'ఆర్‌ఆర్‌ఆర్‌'లో రామ్‌ చరణ్‌ ఎంట్రీ సీన్‌ ఎలా తీశారో తెలుసా..? | Making Of Ram Charan ICONIC Intro Scene From RRR Movie | Sakshi
Sakshi News home page

'ఆర్‌ఆర్‌ఆర్‌'లో రామ్‌ చరణ్‌ ఎంట్రీ సీన్‌ ఎలా తీశారో తెలుసా..?

Published Sat, Feb 8 2025 1:28 PM | Last Updated on Sat, Feb 8 2025 2:01 PM

Making Of Ram Charan ICONIC Intro Scene From RRR Movie

ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram charan) ఇద్దరు స్టార్‌ హీరోలతో తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌.. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ మూవీని రాజమౌళి(Raja mouli) తెరకెక్కించారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయతే, ఇందులో రామ్‌చరణ్‌ ఎంట్రీ సీన్‌ను ఎలా క్రియేట్‌ చేశారో ఒక వీడియో ద్వారా మేకర్స్‌ తాజాగా విడుదల చేశారు. ఈ సన్నివేశం అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది. సుమారు 10 నిమిషాల పాటు ఎంతో ఉత్కంఠభరితంగా ఈ సీన్‌ కొనసాగుతుంది.

తారక్‌ ఎంట్రీ సీన్‌కు ఎంత పాపులారిటీ వచ్చిందో రామ్‌ చరణ్‌ ఎంట్రీ కూడా అంతే బజ్‌ను క్రియేట్‌ చేస్తుంది. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా భారతీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారు. సుమారు 900 మంది ఓ  పోలీస్‌స్టేషన్‌ ఎదుట నినాదాలు చేస్తూ ఉంటారు. అయితే, వారిని కట్టడి చేసేందుకు ఎవరూ సాహసించరు. కానీ, పోలీస్‌ అధికారి అయిన రామ్‌చరణ్‌ రంగంలోకి దిగి అక్కడి పరిస్థితిని కంట్రోల్‌ చేస్తారు. రామరాజుగా చరణ్‌ చూపిన తెగువకు బ్రిటిష్ అధికారులే ఆశ్చర్యపోతారు. 

ఈ ఒక్క సీన్‌ క్రియేట్‌ చేసేందుకు 32 రోజులు పడినట్లు మేకర్స్‌ చెప్పారు. అలాంటి సీన్‌ను ఎలా క్రియేట్‌ చేశారో మీరు చూసేయండి.  ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని ఎలా తెరకెక్కించారో పూర్తిగా తెలుసుకోవాలంటే.. 'ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌' అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది చూసేయండి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement