‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం మొట్టమొదటిసారిగా అలాంటి కెమెరాలు.. | RRR Movie Team Using Advanced Camera For Shooting | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 21 2019 9:03 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

RRR Movie Team Using Advanced Camera For Shooting - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే కేవలం టాలీవుడ్‌ మాత్రమే కాదు.. బాలీవుడ్‌ కూడా ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. బాహుబలి సిరీస్‌లతో ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన జక్కన్న ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లతో మల్టీస్టారర్‌ను అత్యంత భారీ ఎత్తున చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే ఈ మూవీ కోసం ఇండియన్‌ సినిమాల్లో ఇంతవరకు వాడని టెక్నాలజీని వాడుతున్నట్లు కెమెరామెన్‌ సెంథిల్‌కుమార్‌ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. వాటితో ఆర్టిఫీషియల్‌ లైటింగ్‌ అవసరం లేకుండా సహజసిద్దంగా షూట్‌ చేయవచ్చని సమాచారం. అంతేకాకుండా ఈ కెమెరాల‌తో 360 డిగ్రీస్ లో సీన్స్ చిత్రీక‌రించ‌వ‌చ్చు. బాహుబలి కోసం అర్రీ అలెక్సా ఎక్స్ టీ వాడిన చిత్రయూనిట్‌ ప్రస్తుతం ఈ చిత్రం అంతకంటే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వాడుతున్నట్లు తెలుస్తోంది. నేటి నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రెండో షెడ్యుల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement