క్రిస్టోఫర్ ప్లమ్మర్
ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత క్రిస్టోఫర్ ప్లమ్మర్ (91) నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. స్టేజ్ ఆర్టిస్ట్‌గా, టీవీల్లో, సినిమా నటుడిగా సుమారు 70 ఏళ్లు నటుడిగానే కొనసాగారాయన. ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ (1965) చిత్రం ద్వారా నటుడిగా పాపులారిటీ సంపాదించారు ప్లమ్మర్. ఆస్కార్ అవార్డు అందుకున్న పెద్ద వయస్కుడిగానూ ప్లమ్మర్ పేరు మీద ఓ రికార్డు ఉంది.
2012లో వచ్చిన ‘బిగినర్స్’ చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ అందుకున్నారాయన. ఈ అవార్డు అందుకునేప్పటికి ప్లమ్మర్‌కి 82ఏళ్లు. ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ ఎంత పేరు తెచ్చిపెట్టినా లీడ్ రోల్స్‌లో నటించడానికి అంగీకరించలేదాయన. సహాయ పాత్రల్లోనే నటించడానికి స్కోప్ ఎక్కువ ఉంటుందని పేర్కొనేవారు ప్లమ్మర్. షేక్‌స్పియర్ కథల ఆధారంగా తెరకెక్కిన సినిమాల్లో ఎక్కువగా ప్లమ్మరే నటించడం విశేషం. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ నటీనటులు సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment