
మార్క్ బ్లమ్
‘డెస్పరేట్లీ సీకింగ్ సుసాన్’, ‘క్రోకోడైల్ డూండీ’ వంటి చిత్రాల ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు మార్క్ బ్లమ్ (69) ఇక లేరు. కరోనా వైరస్ సోకి, ఆయన ఆస్పత్రిలో చేరారు. వైరస్ కారణంగా వచ్చిన ఆరోగ్య సమస్యల వల్ల మార్క్ చనిపోయారని స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్–అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రెబెక్కా డామన్ పేర్కొన్నారు. టీవీ రంగంలోనూ, సినిమా రంగంలోనూ మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్న మార్క్ మరణం తీరని లోటు అని పలువురు హాలీవుడ్ ప్రముఖులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment