ప్రభాస్ 'కల్కి' సినిమా వచ్చి నాలుగు నెలలైపోయింది. రిలీజ్ టైంలోనే అర్జునుడు, కర్ణుడు పాత్రలు వాటి మధ్య సన్నివేశాల గురించి చర్చోపచర్చలు నడిచాయి. అర్జునుడు గొప్ప అని కొందరు లేదులేదు కర్ణుడే గొప్ప అని మరికొందరు వాదించుకున్నారు. అదంతా ముగిసిపోయి చాలా కాలామైపోయింది. సరిగ్గా ఇలాంటి టైంలో ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు 'కల్కి' సినిమాపై విమర్శలు చేశారు.
గరికపాటి ఏమన్నారు?
తాజాగా వినాయక చవితి సందర్భంగా గరికపాటి ప్రవచనాలు చెప్పారు. మాటల సందర్భంగా 'కల్కి' గురించి ప్రస్తవన వచ్చేసరికి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మహాభారతంలో ఉన్నది వేరు సినిమాలో చూపించింది వేరు అని చెప్పారు. అశ్వద్ధామ, కర్ణుడిని హీరోలుగా చూపించడమేంటో తనకు అస్సలు అర్థం కాలేదని కౌంటర్లు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)
వీడియోలో ఏముంది?
'కర్ణుడు ఎవరో తెలియకపోతే 'కల్కి' సినిమాలో చూపించినవాడే కర్ణుడు. మనేం చేస్తాం. సినిమావోళ్లు ఏం చూపిస్తే అది. మొత్తం భారతంలో ఉన్నది వేరు అందులో చూపించింది వేరు. అశ్వద్ధామ, కర్ణుడు అర్జెంట్‌గా హీరోలైపోయారు. భీముడు, కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు. ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లేదు. బుర్రపాడైపోతుంది. పైగా మహాభారతమంతా చదివితే అర్థమవుతుంది. కర్ణుడినే అశ్వద్ధామ కాపాడాడు. అశ్వద్ధామని కర్ణుడు ఎప్పుడూ ఒక్కసారి కూడా కాపాడలేదు. ఆ అవసరం లేదు. అశ్వద్ధామ మహావీరుడు. ఇక్కడేమో 'ఆచార్య పుత్ర ఆలస్యమైంది' అని డైలాగ్ పెట్టారు. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు. మనకి ఏది కావాలంటే అది పెట్టేయడమే. ఓ వెయ్యి రూపాయలు ఎక్కువిస్తే డైలాగ్ రాసేవాడు రాసేస్తాడు కదా' అని గరికపాటి అన్నారు.
'కల్కి' మూవీ గురించి
జూన్ 27న థియేటర్లలో రిలీజైన 'కల్కి'.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీనికి కొనసాగింపుగా తీస్తున్న రెండో భాగం షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీనికి 'కర్ణ 3102 బీసీ' అనే టైటిల్ కూడా నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది.
(ఇదీ చదవండి: వాళ్లకు ఇచ్చారు.. మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు: ఎన్టీఆర్ ఫ్యాన్స్)
తనకు నచ్చని రాజకీయ పార్టీలపై, సినిమా హీరోలపై విమర్శలు చేసే గరికిపాటి నరసింహారావు.. తాజాగా కల్కిపై విమర్శలు pic.twitter.com/vThPZ5s4Nn
— greatandhra (@greatandhranews) September 23, 2024
Comments
Please login to add a commentAdd a comment