
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు మధ్య చోటు చేసుకున్న సంఘటన పెద్ద దుమారమే రేపింది. చిరంజీవిని ఉద్దేశించి గరికపాటి చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. దీంతో గరికపాటి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. తాజాగా ఈ వివాదంపై సంచలన దర్శకుడు స్పందించాడు.
గరికపాటి తీరుని తప్పుబడుతూ వరుస ట్వీట్స్ చేశాడు. అందులో ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గరికపాటి గతంలో అనుష్క అందం గురించి పొగుడుతున్న వీడియో క్లిప్పుని ఆర్టీజీవి ట్విటర్‌లో షేర్ చేస్తూ ‘మీరు కూడానా బాహు(గరిక)బలి(పాటి)గారు!’అని క్యాప్షన్ ఇచ్చాడు.
(చదవండి: రిలీజ్‌కు ముందే ఖరీదైన బహుమతి.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? డైరెక్టర్ ట్వీట్ వైరల్)
ఆ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ.. ‘హీరోయిన్లని కుర్రాళ్ళు తెగ చూస్తూ ఉంటారు. ఇందులో ఏముంది అని అనుకునేవాడిని. కానీ నా చూపు కూడా ఒక చోట ఆగింది. అది ఎవరంటే మహానటి అనుష్క. అలా నిలబడి ఉంది.. ఒక మంచి పోజ్. మనం కవి కదా.. ఊరికే ఎలా ఉండగలం.. చూశా పై నుంచి కిందకు. ఒక రోజు పేపర్ చదువుతుంటే ముందు రాజకీయాలు చూస్తున్నా.. డిగ్రీ చదివే మా అబ్బాయి .. నా కాళ్ల దగ్గర కూర్చున్నాడు. నేను అనుకున్నాను.. స్నానం చేసొచ్చి నా కాళ్లకు దండం పెడుతున్నాడు అని, కానీ వాడు అక్కడ కూర్చొని పేపర్‌లోని అనుష్క ఫోటోని చూస్తున్నాడు. వాడి ధోరణిలో వాడున్నాడు.. నా ధోరణిలో నేనున్నాను. దానికేముంది ఎవడికి కావాల్సింది వాడు చూసుకుంటున్నాడు. ఏంట్రా అని అడిగితే టక్కుమని లేచి వెళ్లిపోయాడు. ఏంటా అని నేను చూశాను.. ఆ ఫోటో చూసేసరికి వాడు ఈ అమ్మాయిని చూడడంలో తప్పేమి లేదనిపించింది. నన్నే ఆకర్షిస్తుంటే.. వాడిని ఆకర్షించదా? ’అని గరికపాటి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
OHO !!! MEEKU KOODAANAAA BAHU(GARIKA)BALI(PATI) GAARU ! 😜 pic.twitter.com/00rLB4oVj7
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2022
Comments
Please login to add a commentAdd a comment