Nagababu Reaction On Garikapati Narasimha Rao Comments On Megastar - Sakshi
Sakshi News home page

Nagababu: ఆయన ఇమేజ్ చూస్తే ఎవరికైనా అంతే: నాగబాబు

Published Thu, Oct 6 2022 6:58 PM | Last Updated on Thu, Oct 6 2022 7:22 PM

Nagababu Reaction On Garikapati Narasimha Rao Comments On Megastar - Sakshi

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై వ్యాఖ్యలపై నాగబాబు వ్యంగ్యంగా స్పందించారు. 'ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి  అసూయ పడటం పరిపాటే' అంటూ ఆయన ట్వీట్ చేశారు. దసరా పండుగ నేపథ్యంలో హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ  ఏర్పాటు చేసిన అలయ్‌ బలయ్‌ వేడుకలో జరిగిన సంఘటనపై ఆయన ఈ విధంగా కౌంటరిచ్చినట్లు తెలుస్తోంది.

(చదవండి: గరికపాటికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి)

అసలేం జరిగిందంటే: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన అలయ్‌ బలయ్‌ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో అభిమానులు చిరంజీవితో ఫోటో సెషన్‌ నిర్వహించారు. మెగాస్టార్‌తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement