అట్టహాసంగా జరగాల్సిన ఎన్టీఆర్ 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఊహించని రీతిలో రద్దయింది. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‍లో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. కానీ అనుకున్న దానికంటే జనం ఎక్కువగా రావడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు అయితే తారక్ అభిమానులపై లాఠీ ఛార్జ్ కూడా చేశారు. ఈ క్రమంలోనే క్షమాపణలు చెబుతూ ఎన్టీఆర్ వీడియో పోస్ట్ చేశాడు. మరోవైపు అభిమానులు.. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
''దేవర' ఈవెంట్ విషయంలో ప్రభుత్వం ఫెయిలైంది. మహేశ్ బాబు 'భరత్ అనే నేను' కోసం ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అలానే ప్రభాస్ 'కల్కి'కి ఔట్ డోర్ పర్మిషన్ ఇచ్చారు. కానీ మా 'దేవర'కు ఎందుకు ఇవ్వలేదు. ఈ విషయంలో ప్రభుత్వం, పోలీసులు, నిర్వహకులు ఫెయిలయ్యారు. మేం అనంతపుర్ నుంచి పొద్దున 5 గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడేమో ఈవెంట్ క్యాన్సిల్ అయింది' అని అభిమానులు తమ ఆగ్రహాన్ని బయటపెట్టారు.
(ఇదీ చదవండి: మీకంటే నేనెక్కువగా బాధపడుతున్నాను: ఎన్టీఆర్)
అభిమానుల కోపాన్ని పక్కనబెడితే అసలు ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇండోర్ ఫంక్షన్ హాల్‌లో చేయాలనే ఆలోచన ఎవరదనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే దాదాపు తారక్ సోలో మూవీతో వచ్చి దాదాపు ఆరేళ్లు అయిపోయింది. అలాంటిది ఈవెంట్ అంటే కచ్చితంగా ఫ్యాన్స్ ఎగబడతారు. ఇప్పుడు 'దేవర' విషయంలో అదే జరిగింది. 5 వేల కెపాసిటీ ఉన్న హాల్‌లోకి ఏకంగా 20, 30 వేల మంది వచ్చారు. దీంతో వీళ్లని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ వల్ల కాలేదు. దీంతో క్యాన్సిల్ చేయించారు.
అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిరుధ్ లైవ్ ఫెర్ఫార్మెన్స్ ప్లాన్ చేశాడని, కానీ రద్దవడం వల్ల దాన్ని చూసే అవకాశం ఫ్యాన్స్ మిస్ అయిపోయారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. అది ముందు పెట్టుకుని వేరే చోట ఈవెంట్ ఏమైనా ప్లాన్ చేస్తారా? లేదా అనేది చూడాలి.
(ఇదీ చదవండి: Devara Pre Release Event: 'దేవర' అభిమానులపై పోలీసుల లాఠీ ఛార్జ్)
6 సంవత్సరాల తరువాత NTR సినిమా దేవర ఫంక్షన్ జరిగితే ఔట్ డోర్ పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు
ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటూ NTR అభిమానుల ఆగ్రహం https://t.co/6icJJ0yTQZ pic.twitter.com/M2WFeGHpol— Telugu Scribe (@TeluguScribe) September 22, 2024
Comments
Please login to add a commentAdd a comment