oscar award winner
-
ఆస్కార్ వేదికపై అణు బాంబు మోత
అణు బాంబు సౌండ్ అదిరింది.. క్రిస్టోఫర్ కల నిజమైంది... ‘ఆర్ఆర్ఆర్’ నాటు నాటు ఆకర్షణగా నిలిచింది. ఫేక్ చప్పట్లతో మెస్సీ (శునకం), ఆమిర్ ఖాన్ ‘పీకే’ తరహాలో జాన్ ప్రత్యక్షం కావడం చర్చలకు దారి తీసింది.ఇలా ఆనందాలు, వింతలు, విడ్డూరాలతో ఆస్కార్ అవార్డు వేడుక జరిగింది. ఆ విశేషాలు తెలుసుకుందాం. విజేతల వివరాలు: • ఉత్తమ చిత్రం: (ఆపెన్ హైమర్) • దర్శకుడు : క్రిస్టోఫర్ నోలన్ (ఆపెన్ హైమర్) • నటుడు: సిలియన్ మర్ఫీ (ఆపెన్ హైమర్) • నటి: ఎమ్మాస్టోన్ (పూర్ థింగ్స్) • సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఆపెన్ హైమర్) • సహాయ నటి: డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్) • సినిమాటోగ్రఫీ: ఆపెన్ హైమర్ • డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియోపోల్ • హెయిర్ స్టయిల్ అండ్ మేకప్: నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్) • అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫర్‌పన్ (అమెరికన్ ఫిక్షన్ ) • ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్) • యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హిరాన్ • కాస్ట్యూమ్ డిజైన్ : హోలి వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్) • ప్రోడక్షన్ డిజైన్ : జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్) • ఇంటర్నేషనల్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ • ఎడిటింగ్: జెన్నిఫర్ లేమ్ (ఆపెన్ హైమర్) • విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్ • డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్): ది లాస్ట్ రిపేర్ షాప్ • ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఆపెన్ హైమర్ • సౌండ్ : ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ • ఒరిజినల్ సాంగ్: వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ) • లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్. రాబర్ట్ జూనియర్, డేవైన్ జో రాండాల్ఫ్, ఎమ్మా స్టోన్, సిలియన్ మర్ఫీ ప్రముఖ భౌతిక శాస్త్ర నిపుణుడు, అణుబాంబు సృష్టికర్తగా పేరుగాంచిన జె. రాబర్ట్ ఆపెన్‌హైమర్ జీవితంతో రూపొందిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ఆపెన్‌హైమర్’ మోత ఆస్కార్ వేదికపై బాగా వినిపించింది. దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్‌తో ఆస్కార్ అవార్డును ముద్దాడేలా చేసింది. మార్చి 10న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగిన 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆపెన్‌హైమర్’ చిత్రం ఏడు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టి విజయఢంకా మోగించింది. మొత్తం పదమూడు నామినేషన్లు దక్కించుకున్న ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంతో పాటు దర్శకుడు, నటుడు, సహాయనటుడు, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో అవార్డు దక్కింది. అలాగే పదకొండు నామినేషన్లు దక్కించుకున్న ‘పూర్ థింగ్స్’ సినిమాకు నాలుగు విభాగాల్లో, హిస్టారికల్ డ్రామా ‘జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాకు రెండు విభాగాల్లో అవార్డులు దక్కాయి. ‘ఆపెన్‌హైమర్’కు పోటీగా నిలుస్తుందనుకున్న ‘బార్బీ’ సినిమాకు 8 నామినేషన్లు దక్కినా, ఒక్క అవార్డు (బెస్ట్ ఒరిజినల్ సాంగ్)తో సరిపెట్టుకుంది, పది నామినేషన్లు దక్కించుకున్న ‘కిల్లర్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్’ సినిమాకి ఒక్క అవార్డు కూడా దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా నిలిచిన సిలియన్ మర్ఫీ, ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్, ఉత్తమ సహాయ నటి రాండాల్ఫ్ తొలిసారి ఆస్కార్‌ని ముద్దాడారు. గతంలో ‘లా లా ల్యాండ్’కి ఉత్తమ నటిగా ఆస్కార్ అందు కున్న ఎమ్మా స్టోన్ ఇప్పుడు ఇదే విభాగానికి అవార్డుని అందుకున్నారు. భారత సంతతికి చెందిన నిషా తెరకెక్కించిన ‘టు కిల్ ఎ టైగర్’ డాక్యుమెంటరీ ఆస్కార్ సాధించలేకపోయింది. ఇక అవార్డు విజేతల జాబితా ఈ విధంగా... స్వీట్ సర్ప్రైజ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. 96వ అవార్డ్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ విజువల్స్ కనిపించాయి. వరల్డ్ గ్రేటెస్ట్ స్టంట్ సీక్వెన్స్ అంటూ ఆస్కార్ వేదికపై ప్రదర్శించిన విజువల్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’లోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌లు రెండుసార్లు కనిపించాయి. ‘టైటానిక్’, ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘చార్లీ చాప్లిన్’, ‘బస్టర్ కీటన్’ వంటి హాలీవుడ్ క్లాసిక్ చిత్రాల యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ‘ఆర్ఆర్ఆర్’లోని యాక్షన్ విజువల్స్ ప్లే కావడం విశేషం. అలాగే ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ‘వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?’ను విజేతగా ప్రకటించే ముందు ప్లే చేసిన కొన్ని సాంగ్స్ విజువల్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట కనిపించింది. ఈ సందర్భంగా.. ‘‘వరల్డ్ స్టంట్ సీక్వెన్స్‌లకు నివాళిగా ప్లే చేసిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో ‘ఆర్ఆర్ఆర్’ స్టంట్ సీక్వెన్స్‌లు ఉండటం స్వీట్ సర్ప్రైజ్లా ఉంది’’ అని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ స్పందించింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను నిర్మించారు. నా కళ్లు చెబుతున్నాయి... – అల్ పచినో మామూలుగా విజేతలను ప్రకటించే ముందు పోటీలో ఉన్నవారి పేర్లు చెప్పి, చివరిగా విజేత పేరు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రముఖ నటుడు 83 ఏళ్ల అల్ పచినో ఈ విధానాన్ని అనుసరించలేదు. ఈ ‘గాడ్ ఫాదర్’ మూవీ ఫేమ్ ఉత్తమ చిత్రాన్ని ప్రకటించడానికి వేదికపైకి వచ్చారు. ఈ విభాగంలో పది చిత్రాలు పోటీ పడ్డాయి. ఈ చిత్రాల పేర్లు చెప్పకుండా.. ‘ఇదిగో..’ అంటూ మెల్లిగా ఎన్వలప్ కవర్ని ఓపెన్ చేస్తూ.. నా కళ్లు చెబుతున్నాయి టైప్‌లో నా కళ్లకు ‘ఆపెన్‌హైమర్’ కనబడుతోంది అనగానే వీక్షకుల నుంచి కరతాళ ధ్వనులు వినిపించాయి. అయితే అల్ పచినో ఈ విధంగా ప్రకటించడంతో.. అవార్డు ఈ సినిమాకే వచ్చిందా? అనే సందేహంలో కొందరు ఉండిపోయారు. అంతలోనే ‘అవును.. అవును..’ అన్నారు. అయితే అల్ పచినో ఇలా ప్రకటించడం పట్ల పలువురు విమర్శించారు. ఆస్కార్ అవార్డుల జాబితాలో ప్రధానమైన విభాగంలో పోటీ పడిన చిత్రాల పేర్లు చెప్పకుండా, పైగా వేడుకలో చివరి అవార్డు కాబట్టి కాస్తయినా సస్పెన్స్ మెయిన్టైన్ చేయకుండా చెప్పడం బాగాలేదని అంటున్నారు. ఇలా సాదా సీదా ప్రకటనతో ఆస్కార్ అవార్డు వేడుక ముగిసింది. నోలన్ కల నెరవేరెగా... ఫిల్మ్ మేకర్ క్రిస్టోఫర్ నోలన్ ఆస్కార్ చరిత్ర కాస్త ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఎందుకంటే నోలన్ తీసిన సినిమాలు ఆస్కార్ అవార్డుల కోసం 49 నామినేషన్లు దక్కించుకుని, 18 అవార్డులను సాధించాయి. కానీ క్రిస్టోఫర్ నోలన్‌కు మాత్రం 95వ ఆస్కార్ అవార్డుల వరకూ ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా రాలేదు. తొలిసారి 2002లో ‘మెమెంటో’ సినిమాకు గాను బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో 74వ ఆస్కార్ అవార్డ్స్‌లో నామినేషన్ దక్కించుకున్నారు నోలన్... నిరాశే ఎదురైంది. ఆ తర్వాత 83వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘ఇన్సెప్షన్’ సినిమాకు బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో నామినేషన్లు దక్కినా అవార్డులు రాలేదు. 90వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్ విభాగాల్లో నోలన్ ‘డంకిర్క్’ సినిమాకు నామినేషన్లు దక్కినా ఆస్కార్ అవార్డు దక్కలేదు. చివరికి నోలన్ కల ‘ఆపెన్‌హైమర్’తో నెరవేరింది. ఈ ప్రయాణంలో నేనూ భాగం అని... – క్రిస్టోఫర్ నోలన్ ఆస్కార్ వేదికపై క్రిస్టోఫర్ నోలన్ మాట్లాడుతూ – ‘‘మా సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మాట్లతో పాటు యూనిట్ అందరికీ ధన్యవాదాలు. ఇక మా కుటుంబాన్ని, ఈ సినిమాను నిర్మించిన మా నిర్మాత ఎమ్మా థామస్‌తో (భార్య ఎమ్మా పేరును ప్రస్తావించగానే ఒక్కసారిగా నవ్వులు) పాటు నా సోదరుడికి థ్యాంక్స్ చె΄్పాలి. మా సినిమాలో సత్తా ఉందని నమ్మి, డిస్ట్రిబ్యూట్ చేసిన యూనీవర్సల్ స్టూడియోస్‌కు ధన్యవాదాలు. సినిమా చరిత్ర వందేళ్లకు చేరువ అవుతోంది. ఈ అద్భుతమైన ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. కానీ ఈ ప్రయాణం తాలూకు సినిమాల్లో నేను కూడా ఓ అర్థవంతమైన భాగం అని భావించి, నన్ను గుర్తించిన ఆస్కార్ కమిటీకి ధన్యవాదాలు’’ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.... భార్యాభర్త నోలన్, ఎమ్మా దర్శక–నిర్మాతలుగా ఒకేసారి ఆస్కార్ అవార్డులు సాధించారు. అణుబాంబు విస్ఫోటనం నేపథ్యంలోని ‘ఆపెన్‌హైమర్’లో నటించి, అవార్డు దక్కించుకున్న మర్ఫీ తన అవార్డును ప్రపంచ శాంతి ఆకాంక్షించేవారికి అంకితమిస్తున్నట్లుగా పేర్కొన్నారు. జీవితంలో తనకు ఎంతో అండగా నిలిచిన తన భార్య సుసాన్ డౌన్‌కి అవార్డుని అంకితం ఇస్తున్నట్లుగా ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ తెలిపారు. ‘‘నేను నా జీవితంలో మరోలా (స్లిమ్‌గా) ఉండాలనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే... నేను నాలానే ఉండాలి’’ అంటూ ఎమోషనల్ అయ్యారు రాండాల్ఫ్ నేనీ సినిమా చేసి ఉండాల్సింది కాదు – ఎమ్ చెర్నోవ్ ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ‘20 డేస్ ఇన్ మరియోపోల్’ చిత్రం ఆస్కార్ అవార్డును సాధించింది. ఈ అవార్డు యాక్సెప్టెన్సీ స్పీచ్‌లో చిత్రదర్శకుడు ఎమ్ చెర్నోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉక్రెయిన్ చరిత్రలో ఇది తొలి ఆస్కార్ అవార్డు. ఇందుకు గౌరవంగా భావిస్తున్నాను. అయితే ఈ సినిమాను నేను చేసి ఉండకూడదని అనుకుంటున్నాను. బహుశా ఈ వేదికపై ఇలా మాట్లాడుతున్న తొలి దర్శకుడిని నేనేమో. మా ఉక్రెయిన్‌పై దాడులు చేయకుండా, మా నగరాలను ఆక్రమించకుండా ఉండేందుకు బదులుగా రష్యావారికి ఈ అవార్డు ఇస్తాను. నేను చరిత్రను, గతాన్ని మార్చలేను. కానీ కొందరు ప్రతిభావంతులతో కలిసి ఓ కొత్త రికార్డును సృష్టించగలం. అప్పుడు నిజం గెలుస్తుంది. జీవితాలను త్యాగం చేసిన మరియోపోల్ ప్రజలు గుర్తుండిపోతారు. సినిమా జ్ఞాపకాలను ఏర్పరుస్తుంది. జ్ఞాపకాలు చరిత్రను నెలకొల్పుతాయి’’ అంటూ భావోద్వేగంతో మాట్లాడారు చెర్నోవ్. ఆమిర్ ‘పీకే’ని తలపించేలా జాన్ సెనా ఆస్కార్ అవార్డు వేడుకలో జరిగిన ఓ ఘటన ఆమిర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాని గుర్తు చేసింది. ఈ చిత్రంలో ఆమిర్ ఓ సీన్లో తన శరీరానికి ముందు భాగంలో ఓ రేడియో అడ్డుపెట్టుకుని అర్ధనగ్నంగా నటించారు. ఆస్కార్ వేదికపై ఇలాంటి సీనే రిపీట్ అయింది. స్టార్ రెజ్లర్ (డబ్ల్యూడబ్ల్యూఈ) జాన్ సెనా అర్ధనగ్నంగా ప్రత్యక్షమై షాక్ ఇచ్చారు. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డును ప్రకటించేందుకు జాన్ సెనా ఇలా అర్ధనగ్నంగా రావడం చర్చనీయాంశంగా మారింది. తన శరీరానికి ముందు భాగంలో విజేత వివరాలు ఉండే ఎన్వలప్ కవర్‌ను మాత్రమే అడ్డుపెట్టుకొని వేదికపైకి రావడంతో సభికులందరూ తెగ నవ్వుకున్నారు. అయితే తాను ఇలా రావడానికి కారణం ఉందన్నారు జాన్ సెనా. ‘పురుషుడి శరీరం కూడా జోక్ కాదని, అలానే కాస్ట్యూమ్స్ అనేవి ముఖ్యం అని తెలియజెప్పేందుకే ఇలా వచ్చా’ అన్నారు సెనా. అనంతరం ‘పూర్ థింగ్స్’ సినిమాకి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో అవార్డును ప్రకటించారు. 1974 సీన్ రిపీట్ దాదాపు 50 ఏళ్ల క్రితం (1974) జరిగిన ఆస్కార్ వేడుకల్లో నటి ఎలిజబెత్ టేలర్‌ను పరిచయం చేస్తుండగా ఓ వ్యక్తి నగ్నంగా వేదికపైకి దూసుకు రావడం అప్పట్లో సంచలనమైంది. తాజాగా జాన్ సెనా ప్రవర్తనతో నాటి ఘటనను కొందరు గుర్తుకు తెచ్చుకున్నారు. ఫేక్ క్లాప్‌తో శునకానందం ఆస్కార్ వేడుకలో ఈ ఏడాది ఓ శునకం అందరి దృష్టినీ ఆకర్షించింది. సభికులతో పాటు క్లాప్స్ కొట్టిన ఈ శునకం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆస్కార్ కోసం పలు విభాగాల్లో పోటీ పడిన సినిమాల్లో ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ ఒకటి. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఈ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన మెస్సీ (శునకం)ని అవార్డు వేడుకకు తీసుకొచ్చింది యూనిట్. ‘ఆపెన్ హైమర్’కి రాబర్డ్ డౌనీ జూనియర్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకుంటున్నప్పుడు అందరితో పాటు మెస్సీ చప్పట్లు కొట్టడం ఆకర్షణగా నిలిచింది. అయితే ఆ శునకం కూర్చున్న కుర్చీ కింద ఓ వ్యక్తి ఉండి, ఫేక్ చేతులతో క్లాప్ కొట్టాడు. అవి శునకం కాలిని పోలి ఉండటంతో మెస్సీయే చప్పట్లు కొట్టిందని భావించారంతా. -
'అవన్నీ ఫేక్ అవార్డ్స్'.. ఆస్కార్ వేళ హీరోయిన్ సంచలన కామెంట్స్!
ఆస్కార్ అవార్డ్ విన్నర్‌పై బాలీవుడ్ భామ యామీ గౌతమ్ ప్రశంసలు కురిపించింది. తాజాగా 96వ అకాడమీ అవార్డ్ వేడుకల్లో క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ హవా అవార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రానికి బెస్ట్ యాక్టర్ విభాగంలో అవార్డ్ దక్కింది. ఓపెన్ హైమర్ హీరో సిలియన్ మర్ఫీ అవార్డ్‌ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా అతనికి అభినందనలు తెలిపింది యామీ గౌతమ్. అయితే ఊహించని విధంగా ఇండియా ఫిల్మ్ అవార్డులపై తన అక్కసును ప్రదర్శించింది. ఇండియా ఫిల్మ్ అవార్డులు నకిలీవంటూ యామీ గౌతమ్ విమర్శించింది. ఈ మేరకు తన ట్విటర్లో రాసుకొచ్చింది. అందుకే గత కొన్నేళ్లుగా ఇండియాలో జరిగే అవార్డు షోలకు తాను హాజరు కావడం లేదని తెలిపింది. అలాంటి ఫేక్ అవార్డులపై తనకు నమ్మకం లేదని వెల్లడించింది. కానీ ఈ రోజు ఒక అసాధారణ నటుడిని చూస్తుంటే తనకు సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ దక్కించుకున్న మీ ప్రతిభ అన్నింటికంటే అత్యుత్తమంగా నిలుస్తుందని ట్విటర్లో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా యామీకి 2022లో ప్రముఖ అవార్డ్ తనకు దక్కలేదన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. అయితే ఇది చూసిన అభిమానులు భిన్నంగా కామెంట్స్ పెడుతున్నారు. కొందరు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కాగా.. యామీ గౌతమ్ ప్రస్తుతం ఆర్టికల్ 370 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో నటనకు గానూ ఆమెకు ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రంలో యామితో పాటు ప్రియమణి, అరుణ్ గోవిల్ కూడా నటించారు. Having no belief in any of the current fake “filmy” awards, since the last few years, I stopped attending them but today i am feeling really happy for an extraordinary actor who stands for patience, resilience & so many more emotions. Watching him being honoured on the biggest… — Yami Gautam Dhar (@yamigautam) March 11, 2024 -
అంగరంగ వైభవంగా ఆస్కార్స్-2024 వేడుక.. ఈ ఫొటోలు చూశారా?
-
ఆస్కార్ ఇవ్వాల్సింది 'ఆర్ఆర్ఆర్' కు కాదు.. ఆయనకే: ఆర్జీవీ ట్వీట్ వైరల్
టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందరికంటే భిన్నమైన ఆలోచనలతో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టట్‌లో ఉంటున్నారు. తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏంటో ఓ లుక్కేద్దాం. ( ఇది చదవండి: ఎంతో కష్టపడ్డా.. అయినా బాహుబలితో అంత గుర్తింపు రాలేదు) ఇటీవల ఏపీలోని రాయలసీమలో టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే రాయలసీమలో పాదయాత్ర ముగియడంతో నేలకు నమస్కరించిన ఫోటోను లోకేశ్ తన ట్విటర్లో షేర్ చేశారు. దీనిపై స్పందించిన ఆర్జీవీ తనదైన శైలిలో కౌంటరిచ్చారు. ఆస్కార్ అవార్డు రావాల్సింది ఆర్ఆర్ఆర్ సినిమా, రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌కు కాదు.. ఈ పురస్కారం కచ్చితంగా నారా లోకేశ్‌కు దక్కాల్సిందని సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ కూతురు ఆడుకుంటున్న బ్యాగు ధరెంతో తెలుసా?) And the OSCAR goes to not #RRR , not to @ssrajamouli , not to @mmkeeravaani not to @AlwaysRamCharan , not to @tarak9999 ..IT GOES TO @naralokesh 😘😘😘😍😍😍😍 pic.twitter.com/dctyNTEAdq — Ram Gopal Varma (@RGVzoomin) June 14, 2023 -
ఆస్కార్ గెలిచిన రోజే ఏనుగులు మిస్సింగ్.. షాక్‌లో చిత్రబృందం
లాస్ ఎంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ అవార్డు గెలిచిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'. పూర్తిగా ఇండియాలో నిర్మించిన డాక్యుమెంటరీకి తొలి ఆస్కార్ దక్కడం విశేషం. వీరికి ఈ అవార్డు రావడానికి కారణం రఘు, అమ్ము అనే అనాథ ఏనుగు పిల్లలు. ఆ ఏనుగు పిల్లను చేరదీసిన ఆదివాసి దంపతులు బొమ్మన్, బెల్లి. కరెంటు తీగలు తగిలి తల్లి ఏనుగులు మరణించడంతో బొమ్మన్, బెల్లిలు రఘుని, అమ్ముని సాకుతారు. మనుషులకు అడవి జంతువులకు మధ్య ఉండే అనుబంధాన్ని ఈ డాక్యుమెంటరీలో ఎంతో అద్భుతంగా చూపించారు. అయితే అవార్డ్ ప్రదానోత్సవం రోజునే విచిత్ర సంఘటన జరిగింది. ఒకవైపు అవార్డ్ వచ్చిందన్న ఆనందంలో ఉంటే.. మరోవైపు ఆ డాక్యుమెంటరీలో నటించిన ఏనుగులు అదృశ్యమయ్యాయనే వార్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డాక్యుమెంటరీలో రఘు, అమ్ము అనే రెండు ఏనుగులు అదృశ్యమైనట్లు బొమ్మన్ వెల్లడించారు. కొంతమంది తాగుబోతులు ఏనుగులను తరమడంతో ఆదివారం రెండు ఏనుగులు కృష్ణగిరి అరణ్యంలోకి వెళ్లిపోయాయని ఆయన చెప్పారు. ఆ ఏనుగుల కోసం బొమ్మన్ ప్రస్తుతం వెతుకడం ప్రారంభించారు. బొమ్మన్ మాట్లాడుతూ..'మద్యం మత్తులో ఉన్న కొంత మంది వ్యక్తులను తరమడంతో ఏనుగులు అడవిలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం నేను కృష్ణగిరి ఫారెస్ట్‌లో వెతుకుతున్నా. అవి రెండూ కలిసే ఉన్నాయా.. విడిపోయాయా అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాటి ఆచూకీ కనిపెట్టడానికి ప్రయత్నిస్తా. ఒకవేళ అవి నాకు కనిపించకపోతే ఫారెస్ట్ రేంజర్‌కు ఫిర్యాదు చేసి నేను నా సొంతూరికి వెళ్తా.' అని అన్నారు. -
ఆస్కార్ అంటే ఏంటో తెలియదు: ది ఎలిఫెంట్ విస్పరర్స్ నటి
అమెరికాలోని లాస్ ఎంజిల్స్ జరిగిన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేడుకల్లో భారత్‌కు రెండు కేటగరీల్లో అవార్డులు దక్కాయి. ఈ ఏడాది జరిగిన 95 ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్లో భారత్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ నాటునాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ వచ్చింది. అలాగే అందరి దష్టిని ఆకర్షించిన మరో చిత్రం ఒకటుంది. ఆర్ఆర్ఆర్తో పాటు బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్‌ను కైవసం చేసుకుంది 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు సాధించిన యావత్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు. ఈ షార్ట్ ఫిలింలో ప్రధాన పాత్రలో కనిపించిన బెల్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఆమె మాత్రం ఆస్కార్ రావడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా.. దిక్కులేని ఏనుగులను ఆదరించి.. వాటిని చూసుకునే ఓ దంపతుల ఇతివృత్తంగా తెరకెక్కించారు ది ఎలిఫెంట్ విస్పరర్స్. ఆస్కార్ అంటే ఏంటో తెలియదు ఆస్కార్ రావడం పట్ల బెల్లీ మాట్లాడుతూ.. 'ఏనుగులు అంటే మాకు పిల్లలతో సమానం. తల్లిని కోల్పోయిన పిల్లలకు సేవ చేయడాన్ని గొప్పగా భావిస్తాం. అలాంటి చాలా గున్న ఏనుగులను చేరదీశాం. వాటిని మా సొంత పిల్లల్లా చూసుకుంటాం. ఇది మా రక్తంలోనే ఉంది. మా పూర్వీకులు కూడా ఇదే పని చేసేవారు. కానీ నాకు ఆస్కార్ అంటే ఏంటో తెలియదు. అయినా అభినందనలు రావడం చాలా సంతోషంగా ఉంది.' అని అన్నారు. కాగా ఈ చిత్రంలో నటించిన బెల్లీ భర్త మాత్రం.. తీవ్ర సమస్యతో బాధపడుతున్న ఓ ఏనుగును తీసుకొచ్చేందుకు వెళ్లాడని చెప్పింది. అసలు కథేంటంటే.. తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల నిజజీవిత ఆధారంగా తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విష్పరర్స్. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన ఈ దంపతులనే ప్రధాన పాత్రలుగా కథ రూపొందించారు. నిర్మాత గునీత్ మోగ్న ఆధ్వర్యంలో.. దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ ఈ కథను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ 2023లో బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డ్ దక్కించుకుంది. -
ఆస్కార్ అవార్డ్ చిత్రాలు.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఆతృతగా ఎదురుచూసిన ఆస్కార్ పండుగ కొన్ని గంటల క్రితమే ముగిసింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో వైభవంగా జరిగింది. సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డ్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమాలు పోటీలో నిలిచాయి. అయితే అంతిమంగా ఒక్కరినే అవార్డ్ వరిస్తుంది. అలా ఈ ఏడాది జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పలు చిన్న సినిమాలు సైతం సత్తా చాటాయి. అయితే అవార్డ్ దక్కించుకున్న చిత్రాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఆ సినిమాల్లో ఎలాంటి సందేశం ఉందో తెలుసుకోవాలనుకునే చాలా మందే ఉంటార. అలాంటి వారికోసం విజేతలుగా నిలిచిన చిత్రాలు ఏ ఓటీటీలో అలరిస్తున్నాయో తెలుసుకోవాలనుందా? అయితే ఇది మీకోసమే. ఏకంగా ఏడు అవార్డులు గెలుచుకున్న సినిమా అయితే ఈ ఏడాది ఆస్కార్‌లో ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకొన్న చిత్రం 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్'. ఈ సినిమా ఏడు అవార్డులతో రికార్డు సృష్టించింది. ఈ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే భారత్ నుంచి ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ దక్కింది. అలాగే ఇండియా నుంచి షార్ట్ షిల్మ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా సిని ప్రేక్షకులను అలరిస్తోంది. ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఆస్కార్ అవార్డులు పొందిన కొన్ని చిత్రాలు ఆర్ఆర్ఆర్ - జీ5, డిస్నీ + హాట్ స్టార్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ - సోనీలీవ్ ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ - నెట్‌ఫ్లిక్స్ బ్లాక్‌పాంథర్-వకండా ఫరెవర్ - డిస్నీ+ హాట్‌స్టార్ అవతార్ 2 - అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, వుడ్, డిస్నీ+హాట్‌స్టార్ టాప్ గన్: మావెరిక్ - అమెజాన్ ప్రైమ్ వీడియో ( తెలుగు ఆడియో కూడా ఉంది) ది ఎలిఫెంట్ విస్పరర్స్ - నెట్‌ఫ్లిక్స్ పినాషియో - నెట్‌ఫ్లిక్స్ కాగా.. ఉమెన్ టాకింగ్, నవానీ, ది వేల్ లాంటి చిత్రాలు ప్రస్తుతం భారత్‌లో స్ట్రీమింగ్కు అందుబాటులో లేవు. -
ఆస్కార్ వేదికపై ఎలుగుబంటి.. అసలు విషయమిదే..!
అమెరికాలోని లాస్ ఎంజిల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డ్ వేడుక ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు వీక్షించారు. ఈ వేడుకలో సినీరంగంలో అత్యుత్తమ ప్రతిభ చాటిన ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన సినిమాలకు అవార్డులు ప్రకటిస్తారు. ఈ వేడుక కోసం ఆస్కార్ అకాడమీ నిర్వాహకులు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈవెంట్లో అందరి దృష్టిని ఆకర్షించింది ఏంటో తెలుసా? వేదికపై అందరినీ అలరిస్తూ సందడి చేసిన ఓ ఎలుగుబంటి. ఇంతకీ ఆ వేదికపై ఎలుగుబంటి ఎందుకొచ్చిందా అని సందేహం మీకు వచ్చి ఉండొచ్చు. పదండి ఆ ఎలుగుబంటి కథేంటో తెలుసుకుందాం. ఆస్కార్ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించిన ఆ ఎలుగుబంటి ఓ సినిమాలోని పాత్ర. ఎలిజబెత్ బ్యాంక్స్ కామెడీ థ్రిల్లర్ మూవీలో ఎలుగుబంటి అలరించింది. ఈ ఏడాది ఆస్కార్ వేడుకపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈవెంట్లో పాల్గొన్న సినీ దిగ్గజాలను పలకరిస్తూ సందడి చేసింది. దీంతో నెటిజన్స్ దీనిపై ఆరా తీస్తున్నారు. ఆస్కార్ వేదికపై మెరిసిన ఆ ఎలుగుబంటి గురించి ఆసక్తి కనబరుస్తున్నారు. -
రామ్ చరణ్ ట్వీట్.. మరో 'నాటు నాటు' పక్కా..!
ప్రపంచ వేదికపై ఆర్ఆర్ఆర్ పేరు మార్మోగిపోతోంది. తెలుగువారి పేరును ప్రపంచానికి పరిచయం చేశారు రాజమౌళి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ రావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా భారత సినీ చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఈ సినిమాలో అవకాశమిచ్చిన రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ ఓ లెటర్‌ను తన ట్వీట్లో పంచుకున్నారు. అయితే అందులో రామ్ చరణ్ రాసిన ఓ లైన్ అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ఎందుకంటే అందులో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన కో- స్టార్, బ్రదర్ తారక్ నీకు ధన్యవాదాలు.. నీతో మరోసారి డ్యాన్స్ చేసి మళ్లీ రికార్డులు సృష్టించాలనుకుంటున్నా' అంటూ నోట్లో రాశారు. దీంతో ఆర్ఆర్ఆర్-2లో మరో నాటు నాటు పక్కా అని అభిమానులు భావిస్తున్నారు. మరోసారి ఎన్టీఆర్- చెర్రీ స్క్రీన్‌పై డ్యాన్స్‌తో అదరగొట్టడం కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్-2 ఉంటుందని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ అభిమానులు మరోసారి చరణ్- ఎన్టీఆర్ కాంబినేషన్ రిపీట్ కాబోతోందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి, మహేశ్ బాబుతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్- 2 పట్టాలెక్కుతుందేమో వేచి చూడాల్సిందే. We have won!! We have won as Indian Cinema!! We won as a country!! The Oscar Award is coming home!@ssrajamouli @mmkeeravaani @tarak9999 @boselyricist @DOPSenthilKumar @Rahulsipligunj @kaalabhairava7 #PremRakshith @ssk1122 pic.twitter.com/x8ZYtpOTDN — Ram Charan (@AlwaysRamCharan) March 13, 2023 -
ఆస్కార్.. ఇప్పటి వరకు గెలిచిన ఇండియన్స్ వీరే
ప్రస్తుతం అందరినోటా వినిపిస్తున్న మాటా ఒక్కటే. అదేమిటంటే తొలిసారి తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటే సమయమిది. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో డాల్బీ థియేటర్లో జరుగనున్న 95 ఆస్కార్ వేడుకలపై అందరి దృష్టి పడింది. ఈ సారి మన టాలీవుడ్ దర్శకధీరుడు తెరకెక్కించిన వన్ అండ్ ఓన్లీ సెన్సేషనల్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రపంచవేదికపై మెరవనుంది. అందుకే ఈ ఏడాది ఆస్కార్ తెలుగు వారికి కూడా వెరీ వెరీ స్పెషల్. కానీ ఇప్పటి వరకు ఎంతమంది భారతీయులను ఈ అవార్డ్ వరించింది. ప్రపంచ ఆస్కార్ సందడి వేళ ఇప్పటి దాకా ఆస్కార్ నెగ్గిన వారెవరో ఓ లుక్కేద్దాం. తొలి ఆస్కార్ విన్నర్ భాను అథైయా భాను అథైయా తొలి భారత ఆస్కార్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. 1983లో విడుదలైన గాంధీ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆమెకు అరుదైన ఘనత దక్కింది. 55వ ఆస్కార్ వేడుకల్లో ఆమె అవార్డు అందుకున్నారు. మహాత్మా గాంధీ జీవిత కథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కించారు. సత్యజిత్ రే భారతీయ సినీ ఇండస్ట్రీకి పేరు తీసుకొచ్చిన సత్యజిత్ రే ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించిన ఆస్కార్స్ 1992లో సత్యజిత్‌రేకు హానరరి అవార్డును ప్రకటించింది. అయితే సత్యజిత్‌రే అనారోగ్యం కారణాలతో వేడుకలకు పాల్గొనలేదు. దీంతో అకాడమీ స్వయంగా ఆస్పత్రికి వచ్చి ఆస్కార్ అందజేసింది. రెండు అవార్డులు గెలిచిన ఏఆర్ రెహమాన్ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు సాధించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఈ అవార్డులు దక్కించుకున్నారు. రెండు ఆస్కార్ అవార్డులు గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. రసూల్ పూకుట్టి స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రసూల్ పూకుట్టి ఆస్కార్ సొంతం చేసుకున్నారు. గుల్జర్ దర్శకుడిగా, నిర్మాతగా, గేయ రచయితగా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన గుల్జర్ 81వ ఆస్కార్ వేడుకల్లో అవార్డు గెలుచుకన్నాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జయహో పాటకు ఉత్తమ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆయన్ను ఆస్కార్ వరించింది. గునీత్ మోన్గా ఢిల్లీకి చెందిక ప్రముఖ నిర్మాత గునీత్ మోన్గాఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగ్‌గా పీరియడ్ ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్‌కు గునీత్ ఆస్కార్ గెలుచుకుంది. తాజాగా అమెరికాలో లాస్ఎంజిల్స్ జరగనున్న 95వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి ఆల్ దట్ బ్రెత్స్( బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం), ది ఎలిఫెంట్ విస్ఫరర్స్(బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం), నాటు నాటు(బెస్ట్ ఒరిజినల్ సాంగ్) విభాగాలలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అందరి చూపులు ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్‌పైనే ఉన్నాయి. కచ్చితంగా ఆస్కార్ వరిస్తుందని అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ వేడుకల కోసం ఆర్ఆర్ఆర్ బృందం అమెరికా చేరుకుంది. -
హాలీవుడ్ నటుడు క్రిస్టోఫర్ ప్లమ్మర్ మృతి
ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత క్రిస్టోఫర్ ప్లమ్మర్ (91) నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. స్టేజ్ ఆర్టిస్ట్‌గా, టీవీల్లో, సినిమా నటుడిగా సుమారు 70 ఏళ్లు నటుడిగానే కొనసాగారాయన. ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ (1965) చిత్రం ద్వారా నటుడిగా పాపులారిటీ సంపాదించారు ప్లమ్మర్. ఆస్కార్ అవార్డు అందుకున్న పెద్ద వయస్కుడిగానూ ప్లమ్మర్ పేరు మీద ఓ రికార్డు ఉంది. 2012లో వచ్చిన ‘బిగినర్స్’ చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ అందుకున్నారాయన. ఈ అవార్డు అందుకునేప్పటికి ప్లమ్మర్కి 82ఏళ్లు. ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ ఎంత పేరు తెచ్చిపెట్టినా లీడ్ రోల్స్‌లో నటించడానికి అంగీకరించలేదాయన. సహాయ పాత్రల్లోనే నటించడానికి స్కోప్ ఎక్కువ ఉంటుందని పేర్కొనేవారు ప్లమ్మర్. షేక్స్పియర్ కథల ఆధారంగా తెరకెక్కిన సినిమాల్లో ఎక్కువగా ప్లమ్మరే నటించడం విశేషం. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ నటీనటులు సంతాపం ప్రకటించారు. -
తొలి బాండ్ సీన్ కానరీ ఇక లేరు
ఆయన బాండ్ వేషమేస్తే అదో బ్రాండ్ అయింది. ఆయన చరిష్మాకు హాలీవుడ్ ‘సెక్సియస్ట్ మ్యాన్’ అని కితాబిచ్చింది. ఆయన ప్రతిభకు ‘మా జాతీయ సంపద’ అని మెచ్చుకోలు ఇచ్చింది. స్కాటిష్ నటుడు సీన్ కానరీ శనివారం తుది శ్వాస విడిచారు. 90 ఏళ్ల సీన్ కానరీ జీవిత విశేషాలు. బాండ్‌కి బ్రాండ్ సీన్ కానరీకి నటుడిగా పెద్ద బ్రేక్ లభించింది జేమ్స్ బాండ్ సిరీస్ వల్లే. 7 సినిమాల్లో జేమ్స్ బాండ్‌గా నటించారాయన. ‘డాక్టర్ నో’ (1962) చిత్రం ద్వారా బాండ్ పాత్రలో కనిపించారు సీన్ కానరీ. ఆ తర్వాత ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’, ‘గోల్డ్ ఫింగర్’, ‘తండర్‌బాల్’, ‘యు ఓన్లీ లివ్ ట్వైస్’, ‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’, ‘నెవర్ సే నెవర్ ఎగైన్’ సినిమాల్లో బాండ్ పాత్ర చేశారు. అన్నీ కమర్షియల్‌గా సక్సెస్ అయ్యాయి. అయితే ‘బాండ్ జేమ్స్ బాండ్’ అంటూ తెరపై సందడి చేసిన సీన్ కానరీ ముందు ఈ పాత్ర కోసం అడిగితే కాస్త సందేహించారట. అయితే చివరికి రిస్క్ అయినా లాభం కూడా ఉందని కూడా ఓకే చెప్పారు. కట్ చేస్తే.. సూపర్ బాండ్ అయ్యారు. ‘సినిమా చరిత్రలోనే మూడో ఉత్తమ హీరో’ అని అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. బాండ్ నవలా రచయిత ఇయామ్ ఫ్లెమింగ్ మాత్రం ఈ పాత్రకు సీన్ కానరీ ఎంపిక పట్ల ముందు అసంతృప్తి వ్యక్తం చేశారట. కానీ ‘డాక్టర్ నో’ ప్రీమియర్స్ అయ్యాక సీన్‌ను ప్రత్యేకంగా అభినందించారట. బాండ్ అంటే చిరాకొచ్చింది బాండ్ పాత్రకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం ఎంత పాపులారిటీ తెచ్చిందో అంతే చిరాకు కూడా తెప్పించిందట సీన్ కానరీకి.బాండ్‌ను దాటి ఇంకా చాలా చేయగలను అనేవారట. బాండ్గానే ఎక్కువగా పేరు రావడం సీన్ కానరీలోని నటుడికి కాస్త అసంతృప్తిగా అనిపించేదట. ‘ఈ బాండ్‌ని చంపేస్తాను’ అని ఓ సందర్భంలో అన్నారట సీన్. బియాండ్ బాండ్ బాండ్ సినిమాలు కాకుండా ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ తీసిన ‘మేల్’, ‘ది మ్యాన్ హూ ఉడ్ బీ కింగ్’, ‘ది విండ్ అండ్ ది లైన్’, ‘ది అన్‌టచబుల్స్’, ‘ది నేమ్ ఆఫ్ ది రోజ్’, ‘ఇండియన్ జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్’ సినిమాల్లో సీన్ చేసిన పాత్రలు బాగా పండాయి. ఆ సినిమాలు పెద్ద సక్సెస్‌ను చూశాయి. ‘ది అన్‌టచబుల్స్’ సినిమాకు ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు సీన్ కానరీ. రిటైర్మెంట్ 2007లో అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సీన్ కానరీకి జీవిత సాఫల్య పురస్కారం అందించింది. ఆ సమయంలోనే నటనకు స్వస్తి చెబుతున్నట్లు సీన్ ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించబోతున్నారనే వార్తలు వచ్చినా ‘రిటైర్మెంట్ అంటే జోక్ కాదు కదా?’ అని కొట్టిపారేశారు. అయితే తెరపై కనిపించలేదు కానీ తన గొంతుని వినిపించారు. 2012లో ‘సర్ బిల్లీ’ అనే యానిమేషన్ చిత్రంలో సర్ బిల్లీ పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారాయన. వ్యక్తిగత జీవితం 1930 ఆగస్ట్ 25న స్కాట్‌ల్యాండ్‌లో జన్మించారు సీన్ కానరీ. తండ్రి లారీ డ్రైవర్. తల్లి క్లీనింగ్ పనులు చేసేవారు. 14 ఏళ్ల వయసుకే స్కూల్ మానేసి పనులు చేయడం ప్రారంభించారు సీన్. ముందు పాల వ్యాపారం, ఆ తర్వాత నేవీలో చేశారు. అయితే అనారోగ్య కారణాల వల్ల నేవీ నుంచి బయటికొచ్చారు. తండ్రిలానే లారీ డ్రైవర్లా చేశారు. ఇంకా ఈత కొలను దగ్గర లైఫ్ గార్డ్‌గా చేశారు. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ 18 ఏళ్లకు బాడీ బిల్డింగ్ మీద దృష్టిపెట్టారు. మోడలింగ్ చేస్తూ, మిస్టర్ యూనివర్స్ 1953 కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. అయితే ఆ పోటీలో గెలవలేదు. మెల్లిగా థియేటర్స్ చేస్తూ, టీవీలో చిన్న రోల్స్ చేశారు. 1954లో ‘లైలాక్స్ ఇన్ ది స్ప్రింగ్’ అనే సినిమాలో చిన్న పాత్ర చేశారు. అయితే గుర్తింపు లేని పాత్ర అది. ఆ తర్వాత ‘నో రోడ్ బ్యాక్’ (1957)లో మంచి పాత్ర చేశారు. ఓ నాలుగైదేళ్లకు బాండ్ సినిమాకు అవకాశం అందుకున్నారు. ఇక ఆ తర్వాత నటుడిగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. సీన్ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. ఆస్ట్రేలియన్ నటి డయానా క్లింటోతో 1962–1973వరకూ కలసి ఉన్నారు. ఆ తర్వాత ఫ్రెంచ్ పెయింటర్ మైక్లిన్ రోక్బ్రూన్ను 1975లో పెళ్లాడారు. మొదటి భార్య ద్వారా జాసన్ కానరీ అనే కుమారుడు ఉన్నాడు. ప్రశాంతంగా కన్నుమూశారు ఈ ఏడాది ఆగస్ట్ 25న 90వ పుట్టినరోజు జరుపుకున్నారు సీన్ కానరీ. కొంత కాలంగా ఆయన ఆరోగ్యం బాగాలేదు. ‘‘మా నాన్నగారు నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారు. బహామాస్‌లోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు’’ అని సీన్ తనయుడు జాసన్ కానరీ పేర్కొన్నారు. చిత్రసీమకు ఎందరో వస్తారు.. కొందరు మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. సీన్ కానరీ ఓ చరిత్ర. ‘‘ఆయన మరణం ఓ పెద్ద షాక్’’ అని పలువురు హాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. భారతీయ నటులు వెంకటేశ్, మమ్ముట్టి, మహేష్ బాబు, అభిషేక్ బచ్చన్ తదితరులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలిపారు. సెక్స్ సింబల్ సీన్ చరిష్మా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ‘ది సండే హెరాల్డ్’ పత్రిక నిర్వహించిన సర్వేలో ‘ది గ్రేటెస్ట్ లివింగ్ స్కాట్’గా ఓటు వేయబడ్డారు సీన్. ‘స్కాంట్ల్యాండ్ జాతీయ సంపద’ అని యూరోమిలియన్స్ సర్వే చెప్పింది. 1989లో ‘పీపుల్స్’ మేగజీన్ అయితే ‘సెక్సియస్ట్ మేన్ ఎలైవ్’ అని, 1999లో ‘ఈ దశాబ్దపు సెక్సియస్ట్ మేన్’ అని బిరుదులు ఇచ్చింది. -
హాలీవుడ్ కంపోజర్ మోరికోన్ మృతి
ఆస్కార్ అవార్డ్గ్రహీత ప్రముఖ హాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ ఎన్నియో మోరికోన్ (91) కన్నుమూశారు. 1928 నవంబర్ 10న రోమ్‌లో జన్మించారు మోరికోన్ వెస్ట్రన్ మ్యూజిక్‌లో తనదైన ముద్ర వేశారు. దాదాపు నాలుగువందల సినిమాలకు సౌండ్‌ట్రాక్స్ కంపోజ్ చేశారు. ‘ది గుడ్ ది బ్యాడ్ ది అగ్లీ’, ‘ది మిషన్’, ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ది వెస్ట్’, ‘ది అన్‌టచబుల్స్’ వంటి సినిమాలకు మోరికోన్ అందించిన సౌండ్ ట్రాక్స్ ఆయన్ను చాలా పాపులర్ చేశాయి. ఐదుసార్లు (డేస్ ఆఫ్ హెవెన్, ది మిషన్, ది అన్‌టచబుల్స్, బుగ్సీ, మలేనా చిత్రాలకు) ఆస్కార్‌కు నామినేట్ అయిన మోరికోన్ ఫైనల్‌గా 2015లో వచ్చిన ‘ది హేట్‌ఫుల్ ఎయిట్’ అనే చిత్రానికి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించారు. అలాగే సంగీతానికి అందించిన కృషికి గౌరవంగా ఆస్కార్ అకాడమీ ఆయనకు జీవితసాఫల్య పురస్కారాన్ని 2007లో అందించింది. మోరికోన్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ‘మీ సంగీతంతో ఎప్పటికీ బతికే ఉంటారు. మీరు నాకు గురువులాంటివారు’ అని ఇండియన్ స్టార్ కమల్‌హాసన్ ట్వీట్ చేశారు. -
ఆస్కార్ 2020 విజేతలు వీరే
లాస్ఏంజెల్స్ : 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ఏంజెల్స్లో సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డాల్బీ థియేటర్లో జరుగుతున్న ఈ వేడకకు ప్రముఖ హాలీవుడ్ తారాగణమంతా హాజరై సందడి చేసింది. జోకర్ సినిమా హీరో జోక్విన్ ఫినిక్స్ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రంలో బ్రాడ్ పిట్ నటననకు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ఫిల్మ్గా టాయ్‌స్టోరీ నిలిచింది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా టాయ్‌స్టోరీ-4, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే బాంగ్ జాన్ హో (పారాసైట్), బెస్ట్ లైవ్‌యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌గా ద నైబర్స్ విండో నిలువగా, ఉత్తమ స్క్రీన్‌ప్లే తైకా వెయిటిటి(జోజో రాబిట్) కు దక్కింది. ఉత్తమ చిత్రం : పారాసైట్ ఉత్తమ నటుడు : జోక్విన్ ఫీనిక్స్(జోకర్) ఉత్తమ నటి : రెంజి జెల్వెగర్ (జూడి) ఉత్తమ సహాయ నటుడు : బ్రాడ్‌పిట్ ( వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్) ఉత్తమ సహాయక నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ) ఉత్తమ దర్శకుడు : బాంగ్ జోన్-హో(పారసైట్) ఉత్తమ సంగీతం : జోకర్ (హిల్దార్) బెస్ట్ మ్యూజిక్ ఒరిజనల్ సాంగ్ : ఐయామ్ గోన్నా.. లవ్ మీ ఎగేన్ (రాకెట్ మ్యాన్) ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ : పారాసైట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ : బాంబ్ షెల్ ఉత్తమ డాక్యుమెంటర్ షార్ట్ ఫీచర్ : అమెరికర్ ఫ్యాక్టరీ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే : టైకా వైటిటి( జోగో ర్యాబిట్) బెస్ట్ యానిమేటేడ్ ఫీచర్: టాయ్ స్టోరీ 4 బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ : అమెరికన్ ఫ్యాక్టరీ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: ది నైబర్స్ విండో ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే : బాంగ్ జూన్ హో( పారాసైట్) బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ : లెర్నింగ్ టూ స్కేట్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ ( ఇఫ్ యుఆర్ ఏ గర్ల్) బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ : హెయిర్ లవ్ బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ : ఫోర్డ్ వి ఫెరారీ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ : 1917 ఉత్తమ సినిమాటోగ్రఫీ : 1917 ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ : 1917 బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ : ఫోర్డ్ వి ఫెరారీ ఉత్తమ ప్రొడెక్షన్ డిజైన్ : వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : ది నైబర్స్ విండో (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉత్తమ చిత్రం గ్రీన్‌బుక్
లాస్ ఏంజిలస్: 2019 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం అవార్డును ‘గ్రీన్‌బుక్’ దక్కించుకుంది. శ్వేత,నల్ల జాతీయుల మధ్య స్నేహబంధానికి దర్పణంగా నిలిచే ఒక వ్యక్తి జీవిత చరిత్రే గ్రీన్‌బుక్ చిత్రం. రోమా చిత్ర దర్శకుడు అల్ఫాన్సో కారన్‌కు ఉత్తమ దర్శకుడి అవార్డు లభించగా, ద ఫేవరెట్ సినిమాలో నటించిన ఒలివియా కామన్ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. బొహెయిమెన్ రాప్సోడీ చిత్రంలో అస్థాన విద్వాంసుడు ఫ్రెడీ మెర్క్యురీ పాత్రలో నటించిన రామి మలేక్ ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం లాస్ ఏంజిలస్‌లో అట్టహాసంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. వ్యాఖ్యాత లేకుండా ఈ ఉత్సవం జరగడం విశేషం. 1989 తర్వాత వ్యాఖ్యాత లేకుండా ఆస్కార్ అవార్డుల ఉత్సవం జరగడం ఇది రెండో సారి. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల్లో భారతీయ డాక్యుమెంటరీకి అవార్డు లభించింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన ఘటనపై ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’పేరుతో తీసిన డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డు పొందింది. ఒక నల్లజాతి విద్యాంసుడు అతని దగ్గర కారు డ్రైవరుగా పనిచేసే శ్వేత జాతీయుడి మధ్య సంబంధమే ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ఎంపికయిన గ్రీన్ బుక్ కథాంశం. గ్రీన్‌బుక్ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడు(మహేర్షల అలీ), ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డులు కూడా లభించాయి. ఉత్తమ నటి రేసులో ముందున్న గ్లెన్ క్లోజ్(ద వైఫ్)ను పక్కకు నెట్టి ద ఫేవరెట్ చిత్రంలో నటించిన కాల్మన్ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కాల్మన్ నిగ్రహం కల రాణి అన్నెగా నటించారు. ఈ సారి అవార్డులు వేర్వేరు సినిమాలకు వచ్చాయి. బొహెమియన్ రాప్సోడీ చిత్రానికి ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ సౌండ్ ఎడిటింగ్, ఉత్తమ మిక్సింగ్ అవార్డులు సహా మొత్తం నాలుగు అవార్డులు లభించాయి. కారన్‌కు ఒకే ఏడాది 4 నామినేషన్లు రోమా సినిమా ఉత్తమ చిత్రం అవార్డును పొగొట్టుకున్నా ఇతర కేటగిరీలో ఉత్తమ పురస్కారాలు అందుకుంది. చిత్ర దర్శకుడు కారన్ ఉత్తమ దర్శకుడి అవార్డు పొందారు. విదేశీ భాషా చిత్రం కేటగిరీ, సినిమాటోగ్రఫీ కేటగిరీలో కూడా ఈయన ప్రతిభకు పురస్కారాలు లభించాయి. ఒకే సంవత్సరంలో నాలుగు నామినేషన్లు పొందిన మొట్టమొదటి వ్యక్తి కారన్. భారతీయ ఫ్రెడ్డీ భారతీయ మూలాలున్న వ్యక్తికి సంబంధించిన పాత్ర పోషించిన నటుడికి కూడా 91వ ఆస్కార్ అవార్డుల్లో ఓ పురస్కారం దక్కింది. బొహెమియన్ రాప్సోడీ చిత్రంలో ఫ్రెడ్డీ మెర్కూరీ పాత్రలో నటించినందుకు ఉత్తమ నటుడి అవార్డుకు రామి మలేక్ ఎంపికయ్యారు. ఆ చిత్రం ఫ్రెడ్డీ మెర్యూరీ జీవితం ఆధారంగా తెరకెక్కిందే. ఇంతకీ ఈ ఫ్రెడ్డీ మెర్క్యూరీ ఎవరని అనుకుంటున్నారా? ఈయన తన చిన్న తనాన్ని మహారాష్ట్రంలోని పంచగని పట్టణంలో గడిపారు. అక్కడే పాఠశాల విద్యనభ్యసించారు. సంగీత రంగంలో కూడా ప్రవేశించారు. టాంజానియాలోని జంజీబర్లో పార్సీ కుటుంబంలో 1946లో మెర్క్యూరీ జన్మించారు. ఆ తర్వాత ఆయన కుటుంబం భారత్‌కు వలస వచ్చింది. పంచగనిలోని సెయింట్ పీటర్స్ స్కూల్లో మెర్యూరీ చదువుకుంటూనే హెక్టిక్స్ అనే రాక్బ్యాండ్లోనూ అలరించాడు. శాస్త్రీయ సంగీత పాఠాలు నేర్పాలని ఆ స్కూల్లోని గురువులు ప్రయత్నించినా మెర్క్యూరీ ర్యాప్ మ్యూజిక్ పైనే ఆసక్తి చూపాడు. తర్వాత 1960ల్లో ఆయన తన తల్లిదండ్రులతో కలిసి బ్రిటన్‌కు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. -
బెల్టుతో ఉరేసుకున్న రాబిన్ విలియమ్స్
లాస్ ఏంజెలెస్: ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత రాబిన్ విలియమ్స్(63) ఆత్మహత్య చేసుకున్నాడని అధికారికంగా నిర్ధారణ అయింది. బెల్టుతో ఆయన ఉరేసుకున్నాడని మారిన్ కౌంటీ అధికారి వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు ఆయనేమైనా విషపదార్థాలు సేవించారా, లేదా అనేది పోస్టుమార్టంలో తెలుస్తుందన్నారు. రాబిన్ విలియమ్స్ దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. శ్వాసావరోధం కారణంగానే ఆయన మృతి చెందినట్టు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణయిందని తెలిపారు. సోమవారం కాలిఫోర్నియాలోని టిబురన్లో సొంతిట్లో రాబిన్ విలియమ్స్ ఆకస్మికంగా మృతిచెందారు. నిరాశ, నిస్పృహతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. కాగా, రాబిన్ మరణం పట్ల అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సంతాపం ప్రకటించారు. గొప్ప నటున్ని, స్నేహితున్ని కోల్పోయానని పేర్కొన్నారు. -
హాస్యనటుడు రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య!
ఒబామా, కమల్‌హాసన్ తదితరుల సంతాపం లాస్ ఏంజెలిస్: మరపురాని నటనతో కోట్లాది ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత రాబిన్ విలియమ్స్(63) ఇకలేరు. ఆయన సోమవారం కాలిఫోర్నియాలోని టిబురన్లో సొంతిట్లో ఆకస్మికంగా మృతిచెందారు. ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విలియమ్స్ మధ్యాహ్నం అపస్మారకంలో ఉన్నారని తెలుసుకుని అత్యవసర వైద్య సిబ్బంది ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనను పరీక్షించి మృతిచెందినట్లు ప్రకటించారు. విలియమ్స్ శ్వాసకు అవరోధకం కల్పించుకుని, బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని స్థానిక పోలీసు అధికారి ఒకరు చెప్పారు. విలియమ్స్ కొన్నాళ్లుగా తీవ్ర ఆందోళనతో ఉన్నారని ఆయన ప్రచారకర్త మారా బాక్స్బామ్ తెలిపారు. ‘గుడ్‌విల్ హంటింగ్’, ‘డెడ్ పొయెట్స్ సొసైటీ’, ‘గుడ్‌మార్నింగ్, వియత్నాం’ తదితర చిత్రాల్లో మనసు కదిలించే నటనతో విలియమ్స్ ప్రేక్షుకుల హృదయాలను గెలుచుకున్నారు. నాలుగుసార్లు ఆస్కార్ అవార్డులకు నామినేషన్ పొందిన ఆయన ‘‘గుడ్‌విల్ హంటింగ్’ చిత్రానికిగాను ఉత్తమ సహాయ నటుడి పురస్కారాన్ని అందుకున్నారు. ఆ చిత్రంలో ఆయన తెలివైన మానసిక వైద్యుడి పాత్ర పోషించారు. భారతీయ నటుడు కమల్‌హాసన్ నటించిన ‘అవ్వై షణ్ముగి’(తెలుగులో ’భామనే సత్యభామనే’) చిత్రం.. విలియమ్స్ చిత్రం ‘మిసెస్ డౌట్ఫైర్’ అనుకరణ. వెల్లువెత్తిన సంతాపం..: విలియమ్స్ మృతిపై హాలీవుడ్‌తోపాటు బాలీవుడ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన అభిమానులు పెను విషాదంలో మునిగిపోయారు. ‘ఆయన గొప్ప హాస్యనటుడు. మానవ హృదయంలోని ప్రతికోణాన్ని స్పృశించారు. మనల్ని నవ్వించారు, ఏడిపించారు’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొనియాడారు. విలియమ్స్ మరణం గురించి బాధపడకుండా ఆయన పంచిన నవ్వులను గుర్తు చేసుకోవాలని ఆయన భార్య సుసాన్ పేర్కొన్నారు. విలియమ్స్ నాటకప్రదర్శనలు అత్యుత్తమమని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. విలియమ్స్ మగవాడి దుఃఖానికి గౌరవాన్ని సంపాదించిపెట్టారని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. షారుక్ ఖాన్, షబానా ఆజ్మీ తదితర సినీ ప్రముఖులు కూడా నివాళులర్పించారు.