ఆండ్రూ జాక్
కరోనాతో మరో హాలీవుడ్ నటుడు మరణించారు. ఇటీవలే మార్క్ బ్లమ్ అనే నటుడు కరోనా సోకి మరణించారు. తాజాగా ‘స్టార్ వార్స్’ ఫేమ్ ఆండ్రూ జాక్ (76) కూడా కోవిడ్ –19 కారణంగానే చనిపోయారు. కరోనా పాజిటివ్ అని తేలిన రెండు రోజుల్లోనే ఆండ్రూ మరణించారని సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారాయన. ‘మెన్ ఇన్ బ్లాక్’, ‘లార్డ్ అఫ్ ది రింగ్స్’, ‘థార్’ తదితర సినిమాల్లో నటించారాయన.
Comments
Please login to add a commentAdd a comment