
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు టాలీవుడ్ సినిమాను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రేమ అంటే ఏంటో తెలియాలంటే తెలుగు సినిమాను చూడాలని గరికపాటి సూచించారు. ఇటీవల విడుదలైన 8 వసంతాలు చూస్తే చాలు.. నిజమైన ప్రేమ అంటే మీకు తెలుస్తుందని అన్నారు. ఈ చిత్రాన్ని తాను చూశానని వెల్లడించారు. నిజమైన ప్రేమ అనేది మనసులో ఉంటుంది.. కలిసి ఉన్నా, విడిపోయినా వాళ్లు సుఖంగా ఉండాలని కోరుకుంటారని అన్నారు. ఈ వీడియోను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
తెలుగులో ఇటీవల విడుదలైన ప్రేమకథా చిత్రం 8 వసంతాలు. అందమైన ప్రేమకథగా ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కించారు. ఈ ఏడాది జూన్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. అయితే ఓటీటీలో మాత్రం ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రంలో మలయాళ అమ్మాయి అనంతిక సానీల్‌కుమార్(Ananthika Sanilkumar) కీలక పాత్రలో నటించింది. ఈ మూవీలో హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
(ఇది చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)
8 వసంతాలు కథేంటంటే?
శుద్ధి అయోధ్య(అనంతిక).. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ.
Thank you Padma Shri #GarikipatiNarasimhaRao Garu for your great words about #8Vasantalu ✨
An eminent personality like you talking about our film is an honour.
Movie streaming on Netflix ❤🔥
▶️ https://t.co/EmPxSwgx8m
Directed by #PhanindraNarsetti
Produced by… pic.twitter.com/F0P3pykwvV— Mythri Movie Makers (@MythriOfficial) September 16, 2025