సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ నేపథ్యంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, పలువురు ప్రముఖలు హాజరయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అలయ్ బలయ్‌కు వచ్చిన చిరంజీవితో అభిమానులు ఫోటో సెషన్ నిర్వహించారు. అదే సమయంలో అవధాని గరికపాటి నరసింహరావు ప్రసంగం ప్రారంభించారు.
చిరంజీవితో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. ‘ అక్కడ మొత్తం ఫోటో సెషన్ ఆగిపోవాలి. లేదంటే నేను వెళ్లిపోతాను. నాకేం మోహమాటం లేదు. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి.. ఈ పక్కకు రండి. నేను మాట్లాడతాను. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి. ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడకు రావాలి. లేదంటే నాకు సెలవిప్పించండి’ అంటూ వెళ్లిపోతా’ అంటూ గట్టిగానే చెప్పారు.
వెంటనే అక్కడున్న వారు ఆయనకు సర్ధిచెప్పారు. అంతేగాక సెల్ఫీలు ఆపి గరికపాటికి చిరంజీవి క్షమాపణ చెప్పారు. గరికపాటి ప్రసంగాలంటే తనకు ఇష్టమని, ఆసక్తిగా వింటానని చెప్పారు.ఒకరోజు తమ ఇంటికి భోజనానికి రావాలని గరికపాటిని చిరంజీవి ఆహ్వానించారు.
చదవండి: ఉత్సాహంగా అలయ్ బలయ్.. డప్పు కొట్టిన చిరంజీవి
Comments
Please login to add a commentAdd a comment