
గరికిపాటిని సన్మానిస్తున్న దృశ్యం
రేగిడి విజయనగరం : జగత్ అంటే ప్రకృతి అని ప్రకృతినే ప్రత్యేక గురువుగా భావించి ఉన్నత ఆశయంతో జీవిం చాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచన కర్త, మహాసహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు అభిభాషించారు. రేగిడి దత్తపీఠంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక దివ్యసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. గురువులు వేరేగా ఉండరని, ఎవరికి వారే గురువుగా భావించుకోవాలన్నారు.
దేశానికి, సమాజానికి నష్టం కలి గించే అలవాట్లకు నేటి యువత దూరంగా ఉం డాలని సూచించారు. జీవితం నిరంతర ప్రవా హంలాంటిదని, కష్టసుఖాలను సమానంగా తీసుకొని అభివృద్ధి వైపు అడుగులు వేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవ్వాలని పోటీపడకుండా సత్యం, ధర్మం, నిజాయితీని నేర్పాలన్నారు. పిల్లలపై అతిప్రేమ పనికిరాదన్నారు. మాయమాటల్లో మంచి ఆకర్షణ శక్తి ఉంటుందని, అటువంటి మా టలను గుర్తించి అజ్ఞానంలో దిగకుండా చూడాలన్నారు. ప్రపంచంలో హిందూ సంప్రదాయం గొప్పదన్నారు. మారుమూల ప్రాంతమైన రేగిడి ఆమదాలవలసలో ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రం ఉండడం భక్తులు చేసుకున్న పుణ్యమన్నారు.
నరసింహరావుకు ఘన సన్మానం....
గరికిపాటికి దత్తపీఠంలో అరుదైన గౌరవం దక్కింది. దత్తపీఠం వ్యవస్థాపకులు కిమిడి సత్యనారాయణనాయుడు, వైస్ ఎంపీపీ కిమిడి రామకృష్ణంనాయుడులు గరికిపాటికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సత్యనారాయణనాయుడు మాట్లాడుతూ మొదట్లో చిన్న దత్తపీఠాన్ని నిర్మాణం చేశామని, కాలక్రమేణా విస్తరించామన్నారు. ఈ కేంద్రం ఆధ్యాత్మిక పాఠశాలగా విస్తరిస్తుందన్నారు. ఆధ్యాత్మిక వక్త రుంకు శ్రీనివాసరావు మాస్టారు, కందుల ఆదినారాయణ, బెవర వెంకటలక్ష్మీరాంబాబు, వై.హేమసుందరరావు, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు, పలు ఆధ్యాత్మిక పీఠాలకు సంబంధించిన గురువులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment