మెగాస్టార్ చిరంజీవిపై గరికపాటి నరసింహారావు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంతటి దుమారానికి తెరదీసిందో తెలిసిందే! చిరు ఫొటో సెషన్ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతానని గరికపాటి అసహనం వ్యక్తం చేయడంపై మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. తాజాగా ఈ వివాదంపై హీరో మంచు విష్ణు స్పందించాడు.
'అక్కడ ఏం జరిగిందో నాకు కరెక్ట్‌గా తెలీదు. గరికపాటిగారు ఏదో మాట్లాడారు.. చిరంజీవి ఫ్యాన్స్.. అదీ ఇదీ అని! పూర్తి సబ్జెక్ట్ నాకు తెలియదు. కానీ చిరంజీవిగారు ఒక లెజెండ్. ఆయనతో ఫొటో తీసుకోవడమనేది అభిమానులకు సువర్ణావకాశం. ఆయన దగ్గరకు ఎవరైనా సరే పరుగెత్తుకు వెళ్లి ఫొటో తీసుకుంటారు. ఆ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని ఎవరూ ఆపలేరు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ అలాంటి పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎక్సైట్‌మెంట్‌లో ఉంటారు' అన్నాడు మంచు విష్ణు.
చదవండి: బిగ్‌బాస్ ఎలిమినేషన్, ఆ కంటెస్టెంట్ గుడ్‌బై
కాంతార రెండుసార్లు చూశా: ప్రభాస్
Comments
Please login to add a commentAdd a comment