జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం దేవర. సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమంలో దేవర ఫ్యాన్స్ మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. నేడు సెప్టెంబర్ 22న హైదరాబాద్ హైటెక్స్‌లోని నోవాటెల్‌లో దేవర ప్రీరిలీజ్ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. అయితే, అక్కడ కేవలం 5వేల మందికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. కానీ, సుమారు 15 వేలకు మంది పైగానే అభిమానులు చొచ్చుకుని వచ్చారు.
ఇదీ చదవండి: 'దేవర' రెండో ట్రైలర్ విడుదల
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని ముందే అంచనా వేశారు. అందువల్ల ఎలాంటి ప్రచారం లేకుండా కేవలం తారక్ అభిమానుల కోసం 5వేలు పాస్‌లు మాత్రమే జారీ చేశారు. కానీ, ప్రీరిలీజ్ కార్యక్రమం ప్రారంభానికి గంట ముందు నుంచే సుమారు 15వేలకు పైగానే ఫ్యాన్స్ వచ్చారు. వారందరూ ఒక్కసారిగా హైదరాబాద్ హైటెక్స్ నోవాటెల్ లోపలికి రావడంతో అక్కడి ఫర్నీచర్ కూడా ధ్వంసం అయింది.
ఇదీ చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో మెగాస్టార్ చిరంజీవికి చోటు
నోవాటెల్ యాజమాన్యానికి సుమారుగా రూ. 11 లక్షల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈవెంట్ పాస్‌లు లేని వారు కూడా భారీ సంఖ్యలో లోపలికి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేయడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే దేవర అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.
Police boss warning ichhi vellaru ippatlo start ayyela ledu #Devara@tarak9999#Devaraprereleaseevent pic.twitter.com/oFqC2Wi5na
— మాచర్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ (పల్నాడు జిల్లా) (@ntrkaadda) September 22, 2024
To any other hero this is a night mare.
But, for #ManOfMassesNTR this is sample.
దీన్ని మించిన ప్రీరిలీజ్ ఈవెంట్ గాథరింగ్ ఉంటే లైఫ్ టైం సెటిల్మెంట్ #దేవర #Devara #DevaraJatharaaBegins pic.twitter.com/HoKgGaB2om— B1_Viking (@B1Viking) September 22, 2024
Comments
Please login to add a commentAdd a comment