Oscars 2023: 'RRR' star Ram Charan tweet on Co-Star Jr NTR Goes Viral - Sakshi
Sakshi News home page

Ram Charan:రామ్ చరణ్ ట్వీట్.. మనసులో మాట చెప్పేసిన చెర్రీ!

Published Mon, Mar 13 2023 3:08 PM | Last Updated on Mon, Mar 13 2023 3:33 PM

Ram Charan Tweet On RRR Oscar Win about Co star Jr NTR Goes Viral - Sakshi

ప్రపంచ వేదికపై ఆర్ఆర్ఆర్ పేరు మార్మోగిపోతోంది. తెలుగువారి పేరును ప్రపంచానికి పరిచయం చేశారు రాజమౌళి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ రావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్  చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా భారత సినీ చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తుందని  లేఖలో పేర్కొన్నారు. ఈ సినిమాలో అవకాశమిచ్చిన రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ ఓ లెటర్‌ను తన ట్వీట్‌లో పంచుకున్నారు. 

అయితే అందులో రామ్ చరణ్ రాసిన ఓ లైన్ అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ఎందుకంటే అందులో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన కో- స్టార్, బ్రదర్ తారక్‌ నీకు ధన్యవాదాలు.. నీతో మరోసారి డ్యాన్స్ చేసి మళ్లీ రికార్డులు సృష్టించాలనుకుంటున్నా' అంటూ నోట్‌లో రాశారు. దీంతో ఆర్ఆర్ఆర్-2లో మరో నాటు నాటు పక్కా అని అభిమానులు భావిస్తున్నారు. మరోసారి ఎన్టీఆర్‌- చెర్రీ స్క్రీన్‌పై డ్యాన్స్‌తో అదరగొట్టడం కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే  ఆర్ఆర్ఆర్-2 ఉంటుందని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే.  దీంతో టాలీవుడ్ అభిమానులు మరోసారి చరణ్- ఎన్టీఆర్ కాంబినేషన్ రిపీట్ కాబోతోందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి, మహేశ్ బాబుతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్- 2 పట్టాలెక్కుతుందేమో వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement