
ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్లుగా నటించిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రం విడుదలై ఏడాది కావొస్తున్నా ఇంకా ఆర్‌ఆర్‌ఆర్ జోరు తగ్గలేదు. ఇటీవలె ఈ సినిమాలోని ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో జక్కన్న, జూనియర్, రామ్ చరణ్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్నాయి.
ఇక ఈనెల 13న 95వ అకాడమీ (Oscars 2023)అవార్డులను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలోనాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావాలని తెలుగువారితో పాటు భారతీయులంతా కోరుకుంటున్నారు. తాజాగా నాటు నాటు పాట, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై గరికపాటి నరసింహారావు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నాటునాటు పాట గురించి ప్రస్తావిస్తూ.. ''అచ్చ తెలుగులో రాసిన ఈ పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం చాలా సంతోషంగా ఉంది.
ఆ ఇద్దరు నటులు చేసిన అద్భుత నటన,కీరవాణి సంగీతం, రాజమౌళి దర్శకత్వం, చంద్రబోస్ అద్భుత రచన కారణంగా ఇవాళ ప్రపంచ స్థాయి బహుమతి రాబోతోంది. గుడికి వెళ్తే ఆస్కార్ పురస్కారం రావాలని దండం పెట్టండి.ఇక నాటునాటులో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల నటన అద్భుతం. నాటు నాటు పాటలో ఈయన బెల్ట్ తీస్తే ఆయనా తీశాడు, ఈయన కుడికాలు తిప్పితే ఆయనా కుడికాలే తిప్పాడు. కవలలై పుట్టినవారికి కూడా ఇది సాధ్యం కాదు. రెండు వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన మహానటులు ఇద్దరూ అటువంటి నటన చేశారంటే నా కంటే చిన్నవాళ్లైనా ఇద్దరికీ నమస్కారం చేస్తున్నాను'' అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment