garikapati Narasimha Rao
-
'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?
ప్రభాస్ 'కల్కి' సినిమా వచ్చి నాలుగు నెలలైపోయింది. రిలీజ్ టైంలోనే అర్జునుడు, కర్ణుడు పాత్రలు వాటి మధ్య సన్నివేశాల గురించి చర్చోపచర్చలు నడిచాయి. అర్జునుడు గొప్ప అని కొందరు లేదులేదు కర్ణుడే గొప్ప అని మరికొందరు వాదించుకున్నారు. అదంతా ముగిసిపోయి చాలా కాలామైపోయింది. సరిగ్గా ఇలాంటి టైంలో ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు 'కల్కి' సినిమాపై విమర్శలు చేశారు.గరికపాటి ఏమన్నారు?తాజాగా వినాయక చవితి సందర్భంగా గరికపాటి ప్రవచనాలు చెప్పారు. మాటల సందర్భంగా 'కల్కి' గురించి ప్రస్తవన వచ్చేసరికి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మహాభారతంలో ఉన్నది వేరు సినిమాలో చూపించింది వేరు అని చెప్పారు. అశ్వద్ధామ, కర్ణుడిని హీరోలుగా చూపించడమేంటో తనకు అస్సలు అర్థం కాలేదని కౌంటర్లు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)వీడియోలో ఏముంది?'కర్ణుడు ఎవరో తెలియకపోతే 'కల్కి' సినిమాలో చూపించినవాడే కర్ణుడు. మనేం చేస్తాం. సినిమావోళ్లు ఏం చూపిస్తే అది. మొత్తం భారతంలో ఉన్నది వేరు అందులో చూపించింది వేరు. అశ్వద్ధామ, కర్ణుడు అర్జెంట్‌గా హీరోలైపోయారు. భీముడు, కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు. ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లేదు. బుర్రపాడైపోతుంది. పైగా మహాభారతమంతా చదివితే అర్థమవుతుంది. కర్ణుడినే అశ్వద్ధామ కాపాడాడు. అశ్వద్ధామని కర్ణుడు ఎప్పుడూ ఒక్కసారి కూడా కాపాడలేదు. ఆ అవసరం లేదు. అశ్వద్ధామ మహావీరుడు. ఇక్కడేమో 'ఆచార్య పుత్ర ఆలస్యమైంది' అని డైలాగ్ పెట్టారు. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు. మనకి ఏది కావాలంటే అది పెట్టేయడమే. ఓ వెయ్యి రూపాయలు ఎక్కువిస్తే డైలాగ్ రాసేవాడు రాసేస్తాడు కదా' అని గరికపాటి అన్నారు.'కల్కి' మూవీ గురించిజూన్ 27న థియేటర్లలో రిలీజైన 'కల్కి'.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీనికి కొనసాగింపుగా తీస్తున్న రెండో భాగం షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీనికి 'కర్ణ 3102 బీసీ' అనే టైటిల్ కూడా నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. (ఇదీ చదవండి: వాళ్లకు ఇచ్చారు.. మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు: ఎన్టీఆర్ ఫ్యాన్స్)తనకు నచ్చని రాజకీయ పార్టీలపై, సినిమా హీరోలపై విమర్శలు చేసే గరికిపాటి నరసింహారావు.. తాజాగా కల్కిపై విమర్శలు pic.twitter.com/vThPZ5s4Nn— greatandhra (@greatandhranews) September 23, 2024 -
చాగంటి తో విభేదాల పై గరికపాటి మాటల్లో
-
యువతరానికి నా మెసేజ్ ఇదే..!
-
నేను అలా అన్నందుకు నామీద తిరగబడ్డారు : గరికపాటి నరసింహారావు
-
పద్మశ్రీ అవార్డు అందుకున్న కానీ..!
-
తల్లిదండ్రులు గురించి గరికపాటి నరసింహారావు గారు
-
గరికిపాటి నరసింహారావు జీవిత చరిత్ర..!
-
‘నేను–నాది’ అనే భావన వీడాలి
కాకినాడ కల్చరల్: నేను–నాది అనే భావ దరిద్య్రాలను విడిచిపెట్టినప్పుడే వ్యక్తులతోపాటు దేశం బాగు పడుతుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రవచనకర్త డాక్టర్ గరికిపాటి నరసింహారావు అన్నారు. స్థానిక సూర్యకళామందిర్‌లో సరస్వతీగాన సభ ఆధ్వర్యంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న నలదమయంతి చరిత్రపై గరికిపాటి ప్రవచనాలు ఆదివారంతో ముగిశాయి. నలదమయంతుల కథను ఆదర్శంగా తీసుకొని జీవిత పయనంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంతో నిలవాలని అన్నారు. నలుడు అడవిలో దమయంతిని విడిచి వెళ్లిన తర్వాత ఆమె పడిన కష్టాలను వివరించారు. సుందర రూపుడయిన నలుడు అడవిలో పాముకాటుకు గురై నల్లగా మారిపోవడం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నలుడు, బాహుకుడనే పేరుతో ఋతుపర్ణ మహారాజు వద్ద వంటవానిగా చేరిన ఘట్టాలను వివరించారు. కష్టాలలో కూడా తనకు ఉన్న అవకాశాన్ని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలో నలుడి వ్యక్తిత్వం తెలుపుతోందని వివరించారు. చివరకు ఇంద్రుని దయంతో నలుడు పూర్వ రూపం పొంది తన రాజ్యాన్ని దక్కించుకొన్న ఘట్టాలను వివరించారు. ధైర్యంగా బతకాలి, సంతోషంగా మరణించాలని అన్నారు. అహంకారం, మమకారం రెండు ప్రమాదాలే అన్నారు. కష్టం వచ్చిందంటే వెనుక సుఖం వస్తోందని సూచన అని వివరించారు. జీవితంలో కష్టాలు పెరిగాయి అంటే అర్థం సుఖాలు రానున్నాయని భావించాలి తప్ప జీవితం ముగిసిపోయిందని అధైర్య పడరాదన్నారు. అలాగే ఎండలు మండిపోతున్నాయంటే వర్షాలు బాగా పడతాయని సూచన అని మండుతున్న ఎండలపై చమత్కరించారు. అనంతరం సరస్వతీ గాన సభ సభ్యులు నరసింహరావును ఘనంగా సత్కరించారు. గాన సభ అధ్యక్షుడు కేవీఎస్ ఆంజనేయమూర్తి, కార్యదర్శి పేపకాయల రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఎల్.సత్యనారాయణ్, నారాయణ్ మురళి, మునుగంటి వెంకట్రావు, శ్రీరామచందరమూర్తి, ఎస్కేవీడీ వెంకట్రావు, పెద్దాడ సూర్యకుమారి, చావలి సూర్యకుమారి పాల్గొన్నారు. -
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్లుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రం విడుదలై ఏడాది కావొస్తున్నా ఇంకా ఆర్ఆర్ఆర్ జోరు తగ్గలేదు. ఇటీవలె ఈ సినిమాలోని ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో జక్కన్న, జూనియర్, రామ్ చరణ్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఇక ఈనెల 13న 95వ అకాడమీ (Oscars 2023)అవార్డులను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలోనాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావాలని తెలుగువారితో పాటు భారతీయులంతా కోరుకుంటున్నారు. తాజాగా నాటు నాటు పాట, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై గరికపాటి నరసింహారావు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నాటునాటు పాట గురించి ప్రస్తావిస్తూ.. ''అచ్చ తెలుగులో రాసిన ఈ పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఇద్దరు నటులు చేసిన అద్భుత నటన,కీరవాణి సంగీతం, రాజమౌళి దర్శకత్వం, చంద్రబోస్ అద్భుత రచన కారణంగా ఇవాళ ప్రపంచ స్థాయి బహుమతి రాబోతోంది. గుడికి వెళ్తే ఆస్కార్ పురస్కారం రావాలని దండం పెట్టండి.ఇక నాటునాటులో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల నటన అద్భుతం. నాటు నాటు పాటలో ఈయన బెల్ట్ తీస్తే ఆయనా తీశాడు, ఈయన కుడికాలు తిప్పితే ఆయనా కుడికాలే తిప్పాడు. కవలలై పుట్టినవారికి కూడా ఇది సాధ్యం కాదు. రెండు వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన మహానటులు ఇద్దరూ అటువంటి నటన చేశారంటే నా కంటే చిన్నవాళ్లైనా ఇద్దరికీ నమస్కారం చేస్తున్నాను'' అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. -
గరికపాటిపై చిరంజీవి సెటైర్.. పంచ్ మామూలుగా లేదుగా!
అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేసిన విషయం తెలిసిందే! ఆ కార్యక్రమంలో చిరంజీవితో ఫొటోలు దిగేందుకు మహిళలు ఆసక్తి చూపగా అక్కడే ఉన్న గరికపాటి నరసింహరావు.. వెంటనే ఫొటో సెషన్ ఆపేసి చిరంజీవి వచ్చి కూర్చోవాలి లేకుంటే నేను వెళ్లిపోతా అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత ఆ వ్యవహారం ఎంత దూరం వెళ్లిందో అంతా చూశారు. గరికపాటి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఇప్పటివరకు దీనిపై పెద్దగా రియాక్ట్ కాని చిరంజీవి తాజాగా గరికపాటిపై పరోక్షంగా సెటైర్ వేశారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. అయితే కార్యక్రమంలోనూ చిరంజీవితో ఫొటోలు దిగేందుకు కొందరు మహిళలు వేదిక మీదకు రాగా.. వెంటనే చిరు.. ''ఇక్కడ వారు లేరు కదా?'' అంటూ సెటైరికల్‌గా ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. 'వారు ఇక్కడ లేరు' అంటూ పక్కనవాళ్లు సమాధానమివ్వగా హమ్మయ్యా.. అంటూ గుండెల మీద చేయి పెట్టుకుని రిలాక్స్ అయినట్టు చిరంజీవి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. దీంతో చిరు సైలెంట్‌గానే బలే సెటైర్ వేశారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. -
గరికపాటి వివాదంపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవిపై గరికపాటి నరసింహారావు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంతటి దుమారానికి తెరదీసిందో తెలిసిందే! చిరు ఫొటో సెషన్ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతానని గరికపాటి అసహనం వ్యక్తం చేయడంపై మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. తాజాగా ఈ వివాదంపై హీరో మంచు విష్ణు స్పందించాడు. 'అక్కడ ఏం జరిగిందో నాకు కరెక్ట్‌గా తెలీదు. గరికపాటిగారు ఏదో మాట్లాడారు.. చిరంజీవి ఫ్యాన్స్.. అదీ ఇదీ అని! పూర్తి సబ్జెక్ట్ నాకు తెలియదు. కానీ చిరంజీవిగారు ఒక లెజెండ్. ఆయనతో ఫొటో తీసుకోవడమనేది అభిమానులకు సువర్ణావకాశం. ఆయన దగ్గరకు ఎవరైనా సరే పరుగెత్తుకు వెళ్లి ఫొటో తీసుకుంటారు. ఆ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని ఎవరూ ఆపలేరు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ అలాంటి పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎక్సైట్మెంట్లో ఉంటారు' అన్నాడు మంచు విష్ణు. చదవండి: బిగ్‌బాస్ ఎలిమినేషన్, ఆ కంటెస్టెంట్ గుడ్‌బై కాంతార రెండుసార్లు చూశా: ప్రభాస్ -
ఢీ కొట్టాల్సిన పని లేదు, నేనెందుకు ఉలిక్కిపడాలి: చిరంజీవి
అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవిపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే! చిరు ఫొటో సెషన్ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతానని గరికపాటి మెగాస్టార్‌ను బెదిరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా చిరంజీవి మరోసారి ఈ వివాదంపై స్పందించాడు. సంయమనం పాటిస్తే నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయన్నాడు. 'నేను వెనక్కు తగ్గలేదు, సంయమనం పాటిస్తున్నాను. సంయమనం పాటిస్తే నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయి. నేను తప్పు చేయను, తప్పు చేస్తే అందరిముందే పొరపాటు అయిందని ఒప్పుకుంటా. ఒకవేళ నీ తప్పు లేకుండా ఆరోపణలు చేస్తే వెంటనే ఢీ కొట్టాల్సిన అవసరం లేదు, నిజం నిలకడగా తెలుస్తుందని నేను నమ్ముతాను. అసలు అక్కడ నా తప్పు లేనప్పుడు నేనెందుకు ఉలిక్కిపడాలి? నన్ను ఎద్దేవా చేసినవారు దగ్గరకు వచ్చినా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటా, ఇదే నాకు తెలిసిన ఫిలాసఫీ' అని చెప్పుకొచ్చాడు చిరంజీవి. చదవండి: కాంతార సెన్సేషన్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లను దాటేసిందిగా -
గరికపాటి ఎపిసోడ్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
-
గరికపాటి వివాదంపై స్పందించిన చిరంజీవి
అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేసిన విషయం తెలిసిందే! 'చిరు ఫొటో సెషన్ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతా'నని గరికపాటి చిరును బెదిరించడం సరి కాదంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. తాజాగా ఈ వివాదంపై చిరంజీవి స్పందించాడు. గరికపాటి పెద్దాయన అని, ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లైంది. గాడ్ ఫాదర్ సక్సెస్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. మొన్న వచ్చిన ఆచార్య ఫ్లాప్ అయింది. అందుకని నేను బాధతో కుంగిపోలేదు. బయ్యర్లను కాపాడాలని నేను, రామ్‌చరణ్ మా పారితోషికంలో ఎక్కువ మొత్తాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాం. గాడ్‌ఫాదర్ సినిమా విషయానికి వస్తే.. లూసిఫర్ సినిమాలో చిన్న చిన్న మార్పులు చేస్తే నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని సుకుమార్.. చరణ్‌కు చెప్పాడట. ఐడియా ఇచ్చాడు కానీ తర్వాత అందుబాటులో ఉండలేదు. ఒక రోజు చరణ్ బాబు దర్శకుడు మోహన్ రాజా పేరు చెప్పాడు. తని వరువన్ను అద్భుతంగా తీసిన ఆయన లూసిఫర్ రీమేక్‌కు న్యాయం చేస్తాడనే సంపూర్ణ నమ్మకం కలిగింది. నిజానికి రీమేక్ సినిమాలు చేయడం ఒక సవాల్. కానీ ప్రేక్షకుల ఆదరణ వల్ల ఘరానా మొగుడు, ఠాగూర్.. ఇప్పుడు గాడ్ ఫాదర్ గొప్ప విజయాలు అందుకున్నాయి. సల్మాన్ ఖాన్.. గాడ్ ఫాదర్ చేసినట్లే నాకూ వేరే ఇండస్ట్రీ నుంచి పిలుపు వస్తే తప్పకుండా చేస్తాను. ఎలాంటి భాషా, ప్రాంతీయ బేధాలు లేకుండా 'ఇండియన్ సినిమా' అనే పేరు రావాలని నా కోరిక. ఇకపోతే నేను చాలా విషయాల్లో తగ్గితే తప్పేంటని అనుకుంటాను. ఇక్కడ తగ్గటం అంటే సంయమనం పాటించడం. నిజం నిలకడగా తెలుస్తుందనే మాటను నమ్మినవాడిని నేను. నన్ను ఎద్దేవా చేసినవారే మళ్లీ వారి తప్పు తెలుసుకుని నా దగ్గరకు వస్తే వారిని ప్రేమగా దగ్గరకు తీసుకోవడమే నాకు తెలిసిన ఫిలాసఫీ' అని చెప్పుకొచ్చాడు చిరంజీవి. చదవండి: సినిమా ఛాన్స్ అని నడుము చూపించమన్నాడు: నటి నయన్ సరోగసీపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం -
అనుష్కపై గరికపాటి కొంటె వ్యాఖ్యలు.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు మధ్య చోటు చేసుకున్న సంఘటన పెద్ద దుమారమే రేపింది. చిరంజీవిని ఉద్దేశించి గరికపాటి చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. దీంతో గరికపాటి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. తాజాగా ఈ వివాదంపై సంచలన దర్శకుడు స్పందించాడు. గరికపాటి తీరుని తప్పుబడుతూ వరుస ట్వీట్స్ చేశాడు. అందులో ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గరికపాటి గతంలో అనుష్క అందం గురించి పొగుడుతున్న వీడియో క్లిప్పుని ఆర్టీజీవి ట్విటర్లో షేర్ చేస్తూ ‘మీరు కూడానా బాహు(గరిక)బలి(పాటి)గారు!’అని క్యాప్షన్ ఇచ్చాడు. (చదవండి: రిలీజ్‌కు ముందే ఖరీదైన బహుమతి.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? డైరెక్టర్ ట్వీట్ వైరల్) ఆ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ.. ‘హీరోయిన్లని కుర్రాళ్ళు తెగ చూస్తూ ఉంటారు. ఇందులో ఏముంది అని అనుకునేవాడిని. కానీ నా చూపు కూడా ఒక చోట ఆగింది. అది ఎవరంటే మహానటి అనుష్క. అలా నిలబడి ఉంది.. ఒక మంచి పోజ్. మనం కవి కదా.. ఊరికే ఎలా ఉండగలం.. చూశా పై నుంచి కిందకు. ఒక రోజు పేపర్ చదువుతుంటే ముందు రాజకీయాలు చూస్తున్నా.. డిగ్రీ చదివే మా అబ్బాయి .. నా కాళ్ల దగ్గర కూర్చున్నాడు. నేను అనుకున్నాను.. స్నానం చేసొచ్చి నా కాళ్లకు దండం పెడుతున్నాడు అని, కానీ వాడు అక్కడ కూర్చొని పేపర్లోని అనుష్క ఫోటోని చూస్తున్నాడు. వాడి ధోరణిలో వాడున్నాడు.. నా ధోరణిలో నేనున్నాను. దానికేముంది ఎవడికి కావాల్సింది వాడు చూసుకుంటున్నాడు. ఏంట్రా అని అడిగితే టక్కుమని లేచి వెళ్లిపోయాడు. ఏంటా అని నేను చూశాను.. ఆ ఫోటో చూసేసరికి వాడు ఈ అమ్మాయిని చూడడంలో తప్పేమి లేదనిపించింది. నన్నే ఆకర్షిస్తుంటే.. వాడిని ఆకర్షించదా? ’అని గరికపాటి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. OHO !!! MEEKU KOODAANAAA BAHU(GARIKA)BALI(PATI) GAARU ! 😜 pic.twitter.com/00rLB4oVj7 — Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2022 -
చిరంజీవిపై గరికపాటి ఫైర్.. వారు చెప్పే శాంతి వచనాలకు విలువెక్కడిది?
రాజకీయ నాయకులు, ఆద్యాత్మిక వేత్తలు, భక్తి విషయాలకు రాజకీయ అంశాలకు ముడిపెట్టి మాట్లాడడం పద్దతేనా? ఇలాంటివాటివల్ల ప్రజలకు ఏమైనా మంచి సందేశం వెళుతుందా? ఆలయానికి వెళ్లి ప్రార్ధన చేసి, ఏవో కోర్కెలు కోరుకుని వెళ్లిపోవడం రివాజు. కాని రాజకీయ నేతలు దేశం కోసమే ప్రార్ధించామని చెబుతుంటారు. నిజంగా వారు అచ్చం ప్రజల కోసమే పూజలు చేసి ఉంటే మెచ్చుకోవలసిందే. కానీ ఎక్కువ మంది తమ అదికారం కోసమో, మరే రాజకీయ ప్రయోజనం కోసమో చేస్తుంటారు. అదేమి రహస్యం కాదు. అది తప్పుకూడా కాదు. కానీ బయటకు వచ్చి చెప్పే కబుర్లే ఒక్కోసారి అనవసర వివాదాలకు తావిస్తుంటాయి. ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దసరా నాడు విజయవాడ కనకదుర్గమ్మ గుడిని సందర్శించుకుని పూజలాచరించిన తర్వాత అమరావతి రాజధాని విషయమై మాట్లాడిన సంగతులలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనకే తగులుతాయన్న భావన కలుగుతుంది. అలాగే ప్రముఖ ఆద్యాత్మిక వేత్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్య ఒకటి ఆయనలోని పరిజ్ఞానాన్ని ప్రశ్నించేలా ఉంది. ముందుగా చంద్రబాబు ఏమన్నారో చూద్దాం. మాట తప్పేవారిని దుర్గమ్మ కూడా క్షమించదని అన్నారు. ప్రజా సంకల్పం, దుర్గమ్మ ఆశీస్సులతో అమరావతి రాజధానిగా నిర్ణయించాం. ప్రస్తుతం రాజధాని అమరావతిపై రోజుకోమాట మార్చడం మంచిదికాదు.. అలాంటి వాళ్లను దుర్గమ్మ కూడా క్షమించదు .. అంటూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. రాజధానికి సంబంధించి తన వైఖరిపై రాజకీయంగా ఏమి మాట్లాడినా చంద్రబాబును ఆక్షేపించనవసరం లేదు. కాని దుర్గమ్మ తల్లికి లింక్ పెట్టి మాట్లాడడమే అభ్యంతరకరం. మాట తప్పేవారిని దుర్గమ్మ క్షమించదని అంటే, అందువల్లే ఆయన 2019 ఎన్నికలలో ఘోర ఓటమి పాలయ్యారా? రాజధాని 29 గ్రామాల పరిధిలోనే ఉండాలని, రాష్ట్ర ప్రజలందరి సొత్తు తీసుకువచ్చి ఆ గ్రామాలలోనే పెట్టాలని దుర్గమ్మ ఏమైనా చెప్పారా? (చదవండి: గరికపాటిపై ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు, నువ్వేంటో..!) చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ బదులు ఇస్తూ, దుర్గమ్మ అన్ని ప్రాంతాల ప్రజల మేలు కాంక్షిస్తారని అన్నారు. చంద్రబాబును 23 సీట్లకే పరిమితం చేసి జగన్ కు 151 సీట్లను దుర్గమ్మ ఇచ్చినట్లే కదా? అసలు మాట తప్పడం అంటే ఏమిటి? లక్షకోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకపోవడం మాట తప్పినట్లు అవుతుందా? లేదా? కాపులను బిసిలలో చేర్చుతామని చెప్పి చేయలేకపోవడం మాట తప్పడం అవుతుందా? 400 ఎన్నికల హామీలను ఇచ్చి అమలు చేయకపోవడాన్ని ఏమంటారు. రాజకీయ నేతలు ఇలాంటి విషయాలలో సెంటిమెంట్ జోడించి ప్రసంగాలు చేస్తే అవి వారికే తగులుతాయన్న సంగతి అర్ధం చేసుకోవాలి. ఇక గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యను గమనిద్దాం. ఏడు కొండలని రెండు కొండలు చేస్తే ఏమైందో చూశాం కదా అని అన్నారు. ఇది ఫక్తు రాజకీయ విమర్శ. గతంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై రాజకీయంగా కుట్ర చేయడానికి అప్పట్లో కొందరు ఈ దుష్ప్రచారం చేశారు. నిజానికి స్థానిక ఎన్నికల వల్ల పవిత్రత దెబ్బతినకూడదని ఆనాటి ప్రభుత్వం కొంత విస్తీర్ణం పేర్కొంది. పైగా అది కూడా గత ప్రభుత్వాల టైమ్ నుంచి ఉన్నదే. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మీడియా వ్యక్తి, ఆర్ఎస్ఎస్ కు చెందిన కొందరు దీనిని వివాదం చేసి వైఎస్ కు పులమడానికి యత్నం చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధించడమే కాకుండా, తిరుమల అంటే ఏడు కొండలేనని వైఎస్ జిఓలు కూడా ఇచ్చారు. ఆ పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా గరికపాటి అభ్యంతరకరంగా మాట్లాడారు. కేవలం ఏదో వ్యక్తిగత ద్వేషం పెట్టుకుని మాట్లాడారేమో అనిపిస్తుంది. పైగా అలయ్ బలయ్ వంటి ప్రోగ్రాంలో ఈ ప్రస్తావనే అవసరం లేదు. పోనీ ఏదైనా శాపం వల్లే నేతలు చనిపోతారన్నది నిజమే అని పురాణ ప్రవచనకర్త గరికపాటి భావిస్తుంటే ఆయన అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. మహాత్మా గాంధీని గాడ్సె దారుణంగా కాల్చి హత్యచేశాడు. దేశ ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రష్యాలో మరణించిన తీరు మిస్టరీ. మరో ప్రధాని ఇందిరాగాంధీ భద్రతా సిబ్బంది జరిపిన కాల్పులలోనే చనిపోయారు. ఇంకో ప్రధాని రాజీవ్ గాంధీని శ్రీలంక తీవ్రవాదులు బాంబులు పేల్చి హత్యచేశారు. ఇందిరాగాందీ రెండో కుమారుడు సంజయ్ గాందీ హెలికాఫ్టర్ కూలి మరణించారు. వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన రోజుల్లోనే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూడా గల్లంతైపోయింది. టిడిపి నేతలు ఎర్రన్నాయుడు, హరికృష్ణ, లాల్ జాన్ భాష లు రోడ్డు ప్రమాదాలలో మరణించారు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు పదవీచ్యుతుడై కుటుంబం నుంచే ఘోర పరాభవంతో కుమిలి, కుమిలి మరణించారు. మాజీ ప్రధాని, గొప్ప నేత అయిన అటల్ బిహారీ వాజ్ పేయి తన చివరి సంవత్సరాలలో జ్ఞాపక శక్తి కోల్పోయి చాలాకాలం మంచానికే పరిమితం అయ్యారు. ఇలా చెప్పుకుంటూ చాలా ఉదాహరణలు ఉంటాయి. వీళ్లంతా గొప్పవారు. కాని వారి జీవితాలు ఇలా ముగియడం దురదృష్టకరం. కాని అంత మాత్రాన ఏదో శాపం అనో, పాపం అనో ఆద్యాత్మికవేత్తలు వ్యాఖ్యానిస్తే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయి? అందువల్ల గరికపాటి వంటివారు సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. మరో సంగతి. ఆద్యాత్మికవేత్తలకు మరీ కోపం ఎక్కువ ఉండకూడదు. కాని అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ని ఉద్దేశించి గరికపాటి అంత కటువుగా వ్యవహరించి ఉండవలసింది కాదు. ప్రశాంతంగా ఉండవలసిన ఆద్యాత్మికవేత్తలు తోటి ప్రముఖుడిపైనే ఫైర్ అయితే, వారు చెప్పే ప్రవచనాలకు, శాంతి వచనాలకు ఏమి విలువ ఉంటుంది? వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
గరికపాటిపై ఆర్జీవీ ఆగ్రహం.. వదిలే ప్రసక్తే లేదంటూ..!
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, మెగాస్టార్ల మధ్య జరిగిన వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. వివాదాస్పద కామెంట్లు చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజాగా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. దీనిపై నాగబాబు చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఆర్జీవీ గరికపాటిని విమర్శించారు. ‘మిమ్మల్ని మెగా ఫ్యామిలీ క్షమించినా.. అభిమానులైన మేం వదిలే ప్రసక్తే లేదంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీ ఆ ట్వీట్లో తనదైన శైలిలో గరికపాటిపై విరుచుకుపడ్డారు. వివాదం ఎక్కడ మొదలైందంటే! ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారమే రేగింది. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ‘చిరంజీవి ఫొటో సెషన్ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా’ అని గరికపాటి అసహనం వ్యక్తం చేయడంతో ఆ వ్యాఖ్యలు వివాదానానికి దారి తీశాయి. అయితే ఆ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి బాగానే మాట్లాడుకున్నా.. ఆ తరువాత నరసింహారావు వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్లో ఆయన పేరు ప్రస్తావించకుండా ‘ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’నని స్పందించిన సంగతి తెలిసిందే. సర్ @NagaBabuOffl గారు, ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీ ని ఎందుకు ఇచ్చారు సర్ .. సర్ సర్ సర్ @KChiruTweets ???? — Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022 సర్ @NagaBabuOffi గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు 🙏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022 హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా @KChiruTweets నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి 😡😡😡😌😌😌 — Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022 హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ @KChiruTweets ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో — Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022 -
గన్ షాట్ : అలయ్ బలయ్ లో చిరు ఇమేజ్ ని చూసి అసూయపడ్డారా ..?
-
చిరంజీవి ఫ్యాన్స్ దెబ్బకి దిగివచ్చిన గరికపాటి
-
ఆగని గరికపాటి వ్యాఖ్యల దుమారం..‘ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారమే రేగింది. హైదరాబాద్‌లో బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ‘చిరంజీవి ఫొటో సెషన్ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా’అని అసహనం వ్యక్తం చేశారనే అంశం వివాదానానికి దారి తీసింది. అయితే ఆ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి బాగానే మాట్లాడుకున్నా... ఆ తరువాత నరసింహారావు వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్లో ఆయన పేరు ప్రస్తావించకుండా ‘ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’నని స్పందించారు. నాగబాబు ట్వీట్‌పై బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ కౌంటర్ ఇచ్చారు. ‘నిత్యం తన ప్రవచనాలతో సమాజాన్ని ఎంతో సంస్కారవంతం చేస్తున్న ఒక సనాతనవాది, ఆధ్యాత్మిక వేత్తను.. నటనావ్యాపారం తప్ప సమాజహితాన్ని మరిచిన చిత్రవ్యాపారిని చూసి అసూయ చెందాడనడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే’ అని ఘాటుగా స్పందించారు. చదవండి: 'మాకు ఆ ఉద్దేశం లేదు.. ఆయనను ఎవరూ తప్పుగా మాట్లాడొద్దన్న నాగబాబు' ఆగని ట్రోల్స్ మరోవైపు చిరంజీవి అభిమానులు, నటులు గరికపాటిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలంటూ చిరంజీవి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ గరికపాటికి ఫోన్ చేసి డిమాండ్ చేశారు. చిరంజీవి గురించి అలా అనాల్సింది కాదంటూ గరికపాటిపై సినీనటుడు ఉత్తేజ్ మండిపడ్డారు. ఇలా సోషల్ మీడియాలో పోస్టుల పరంపరం కొనసాగింది. చివరకు నాగబాబు మళ్లీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘గరికపాటి వారు ఏదో మూడ్‌లో అలా అని ఉంటారు. ఆయనలాంటి పండితుడు అలా అని ఉండికూడదని అన్నామే తప్ప, ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. మెగాభిమానులు ఆయ నని అర్థం చేసుకోవాలే గానీ, ఆయన గురించి ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని రెక్వెస్ట్’అని పేర్కొన్నారు. -
'మాకు ఆ ఉద్దేశం లేదు.. ఆయనను ఎవరూ తప్పుగా మాట్లాడొద్దన్న నాగబాబు'
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై చేసిన వ్యాఖ్యల పట్ల మెగాబ్రదర్ నాగబాబు వివరణ ఇచ్చారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన అలయ్-బలయ్ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటనపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. తాజాగా ఇవాళ వివరణ ఇస్తూ మరో ట్వీట్ చేశారు నాగబాబు. ట్విటర్లో ఆయన రాస్తూ.. 'గరికపాటి వారు ఏదో మూడ్‌లో ఆలా అని వుంటారు. ఆయన లాంటి పండితుడు అలా అని ఉండకూడదని ఆయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప.. ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. ఏది ఏమైనా మన మెగా అభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని.. ఆయనను ఎవరు తప్పుగా మాట్లాడవద్దని నా రెక్వెస్ట్.' అంటూ పోస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే: దసరా సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో అభిమానులు చిరంజీవితో ఫోటో సెషన్ నిర్వహించారు. మెగాస్టార్‌తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. గరికపాటి వారు ఏదో మూడ్ లో ఆలా అనివుంటారు ,అయన లాంటి పండితుడు ఆలా అనివుండకూడదని అయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప ,ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు.ఏది ఏమైనా మన మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని ఆయనని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని మెగాభిమానులకు నా request. — Naga Babu Konidela (@NagaBabuOffl) October 7, 2022 ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే .. — Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022 -
గరికపాటి వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు.. ఏమన్నారంటే?
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై వ్యాఖ్యలపై నాగబాబు వ్యంగ్యంగా స్పందించారు. 'ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే' అంటూ ఆయన ట్వీట్ చేశారు. దసరా పండుగ నేపథ్యంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ వేడుకలో జరిగిన సంఘటనపై ఆయన ఈ విధంగా కౌంటరిచ్చినట్లు తెలుస్తోంది. (చదవండి: గరికపాటికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి) అసలేం జరిగిందంటే: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన అలయ్ బలయ్ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో అభిమానులు చిరంజీవితో ఫోటో సెషన్ నిర్వహించారు. మెగాస్టార్‌తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే .. — Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022 -
చిరంజీవిపై ఫైర్ అయిన గరికపాటి
-
గరికపాటికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ నేపథ్యంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, పలువురు ప్రముఖలు హాజరయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అలయ్ బలయ్‌కు వచ్చిన చిరంజీవితో అభిమానులు ఫోటో సెషన్ నిర్వహించారు. అదే సమయంలో అవధాని గరికపాటి నరసింహరావు ప్రసంగం ప్రారంభించారు. చిరంజీవితో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. ‘ అక్కడ మొత్తం ఫోటో సెషన్ ఆగిపోవాలి. లేదంటే నేను వెళ్లిపోతాను. నాకేం మోహమాటం లేదు. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి.. ఈ పక్కకు రండి. నేను మాట్లాడతాను. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి. ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడకు రావాలి. లేదంటే నాకు సెలవిప్పించండి’ అంటూ వెళ్లిపోతా’ అంటూ గట్టిగానే చెప్పారు. వెంటనే అక్కడున్న వారు ఆయనకు సర్ధిచెప్పారు. అంతేగాక సెల్ఫీలు ఆపి గరికపాటికి చిరంజీవి క్షమాపణ చెప్పారు. గరికపాటి ప్రసంగాలంటే తనకు ఇష్టమని, ఆసక్తిగా వింటానని చెప్పారు.ఒకరోజు తమ ఇంటికి భోజనానికి రావాలని గరికపాటిని చిరంజీవి ఆహ్వానించారు. చదవండి: ఉత్సాహంగా అలయ్ బలయ్.. డప్పు కొట్టిన చిరంజీవి -
ఎట్టకేలకు గరికపాటి క్షమాపణ
భీమవరం(ప్రకాశం చౌక్): తన వ్యాఖ్యలతో స్వర్ణకారులు బాధపడుతున్న నేపథ్యంలో వారికి క్షమాపణలు చెబుతున్నానని ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రవచనాలు చేయడానికి విచ్చేసిన ఆయన స్థానిక హోటల్లో బస చేశారు. తమను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ భీమవరానికి చెందిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చి క్షమాపణ చెప్పాలని ఆందోళనకు దిగారు. దీంతో స్వర్ణకారుల సంఘం నుంచి పలువురు నాయకులు అలాగే కొందరు పెద్దల సమక్షంలో గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ సుమారు 2006 సంవత్సరంలో ఓ చానల్లో హాస్యం అనే కార్యక్రమంలో స్వర్ణకారుల గురించి తాను వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ఈ సందర్భంగా బయటకు వచ్చి బహిరంగంగా కూడా స్వర్ణకారులకు ఆయన క్షమాపణ చెప్పారు.