సహా బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు.ఇలాంటి వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని అవమానించడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీలు కార్తిచిదంబరం, రాజీవ్‌శుక్లా కూడా సెంథిల్ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్లమెంటులో మంగళవారం మాట్లాడుతూ గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలిచిందన్న వ్యాఖ్యలు చేసి వివాదం రాజేసిన విషయం తెలిసిందే. ఇదీచదవండి..భార్య, పిల్లలను చంపి డాక్టర్ సూసైడ్..కారణమిదే! -
గోమూత్ర రాష్ట్రాల్లోనే గెలుపు
న్యూఢిల్లీ: హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాలను తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ గోమూత్ర రాష్ట్రాలు అని అభివర్ణించారు. కేవలం గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందంటూ లోక్‌సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో గెలిచే సత్తా బీజేపీకి లేదని ఆయన అన్నారు. సెంథిల్ కుమార్‌పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే ఎంపీ ఉత్తర భారతీయులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా? అని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాందీని ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన రెండు బిల్లులపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో సెంథిల్ కుమార్ మాట్లాడారు. మనం సాధారణంగా గోమూత్ర రాష్ట్రాలుగా పిలిచే ఉత్తరాది రాష్ట్రాల్లోనే బీజేపీ విజయం సాధిస్తుందని, ఈ విషయం ప్రజలు గుర్తించాలని అన్నారు. ‘‘మీరు(బీజేపీ) దక్షిణ భారతదేశానికి చేరుకోలేరు. అక్కడ మీకు విజయం దక్కదు. స్థానం లేదు. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో ఏం జరిగిందో చూడండి. దక్షిణాదిన మేము బలంగా ఉన్నాం’’ అని స్పష్టంచేశారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిస్తే తప్ప బీజేపీకి అక్కడ అధికారం దక్కదని తేల్చిచెప్పారు. దక్షిణ భారతదేశంపై ఆధిపత్యం చెలాయించే సాహసాన్ని బీజేపీ కలలో కూడా చేయలేదని పేర్కొన్నారు. సెంథిల్‌కుమార్ వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై తీవ్రంగా ఖండించారు. తమిళనాడులో డీఎంకే పతనం ప్రారంభమైందని, ఆ పార్టీ నేతల అహంకారమే ఇందుకు కారణమని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వ నిర్వాకం వల్లే చెన్నై నగరం నీట మునుగుతోందని విమర్శించారు. పుదుచ్చేరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలో ఉందని అన్నామలై గుర్తుచేశారు. సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా? అని కర్ణాటక మాజీ మంత్రి సి.టి.రవి నిలదీశారు. భారతీయులను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అవమానిస్తున్నాయని మండిపడ్డారు. సెంథిల్ కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని, వివాదాస్పద వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం డిమాండ్ చేశారు. సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ శుక్లా తదితరులు తప్పుపట్టారు. మరోవైపు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కేసు నమోదు చేయాలని, పదవి నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మంగళవారం తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభ గౌరవాన్ని కాపాడాలి: ఓం బిర్లా లోక్‌సభలోకి ఎంపీలు ప్లకార్డులు తీసుకురావడం పట్ల స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ గౌరవాన్ని కాపాడాలని, క్రమశిక్షణ పాటించాలని సూచించారు. తనను కించపర్చేలా మాట్లాడిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ సభ్యుడు డానిష్ అలీ సోమవారం సభలో ప్లకార్డును మెడకు బిగించుకొని నిరసన తెలిపారు. ఈ ఘటనపై స్పీకర్ మంగళవారం సభలో స్పందించారు. సభలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడం సరైంది కాదని హితవు పలికారు. నియమ నిబంధనలకు సభ్యులంతా కట్టుబడి ఉండాలని చెప్పారు. సెంథిల్ కుమార్ క్షమాపణ లోక్‌సభలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ క్షమాపణ చెప్పారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ప్రస్తావించానని, ఇందులో భాగంగా ఒక వాక్యాన్ని సరైన రీతిలో ఉపయోగించలేదని పే ర్కొన్నారు. తనకు ఎలాంటి దు రుద్దేశం లేదన్నారు. తన మాటలకు తప్పుడు అర్థాలు ప్రచారంలోకి వస్తుండడంతో క్షమాపణ కోరుతున్నానని వివరించారు. -
ఆస్కార్‌లో కొత్త రూల్.. ఈ అర్హతలు ఉంటేనే ఎంట్రీ
ప్రతి ఏడాది ఆస్కార్ సభ్యత్వ నమోదు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు విజేతల నిర్ణయానికి ఈ సభ్యుల ఓటింగ్ కీలకంగా నిలుస్తుంది. 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14న జరగనుంది. కాగా ‘క్లాస్ ఆఫ్ 2023’లో భాగంగా 398 మంది కొత్త సభ్యులకు ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానాన్ని పంపినట్లు ఆస్కార్ కమిటీ సీఈవో బిల్ క్రామెర్, అధ్యక్షుడు జానెట్ యాంగ్ వెల్లడించారు. ఈ జాబితాలో మన దేశం నుంచి దాదాపు 15 మందికి ఆహ్వానం అందడం విశేషం. తెలుగు నుంచి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌లో ఆరుగురు, తమిళం నుంచి మణిరత్నం, బాలీవుడ్‌నుంచి దర్శక–నిర్మాత కరణ్ జోహార్ వంటివారు ఉన్నారు. వృత్తిపరమైన అర్హతలు, ప్రపంచవ్యాప్త గుర్తింపు వంటి అంశాల ఆధారంగా ఈ ‘క్లాస్ ఆఫ్ 2023’ జాబితాను తయారు చేసినట్లు అకాడమీ పేర్కొంది. ఈ 398 మందిలో 51 దేశాలకు చెందినవారు ఉండగా, వీరిలో 40 శాతం మంది మహిళలు, 52 శాతం మంది యూఎస్‌కు చెందనివారు ఉన్నట్లుగా ఆస్కార్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక ఈ కొత్త సభ్యులతో కలిసి ఆస్కార్ మెంబర్‌షిప్‌లు కలిగి ఉన్నవారి సంఖ్య 10, 817కు చేరినట్లు హాలీవుడ్ అంటోంది. ఆర్ఆర్ఆర్ నుంచి ... ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకుగాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ యంయం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌లకు అకాడమీ ఆహ్వానాలు అందాయి. అలాగే ఈ చిత్రం హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌లు కూడా ఆస్కార్ అకాడమీ సభ్యులు కానున్నారు. దర్శకులు మణిరత్నం, షౌనక్ సేన్ (95వ ఆస్కార్ అవార్డ్స్‌లో డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ దర్శకుడు), నిర్మాతలు కరణ్ జోహర్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ (95వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీగా పంపబడిన గుజరాతీ ఫిల్మ్ ‘ది ఛెల్లో షో’ నిర్మాత), చైతన్య తమ్హానే (మరాఠీ), ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీకి చెందిన గిరీష్ బాలకృష్ణన్, క్రాంతి శర్మ, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్‌లు హరేష్ హింగో రాణి, పీసీ సనత్, ఫిల్మ్ ఎగ్జిక్యూ టివ్‌లు శివానీ రావత్, శివానీ పాండ్యా మల్హోత్రా వంటివారు ఉన్నారు. గర్వంగా ఉంది – రాజమౌళి ‘‘ఆస్కార్ అకాడమీ సభ్యత్వ నమోదు కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచి ఆరుగురికి ఇన్విటేషన్స్ రావడం గర్వంగా ఉంది. వీరితో పాటు భారతదేశం తరఫున ఆస్కార్ ఆహ్వానం అందుకున్నవారికి కూడా నా శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు రాజమౌళి. కొత్త రూల్ ఓ సినిమాను ఆస్కార్ ఎంట్రీకి పంపాలంటే కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. యూఎస్‌లోని ఆరు ప్రధాన నగరాల్లో (న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, చికాగో, మియామి, అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో) ఆ సినిమా కనీసం ఏడు రోజులు ప్రదర్శితం కావాలి. వీటిలో ఒక షో సాయంత్రం ప్రైమ్ టైమ్‌లో ఉండాలి, థియేటర్స్‌లో కనీస సీటింగ్ సామర్థ్యం ఉండాలి. తాజాగా బెస్ట్ పిక్చర్, ఫారిన్ బెస్ట్ ఫిల్మ్ విభాగాలకు సంబంధించి కొత్త రూల్ పెట్టనున్నారట. ఇకపై ఆస్కార్‌కు ఓ సినిమాను పంపాలంటే యూఎస్‌లోని పాతికకు పైగా మూవీ మార్కెట్స్ ఉన్నచోట సినిమాలు ప్రదర్శించబడాలట. అది కూడా రెండువారాలకు పైగా. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని అని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ కొత్త రూల్‌ను 97వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవం (2025) నుంచి అమలులోకి తేవాలని అవార్డ్ కమిటీ ప్లాన్ చేస్తోందన్నది హాలీవుడ్ టాక్. ఆ నలుగురికీ గౌరవం ‘‘ఈ నలుగురూ చలన చిత్రపరి శ్రమలో మంచి మార్పుకు నాంది అయ్యారు. తర్వాతి తరం ఫిల్మ్ మేకర్స్‌కి, ఫ్యాన్స్‌కి స్ఫూర్తిగా నిలిచారు. వీరిని సత్కరించడం ‘బోర్డ్ ఆఫ్ గవర్నర్స్’కి థ్రిల్‌గా ఉంది’’ అని ఆస్కార్ అకాడమీ అవార్డ్ అధ్యక్షుడు జానెట్ యాంగ్ అన్నారు. సినిమా రంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ‘గవర్నర్ అవార్డ్స్’లో భాగంగా హానరరీ ఆస్కార్ అవార్డ్‌ను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఈ గౌరవ ఆస్కార్‌ను అందుకోనున్న నలుగురిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. నటి ఏంజెలా బాసెట్, రచ యిత–దర్శకుడు–నటుడు–గేయ రచయిత మెల్ బ్రూక్స్, ఫిల్మ్ ఎడిటర్ కరోల్ లిటిల్టన్లతో పాటు సన్డాన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన మిచెల్ సాటర్‌లకు అవార్డును అందజేయనున్నారు. నవంబర్ 18న లాస్ ఏంజెల్స్‌లోని ఫెయిర్మాంట్ సెంచరీ ప్లాజాలో జరిగే వేడుకలో ఈ నలుగురూ గౌరవ పురస్కారాలు అందుకుంటారు. -
RRR: ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చిన డీఓపీ సెంథిల్ కుమార్ (ఫొటోలు)
-
RRR సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, భార్య రూహీతో " ప్రత్యేక ఇంటర్వ్యూ "
-
RRR సినిమాపై సెంథిల్ కుమార్ రివ్యూ
-
'నా బిడ్డను అన్యాయంగా చంపేశారు..'
సాక్షి, పీలేరు/కేవీపల్లె: ‘‘నా బిడ్డను అన్యాయంగా చంపేశారు... నిందితులను కఠినంగా శిక్షించండి.’’ అంటూ హతుడి తల్లి బోరున విలపించింది. కేవీపల్లె మండలం ఎగువమేకలవారిపల్లె సమీపంలోని బొప్పాయితోటలో హత్యకు గురైన తేజేష్‌రెడ్డి తల్లి జ్యోతి గురువారం పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఎదుట తనగోడు వెల్లబోసుకుంది. తేజేష్‌రెడ్డి(8) మృతదేహానికి గురువారం పీలేరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. ఎమ్మెల్యే ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతుని బంధువులను ఓదార్చే ప్రయత్నం చేశారు. జ్యోతి మాట్లాడుతూ, తాము ఎవరికీ ఎలాంటి హానీ చేయలేదని, గతంలో అప్పు చేసినా తీర్చేశామని పేర్కొంది. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ అభంశుభం తెలియని బాలుడిని హత్య చేయడం అత్యంత కిరాతకమైన సంఘటనగా అన్నారు. నిందితులు ఎంతటి వారైనా, ఎవరైనా ఉపేక్షించబోమని కఠిన శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఎస్పీ విచారణ తేజేష్‌రెడ్డి హత్యాఘటనపై గురువారం రాత్రి ఎస్పీ సెంథిల్‌కుమార్ గ్రామంలో విచారణ చేపట్టారు. వివిధ కోణాల్లో గ్రామస్తులను సమాచారం అడిగి తెలుసుకుని వివరాలు నమోదు చేశారు. ప్రధానంగా తేజేష్‌రెడ్డి తల్లిదండ్రుల ఆర్థిక లావాదేవీలు కారణమై వుండవచ్చన్న అనుమానాలున్నాయి. ఎస్పీతోపాటు సీఐ, ఎస్ఐ, సిబ్బంది ఉన్నారు. చదవండి: (Devaragattu Bunny Festival: భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే..?) సంకేనిగుట్టపల్లెలో విషాదఛాయలు పోస్టుమార్టం చేసిన మృతదేహాన్ని గ్యారంపల్లె పంచాయతీ సంకేనిగుట్టపల్లెకు తరలించారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తల్లి జ్యోతితోపాటు బంధువుల రోదనలు కలచివేశాయి. కువైట్‌లో ఉన్న తండ్రి నాగిరెడ్డి స్వగ్రామానికి వస్తున్నట్లు బంధువులు తెలిపారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. -
రాజకీయం చేయడం తగదు
కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలం గోనుగూరు పంచాయతీలో సుబ్రమణ్యస్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం ఘటన సున్నితమైందని, దీన్ని రాజకీయ పారీ్టలు లబి్ధకోసం వాడుకోవడం తగదని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ పేర్కొన్నారు. కుప్పంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఘటనపై మంగళవారం దేవస్థాన కమిటీ, పూజారులు ఫిర్యాదు చేయడంతో 24 గంటల్లోనే పోలీసుశాఖ ఛేదించిందని చెప్పారు. ఇది ఎలా జరిగింది, కారకులెవరు.. అనే సమాచారం తెలుసుకోకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనల్ని రాజకీయ పారీ్టలు మానుకోవాలని సూచించారు. గోనుగూరు గ్రామంలో నాలుగేళ్లుగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న జ్యోతి అనే మహిళ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను ధ్వంసం చేసి కొండ పక్కనున్న గుట్టలో పడేసిందని చెప్పారు. గ్రామంలోని ఓ టీ దుకాణం వద్ద చేతికి గాయాలెందుకయ్యాయని కొందరు జ్యోతిని ప్రశ్నించగా.. మురుగన్‌ను చంపేశానని చెప్పినట్లు తెలిపారు. వారానికి ఒకసారి ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లే పూజారులు మూల విగ్రహాలు కనబడకపోవడంతో ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై అదనపు ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేశామని, ఆలయ కమిటీ, గ్రామస్తుల సహకారంతో 24 గంటల్లో ఛేదించామని చెప్పారు. జిల్లాలో 3,700 ఆలయాల్లో జియో ట్యాగింగ్ చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, నిఘా పెంచామని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసుశాఖ స్పందించి నిగ్గు తేల్చిందని, అసలు విషయం తెలుసుకోకుండా చంద్రబాబు సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో డీఎస్పీ గంగయ్య, సీఐలు శ్రీధర్, యతీంద్ర, నాలుగు మండలాల ఎస్ఐలు పాల్గొన్నారు. -
చిత్తూరు జిల్లా ఆలయం లో జరిగిన ఘటన పై ఎస్పీ ప్రెస్ మీట్
-
ఓం ప్రతాప్ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు
పుంగనూరు (చిత్తూరు జిల్లా): సోమల మండలం పెద్దకాడ హరిజనవాడలో మృతి చెందిన ఓంప్రతాప్ (28) మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, ఆయనది సహజ మరణమేనని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శుక్రవారం ఆయన మృతుడి తండ్రి శ్రీనివాసులు, చిన్నాన్న వెంకటరమణ, తల్లి జాదెమ్మ, సోదరుడు ఓంప్రకాష్‌ల ఇళ్లకి వెళ్లి పరామర్శించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ► ఓంప్రతాప్ మృతిపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టింగ్‌లు అన్నీ వాస్తవాలు కాదు. ► అలాగే, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఎమ్మెల్సీ లోకేశ్, టీడీపీ నాయకుడు వర్ల రామయ్యల ఆరోపణల్లోనూ వాస్తవం లేదు. ► ఓం ప్రతాప్ మృతిపై ప్రతిపక్ష నాయకుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు ఉన్నా అందజేస్తే చర్యలు తీసుకుంటాం. ► ఓంప్రతాప్ మాటలను కొంతమంది రికార్డు చేసి, దురుద్దేశంతోనే సోషల్ మీడియాలో పెట్టారు. ఓంప్రతాప్ ఎలాంటి పోస్టులు పెట్టలేదు. దీనిపైనా దర్యాప్తు చేపడుతున్నాం. ► సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాలతో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ► సమావేశంలో మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, తహశీల్దార్ శ్యాంప్రసాద్‌రెడ్డి, సీఐలు మధుసూదనరెడ్డి, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మగధీర.. కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలు
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో రికార్డు తిరగరాసిన చిత్రం మగధీర. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో అల్లు అరవింద్, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతలుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా తెలుగు సినిమా సత్తాను చాటింది. రామ్‌చరణ్‌తో పాటు ఈ చిత్రంలో నటించిన కాజల్ అగర్వాల్, శ్రీహరి, దేవ్ గిల్, రావు రమేష్.. తమ నటనతో మెప్పించారు. ముఖ్యంగా రామ్‌చరణ్.. హార్స్ రైడింగ్, కాజల్ గ్లామర్, శ్రీహరి-రామ్‌చరణ్ మధ్య డైలాగ్ వార్ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.(జూన్ 8 వరకు సుశాంత్‌తోనే ఉన్నా: రియా) Here's the beautiful video tribute to Dr.Srihari garu by @AlwaysRamCharan fans on the 11th anniversary of #Magadheera #11YearsForIHMagadheera#RamCharan #SSRajamouli pic.twitter.com/j9uaFfdt8t — BARaju (@baraju_SuperHit) July 31, 2020 అలాగే రాజమౌళి- డైరెక్షన్, కీరవాణి- సంగీతం, కేకే సెంథిల్- సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్- ఫైట్స్, రమ రాజమౌళి- కాస్ట్యూమ్ డిజైన్స్.. ఇలా ప్రతి ఒక్కటి సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం విడుదలై 11 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్.. ఆ సినిమా సంగతులను గుర్తుచేసుకుంది. ‘ మగధీర సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌కు గురి చేసింది. ఫిల్మ్ మేకింగ్‌లోనూ, బాక్సాఫీస్ వసూళ్లలోనూ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. విడుదల తర్వాత దక్షిణాదిలో సన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది’ అని పేర్కొంది.(రాజమౌళి, ఆయన కుటుంబసభ్యులకు కరోనా) తాజాగా ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ కూడా ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మగధీర షూటింగ్‌కు సంబంధించిన పలు చిత్రాలనున ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. మగధీర నుంచి కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలు అని పేర్కొన్నారు. మరోవైపు అభిమానులు కూడా సోషల్ మీడియాలో ‘#11YearsForIHMagadheera’ ట్యాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దివంగత నటుడు శ్రీహరికి రామ్‌చరణ్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రీహరి తనపై తీసుకున్న కేర్ గురించి రామ్‌చరణ్ గతంలో చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేస్తున్నారు. Some wonderful memories from #Magadheera.....@AlwaysRamCharan @MsKajalAggarwal @ssrajamouli @GeethaArts pic.twitter.com/DTDa46DoiO — KK Senthil Kumar ISC (@DOPSenthilKumar) July 31, 2020 -
సీఎం జగన్ సభకు ఏర్పాట్ల పరిశీలన
సాక్షి, చిత్తూరు : ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. వచ్చే నెల(జనవరి) 9న అమ్మ-ఒడి కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ చిత్తూరు నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 47 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, ఎస్పీ సెంథిల్ కుమార్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న అమ్మ ఒడి కార్యక్రమానికి స్థల పరిశీలన చేస్తున్నామని కలెక్టర్ భరత్ గుప్తా పేర్కొన్నారు. సీఎం జగన్ మొదటి సారి జిల్లాకు రానున్న నేపథ్యంలో ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తారని, అందుకు తగిన భద్రతతోపాటు చర్యలు తీసకుంటామని ఎస్పీ సెంథిల్ కుమార్ స్పష్టం చేశారు. అమ్మ ఒడి కార్యక్రమాన్ని ద్విగిజయం చేసేందుకు అందరం కలిసి కృషి చేస్తామని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. -
పోలీసులు ప్రజల్లో భాగమే
సాక్షి, చిత్తూరు అర్బన్: పోలీసులు కూడా ప్రజల్లో భాగమేనని, స్టేషన్‌కు రావాలంటే ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో పోలీసు శాఖ పనితీరు, ప్రజల అభిప్రాయాలపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసులపై ప్రజల్లో ఉన్న దురాభిప్రాయాన్ని తొలగించి, లోటుపాట్లను చర్చించడానికి ఇలాంటి సదస్సులు ఉపయోగపడుతాయన్నారు. ప్రజలు కూడా యూనిఫాం ధరించని బాధ్యత కలిగిన పోలీసులేనన్నారు. ఏఎస్పీ సుప్రజ మాట్లాడుతూ ప్రజలు పోలీసు శాఖపై అభిప్రాయాలు పంచుకోవాలన్నా, ఆపదలో ఉన్నప్పుడు డయల్–100, పోలీసు వాట్సప్–9440900006 లకు ఫోన్ చేయాలన్నారు. నగరానికి చెందిన సీ–ప్యాక్ సంస్థ వ్యవస్థాపకులు రాంబాబు మాట్లాడుతూ పోలీసు శాఖలో అవినీతిని తగ్గించడానికి ప్రయత్నించాలని, ఫ్రెండ్లీ పోలీస్‌ను మరింత కిందిస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలు స్టేషన్‌కు ధైర్యంగా రావాలంటే స్టేషన్లలో సీసీ కెమెరాలు పెట్టాలన్నారు. జైన్సంఘ నిర్వాహకులు సుభాష్‌జైన్ మాట్లాడుతూ పోలీసులతో పాటు ప్రజలు కూడా బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పలువురు విద్యార్థులు వివిధ అంశాలపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్‌ఫర్ బెటర్ సంస్థ ప్రతినిధి విష్ణు, సీతమ్స్ కళాశాల అధ్యాపకులు షపీ, ఏఎస్పీలు కృష్ణార్జునరావు, చంద్రమౌళి, సీఐలు భాస్కర్‌రెడ్డి, యుగంధర్ పాల్గొన్నారు. 516 మంది రక్తదానం పోలీసు అమరవీరుల వారోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 516 మంది రక్తదానం చేశారు. చిత్తూరు నగరంలోని పోలీసు సంక్షేమ ఆస్పత్రిలో 152 మంది రక్తదానం చేయగా పరిశీలించి, ఎస్పీ సెంథిల్‌కుమార్ దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
భర్త అంత్యక్రియలపై ఇద్దరు భార్యల బాహాబాహీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇద్దరు సవతి భార్యల పోరులో భర్త అంత్యక్రియల వ్యవహారం ప్రహసనంగా మారింది. భర్త శవం తనకే సొంతమంటూ ఇద్దరు భార్యలు పోట్లాడుకుని పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కిన ఉదంతం తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ యూనివర్సిటీలో సెక్యూరిటీ పని చేస్తున్న సెంథిల్ కుమార్ (44), విజయ దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. మనస్పర్థల కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. భర్తతో విడిపోయి అదే వర్సిటీలో పనిచేస్తున్న మహేశ్వరి అనే మహిళను సెంథిల్ కుమార్ రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ వర్సిటీ క్వార్టర్స్‌లో కాపురం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. అయితే బుధవారం రాత్రి సెక్యూరిటీ విధుల్లో ఉన్న సెంథిల్ కుమార్ గుండెపోటుకు గురై స్పృహతప్పి పడిపోయాడు. సహచర ఉద్యోగులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్న రెండో భార్య మహేశ్వరి.. భర్త అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని బంధువుల సహాయంతో ఇంటికి చేర్చింది. ఈ సమాచారం అందుకున్న మొదటి భార్య విజయ అక్కడికి వెళ్లగా.. విడాకులు ఇచ్చిన నీకు భర్త మరణంతో సంబంధం ఏమిటని మహేశ్వరి వెళ్లగొట్టే ప్రయత్నం చేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. దీంతో బంధువులు చేసేది లేక పోలీసులకు సమాచారం ఇవ్వగా సెంథిల్‌కుమార్ మృతదేహాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేయగా ఫలించకపోవడంతో పోలీసులు.. విద్యుత్ శ్మశానవాటికలో విజయ కుమార్తె తన తండ్రికి అంత్యక్రియలు చేయవచ్చని తీర్మానం చేశారు. దీంతో సెంథిల్‌కుమార్, ఇద్దరు భార్యలు, బంధువుల సమక్షంలో అంతిమ సంస్కారాలు గురువారం పూర్తయ్యాయి. -
ప్రతి ఐదు సీన్లకు సస్పెన్స్
శ్రీనివాసరెడ్డి, సెంథిల్ కుమార్, బాబు రాజన్, దేవన్, సరోజిత్, స్నేహాకపూర్ ముఖ్య తారలుగా రమేష్ చౌదరి దర్శకత్వంలో విక్కీరాజ్ నిర్మించిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్’. ఈ నెల 22న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ మాట్లాడుతూ– ‘‘శరత్, మోహన్‌గాంధీ, కె. వాసు, తాతినేని లక్ష్మీవరప్రసాద్ వంటి దర్శకుల దగ్గర పనిచేశాను. నా పిల్లల చదువుకోసం టైమ్ స్పెండ్ చేయడం వల్ల నేను దర్శకునిగా పరిచయం అవ్వడం ఆలస్యం అయ్యింది. విక్కీరాజ్గారు చాలా బిజీగా ఉంటారు. ఓ ప్రయాణంలో ఆయన పరిచయం అయ్యారు. ఈ సినిమా కథ చెప్పాను. ఆయనకు నచ్చింది. షూటింగ్ స్టార్ట్ చేశాం. పదిమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించిన కథ ఇది. వారు విహారయాత్రం కోసం అడవుల్లోకి వెళ్లినప్పుడు ఏం జరిగింది? అనే అంశం చుట్టూ సినిమా ఉంటుంది. ప్రతి ఐదు సీన్లకు ఓ సస్పెన్స్ ఉంటుంది. ఇందులోని మర్డర్ మిస్టరీ ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది. యువతకు తగ్గట్లు ఉంటుంది. మలేసియాలో చిత్రీకరించిన క్లైమాక్స్, హైదరాబాద్‌లో షూట్ చేసిన ఓ పబ్‌సాంగ్ హైలైట్‌గా ఉంటాయి. టీమ్ అందరూ బాగా నటించారు. విక్కీరాజ్గారితోనే నా నెక్ట్స్ చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘కథ విన్నప్పుడు ఎగై్జటింగ్‌గా అనిపించింది. కాస్త డబ్బులు రాగానే లైఫ్‌స్టైల్‌ని మార్చుకుని హైఫై లైఫ్‌ని లీడ్ చేయడానికి ఇష్టపడతారు కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వారికి చెందిన కథే ఇది. సోషల్ మెసేజ్ కూడా ఉంది’’ అన్నారు విక్కీరాజ్. -
ట్వంటీ ట్వంటీ లవ్
అరవింద్, మోహిని జంటగా సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి ‘లవ్ 20–20’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మోహన్ వడ్లపట్ల, మహేందర్ వడ్లపట్ల, జో శర్మ నిర్మిస్తున్నారు. మెక్విన్ గ్రూప్ (యూఎస్ఏ) సహనిర్మాత. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. కొంత ప్యాచ్ వర్క్‌తో సహా, ఫైనల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ ఈ నెల 6 వరకు జరుగుతుంది. ‘‘మంచి కథ కుదిరింది. హీరోహీరోయిన్ల క్యారెక్టర్లు కొత్తగా ఉంటాయి. యూత్‌కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సత్యన్. -
చిన్న బ్రేక్ తర్వాత!
కుమారుడు కార్తికేయ పెళ్లి పనులు పూర్తి కావడంతో చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్స్ బిజీలో పడిపోయారు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్). డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ఫస్ట్ షెడ్యూల్‌ను యాక్షన్ సన్నివేశాలతో స్టార్ట్ చేసిన టీమ్ ఈ షెడ్యూల్లో ఏం చిత్రీకరించనున్నారో తెలియాలి. ఈ సినిమా షూటింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఫస్ట్ సినిమా మాదే రాజమౌళి, కెమెరామేన్ సెంథిల్ కుమార్లది సూపర్ హిట్ కాంబినేషన్. రాజమౌళి తెరకెక్కించే చిత్రాలన్నింటికీ దాదాపు సెంథిలే కెమెరామేన్. వీళ్ల కాంబినేషన్లో విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సరికొత్త కెమెరాలను ఉపయోగించనున్నారట సెంథిల్. ‘‘అర్రీ అలెక్సా ఏఆర్ కెమెరాతో, అర్రీ సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్‌తో ‘ఆర్ఆర్ఆర్’ను షూట్ చేయబోతున్నాం. ఇండియాలో ఈ కెమెరాలతో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం మాదే’’ అని పేర్కొన్నారు సెంథిల్. సెంథిల్ కుమార్ -
‘ఆర్ఆర్ఆర్’ కోసం మొట్టమొదటిసారిగా అలాంటి కెమెరాలు..
దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ కూడా ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. బాహుబలి సిరీస్‌లతో ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన జక్కన్న ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టీస్టారర్‌ను అత్యంత భారీ ఎత్తున చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం ఇండియన్ సినిమాల్లో ఇంతవరకు వాడని టెక్నాలజీని వాడుతున్నట్లు కెమెరామెన్ సెంథిల్‌కుమార్ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. వాటితో ఆర్టిఫీషియల్ లైటింగ్ అవసరం లేకుండా సహజసిద్దంగా షూట్ చేయవచ్చని సమాచారం. అంతేకాకుండా ఈ కెమెరాలతో 360 డిగ్రీస్ లో సీన్స్ చిత్రీకరించవచ్చు. బాహుబలి కోసం అర్రీ అలెక్సా ఎక్స్ టీ వాడిన చిత్రయూనిట్ ప్రస్తుతం ఈ చిత్రం అంతకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతున్నట్లు తెలుస్తోంది. నేటి నుంచి ‘ఆర్ఆర్ఆర్’ రెండో షెడ్యుల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. One of the first film in India to be Shot on Arri #AlexaLF and Arri #SignaturePrime Lens.@ARRIChannel @RRRMovie. Starting our 2nd Schedule Today.@DVVMovies@tarak9999 @ssrajamouli #RamCharan pic.twitter.com/0JVUWbhbuG — KK Senthil Kumar (@DOPSenthilKumar) January 21, 2019 -
సైమాలో ‘బాహుబలి 2’ హవా!
దక్షిణాది చలన చిత్ర అవార్డుల కార్యక్రమం దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలకు చెందిన తారలందరూ ఈ సైమా వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో టాలీవుడ్‌కు సంబంధించి బాహుబలి2కి అవార్డుల పంట పండింది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫర్ ఇలా బాహుబలి అవార్డుల వేటను కొనసాగించింది. అవార్డులు స్వీకరించిన అనంతరం బాహుబలి బృందం దిగిన ఫోటోను షేర్ చేశాడు సినిమాటోగ్రఫర్ కె.కె.సెంథిల్‌కుమార్. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. సైమా అవార్డుల వివరాలు.. ఉత్తమ చిత్రం : బాహుబలి ది కంక్లూజన్ ఉత్తమ దర్శకుడు : SS రాజమౌళి (బాహుబలిది కంక్లూజన్) ఉత్తమ నటుడు : ప్రభాస్ (బాహుబలిది కంక్లూజన్) ఉత్తమ నటి : కాజల్ అగర్వాల్ (నేనే రాజు నేనే మంత్రి) ఉత్తమ సహాయనటుడు : ఆది పినిశెట్టి (నిన్ను కోరి) ఉత్తమ సహాయనటి : భూమిక చావ్లా(MCA) ఉత్తమ సంగీత దర్శకుడు : MM కీరవాణి (బాహుబలిది కంక్లూజన్) ఉత్తమ పాటల సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ(ఫిదా) ఉత్తమ నేపథ్య గాయకుడు : కాల భైరవ (బాహుబలిది కంక్లూజన్) ఉత్తమ నేపథ్య గాయని : మధుప్రియ (ఫిదా) ఉత్తమ ప్రతి నాయకుడు : రానా దగ్గుబాటి (బాహుబలిది కంక్లూజన్) ఉత్తమ నటుడు( తొలి పరిచయం) : ఇషాన్ (రోగ్) ఉత్తమ నటి( తొలి పరిచయం) : కళ్యాణి ప్రియదర్శన్ (హలో) ఉత్తమ దర్శకుడు( తొలి పరిచయం) : సందీప్ రెడ్డి వంగా(అర్జున్ రెడ్డి) ఉత్తమ ఛాయాగ్రహకుడు : సెంథిల్ కుమార్ (బాహుబలిది కంక్లూజన్) ఉత్తమ హాస్య నటుడు : రాహుల్ రామకృష్ణ(అర్జున్ రెడ్డి) ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ : రానా దగ్గుబాటి(బాహుబలిది కంక్లూజన్.. ది ఘాజి ఎటాక్.. నేనే రాజు నేనే మంత్రి) ఉత్తమ చిత్రం(విమర్శకులు) : గౌతమిపుత్ర శాతకర్ణి ఉత్తమ నటుడు(విమర్శకులు) : నందమూరి బాలకృష్ణ (గౌతమిపుత్ర శాతకర్ణి) ఉత్తమ నటి(విమర్శకులు) : రితిక సింగ్ (గురు) -
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: మోస్ట్ పాపులర్ సినిమాటోగ్రఫీ ఆఫ్ ద ఇయర్ సెంథిల్ కుమార్
-
ఏదో రోజు డైరెక్టర్ అవుతా
‘‘ప్రతి సినిమాకు చాలెంజెస్ ఉంటాయి. ‘బాహుబలి’ సినిమాకు ఆ రేంజ్ చాలెంజ్‌లు ఉంటాయి. చిన్న సినిమాలకు ఆ సినిమా స్థాయిలోనే కష్టాలుంటాయి. అది దర్శకుడి విజన్ కావొచ్చు, నిర్మాతవైపు నుంచి కావచ్చు. ‘విజేత’ సినిమా చేస్తున్నప్పుడు నా కెరీర్ బిగినింగ్‌లో చేసిన ‘ఐతే’ సినిమా రోజులు గుర్తుకు వచ్చాయి. ‘బాహుబలి’ తర్వాత ఈ సినిమా నాకు మరో గ్రేట్ ఎక్స్ పీరియన్స్’’ అన్నారు ఛాయాగ్రాహకుడు కె. సెంథిల్‌కుమార్. చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘విజేత’. రాకేశ్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రఛాయాగ్రాహకుడు కె.సెంథిల్ కుమార్ చెప్పిన విశేషాలు. ► సంక్రాంతికి రాజమౌళిగారిని కలిసినప్పుడు సాయి కొర్రపాటిగారు ‘ఓ మంచి కథ ఉంది వినండి’ అన్నారు. రాకేశ్ శశి చెప్పిన కథ నాకు బాగా నచ్చింది.అందులో చాలా ఎమోషన్స్‌తో పాటు కనెక్ట్ అయ్యే సన్నివేశాలున్నాయి. తండ్రీ కొడుకుల మధ్య జరిగే ఓ మిడిల్ క్లాస్ స్టోరీ ఇది. ► అన్ని సినిమాలు పేరు కోసమే చేయలేం. క్రికెట్ అంటే ఇష్టంతో ‘గోల్కొండ హై స్కూల్’ సినిమా చేశాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు పేరొస్తుందని చేయలేదు. అలాగే ఈ సినిమా నచ్చడంతో చేశా. ► కల్యాణ్ దేవ్లో నటుడిగా చాలా పరిణితి చూశాను. ఫస్ట్ డే షూట్లో కంఫర్ట్‌గా ఫీల్ అయినట్టు కనిపించలేదు. సినిమా పూర్తయ్యేసరికి కాన్ఫిడెన్స్ లెవల్ బాగా పెరిగింది. కల్యాణ్ హార్డ్ వర్కింగ్ పర్శన్. ఏదైనా త్వరగా నేర్చుకుంటాడు. ప్యూచర్లో పెద్ద నటుడు అవుతాడు. నటనలో తను తీసుకునే జాగ్రత్తలు అలాంటివి. ► రాకేశ్‌కి తనేం చేస్తున్నాడనే విషయం మీద క్లారిటీ ఉంది. దాని వల్లే సినిమాను ఈజీగా హ్యాండిల్ చేయగలిగాడు. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని తెర మీదకు తీసుకురావడానికే నేను ప్రయత్నిస్తాను. ► ‘బాహుబలి’ తర్వాత తెలుగులోనే కాదు బాలీవుడ్ నుంచీ చాలా అవకాశాలొచ్చాయి. కానీ నేను ఎదురుచూస్తున్న కథ రాకపోవడంతో హిందీ వైపు వెళ్లలేదు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో మనమే సినిమాలు చేస్తున్నాం. అలా అని హిందీ సినిమాలు చేయనని కాదు, నచ్చితే చేస్తా. ► తెలుగులో ప్రస్తుతం గోల్డెన్ íపీరియడ్ నడుస్తోంది. ‘బాహుబలి, ఘాజీ, అర్జున్ రెడ్డి, గరుడవేగ, మహానటి’ లాంటి వైవిధ్యమైన సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులు కొత్త సినిమాలను ఆదరించడంతో దర్శకులు కొత్త కథలు చెప్పడానికి చూస్తున్నారు. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే రోజు తప్పకుండా వస్తుంది. ► ప్రతి టెక్నీషియన్‌కు డైరెక్టర్ కావాలనుంటుంది. ఏ టెక్నీషియన్ అయినా డైరెక్టర్ కథని స్క్రీన్ మీద చెప్పడానికి సహకారం మాత్రమే అందిస్తారు. అందుకే డైరెక్టర్ కావాలని అందరూ అనుకుంటారు. నేను డైరెక్టర్ అవుతాను. కానీ ఎప్పుడవుతానో కచ్చితంగా చెప్పలేను. కల్యాణ్ దేవ్, మాళవిక -
సెంథిల్ కుమార్ సంచలనం
చెన్నై: భారత స్క్వాష్ ప్లేయర్ వెలవన్ సెంథిల్ కుమార్ తన కెరీర్లో తొలి ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) వరల్డ్ టూర్ టైటిల్ సాధించాడు. అమెరికాలో జరిగిన మాడిసన్ ఓపెన్‌లో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన ఈ ఆసియా జూనియర్ చాంపియన్ సంచలన విజయాలతో కడదాకా దూసుకెళ్లాడు. ఫైనల్లో 20 ఏళ్ల సెంథిల్ 7–11, 13–11, 12–10, 11–4తో నాలుగో సీడ్ ట్రిస్టన్ ఐజెల్ (దక్షిణాఫ్రికా)ను కంగుతినిపించాడు. మాజీ బ్రిటిష్ జూనియర్ ఓపెన్ విజేత అయిన సెంథిల్ మొదటి రౌండ్లో మూడో సీడ్ బెర్నట్ జుమే (స్పెయిన్)కు షాకిచ్చాడు. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ మార్క్ ఫుల్లర్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. ప్రపంచ 255 ర్యాంకర్ అయిన ఈ భారత ఆటగాడు గతంలో రెండుసార్లు పీఎస్ఏ ఈవెంట్లలో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచాడు. ఈ సారి మాత్రం టైటిల్ సాధించేదాకా విశ్రమించలేదు. -
కిడ్నాప్ కేసులో నటుడి అరెస్ట్
సాక్షి, చెన్నై: వాణియంబాడి పాఠశాల కరస్పాండెంట్ కిడ్నాప్ కేసులో తమిళ నటుడు ఒకరిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. వాణియంబాడి టీచర్స్ కాలనీకి చెందిన సెంథిల్‌కుమార్.. ఆదర్శ్ మాట్రిక్ పాఠశాలలో కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. జనవరి 19న బైక్‌పై వెళ్తుండగా ఆయనను ముగ్గురు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేశారు. కొద్ది సేపటి తర్వాత సెంథిల్‌కుమార్ తన అన్నయ్య ఉదయచంద్రన్కు ఫోన్ చేసి కిడ్నాప్‌నకు గురైనట్టు తెలిపాడు. తనను విడిచిపెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారని చెప్పడంతో ఉదయచంద్రన్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తర్వాత అతడు రూ.50 లక్షల నగదుతో కృష్ణగిరి– ధర్మపురి హైరోడ్డులో కారిమంగళం అనే ప్రాంతానికి వెళ్లాడు. అతడిని వెంబడించిన వాణియంబాడి పోలీసులు కిడ్నాపర్లు ఉపయోగించిన కారు ఆధారంగా రెడ్‌హిల్స్‌కు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కిడ్నాప్‌నకు సూత్రధారుడు హరి అని తెలిసింది. ఆంబూరు సమీపం శంకరాపురానికి చెందిన హరి పలు సినిమాల్లో విలన్‌గా నటించాడు. అతడు జిమ్నాస్టిక్ సెంటర్ కూడా నడుపుతున్నట్లు తెలిసింది. హరి భార్య ప్రియ12 ఏళ్లుగా సెంథిల్‌కుమార్ స్కూలులో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడంతో సెంథిల్‌కుమార్‌ను హరి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రన్నరప్ సెంథిల్
చెన్నై: పార్క్‌వ్యూ ఓపెన్ స్క్వాష్ టోర్నీలో భారత ప్లేయర్ వెలవన్ సెంథిల్ కుమార్ రన్నరప్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఫైనల్లో సెంథిల్ 8–11, 7–11, 12–10, 8–11తో ఎల్‌షెర్బిని (ఈజిప్టు) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్ చేరే క్రమంలో టాప్ సీడ్, మూడో సీడ్ క్రీడాకారులపై సంచలన విజయాలు సాధించిన సెంథిల్ తుది పోరులో తడబడ్డాడు. -
పార్క్‌వ్యూ ఓపెన్ ఫైనల్లో సెంథిల్
చెన్నై: పార్క్‌వ్యూ ఓపెన్ టోర్నీలో భారత స్క్వాష్ ఆటగాడు వెలవన్ సెంథిల్ కుమార్ ఫైనల్లోకి ప్రవేశించాడు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన సెంథిల్ సెమీస్‌లో 12–10, 11–7, 11–9తో మూడో సీడ్ మార్క్ ఫుల్లర్(ఇంగ్లండ్)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. దీంతో తొలిసారి పీఎస్ఏ వరల్డ్ టూర్ ఫైనల్‌కు అతడు అర్హత సాధించాడు. అంతకు ముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో సెంథిల్ టాప్‌సీడ్ అకీల్ రహమాన్(ఆస్ట్రియా)ను 11–3, 11–1, 11–5తో కంగుతినిపించాడు. మరో సెమీఫైనల్లో భారత్‌కే చెందిన రెండో సీడ్ ఆటగాడు హరిందర్‌పాల్ సింగ్ సంధు 8–11, 6–11, 5–11తో ఎల్స్‌హర్‌బిని(ఈజిప్ట్) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్స్‌లో ఎల్స్‌హర్‌బిని, సెంథిల్ తలపడతారు. క్వార్టర్స్‌లో జోష్న ఓటమి చెన్నై: ప్రపంచ మహిళల స్క్వాష్ చాంపియన్‌షిప్ నుంచి భారత స్టార్ క్రీడాకారిణి జోష్న చినప్ప నిష్క్రమించింది. ఈజిప్ట్‌లోని ఎల్‌గోనలో జరుగుతున్న ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జోష్న 6–11, 12–10, 7–11, 11–8, 3–11తో కమిల్లీ సెర్మి(ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. 70 నిముషాలు జరిగిన ఈ పోరులో కమిల్లీ ముందు నుంచే జోష్నపై విన్నర్లతో దాడి చేసింది. వాటిని తట్టుకుంటూ ఎదురునిలిచినా నిర్ణాయక ఐదో సెట్లో 3–11తో ఓడిపోయి జోష్న మ్యాచ్‌ను కోల్పోయింది. -
ఆ సెల్ఫీ తీసిందెవరో తెలుసా?
బాహుబలి-2 ద కన్‌క్లూజన్ సినిమా ప్రీరిలీజ్, ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఈ సినిమాలో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. చాలామంది మాట్లాడే సమయంలో ఉద్వేగానికి గురయ్యారు. స్వయంగా దర్శకుడు రాజమౌళి కూడా కంటతడి పెట్టారు. దాదాపు ఐదేళ్ల పాటు అంతా ఒక కుటుంబంలా కలిసిపోయి, ఇప్పుడు విడిపోవాలంటే ఏదోలా ఉందని బాధపడ్డారు. ఇదే విషయాన్ని రానా కూడా చెప్పాడు. ఇంత గొప్ప సినిమాలో చేసినందుకు గర్వంగా ఉందంటూనే.. ఈ కుటుంబాన్ని విడిచి వెళ్లిపోతున్నందుకు బాధగా ఉందన్నాడు. వారానికోసారి ఫోన్ చేసి తిట్టాలంటూ కీరవాణి భార్య శ్రీవల్లిని కోరాడు. ఇక సమయం మించిపోతుండటంతో చివర్లో చాలా క్లుప్తంగా ప్రసంగాలను ముగించేశారు. అంతా అయిన తర్వాత రాజమౌళి కోరిక మేరకు టీమ్ మొత్తం కలిపి ఓ సెల్ఫీ తీసుకుంది. సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా వ్యవహరించిన సెంథిల్ స్వయంగా తన ఫోన్లోనే ఈ సెల్ఫీ తీశాడు. ఏ ఒక్కరినీ మిస్ కాకుండా.. ఫ్రేములో అందరూ పట్టేలా తన టాలెంట్ మొత్తాన్ని చూపించి మరీ ఈ సెల్ఫీ తీయడం విశేషం. ఇందులో సెంథిల్‌తో పాటు నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, దర్శకుడు రాజమౌళి, హీరోలు ప్రభాస్, రానా, హీరోయిన్లు అనుష్క, తమన్నా, సీనియర్ నటులు సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ, ఇంకా సుబ్బరాజు, సంగీత దర్శకుడు కీరవాణి, సాంకేతిక నిపుణులు కమల్ కణ్నన్, సాబు సిరిల్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, డిజైనర్ ప్రశాంతి తదితరులు ఉన్నారు. సెల్ఫీలో సరిగ్గా వచ్చేందుకు వీలుగా శోభు యార్లగడ్డ, రాజమౌళి కాస్త మోకాళ్లు వంచి నిల్చోవడం విశేషం. -
బాహుబలి 2 ట్రైలర్ రెడీ అయ్యిందోచ్
సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి 2 ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన రాజమౌళి ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రెడీ అయిపోయిన ట్రైలర్ ను ఫైనల్ గా తెరపై ఎలా ఉందో పరీక్షిస్తున్నారు. ఈ విషయన్నా చిత్ర సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ ట్రైలర్ కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఈ సందర్భంగా తెరపై ట్రైలర్ ఎలా ఉందో పరీక్షిస్తున్న సమయంలో తీసిన ఓ ఫోటోను తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేశాడు సెంథిల్. 'అన్నపూర్ణ స్టూడియోస్ లో బాహుబలి 2 ట్రైలర్ పై వర్క్ చేస్తున్నాము. సీవీ రావ్, శివకుమార్ లతో కలిసి తెర అంతా సరిగా వస్తుందో లేదో పరీక్షిస్తున్నాము' అంటూ కామెంట్ చేశాడు. అంటే మరో వారం, పదిరోజుల్లో బాహుబలి 2 ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్స్ ఉంది. At#AnnapurnaStudios Working on Trailer of #Baahubali2 Making sure Everything is Fine with the Screen Calibration, With #CVRao & #ShivaKumar pic.twitter.com/BsvKlOO6Js— KK Senthil Kumar (@DOPSenthilKumar) 2 March 2017 -
ఆసియా జూనియర్ స్క్వాష్ చాంప్ భారత్
హాంకాంగ్: ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన భారత యువ స్క్వాష్ జట్టు ఆరేళ్ల తర్వాత ఆసియా జూనియర్ చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం ముగిసిన ఆసియా జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ మలేసియాపై భారత్ 2–0తో విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ వెలవన్ సెంథిల్ కుమార్ 12–10, 11–0, 11–2తో ఓంగ్ సాయ్ హుంగ్పై... రెండో సింగిల్స్‌లో అభయ్ సింగ్ 10–12, 7–11, 11–5, 14–12, 11–6తో డారెన్ రాహుల్ ప్రగాసంపై గెలిచి భారత్‌కు టైటిల్‌ను అందించారు. ఫలితం తేలిపోవడంతో మూడో మ్యాచ్‌ను నిర్వహించలేదు. ఈ టోర్నీలో భారత్ లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచింది. ఆ తర్వాత సెమీస్‌లో హాంకాంగ్‌పై నెగ్గి ఫైనల్‌కు చేరింది. తుది పోరులోనూ నెగ్గి ఈ టోర్నీని అజేయంగా ముగించింది. భారత్ చివరిసారి 2011లో ఆసియా జూనియర్ విజేతగా నిలిచింది. -
రాజమౌళి వర్సెస్ సెంథిల్
షూటింగ్ స్పాట్లో దర్శకుడు చేయాల్సిన పనేంటి? ఎలా నటించాలో ఆర్టిస్టులకు.. ఎలా షూట్ చేయాలో సినిమాటోగ్రాఫర్‌కు.. ఇలా ట్వంటీఫోర్ క్రాఫ్ట్స్ మెంబర్స్‌కి ఎవరి పనులు వాళ్లకు.. వివరించడమే. రాజమౌళి కూడా తన చిత్రబృందానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కానీ, అది షూటింగ్ కోసం కాదు. లొకేషన్లో షూటింగ్ జరగకుండా మరేం జరిగింది? అని ఊహాగానాలు చేస్తున్నారా? అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ చిత్రబృందం క్రికెట్ ఆడారు. అయ్యో పాపం నిర్మాత.. షూటింగ్ కోసం లక్షలు లక్షలు ఖర్చుపెడితే.. బాధ్యత లేకుండా ఆట ఆడుకుంటున్నారా? అని నిందించక్కర్లేదు. ఎందుకంటే, కావాలని షూటింగ్ ఆపేసి ఆడలేదు. పరిస్థితి అలా వచ్చింది. విరామం లేకుండా షూటింగ్ చేస్తున్న వీళ్లను చూసి, వరుణ దేవుడికి జాలి అనిపించిందేమో. నాన్‌స్టాప్‌గా వర్షం కురిపించేశాడు. మరీ తడిసి ముద్దయ్యే వర్షం కాకపోవడంతో చినుకుల్లోనే క్రికెట్ ఆడారు. వాస్తవానికి వరుణుడు అడ్డుపడకపోతే మంగళవారంతో ‘బాహుబలి-2’ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయ్యేది. ఆ సంగతలా ఉంచితే.. టీమ్ అందరూ క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. రాజమౌళి బౌలింగ్.. సెంథిల్ కుమార్ బ్యాటింగ్ చేశారు. సెంథిల్‌ను అవుట్ చేయాలని రాజమౌళి చేసిన ప్రయత్నం ఫలించలేదు. రివర్స్‌లో సెంథిల్ రెండు సిక్సులు కొట్టారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్లో తెలిపారు. -
తిరుమలలో ఐదుగురు లడ్డూ దళారుల అరెస్టు
- 52 సబ్సీడీ లడ్డూ టోకెన్లు, రూ.10,520 నగదు స్వాధీనం సాక్షి,తిరుమల తిరుమలలో మంగళవారం ఐదు మంది లడ్డూ దళారులు పట్టుబడ్డారు. తమిళనాడులోని రామనాథపురంకు చెందిన ట్యాక్సీడ్రైవరు టి.ప్రభు (26) , మధురైకు చెందిన సి.సెంథిల్‌కుమార్ (34), వరంగల్జిల్లాకు చెందిన ఏ.రమేష్ (30), ప్రకాశం జిల్లాకు చెందిన ఎం.నాగార్జున (20), బెంగళూరుకు చెందిన సి.సుబ్రమణ్యం (20) జట్టుగా ఏర్పడ్డారు. వీరంతా క్యూలైన్లలో సర్వదర్శనానికి వెళతారు. అక్కడ సబ్సిడీ ధరతో రూ.70 నాలుగు లడ్డూలతోపాటు దొడ్డిదారుల్లో మరికొన్ని లడ్డూ టోకెన్లు పొందుతారు. వీటిని ఆలయం వెలుపల ఒక్కో లడ్డూ రూ.50 నుండి రూ.100 వరకు విక్రయిస్తుంటారు. వీరిని మంగళవారం టూ టౌన్ సీఐ వెంటకరవి, ఎస్ఐ వెంకట్రమణ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి మొత్తం 52 లడ్డూలకు సంబంధించిన టోకెన్లు, రూ.10,520 నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ వెంకటరవి తెలిపారు. ఇలాంటి దళారుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షింబోమని, దళారుల సమాచారం ఉంటే తక్షణమే స్పందిస్తామన్నారు. -
వెరైటీ టైటిల్ తో వస్తున్న ధనుష్
చెన్నై: వరుస భారీ విజయాలతో జోరు మీదున్న తమిళ స్టార్ హీరో ధనుష్ మరింతగా దూసుకుపోతున్నాడు. విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ క్రేజీ హీరో చేతినిండా ప్రాజెక్టులతో బిజీబిజీగా మారనున్నాడు. తాజాగా తమిళంలో మరో సినిమాకు సైన్ చేసి తన హవాను కొనసాగిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీని ఈ శుక్రవారం అఫీషియల్ గా లాంచ్ చేశారు. కోడి గా టైటిల్ ఖరారు చేసుకున్న ఈ మూవీ షూటింగ్ కార్యక్రమాలు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ధునుష్ లేటెస్ట్ మూవీ తంగమగన్ చిత్రం ట్రైలర్, ఆడియో నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది. ధనుష్ సరసన సమంతా, అమీ జాక్సన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి వేల్ రాజ్ దర్శకత్వం వహించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. తెలుగులో నవ మన్మథుడు పేరుతో వస్తోంది. ఈ సంవత్సరంలో ధనుష్ నటించిన రెండు సినిమాలు ఇప్పటికే విజయం సాధించగా మూడో సినిమా ఈ డిసెంబర్ 18 న థియేటర్లను పలకరించనుంది. ధురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో ధనుష్ సరసన త్రిష నటించనుందని సమాచారం. కోడి అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన ఈ మూవీ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. డిసెంబర్ చివరివారంలో సెట్స్ పైకి తీసుకు వెళ్ళనున్నామని చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
బాహుబలి నిరాశ కలిగించింది : సెంథిల్
బాహుబలి తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన భారీ చిత్రం. ఓ రీజినల్ సినిమా కూడా చక్కటి కథా కథనాలతో తెరకెక్కించి భారీగా ప్రమోట్ చేస్తే జాతీయ స్ధాయిలో మంచి మార్కెట్ సాధించగలదని నిరూపించిన సినిమా. ఇంతటి భారీ చిత్రం కాబట్టే ఇప్పటికీ ఆ సినిమాలో నటించే అవకాశం రాలేదే అని చాలా మంది నటీనటులు బాధపడుతున్నారు. అలాంటి బాహుబలి ఆ సినిమాకు పనిచేసిన ఓ సాంకేతిక నిపుణుడిని నిరాశపరిచిందట..! పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కిన బాహుబలి సినిమాలో చాలా భాగం గ్రాఫిక్స్ లో రూపొందించారు. ముఖ్యంగా తొలి భాగంలో వచ్చే పాటతో పాటు క్లైమాక్స్ మొత్తాన్ని గ్రాఫిక్స్ లోనే క్రియేట్ చేశారు. ఇలా ఎక్కువ భాగం విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందించటం, గ్రాఫిక్స్ విషయంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు కెమరామేన్ సెంథిల్ ను నిరాశపరిచాయట. ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న సెంథిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మగధీర, అరుంథతి, ఈగ లాంటి భారీ చిత్రాలకు పనిచేసిన సెంథిల్, షారూఖ్, కాజోల్ జంటగా రూపొందుతున్న దిల్ వాలే సినిమాలో ఒక పాటకు సినిమాటోగ్రఫి అందించాడు. ప్రస్తుతం ఈ స్టార్ సినిమాటోగ్రాఫర్ బాహుబలి 2 మరింత క్వాలిటీతో అందించడానికి ప్రయత్నిస్తామన్నాడు. -
'పయ్యావుల కేశవ్ ను అరెస్ట్ చేయండి'
అనంతపురం: దళితులపై దాడి చేసిన పయ్యావులను అరెస్ట్ చేయాలని దళిత సంఘం డిమాండ్ చేసింది. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిసి దళిత సంఘం నేతలు పయ్యావులపై ఫిర్యాదు చేశారు. ఉరవకొండ ప్రాంతంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని వారన్నారు. పయ్యావుల నుంచి దళితులకు రక్షణ కల్పించాలని ఎస్పీకి విజ్క్షప్తి చేశారు. అంతేకాకుండా నాగన్న కుటుంబంపై దాడి చేసిన కేసునమోదు చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే ఉరవకొండలో పయ్యావులు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని దళిత సంఘం నేతలు ఆరోపించారు. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిసిన దళిత సంఘం నేతల్లో శ్రీనివాస్, పెన్నోబులేసు ఉన్నారు. మంచి నీటి సమస్య ఎందుకు తీర్చలేదంటూ ప్రశ్నించిన పాపానికి గ్రామస్థులపై మంగళవారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరులు దళితులపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. -
హై ‘అలర్ట్’
పోలింగ్ కేంద్రాల వద్ద గట్టినిఘా అధికారులు, సిబ్బంది నిష్పక్ష పాతంగా వ్యవహరించాలి పోలింగ్ కేంద్రాల వద్ద సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవ్ ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’పై సిబ్బందితో సమీక్షించిన ఎస్పీ సెంథిల్‌కుమార్ అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : ‘ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి...సమస్యలు సృష్టించే వారిని గుర్తించాలి...అల్లర్లకు తావివ్వకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎవరు తోక జాడించినా తక్షణం ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ వారిని అదుపులోకి తీసుకోవాలి’ అంటూ పోలీసు సిబ్బందికి ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదేశాలు చేశారు. నగరంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో శనివారం జిల్లా వ్యాఫ్తంగా ఉన్న సిబ్బందితో ఆయన ‘ఎన్నికల నియమావళి’పై సమీక్షించారు. ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాలకు లోబడి ప్రతి ఒక్కరూ వ్యవహరించాలన్నారు. ఎస్పీ ఇంకా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అధికారుల విధులు.. సబ్ డివిజన్, సర్కిల్స్ పరిధిలోని సిబ్బం దిపై పర్యవేక్షణ కలిగివుండాలి. సిబ్బంది నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకొని విశ్లేషిస్తూ ఉండాలి. వీలైనన్ని సమస్యాత్మక గ్రామాలు, వార్డులు సందర్శించాలి. కిందిస్థాయి సిబ్బంది అన్ని గ్రామాలు, వార్డులపై పట్టు సాధి స్తూ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పుడు సమయ స్ఫూర్తితో వ్యవహరించాలి. పోలింగ్‌స్టేషన్, బూత్‌లు పరిశీలించి అక్కడ ఏర్పాటు చేయాల్సిన బందోబస్తు జరుగుతున్న కూంబింగ్ ఆపరేషన్లను పర్యవేక్షిస్తుండాలి. అత్యంత ప్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఎస్డీపీఓలు ఆయా సబ్-డివిజన్లలోని అన్ని రాజకీ య పార్టీ నాయకులతో సమన్వయంగా వ్యవహరించాలి. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో గ్రామాలు, వార్డులలో ఆకస్మిక తనిఖీలు సిబ్బంది పనితీరును అంచనా వేస్తుండాలి. ప్రతి ఉదయం డీఎస్పీలు సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్ధితులను సమీక్షిస్తుండాలి. ఎన్నికల శాంతియుతంగా, సజావుగా సాగడానికి తాము తీసుకున్న చర్యలను ప్రజలకు తెలియజేస్తుండాలి. పోలింగ్ రోజు ఇలా ఉండాలి.. ప్రతి ఓటరు ఓటరు ఐడెంటిటీ కార్డును తప్పని సరిగా తెచ్చుకునేలా అవగాహన పెంచాలి. పోలింగ్‌బూత్‌కు 200 మీటర్ల లోపల ఏ పార్టీకి చెందిన వారైనా ఓటరు స్లిప్పుల పంపిణీ, ఆహార పొట్లాల పంపిణీ శిబిరాలు ఏర్పాటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కేంద్రాల వద్ద క్యూ పద్ధతి పాటించేలా చూడాలి. పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థులు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లు ఘర్షణ పడకుండ ముందస్తు హెచ్చరికలు చేయాలి. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు వహించాలి. ప్రతి వ్యక్తినీ తనిఖీ చేసి పోలింగ్‌బూత్‌లోకి అనుమతించాలి. పోలింగ్ కేంద్రంల్లోకి అగ్గిపెట్టెలు, సిజర్లైట్లు ఇంకు, నీళ్ల బాటిళ్లు, తినబండారాలు, పేలుడు పదార్ధాలను అనుమతించరాదు. పోలింగ్ సామగ్రికి ఎటువంటి నష్టం రాకుండా చూడాలి. వాహనాల కదిలకలను నియంత్రించాలి. పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగితే పై అధికారులకు తెలియజేసి, పోలింగ్ అధికారులతో సంప్రదించి సకాలంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలి. పోలీసు సిబ్బంది ఎట్టిపరిస్ధితుల్లోనూ ఆవేశానికి లోనుకారాదు. అభ్యర్ధులతోపాటు వచ్చిన గన్మెన్లను, అనుమతి లేని వ్యక్తులను కేంద్రాలలోకి అనుమతించరాదు. అభ్యర్ధులు వారి అనుచరులు చూపే ప్రలోభాలకు లొంగకుండా సిబ్బంది ఎన్నికల డ్యూటీని చిత్తశుధ్ధితో, కర్తవ్య దీక్షతో నిర్వహించాలి. పోలింగ్ ముగిసిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మి షన్, బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేం ద్రాలకు భద్రంగా చేరవేయాలి. సమీక్ష స మావేశంలో డీఎస్పీ నాగరాజు, వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ సీఐలు మాదవ్, మన్సూరుద్దీన్, దేవానంద్, ఎస్ఐలు వి శ్వనాథచౌదరి, సుబ్బరాయుడు, శంకర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
..అయినా తీరు మారలేదు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం/అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తోన్న ఎస్ఐ, సీఐలకు ఎస్పీ సెంథిల్‌కుమార్ చార్జ్ మెమోలు జారీ చేస్తున్నా పలువురు పోలీసుల తీరు మారడం లేదు. ఖద్దరు చొక్కాలకు గులాంగిరి చేస్తూ.. రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోతున్నారు. ఇందుకు తార్కాణం రామగిరి మండలం గంగంపల్లిలో చోటుచేసుకున్న అమానుషమే. మైనర్ బాలికను నమ్మించి పదే పదే అత్యాచారం చేసి.. గర్భవతిని చేసిన మురళి అనే కీచకుడిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు వ్యవహరించిన తీరే అందుకు తార్కాణం. టీడీపీ ఎమ్మెల్యే సోదరుడి ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గడం వల్లే నిందితునిపై సకాలంలో చర్యలు తీసుకోలేకపోయారనే విమర్శ ఆ శాఖ నుంచే బలంగా వ్యక్తమవుతుండటమే అందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. జిల్లా ఎస్పీగా ఈ నెల 2న సెంథిల్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆ మరుసటి రోజు నుంచే ఓ వైపు ఎస్పీ సెంథిల్‌కుమార్.. మరో వైపు డీఐజీ బాలకృష్ణ పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టడానికి కొరడా ఝుళిపించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే పోలీసు అధికారులపై తక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఆ క్రమంలోనే ఒక డీఎస్పీ, ఆరుగురు సీఐలు, పది మంది ఎస్ఐలకు చార్జి మెమోలు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వహించినా.. ప్రజలకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు తప్పవనే సంకేతాలను పోలీసు సిబ్బందికి పంపారు. కానీ.. డీఐజీ, ఎస్పీ చేపట్టిన చర్యలు కొందరు ఎస్ఐ, సీఐల్లో మార్పు తేవడం లేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధుల దన్నుతో పోస్టింగ్‌లు తెచ్చుకున్న కొందరు ఎస్ఐ, సీఐలు వారి సేవలో తరించిపోతున్నారనే విమర్శలు పోలీసు శాఖ నుంచే వ్యక్తమవుతున్నాయి. తమపై ఈగ వాలనివ్వకుండా తమకు దన్నుగా నిలుస్తోన్న ప్రజాప్రతినిధులు చూసుకుంటారనే ధీమా వారిలో ఉండటమే అందుకు కారణమే భావన బలంగా విన్పిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధుల దన్నుతో కొందరు ఎస్ఐ, సీఐలు పేట్రేగిపోతున్నారు. వారికి వంత పాడుతూ శాంతిభద్రతల పరిరక్షణను విస్మరిస్తున్నారు. ప్రజల మానప్రాణాలను దోచుకుంటున్నా వారు కిమ్మనడం లేదు. ఇందుకు నిదర్శనమే రామగిరి మండలం గంగంపల్లిలో చోటుచేసున్న దాష్టీకం. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు బాలాజీ అనుచరుడిగా భావిస్తున్న మురళి రామగిరి మండలం గంగంపల్లిలో ఓ మైనర్ బాలికను నమ్మించి, లోబర్చుకున్నాడు. ఆ బాలికపై పదే పదే అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడు. గుట్టు రట్టువుతుందని భావించిన మురళి, అతని తల్లిదండ్రులు.. మైనర్ బాలిక, తల్లిపై దాడి చేసి.. ఈనెల 11న బలవంతంగా నాటు పద్దతిలో అబార్షన్ చేశారు. తీవ్ర రక్తస్రావం జరగడంతో బాలికను అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఈనెల 11న చేర్పించారు. ఈ వ్యవహారంపై సర్వజనాసుపత్రిలో అదే రోజున మెడికో లీగల్ విభాగంలో కేసు నమోదైంది. ఈ తరహా ఘటనలపై ఆయా పోలీసుస్టేషన్లకు ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులు ముందుస్తు సమాచారం ఇచ్చే సంప్రదాయం ఆ శాఖలో ఉంది. ఇందుకు సంబంధించిన సమాచారం ఆయా పోలీసుస్టేషన్లకు ఇచ్చామని ఔట్‌పోస్టు పోలీసులు కూడా అంగీకరిస్తున్నారు. కానీ.. రామగిరి పోలీసులు ఈ వ్యవహారంపై సకాలం కేసు నమోదు చేయలేదు. నింపాదిగా శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అదే సమయంలో ఈ వ్యవహారంపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ‘సాక్షి’ ప్రశ్నిస్తే.. సీఐ నర్సింహరావు మాట్లాడుతూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడమే మంచిదని చెప్పడం గమనార్హం. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడం వల్లే కేసు నమోదులో జాప్యం జరిగినట్లు మైనర్ బాలిక తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఎస్పీ సెంథిల్‌కుమార్ తీవ్రంగా స్పందించడంతో శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు తీరిగ్గా కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ అంశంపై ధర్మవరం ఏఎస్పీ అభిషేక్ మహంతి ‘సాక్షి’తో మాట్లాడుతూ నిందితుడు మురళీపై ఐపీసీ 313, 376, రెడ్ విత్ 34 సెక్షన్ కింద కేసులు నమోదు చేశామన్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అతని తల్లి ముత్యాలమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. సాధ్యమైనంత త్వరగా నిందితున్ని పట్టుకుంటామన్నారు. కేసు ఆలస్యం చేయడంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 13న రాత్రి 9 గంటలకు కేసు కట్టామని తెలియజేశారు. బాధితురాలికి నిర్భయ చట్టం వర్తిస్తే.. ఆ చట్టం కిందే కేసు పెడతామని స్పష్టీకరించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటేనేగానీ బాధితులకు కొందరు పోలీసులు న్యాయం చేయరన్నది మరో సారి స్పష్టమైంది. -
భయపెట్టి.. అణగదొక్కి..
ఎస్కేయూ, న్యూస్‌లైన్ : తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ అమోదం తెలపడంతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ (ఎస్కేయూ) విద్యార్థులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వర్సిటీ ఎదుట 205 జాతీయ రహదారిని దిగ్బంధించారు. అనంతరం నగరంలోకి ర్యాలీగా బయలు దేరిన విద్యార్థులు పంగల్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ నాగరాజు, సీఐలు రాజా, మహబూబ్‌బాషా, శ్రీనివాసులు, మాధవ్, ప్రవీణ్‌కుమార్ అధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నగరంలోకి వెళ్లేందుకు అనుమతించేదిలేదని వెనక్కు వెళ్లిపోవాలని విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ససేమిరా అనడంతో బలవంతంగా వెనక్కు నెట్టే ప్రయత్రం చేశారు. తామేమైనా రౌడీల్లా కనిపిస్తున్నామా అంటూ విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సమైక్యాంధ్ర సాధన కోసం శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్న తమపై బలప్రయోగం ఎందుకని నిలదీశారు. ‘పోలీస్ జులుం నశించాలి’.. ‘సోనియా డౌన్‌డౌన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆ సమయంలో విద్యార్థులు ప్రతిఘటించడంతో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ముగ్గురు విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. ఇద్దరు విద్యార్థులు అక్కడే తేరుకోగా.. మరో విద్యార్థి శ్రీనివాసులు పరిస్థితి విషమంగా ఉండటంలో వైద్యం నిమిత్తం పోలీసుల వాహనంలో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇలా మూడు గంటల పాటు హైడ్రామా నడిచింది. చివరకు ఆందోళనకారులను అరెస్టు చేసి ఇటుకలపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ... ఇటలీ నుంచి వచ్చిన సోనియా రాష్ట్ర విభజనకు ఏకపక్ష నిర్ణయం తీసుకొని మాఫియాలా వ్యవహరిస్తూ సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు డబ్బు మూటలకు అమ్ముడుపోయి ఢిల్లీ పెద్దల కాళ్ల వద్ద తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని మండిపడ్డారు. అడుగడుగునా పోలీసుల అడ్డగింత సమైక్యమే తమ నినాదమంటూ ఉద్యమాన్ని బలపర్చేందుకు నగరంలోకి వస్తున్న ఎస్కేయూ విద్యార్థులకు పోలీసులు అడుగడుగునా అడ్డు తగిలారు. ఎస్కేయూ విద్యార్థులు నగరంలోకి వెళ్తే ఉద్యమం మరింత ఉధృతమవుతుందనే కారణంతో స్పెషల్ పార్టీ, ఏపీఎస్పీ పోలీసులు రోప్ ద్వారా నిలువరించారు. అయినా పలువురు విద్యార్థులు పోలీసు వలయాన్ని ఛేదించుకొని పరుగు తీస్తుండడంతో వారిని విచక్షణా ర హితంగా ఈడ్చి పారేశారు. పలువురు విద్యార్థులను అరెస్టు చేసి నగరంలోకి, ఇటుకలపల్లి పోలీసు స్టేషన్లకు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కార్యక్రమంలో డాక్టర్ సదాశివరెడ్డి, నాయకులు లింగారెడ్డి, బాలాస్వామి, నరసింహారెడ్డి, పులిరాజు, పరుశురాంనాయక్, వెంకటేష్, వెంకట్, పురుషోత్తంరెడ్డి, కేశవరెడ్డి, లక్ష్మీకర్బాబు, తిమ్మప్ప తదితరులు ఉన్నారు.