
అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేసిన విషయం తెలిసిందే! ఆ కార్యక్రమంలో చిరంజీవితో ఫొటోలు దిగేందుకు మహిళలు ఆసక్తి చూపగా అక్కడే ఉన్న గరికపాటి నరసింహరావు.. వెంటనే ఫొటో సెషన్ ఆపేసి చిరంజీవి వచ్చి కూర్చోవాలి లేకుంటే నేను వెళ్లిపోతా అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత ఆ వ్యవహారం ఎంత దూరం వెళ్లిందో అంతా చూశారు.
గరికపాటి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఇప్పటివరకు దీనిపై పెద్దగా రియాక్ట్ కాని చిరంజీవి తాజాగా గరికపాటిపై పరోక్షంగా సెటైర్ వేశారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. అయితే కార్యక్రమంలోనూ చిరంజీవితో ఫొటోలు దిగేందుకు కొందరు మహిళలు వేదిక మీదకు రాగా.. వెంటనే చిరు.. ''ఇక్కడ వారు లేరు కదా?'' అంటూ సెటైరికల్‌గా ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.
'వారు ఇక్కడ లేరు' అంటూ పక్కనవాళ్లు సమాధానమివ్వగా హమ్మయ్యా.. అంటూ గుండెల మీద చేయి పెట్టుకుని రిలాక్స్ అయినట్టు చిరంజీవి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. దీంతో చిరు సైలెంట్‌గానే బలే సెటైర్ వేశారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment